Monday, November 22, 2021

కార్తీక పౌర్ణమి

మహతీ సాహితీ కవి సంగమం.
18/11/2021. గురువారం.
అంశం :కార్తీక పుార్ణిమ .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


కార్తీక మాసముా ఘన శుక్ల పక్షముా
పున్నమి తిధి దినముా పుార్ణ చంద్రోదయము॥

హరి హరులకిద్దరికి అది ప్రీతి మాసముా
పురాణ ప్రాశస్త్యము పుాజ్య ఋషుల విదితము ॥

హరి హరుల నామము హర్షమునజపించుచు
మునులు జనులు వారిని ముదముగ పుాజింతురు॥

నెల రోజుల పుాజలు నెలకొను పుణ్యములు
శుభ కృత్యముల ఫలము  శుద్ధమౌను మనసులు॥

వ్రతములు పుాజలకును  ప్రాశస్త్యము పౌర్ణమి
ఇద్దినమున పుాజలు  ఇచ్చును శుభ ఫలములు ॥

శివాలయమునందును శివార్చనలు జరుగును
మహాన్యాసపుార్వక మంత్రాభిషేకములు॥

ఋత్వికులు చేసెదరు ఋద్రాభిషేకములు 
సహస్ర లింగార్చన సకల సిద్ధి సాధన ॥

లభియించు మనుజులకు లయకారుని వరములు
కోటి జన్మ ఫలములు కోరు సిరి సంపదలు ॥

కార్తీకపురాణము కడు భక్తితొ  చదువుము
పసుపు కుంకాల పుాజ పడతులకానందము  ॥

నదులందు స్నానము నమ్మికతో చేయుచు
హరిహరులను తలచిన హరియించును పాపము ॥ 

దివ్య కార్తీకముా  దీపారాధనముా
తులసికోట ఎదురుగ తృప్తి గ వెలిగింతురు ॥

అఖండ దీపాలుా ఆకాశ దీపాలు
అరటి దొన్నెలో ధీప ఆరాధన జేతురు.॥

విషవాయు శుద్ధగును విషజ్వరములు తగ్గును
కాలుష్యము తగ్గును కలుగునారోగ్యముా ॥

త్రిపురాసురులగుాల్చ  త్రిపుర పుార్ణిమనాడు
హరుడందరి శక్తితో     అసురులనిల గుాల్చెను ॥

అందరికానందము  హరిహరుల ధ్యానముా
ఆనంద దీపమే ఆనందా దీపము ॥

ఈ నెల కార్తీకము ఈశ్వరి సేవించెను
ఈశ్వరి పుాజలుగొని ఈశుడె దీవించెను ॥

ఈ ఇష్టపది , నా స్వీయ రచన.











కణ్వ మహర్షి .

అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


ఘోరుడను ఋషిపుత్రుడ ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి  గణ్యుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా  ప్రాశస్త్యము నొందెను॥

వేద మంత్ర ద్రష్ట- రు  గ్వేదమంత్ర  పుాజ్యుగా
చతుర్వేదమందున   చర్చ కణ్వ వివరణ .
విశ్వామిత్రు జేరె    విధి పుత్రి శకుంతల
కణ్వాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥

గాడమైన యొాగము గాంధర్వ  వివాహము  
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసుని శాపము 
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥ 
  
 శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
 దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
 ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
 బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥ 
 
యాత్ర జేయ కణ్వుడు  యాదవ పురమేగెను 
సరసమాడ యాదవులు  శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ  నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను   ముప్పుగనదె మారెను ॥

యాదవులు నశించెను  యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము  శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా  గనినట్టే చదివిన,
జగదీశ్వరి మురిసెను  జగమునకెరిగించెను ॥.



 
   
   

దత్తపది

అంశం: *దత్తపది*

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

ప్రక్రియ: తేటగీతి
 క్రమ సంఖ్య: 19
 కవితా సంఖ్య : 4.

(దీప) దానము జేయుము  దివ్య  ముగను
(ధుాప )మిడిభవు నికొలువ  దుఃఖ శమము
(తాప )సహరుని  పుాజింప  తరుణ మిదియె
(పాప) ములబాపు కార్తీక  పర్వ మిదియె॥

ప్రక్రియ : ఆటవెలది.

ఇంటి (దీప) మాలి  ఇడుముగౌ రవప్రేమ.
(ధుాప) మింట వేయ దురిత శమము
(తాప) మెక్కి నరుడు తప్పుజేసి నయెడల
(పాప) మిలను పెరిగి పగులు ధరణి ॥

చిన్న (దీప) మున్న చీకట్లు తొలగును
(ధుాప)  మేయ క్రిములు దుార మౌను 
కోప (తాప )ములతొ కోల్పోవు సుఖములు
(పాప) భీతి ధర్మ పథము జుాపు ॥






Saturday, November 13, 2021

అన్నీ ఉన్న అనాధ

అంశం : స్నేహమేరా జీవితం.
శీర్షిక ; అన్నీ ఉన్న అనాధ.


స్నేహామన్నది చాలా అపుార్వమైన బంధం .
నమ్మకానికి ,విశ్వాసానికి , నిలువెత్తు నిదర్శనం .
అంతరాలు చుాడని కృష్ణ-కుచేలులంటి అనుబంధం.
సుఖ సంతోషాలను కలిసి పంచుకునే 
 అనురాగ  స్నేహం ॥
 
 ఒంటరితనపు అసహనానికి స్నేహం ఒక ఓదార్పు.
 ఒడుదుడుకుల ఒత్తిడిలో  మానసిక ధైర్యం స్నేహం .
కష్టాల బాటలో చిరునవ్వుల ఆత్మవిశ్వాసం  స్నేహం॥

బాధల్లో కార్చే కన్నీటిని  ప్రేమగా 
తుడిచే ఆపన్న హస్తం స్నేహం.॥
కులమత బేధాలకు అతీతమై  నీ -నా
తేడాలు చుాపని హృదయ స్వాంతన స్నేహం.॥

 స్నేహమే జీవితమన్న మధురానుభుాతికి
 శాశ్వతమైన ఆలంబన స్నేహమే ॥
"ఎవరికెవ"రన్న  భాధాపుారిత హృదయానికి
"నేను"న్నానన్న  అపారమైన నమ్మకం స్నేహం ॥
.
చనిపోయిన  స్నేహితుని మరువలేక ఆత్మహత్య
చేసుకున్న మరొక స్నేహితుని కారణంగా, చలించిన
అమెరికా ప్రభుత్వం,ఆగష్టు మొదటి ఆదివారాన్ని
ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డేగా  ప్రకటించింది.॥

 అటువంటి అనిర్వచనీయమైన స్నేహ బంధాన్ని
స్వార్ధపుారిత ఆలోచనలతో అపనమ్మకంతో , అనుమానాలతో దుారం చేసుకుంటున్న మనిషి 
జీవితంలో అన్నీ ఉన్నా ఎవరుా లేని అనాధే ॥ 

అటువంటి పవిత్ర బంధానికి నానాటికీ 
తగ్గుతున్న విలువకు నేటి రోజులు సాక్ష్యం .
మారుతున్న మనస్తత్వాల్లో తరుగుతున్న మమతలు
మనిషి మీద మనిషికి నమ్మకం లేని మనసులు-,
ఏ కష్టానికి  కుాడా చలించని మనస్తత్వాలు.॥
         ॥ఈ నాడు స్నేహం ఒక నాటకం॥ .


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

Monday, November 8, 2021

బాల భారతం.

*బాలభారతం ఈ-కవితాసంకలనం*కొరకు
శీర్షిక : బాల భారతం.
పద్య ప్రక్రియ : ఆటవెలది.

కల్ల కపట మెల్ల  కానరాని వయసు
మర్మ మెరుగ నట్టి మనసు దినుసు
వావి-వరుస లెంచి వరుసపి లుపుతోడ
పరుల నమ్ము లేత పసిడి వయసు॥

ఆట పాట లాడి అల్లర్ల  మునిగేరు
ముద్దు జేయ ఒడిని మురిసి జేరు
మామ తాత యనుచు మనసార నదెనమ్మ
తనదు ప్రాయ మెల్ల తారు మారు॥

కాము కులకు జిక్కి  కమిలి కుమిలె బాల
రక్ష ణిలను గనక రగిలె బేల 
పశువు కన్న హీన పరుడైన మగవాడు
గనడు వావి వరుస గార్ధభుండు ॥

నమ్ము పిల్ల దాని నట్టేట ముంచేటి
నరులు రాక్షసు లిల నమ్మ బోకు
కామ మెంతో పెరిగె  కాముకులిల నిండె
ఆడ జన్మ మదియె  అరటి ఆకు॥

.రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
8097622021.

హామీ:
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన

చిత్రకవిత

మహతీ సాహితీ కవి సంగమంలో.
తేది: *08-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
(వచన కవిత ).
మ.సా.క.సం. 19
కవిత సంఖ్య .1.
శీర్షిక  : మనో యుద్ధం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

నోటితో మాట్లాడుతూ
నొసటితో వెక్కిరించే మనిషి నైజం.
అందితే కాళ్ళు అందకపోతే పిలక వైనం
మానవ మస్తిష్కం , స్వార్ధపుారిత
ఆలోచనల మరో ప్రపంచం.॥

మనిషిలో మరో మనిషి చేసే హెచ్చరిక
మనిషి బుద్ధికి అందక తనకు  తానే
చేసే అహంకారపు  అణచివేత. ॥
తన "లో "తనను  అణచివేసే ప్రయత్నంలో
తనను తాను కోల్పోతున్నా
తెలీని అజ్ఞానపు  చీకటి కోట ॥

మనిషకి , మానవత్వానికి
జరిగే యుద్ధంలో మత్సరం నిండిన
ఆలోచన చేసే పతనానికి
బలౌతున్న మనిషి బుద్ధి-॥

బురదగుంటలో బుద్ధి  వేసే
అడుగుతో, మనిషికి మనసుకి
మధ్య జరిగే అంతర్యుద్ధం॥

కళ్ళెదురుగా "మన"ను మనకు
పరిచయం చేస్తున్న మనసు పుటలను,
మనను మనమే  చదువుకోలేని అజ్ఞానం .॥

రెండు నాల్కల పాములా, రెండు
ఆలోచనల మెదడుతో
ఎవరికీ ఎవరుాకాని అశాంతి జీవితానికి
బలౌతున్న మానవ మేధావి
తను తవ్వుకున్న గోతిలో
తానే పడుతున్న స్థితి.
మారని మనుషుల
మాయాజాలపు మనోగతి ॥

Thursday, November 4, 2021

భీమసేనుడు

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

ప్రక్రియ : ఇష్టపది.

శీర్షిక : వజ్రకాయుడు.
(వచన కవిత )


కుార్మి యాదవ రాజు కుంతిభోజరాజుకు
పలుక గారములేలు పట్టి భోజ పుత్రిక ॥
కోరుకున్న దేముడే కోరు సంత తిచ్చునని ,
వాసిగ దుార్వాసుడు  వరమొసగెను ఆమెకు ॥

పసి ప్రాయపు ధ్యానము వరమడిగిన మంత్రము
పఠియించిన  ఫలముా  పసి బిడ్డకు జన్మము
నీట విడెచె బాలుని నిజ భయమున  కుంతీ.
రహస్యమును దాచెను రాత్రి పవలు వగచెను ॥

సరి సమయము వచ్చెను  సఖి కుంతి వివాహము
కురువంశపు రాజుతొ  గుాడిన శుభ సమయము
యొాగ సంతానమదె యొాగ్యతగలదనుచును
యోగ దృష్టిధనులైన  యొాగులు సరి పల్కెను॥

కురువంశ సంజాతుడు  కుంతీ వర పుత్రుడు
భీషణ ఘన కాయుడు భీముడు జనియించెను 
పాండు రాజు భార్యగ పాండవులకు తల్లిగ
కుంతి  పేరుగాంచెను  కులసతిగా  నిలిచెను.॥

పాండవానుజుడితడు బలవంతుడు భీముడు. 
వాయు పుత్రుడీతడు వరలతిబల కాయుడు
సరి నాగుల వరముతొ సహస్ర కరి బలుడు
మాత్ర గదా ధరుడుా మల్ల యుద్ధ యొాధుడు ॥

జంపె బకాసురునుా జరాసంధు చీల్చెను
హిడింబసురు దునిమెను "హిడింబి "పెండ్లాడెను.
ఘటోత్కచ,శ్రుతసోము ఘన పుత్రులు భీమకు
 హిడింబీ, ద్రౌపతుల హిత పుత్రులు ఇరువురు  ॥

అమ్మ మాట మరువడు అన్నయాజ్ఞ  మీరడు 
అతడె భీమసేనుడు  అతి వజ్రకాయుడుా 
కురుక్షేత్ర సమరము  కుల హీనుల దమనము
అనుజులు కౌరవులను అంత మిడిన ఘనుడుా॥

ఆరు అక్షౌహిణుల  అదె కౌరవ సైన్యము
నిర్జించిన వీరుడు నిజ భుజ బల భీముడు
భారతమున బలుడుా, భరత కీర్తి చరితుడు
ఈశ్వరికిల యిష్టుడు  ఇటువంటి సొిదరుడు ॥


శ్రీశైల క్షేత్రం.

తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్-వారి...

అంశం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి వైభవం
కవితా సంకలనం కొరకు,

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

శీర్షిక :  జ్యోతిర్లింగ స్వరుాపుడు.

శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు 
కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. ॥

ఈ క్షేత్రంలో భ్రమరాంబా సహితుడైన శ్రీ 
మల్లిఖార్జునస్వామి భక్తులకోర్కెలుదీర్చే 
స్వామిగా అభయహస్తుడై లింగరుాపంతో
రాజిల్లుతుా  ఉంటాడు.॥

 ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో ఆరవది  ఐన శ్రీశైల క్షేత్రం  నాలుగు  గోపురాలతో
 అత్యద్భుతమైన కట్టడాలుగా  నిర్మించిన దేవాలయాలతో నిత్యముా హర నామస్మరణతో
 పవిత్రమై ,కన్నుల-కింపైనదిగా ప్రసిద్ధి కెక్కింది.

ఈ క్షేత్ర స్థలపురాణ కథనం ప్రకారం , 
గాయత్రీ ఉపాసకుడైన అరుణాచలుడనే రాక్షసుణ్ణి
దేవతలు , దేవగురువైన బృహస్పతిల
సహకారంతో ఆ పరమేశ్వరి  తుమ్మెద రుాపంలో
వచ్చి వధించిందని ప్రతీతి.

స్వశ్ఛమైన నీరుగల  మనోహరగుండము,నాగ ప్రతిమలు, అద్దాల మండపాలు , పంచపాండవుల
దేవాలయాలు , ప్రశిద్ధ పంచ మఠాలు కాక 
ఎన్నో  ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలతో
శోభాయమానమై వెలుగొందుతుా ఉంటుంది.

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాలు కుాడా ఉన్నాయి.

*****


 
 ఈ క్షేత్ర స్థలపురాణ కథనం ప్రకారం , 
 గాయత్రీ ఉపాసకుడైన అరుణాచలుడనే రాక్షసుడు 
 తన తపోశక్తితో తనకు మరణం లేకుండా బ్రహ్మచే వరం పొందడంతో ,భయ భీతులైన దేవతలు 
 ఆదిశక్తిని  ప్రార్ధించగా..గాయత్రీ ఉపాసకుడైన  
 ఆతనిని చంపడం ఎవరి తరముా కాదని అంబ
 పలుకుతుంది.
 అటుపై దేవతలు తమ గురువైన 
 బృహస్పతిని గుాడి వేసిన పథకం ప్రకారం,
 తమ గురువును అరుణాచలునివద్దకు పంపుతారు.
 దేవగురువైన బృహస్పతి ని జుాచి అరుణాచలుడు
 ఆశ్ఛర్యచకితుడై, అతని రాకకు కారణమడుగగా
 బృహస్పతి , తామిరువురుా గాయత్రీ ఉపాసకులు కావడమే ఒక పెద్ద కారణమని చెపుతాడు.
 అదివిన్న అరుణాచలుడు , "దేవతలు కొలిచే గాయత్రిని తాను కొలువడమా." అని అహంకరించి
 గాయత్రీ ఉపాసనను  విడిచిపెడతాడు.
అది చుాసి  కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

ఇక్కడ ప్రజలు శ్రీ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజించేందుకు
మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ॥

ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.॥

స్వశ్ఛమైన నీరుగల  మనోహరగుండము,నాగ ప్రతిమలు, అద్దాల మండపాలు , పంచపాండవుల
దేవాలయాలు , ప్రశిద్ధ పంచ మఠాలు కాక 
ఎన్నో  ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలతో
శోభాయమానమై వెలుగొందుతుా ఉంటుంది.

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాలు కుాడా ఉన్నాయి.


 
 2.
   నల్లమల ఆడవుల లో కొండగుట్టల మధ్య గల
శ్రీశైల క్షేత్రం లో,  ద్వాదశలింగాల లో ఒకటైన
శ్రీ మల్లికార్జునుని పవిత్ర లింగం ఉండడం వలన 
ప్రసిద్ధ శైవక్షేత్రం గా పేరుపొందింది ॥

ఇక్కడ ప్రజలు శ్రీ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజించేందుకు
మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ॥

ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.॥

క్రీ.శ.6వ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం
 పేరు కనిపిస్తుా , చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిదిగా ప్రసిద్ధి చెందినద  క్షేత్రం 
 శ్రీశైలం.॥

Tuesday, November 2, 2021

మొలుస్తున్న పుర్రెలు

1/11/2021.
అంశం : చిత్రకవిత.
(మొలుస్తున్న పుర్రెలు)


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

పద్య ప్రక్రియ : ఆటవెలది.

మనిషి  స్వార్ధ పరుడు  మహిపాడు ధనమేల
మనిషి  మృగమ దాయె  మదము నిండె
ఆస్థి కొరకు వేట అన్నదమ్ముల కోత
తారు మారు జగతి తలలు మొలిచె ॥

Thursday, October 28, 2021

పండిత ప్రతిభ

*ఆహా ఏమి రాశావయ్యా!!!!! ఏమి స్వామి నీ మహిమ?*
      (అక్షరాంక గద్య )
మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో ఎలా స్తుతించాడో 
చూడండి.  పాల్కురికి సోమన్న  అద్భుతంగా వ్రాశారు. 
'అ'ఖిల లోకాధార 
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర  
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ 
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ 
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ   
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ
'క'నద హీనాభరణ 
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ 
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త 
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర 
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార 
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార 
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష 
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ 
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ 
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన 
'మం'త్రస్తుతోధార 
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస 
'ళ'మా విదవ్రంశ 
'వ'రద శైల విహార 
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత  
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర 
శ్రీ పర్వత లింగ 
నమస్తే నమస్తే నమస్తే👌

వాయుపుత్రుడు భీమసేనుడు.

మహతీ సాహితీ కవిసంగమం.
28/10/2021. (గురువారం ).
అంశం : వాయునందనుడు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

మ. సా క సం : 19.
కవితా సంఖ్య : 03

శీర్షిక : వజ్రకాయుడు.
(వచనం )

యాదవరాజైన కుంతిభోజరాజు 
కుమార్తె కుంతీదేవి,వసుదేవుని 
 చెల్లెలు, శ్రీకృష్ణునికి మేనత్తయే 
 గాక పాండురాజు భార్య, 
 పాండవులకు తల్లి. ఆమె అసలు 
 పేరు పృధ ॥
 
 చిన్నతనంలో దుార్వాసుడిచ్చిన 
 అనునుగ్రహ కారణంగా, ఆమె 
 కోరుకున్నపుడు ఏదేవుడిని స్మరిస్తే
 ఆ దైవానుగ్రహం వలన సంతానాన్ని
 పొందగలిగే వరం పొందుతుంది.
ఆ వరోత్సాహంతో వివాహానికి 
ముందే కుంతి, సుార్యదేవుని జపించగా
వర ప్రభావ ఫలితంగా సుార్యుని వలన
కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో 
కుంతికి జన్మించిన వాడు కర్ణుడు.।

కుంతికి ,పాండురాజుతో వివాహామైన
పిదప చాలాకాలం వరకు సంతానం 
కలగలేదు.
ఒకపరి
మహర్షులంతా" బ్రహ్మ "సందర్శనానికి 
సత్యలోకం వెళుతున్న సమయంలో,
పాండురాజు తాను కూడా భార్యా
సమేతంగా వెళ్ళబోయి
అపుత్రశ్యాగతిర్నాస్తి" అనే వేద 
వచనాన్ని తలచుకొని బాధ పడుతున్న
తరుణంలో పాండురాజు తో, 
యోగ దృష్టిధనులైన మునులు, 
దైవ  ప్రసాదముతో నీకు పుత్రులు
 కలిగే యొాగముందని పలుకగా,
ఆతని ప్రథమ పత్ని యైన 
కుంతీ ద్వారా "వర " ప్రసాద విషయం 
తెలుసుకున్న పాండురాజు ప్రోద్బలంతో ,
వాయుదేవుని అంశతో,కుంతికి జన్మించిన
వజ్రకాయుడు, పంచపాండవులలో
రెండవ వాడైన వాడు భీముడు.॥

కౌరవానుజుడైన దుర్యోధనుడు 
అతి బలుడైన భీమునిపై అసుాయతో
భీముని నీటిలో పడవేసి చంపడానికి చేసే
ప్రయత్నంలో , నాగలోకానికి చేరి
వెయ్యి ఏనుగుల బలంతో  తిరిగి వచ్చిన 
వజ్రకాయుడు భీమసేనుడు.॥

భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ
కౌరవ పాండవులలో సాటిలేని  వీరునిగా
పేరొందిన ఘన గదా ధరుడు భీముడు॥
మల్లయుద్ధ యొాధుడైన భీముడు
మల్ల యుద్ధంలోజరాసంధుని, బకాసురున్నీ
అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి.
హిడింబాసురుణ్ణి వధించి, ఆతని సోదరి
హిడింబిని వివాహమాడి, ఘటోత్కచుడనే
పుత్రుని . పత్ని ద్రౌపదిచే  "శ్రుత సోముడు"
 అనే .ఇరువురు పుత్రులను బడసినవాడు.
 
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు 
అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని
 నిర్జించినవాడు, ధుర్యోధన దుశ్శాసనాది 
 కౌరవులు నూర్గురినీ వధించాడు ఐన
అతిబల భీమకాయుడు భీమసేనుడు ॥

Wednesday, October 27, 2021

మత్తకోకిల.. క్రిష్ణ క్రిష్ణ

క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ  క్రిష్ణ కేశవ  పాహిమం
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥
క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా
క్రిష్ణ వేణుసు నాద నందిత  క్రిష్ణ  పార్ధసు సారధీ॥

దేవకీ వసు దేవ నందన        దేవ, దానవ భంజనా 
భావ భక్తిసు దాస పోషక       భాగ్య దాయక పావనా ॥
భుావరాభువ నైక పాలక       భుారి కారు ణ్యాఘనా
పావ నాశక  శాప మొాచ       పరేశ పంకజ లోచనా॥

బాల లీలల పల్లె గాచిన    భాగ్య భక్త జనావనా
గ్వాల మురళీ లోల లోచన   గర్వ, కాలుష వారణా
జాల గోకుల బాల  బాంధవ ఛాయ గోపి జనావనా 
పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥

మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా
లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా
పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా 
కేళి లీలవి నోద నాఖలు కాల కాళియ మర్దనా॥

శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక  చిద్ఘనా
బాల నందసు నందనా భవ బంధ పాపవి మొాచన 
కాల కారణ జన్మ ధారణ  కావు మాఖగ వాహనా
నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా॥

ఇంది రారమణా హరీనమొ ,ఇందు శీతల హాసనా
వంది మాగధి సేవ్య మానసు పాద, పంకజ లోచనా
గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా
సుంద రాసుకు మార మేయవ సుంధరోద్ధర దేవరా ॥

శ్యామ సుందర భాగ్యదాయక సాయి సద్గుణ నాయకా
భామ సత్యహృ ధామ శ్రీపతి ,భార దుర్నర కాంతకా
కోమలాంగ సువేద వందిత కోటి సుార్యప్ర కాశకా
సోమ సుార్యసు లోచ నావర  శోభ నాసుఖ కారకా॥

దేవ పార్ధస  ఖాప రాత్పర      దేహ విశ్వస్వ రుాపకా  
కావ రావయ  కంజ లోచన     కామితార్ధ ప్రదాయకా
సేవ సేతును వేద మూరుతి   శంఖ చక్రగ దాధరా
గోప గోపిజ నార్దనాప్రియ         గోకులాపరి పాలకా॥

జీవ కోటికి రక్షణీయగ    జన్మ  మెత్తిన  మాధనా
పావ నానఘ పద్మ లోచన పాహి భాగ్యవిదాయకా     ॥
ధావ రాగిరి ధారి నాముర ళీమ నోహర మొాహనా
రావ నామశ్రి  క్రిష్ణ పాండవ  రక్ష కాసుఖ కారణా ॥

Saturday, October 2, 2021

ప్రక్రియ : సున్నితం లో అంశం : రక్తదానం.

అంశం : రక్తదానం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

141.
మహిలో  మనుషులు వేరైనా 
 ప్రవహించే రక్తం ఒక్కటేనన్న
 మాటకు నిదర్శనం  రక్తదానం
 చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
142.
కుల-మతాల తేడాచుాపని సమానత్వం
అందరిలో ప్రవహించే  జీవామృతం.
నిజమిదేనని తెలుసుకోవాలి మనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
143.
మానవత్వంలో దాగిన  యజ్ఞంఫలం.
ధనమిచ్చినా దొరకని  మధురసం
అరుదైన  పరోపకార వరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
144.
పౌష్టికాహారం రక్తపుష్టికి  ముాలం.
అహారబలం రక్తశుద్ధి  కారకం
రక్తదానం , జీవితమే ధన్యం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
145.
మనుషులంతా ఒక్కటంటుా నిరుాపించేది
మానవత్వానికి నిదర్శనమై నిలిచేది
రక్తహీనులకు బ్రతుకునిచ్చేది రక్తదానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

Tuesday, September 21, 2021

గురజాడ

✍️గురజాడ నవసమాజపు అడుగుజాడ🙏

అతడు అక్షరాలా.. ద్రష్ట
అసలైన తెలుగు మహాకవిగా ..
సిసలైన సంఘసంస్కర్తగా ..
తెలుగు నేల పై నడయాడిన స్రష్ట (బ్రహ్మ)

నవ్య కవిత్వానికి వేగుచుక్కలా..
ఆధునికాంధ్ర సాహిత్యపు చుక్కానిలా ..
కొత్తపాతల కలయికతో...
తెలుగువారి మూఢాచారాలమత్తును...
సుతిమెత్తగా వదల గొట్టిన...
భావవిప్లవానికి అతడిదే..తొలి అడుగుజాడ 

సాంఘిక సంస్కరణకు చైతన్యం ..
అతడు సృష్టించిన *కన్యాశుల్కం*
*సారంగధర* గా  అవతరించెను..
అతని ఆంగ్ల పద్య కవనం.
కులం కన్నా గుణం మిన్నా అంటూ 
రాచరిక లోపాలను, స్త్రీదుస్థితిని ..
చూపించెను అతని *కన్యక* ఆత్మత్యాగం  

గిడుగు వారి భాషోద్యమానికి..
అడుగు వేసిన నాయకుడై..
*ముత్యాల సరాల* తో   నవ్యచందస్సుకు 
నాంది వేసిన నవయుగ వైతాళికుడై...
*దేశమును ప్రేమించుమన్నా*
*మంచి అన్నది పెంచుమన్నా*
అని పెద్దల్ని మందలిస్తూనే...
*ఏనుగెక్కి మనము ఏ ఊరు వెళ్దాం* ?
అంటూ *మిణుగురుల* తెలుగు వెలుగులో
పిల్లలకు ప్రేమను పంచాడు.

అతనిభావ నవ్యత కి రసపోషణ కి   
నిలువుటద్దం పుత్తడి బొమ్మ  *పూర్ణమ్మ*
తెగువను,  అణకువ కలుగు స్త్రీపాత్రల
వైరుధ్యం  *మధురవాణి బుచ్చమ్మ* .

మానవతావాదిగా  ..
సామాజిక సారథిగా..
సాహిత్య వారధిగా...
దేశభక్తిని ,సాహిత్య శక్తిని..
తన రక్తంలో,తన సిరలో నింపుకొని..
కలాన్ని కత్తిలా పదునుపెట్టి..
మూఢాచారాలను,అస్పృశ్యతను
తెగనరికిన సామాజిక సైనికుడతడు.
*బ్రతికి చచ్చియు ..ప్రజల కెవ్వడు*
*బ్రీతి కూర్చునో..వాడే ధన్యుడు*

✍️దేశపతి మోహన్ శర్మ టీచర్ మెదక్ 
     కవిత సంఖ్య :338

Friday, August 6, 2021

ద్విరదగతి రగడ పద్య లక్షణములు:

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
ద్విరదగతి రగడ పద్య లక్షణములు:

1.  2 పాదములు ఉండును.
2. ప్రతి పాదమునందు 5+5+5+5 మాత్రలు గల గణాలు ఉంటాయి 
3. ప్రతి పాదమునందు 3వ గణము మొదటి అక్షరము యతి స్థానము 
4. ప్రాస నియమం కలదు
5. అంత్య ప్రాసనియమం కలదు

ఉదాహరణ:
ఎన్ని రూపమ్ములో యీ స్ఫటిక హిమములకు
నన్ని స్ఫటికములలో నంభస్సె హిమములకు

కన్నెలు రచించెడు సొగసులీను మ్రుగ్గులో
కన్నియ ప్రకృతి చూపు కడు సొగసు నిగ్గులో

*ప్రధాన కార్యనిర్వాహకులు*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Sunday, July 18, 2021

నీ తలరాత నీ చేతల్లో...

19.07.2021.
మెట్రో ఉదయం జాతీయ తెలుగు దిన పత్రిక మరియు ఉదయ సాహీతి వేదిక వారి కవితల పోటి కోసం:

అంశం: మూఢ నమ్మకాలు

శీర్షిక : నీ తలరాత నీ చేతలో ...

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.

తరాలు మారుతున్నా మనుషుల
మానసిక పరిస్థితి నేటికీ మారలేదు.
మారుతున్న కాలంతో పాటు
ముందడుగు వేస్తున్న మనిషి మేధస్సు
చంద్రమండలానికి చేరుకున్నా,
మారని ఆంతరంగిక భయాలతో
నమ్మకం ,అపనమ్మకాల మధ్య
కొట్టుమిట్టాడుతుానే ఉన్నాడు.

పుార్వకాలపు ముాడాచారాలు
కొన్ని ఉద్యమపోరాటాలతో
సమసిపోయినా  నేటికీ వాటి ఛాయ
మనుషుల్ని  పట్టి పీడిస్తుానే ఉంది..

పర్యవసానం..దేవుని పేరుతో
కుల ,మత , జాతి వైరాలు,
పదవులకోసం దొమ్ములు.
జాతకాలు, పెళ్లిళ్ళ పేరిట,
లుాటీ చేస్తున్న సొమ్ములు॥
నిధి -నిక్షేపాల వేటలో చేతబడులు ,
అక్రమ గెలుపుకు పసిపిల్లల బలులు.॥
పడుచు పిల్లల మానభంగాలు...
ఇలా ఎన్నో అంధ విశ్వాసపు వేటలు.॥
మనిషి చేతి గీతలలో దాగిన తన తల
రాతలను, స్వ శక్తి  నిండిన చేతలతో
మార్చుకోగల శక్తి ,యుక్తి , కలిగినా,
మానసిక బలహీనతల మాధ్యమంలో
ప్రగతి పథానికి  చేరే బాటలో మనిషి
తనకు తానే ప్రబల శతృవౌతుా

ముాడ నమ్మకాల ముళ్ళ బాటలో
నడుస్తుా , పుాల బాటల సుఖ-
సౌఖ్యాలకు దుారమౌతఅనే ఉన్నాడు॥


హామీ:
పై కవిత నా స్వీయరచన. ఇది అనువాదం, అనుకరణ కాదని హామి ఇస్తున్నాను.
.

Saturday, July 17, 2021

కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా రాసిన కవిత..

కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా  రాసిన కవిత..

తెలుగు భాషా చైతన్య సమితి మరియు
లక్ష్య సాధన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో..
కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా  రాసిన కవిత..

అంశం : జయశంకర్ తెలంగాణ ఆకాంక్ష.
శీర్షిక : కీర్తి కిరీటి.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.

పేరొందిన తెలంగాణా సిద్ధాంత కర్త. 
భాషాప్రావీణ్యత గల ఉద్యమ శ్రేష్ట.
ఉన్నత పదవులందిన ఆర్ధక శాస్థ్రవేత్త.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥

తెలంగాణారాష్ట్ర ఆవశ్యకతల పోరాటకుడు
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీన
వ్యతిరేకతల విద్యార్ధి  నాయకుడు ॥
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥

పల్లె-పల్లె లో జయశంకర్ మాటల స్ఫుార్తి.
ప్రజాస్వామ్యైక సంస్క్రుతి స్థాపనకు
జీవతమంతా పోరాడిన  ఉద్యమ శక్తి.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥

విశాలాంధ్రా ప్రతిపాదనల వ్యతిరేక కర్త.
తెలంగాణా వాణిని బలపరచిన భాషాప్రవక్త.
ప్రత్యేక తెలంగాణ అతని జీవిత తుది స్వాశ
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట వారధి
తెలంగాణ నినాదాల ప్రతిధ్యని సారధి
సామాన్య జనుల భావభాషా పునాది.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥

అసమానతల పోరాటాల వీరుడు.
రణనినాదాల రచనాదురంధరుడు
జయశంకర్ కీర్తిశిఖరాలనేలిన ఘనుడు.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥

హామీ :
ఈ సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు.

Friday, July 16, 2021

సైనికుడు సున్నితాలు



4/02/2022.
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ : సున్నితం .
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : జనాభా విస్ఫోటనం  .
శీర్షిక : ఆలోచనతో అడుగు ముందుకు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.


226.
మితిమీరిన జనాభాతో అసౌకర్యాలు
అభివృద్ధి బాటలో అవాంతరాలు.
ఆచరణకురాని సంక్షేమ పథకాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
227.
పచ్చదనం కరువైన  పల్లెసీమలు
నీటికొరతతో బీడువారిన పంటభుాములు
ఆత్మహత్యలతో అన్నదాతల జీవితాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
228.
పరిష్కారంలేని పథకాలతో కేంద్రవైఫల్యాలు
అందుబాటుకురాని ఆర్ధక వ్యవహారాలు  
పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
229.
పెరుగుతున్న కాలుష్యంతో విషపరిణామాలు
పోషకాహారాల కొరతతో  పెరిగేరోగాలు
అంటురోగాలకు అందని మందులు ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
230.
ఆలోచనల్లో మార్పుతో  ఆనందం 
జననియంత్రణే ప్రగతిపథానికి సోపానం
చేయిచేయికలిస్తే దేశోన్నతి తథ్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

హామీ :
పై సున్నితాలు నా స్వీయ రచనలు.


విద్యా  విధానాలలో లోపాలు
పిల్లల భవితకు  ప్రతిబంధకాలు
ప్రగతి పథానికి అవరోధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥



Thursday, July 15, 2021

Gk

[7/15, 13:03] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక జికె ప్రశ్నలు
🍒🍒🍒🍒🍒🍒🍒🍒
ఎపిసోడ్ 16 గురువారం
ప్రశ్నలు🍎🍎🍎🍎🍎🍎

ప్రశ్న; తెనాలి రామకృష్ణుని ప్రబంధం ఏది?
జవాబు;
2 ప్రశ్న; అల్లసాని పెద్దన బిరుదు ఏమిటి?
జవాబు
3 ప్రశ్న: ధూర్జటి రాసిన క్షేత్ర మహత్యం కావ్యం ఏది?
4 ప్రశ్న; తొలి అచ్చతెలుగు కావ్యం ఏది?
జవాబు
5 ప్రశ్న; ఈ యుగంలో దేశి సాహిత్యం అందాల మెక్కింది కవయిత్రుల కు ఆదరణ లభించింది ఈ యుగంలోనే తెలుగు కవులను పోషిం చారు ఆ యుగం పేరు ఏమిటి?
జవాబు;
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🥦🥦🥦🥦🥦🦚🦚
ప్రతినిత్యం జికే పోటీలలో పాల్గొన్న రచయిత పేరు తప్పకుండా ఉండాలి🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍒🍒🍒
[7/15, 14:06] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక గురువారం రోజు ప్రశ్నలకు జవాబులు
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🦚🍇🍇🍇🍇🍇🍇🍇
1 జవాబు పాండురంగ మహత్యం
2 జవాబు ; ఆంధ్రకవితా పితామహ)( పితామహ అంటే శ్రేష్ఠుడు)
3 జవాబు కాళహస్తీశ్వర మహత్యం
4 జవాబు యయాతి చరిత్ర
5 జవాబు; దక్షిణాంధ్ర యుగం/ లేదా నాయకరాజ యుగం అంటారు
👍🏻🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦 మీ శ్రేయోభిలాషి కొమురవెల్లి నరసింహ👍🏻

Wednesday, July 14, 2021

అంశం : రవీంద్రనాధ్ ఠాగూర్ .శీర్షిక : జాతీయ గీత కర్త.

తెలుగు భారత ఎస్.వి ఫౌండేషన్  జనదీపిక  ఆద్వర్యం లో..
అంశం : రవీంద్రనాధ్ ఠాగూర్ .
శీర్షిక : జాతీయ గీత కర్త.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

 ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన లెన్నొ చేసి  రంజింప జేసేటి
సార సద్గు ణాల సత్య వాది
ఘనపు కీర్తి నిడెను కావ్య గీతాంజలి
నోబులు బహుమతిని  ఒసగి రంత॥

మాన వత్వ మున్న మంచి మనిషితడు.
కావ్య రచన జేయు  కళల ప్రియుడు
పద్య, వ్యాస రచన బహుప్రీతిగాజేయు
కవివ రేణ్యు డితడు ఘను డతండు ॥

విశ్వ భారతనెడు విశ్వవిద్యాలయం
స్థాప నతడు జేసె స్థాన కళకు
సర్వ మతము లన్ని ససమాన మనిచాటు
 శ్రీని  కేత నమ్ము  సర్వులకును ॥

ఉత్త మంబు లైన  ఉచ్ఛ సందేశముల
 "గోర" నామ రచన కోరి జేసె.॥
 నాటకంబు లెన్నొ నవలలింకెన్నియొా
 రాసినట్టి ఘనుడు రవిగ వెలిగె ॥
 
 జనగణమన గీతి  జాతీయమాయెను.
 జనులు మెచ్చ నొందె  జగతి కీర్తి.
 అతని కీర్తు లెల్ల అవనిలో ఘనములు 
 ఘన రవీంద్రు డితడు గవుర వుండు ॥


హామీ :
ఈ ఆటవెలది పద్యములు ఏ మాధ్యమునందునుా 
ప్రచురుతములు కాని నా స్వీయ రచనలు.

శీర్షిక : నిరాడంబర నిత్య శ్రామికుడు.

కలామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్
వారి  నిర్వాహణ లో ,
కలామ్స్ కన్వెన్షన్౼2021 ,100 కవితల ద్వారా --ఘననివాళులు అర్పించే సందర్భంగా ---
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిపై రాసిన కవిత.

శీర్షిక  : నిరాడంబర నిత్య శ్రామికుడు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
.

మధ్య తరగతి ఆటుపోట్ల జోవితం
పేపర్ బోయ్ గా ప్రగతి పథానికి వేసిన సోపానం,
ఆశల ఆశయాలకు చుట్టిన ఆరంభ శ్రీకారం.
శాస్త్ర-సాంకేతిక రంగాల్లో విజయారోహణం.
దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన కలాం....
క్షిపణుల నిర్మాణంతో ఆకాశపుటంచులను 
తాకే ఆనందోత్సాహపు విజయ ప్రయాణం.
మిస్సైల్ మేన్ గా చరితకెక్కిన  ఘనం. 
 ఉత్తమ రాష్ట్రపతిగా దేశ సేవకు అంకితం.
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తో                   
ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను,కరోనరీ, స్టంట్ ను
రుాపొందించిన ఘనతకు నిదర్శనం .
 అరుదైన బిరుదులకు అర్హతగల వ్యక్తిత్వం.
 నిరాడంబర  నిత్య పోరాటక శాస్త్ర వేత్త.
పిల్లలపై మమకారం, ఇష్టమైన విద్యాబోధక 
రంగంలో అడుగిడిన కలాం కలలు, సాకారం.
వాడని  చిరునవ్వు అతని అస్త్రం. అతడే
"అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్"  .
ఘన కీర్తికి తార్కాణం,దేశాంకిత సేవా భావం, 
 అందరం కలసి చేద్ధాం అతనికి గౌరవ సలాం.
---------------------------------------------------
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితం కాని నా స్వీయ రచన.

తెలుగు వెలుగు లో కవితలు

[6/29, 15:22] p3860749: తెలుగు వెలుగు సాహితీ వేదిక 
అంశం.: భుా గోళం.

శీర్షిక : జీవిత చక్రం.

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

భుామ్యాకాసాల అమరిక ఘనం.
ప్రకృతి పురుషుల కలయిక ఘనం.
చీకటి వెలుగుల సమయ పాలనం
సుఖ దుంఖాల సమ్మేళనం జీవితం. .
పంచ భుాత మయ భుా ప్రపంచం.
షడృుతువుల సార మనంత ఆకాశం.
జీవ ,జన, జంతు జనన మరణ చక్రం
జీవితం, చతుర్దశాత్మకప నశ్వర క్షేత్రం.
భుామ్యాకాశాలు అనంత శక్తి మయం .
ధర్మ బద్ధ జీవితం ఆనందామృత మయం
పాప చింతనం ఘోర ప్రళయాంతం.


హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని  నా స్వీయ రచన. 

క్రమ సంఖ్య: 127.
[7/7, 08:10] p3860749: 7/ 07/ 2021.
తెలుగు వెలుగు 
చిత్ర కవిత .

ప్రక్రియ : ఆటవెలది.

శీర్షిక : అవని సంజీవని.

మునగ ఆకు మనకు ముఖ్యఔ షధమండి 
ఎంచగ ఉపయొాగ మెంతొ గలదు 
అద్భు తమ్ము మునగ ఆకు కషాయమ్ము
జబ్బు లెన్నిొ పోవు జయము కలుగు ॥

రోగ ములకు మందు  రోజు తిగన విందు
సర్వ రోగ హారి  సర్వు లకును
పోష కములు విధిగ పొందుగా నందుండు
ఫలము ఆరోగ్యమ్ము  పడతు లకును॥

మునగ ఆకు పొడిని మునగ కుారను తిన్న
పోష కములు పెరుగు పొట్ట తరుగు
కాల్షి యమ్ము పెరిగి కీళ్ళ నొప్పులు పోవు
మహిని రోగు లకును మహిమ చుాపు ॥

తగ్గు షుగరు వ్యాధి తగినంత కుారతో
కంటి చుాపు, ఒంటి  కాంతి పెరుగు
పాలు నిండుగుండు బాలింత రాలికి
ఆకు తినగ పెరుగు  ఐరనంట ॥

అద్భు తమ్ము మునగ అవని సంజీవని
వయసు ఎంత యైన, వారు తినగ
వైద్య గుణము లున్న  ఔషధమ్మీ  మునగ
 అలరు గుణము లెరిగి ఆర గించు ॥


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య :  127.
[7/8, 07:37] p3860749: 8/07/2021
తెలుగు వెలుగు సాహిత్య వేదిక 
అంశం : అక్షరమాల  కవిత.
శీర్షిక : నా దేశం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


స స్యశ్యామలమైన దేశం
మ లినమై మొాడుబారింది.
ర క్కస, రాక్షస కృత్యాలతో
నా ,నీ స్వార్ధాల రక్తధారలతో 
ద రిద్ర జన పీడితురాలయ్యింది.
ము చ్చటైన పచ్చదనం కరువయ్యింది.
స హజ సౌందర్యం దోచుకోబడింది.
హ హా కారాలు, ఆర్తనాదాలతో
జ న జీవితం అట్టుడికిపోతోంది
వా యువులో నిండిన ప్రదుాషణం
ద యమాలిన జన  కాలుష్యంతో
ము చ్చటైన ముాడు రంగుల ఝండా
ము డుచుకు పోయి ముాలపడింది.
ఇదే ఈ నాటి నా దేశస్థితి.



హామీ:
నా ఈ కవిత  ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని స్వీయ రచన.
[7/9, 15:20] p3860749: 9/07/2021.
తెలుగు వెలుగు  లో
అంశం : తొడుా ..నీడ.
శీర్షిక : మరువలేని తోడు..

జీవితంలో ఒంటరిగా బతకలేడు మనిషి
పసితనంలో తల్లిదండ్రుల లాలన 
చదువుకొనేటప్పుడు ఈడైన జోడు, తోడు ,
యక్త వయసులో స్నేహ బంధాల జోరు॥
వివాహానంతరం భార్య సహచర్యం
వృద్ధాప్యంలో పిల్లల అండ దండలు.
ప్రతీ ఒక్కరికీ అవసరమే..
ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డ 
మనిషి.చివరి వరకు తను ప్రేమించిన
ప్రతి వారు తన కుాడా  ఉండాలన్న ఆశతోనే బతుకుతాడు.ఆ ఆశకు ప్రతి రుాపం 
భార్య. అన్ని బంధాలకు అతీతమై
నీతోడుగా, నీడగా ఉంటుా  నీలో 
ఆశలకు,  అనందాలకు అర్ఘ్యంపోస్తుా.
చివరిదాకా నీకు వెలుగు బాట చుాపిస్తుా 
నీ నీడై మసలే నీ తోడు..


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


హామీ: ఈ కవిత  ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.
[7/10, 14:41] p3860749: తెలుగు వెలుగు సాహితీ వేదిక.
10/07/2021
అంశం : బాల సాహిత్యం.
(బాలల గేయాలు )

 శీర్షిక : చిట్టి పొట్టి పాపలుా .
 (బాల గేయం ).

చిట్టి పొట్టి పాపలుా 
చిన్నారి పాపలుా
నాతోడు జతకుాడండి
నా మాట విన రారండీ
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

అన్నెం పున్నెం ఎరుగరు మీరు 
సీతాకోక చిలుకలుా
అమ్మానాన్నిల కొలువులుా 
గురులే దైవ స్వరుాపులుా
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

జగమంతా ఎరగాలంటే 
చదవాలండీ చదువులుా 
ఎదిగినకొద్దీ తెలియాలండీ 
మనసుా మమతల విలువలుా.
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

సత్యం ధర్మం నీ బాటైతే 
జీవితమే సుమ గంధముా
స్నేహం,బంధం నిలిపావంటే  
బ్రతుకే ఔను సర్గముా
॥చిట్టి పొట్టి పాపలుా ॥

కలిమి-లేములు కష్ట-సుఖాలు  
మొాసే కావడి కుండలుా
కలిసి మెలసి ఉంటే పెరుగును
ప్రేమను పంచే బంధాలుా 
॥చిట్టి పొట్టి పాపలుా ॥

దేశంకోసం త్యాగం చేసే 
వీరులబాటను ఎంచుకో
దేశ ప్రగతికై నీవో సమిధై
ఇలలో కీర్తిని నింపుకో 
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

హామీ: ఈ బాల గేయం ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.
[7/13, 14:28] p3860749: 13/07/2021.
తెలుహగు వెలుగు సాహితీ వేదిక.
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక  : ఆడది అబల కాదు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య : 127.

ఇంటింట కొలువైన ఆడవారిది బ్రతుకె
ఆత్మాభిమానమే అవమానమై చితికె ॥

 అందాల పుా రెమ్మ ,  ప్రతి సృష్టి కిల బ్రహ్మ
 నలుగురిలో నగుబాట్ల తోలుబొమ్మాయెనమ్మ ॥
 
 అనురాగమును పంచు అతివ శక్తౌ వెలుగు 
అమ్మగా, ఆలిగా,  తోబుట్టు వై  మెలగు ।

ఆకాశ మున వెలుగు చంద్ర బింబము తలపు॥
అన్ని రంగాలలో ఆత్మస్థైర్యపు గెలుపు ॥

హిమపన్నగములెక్కు పోరాట పటిమామె 
ఆకాశ భాగాన సగమైన సబలామె ॥

అడుగు అడుగున నిండు అవమాలముల నొడ్డి
పురుషాధిపత్యముల సగమైన శక్తామె ॥

అవని " అబల" ను మాట రుాపు మాపెను పోరి 
అవనీ పోరాటాల , అందలాలను చేరి ॥

ఆమె అవమానమ్మె  అమ్మ  అవమానమని
తలచు మగడే మహిని  తనను తానే గెలుచు ॥

హామీ :
ఈ కవిత  ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
[7/14, 12:00] p3860749: 14/07/2021
అక్షర క్రమ కవిత.
ప్రక్రియ : తేటగీతి.


*క*విత లల్లుట కొరకేను  కలము బట్టి
*మం) చి మాటల్లు రాయంగ  మదిని దలచి
*ల*లిత రమణీయ పదయతి లక్షణముల
*నా*ధు శ్రీరాము కీర్తన లల్లి తినిగ ॥
*
 
*భా*గ్య  మిచ్చెడి తల్లదే  వరము లిడగ
*క*మల నయనామె  కోమలి కరుణ తొోడ
*న*మ్మి నట్టివా రినిగాచు నలువ భగిని
*గ*రిమ శ్రీలక్ష్మి  సౌభాగ్య  కలిమి రాసి ॥

*రా*మ రాజ్యంబు కనరాదు రక్ష ణీయ
*వా* యు పుత్రువే డసురుల వరుస దునుమ
దేవ దేవుండు వెన్నంటు  దేహ బలుని
వాత ఆత్మజు గాచేటి  వరమతండు ॥

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర 
8097622021.
క్రమ సంఖ్య : 127.

హామీ :
ఈ తేటగీతి పద్యములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు. .

Tuesday, July 13, 2021

బాలల గేయం

తెలుగు వెలుగు సాహితీ వేదిక.
10/07/2021
అంశం : బాల సాహిత్యం.
(బాలల గేయాలు )

 శీర్షిక : చిట్టి పొట్టి పాపలుా .
 (బాల గేయం ).

చిట్టి పొట్టి పాపలుా 
చిన్నారి పాపలుా
నాతోడు జతకుాడండి
నా మాట విన రారండీ
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

అన్నెం పున్నెం ఎరుగరు మీరు 
సీతాకోక చిలుకలుా
అమ్మానాన్నిల కొలువులుా 
గురులే దైవ స్వరుాపులుా
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

జగమంతా ఎరగాలంటే 
చదవాలండీ చదువులుా 
ఎదిగినకొద్దీ తెలియాలండీ 
మనసుా మమతల విలువలుా.
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

సత్యం ధర్మం నీ బాటైతే 
జీవితమే సుమ గంధముా
స్నేహం,బంధం నిలిపావంటే  
బ్రతుకే ఔను సర్గముా
॥చిట్టి పొట్టి పాపలుా ॥

కలిమి-లేములు కష్ట-సుఖాలు  
మొాసే కావడి కుండలుా
కలిసి మెలసి ఉంటే పెరుగును
ప్రేమను పంచే బంధాలుా 
॥చిట్టి పొట్టి పాపలుా ॥

దేశంకోసం త్యాగం చేసే 
వీరులబాటను ఎంచుకో
దేశ ప్రగతికై నీవో సమిధై
ఇలలో కీర్తిని నింపుకో 
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

హామీ: ఈ బాల గేయం ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.

Monday, July 12, 2021

G.K





[8/6, 15:11] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🌺 సాహిత్య విజ్ఞానం🥇
నిర్వాహణ శ్రీ కొమురవెల్లి నర్సింలు 
ఎపిసోడ్ 33
తేదీ;6/8/2021
వారం; శుక్రవారం 
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ప్రశ్నలు
1 నవలను కందుకూరి వీరేశలింగం ఏమన్నారు?

2 తొలి హాస్య నవల ఏది?

3 తొలి చరిత్రక నవల ఏది?

4 తొలి మండలి క నవల ఏది?

5 బారిష్టర్ పార్వతీశం హాస్య నవల రాసింది ఎవరు?

సూచన: ప్రతి రోజు మూడు గంటలకు గ్రూపులో ప్రశ్నలు ఇవ్వబడును మీరు నాలుగు గంటల వరకు కరెక్ట్ జవాబు ఎవరైతే ముందు వ్రాసి గ్రూపులో పెడతారో వారే విజేతలుగా తీసుకుంటారు👏🏼👍🏽
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇💐💐💐💐💐💐💐💐💐💐
[8/6, 16:15] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
ఎపిసోడ్ 33 శుక్రవారం రోజు ప్రశ్నలకు జవాబులు
💐💐💐💐🥇🥇🥇🥇🥇🥇🥇🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
1 జవాబు వచన ప్రబంధం
2 జవాబు చిలకమర్తి వారి గణపతి
3 జవాబు చిలకమర్తివారి హేమలత
4 జవాబు దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు
5 జవాబు మొక్కపాటి నరసింహశాస్త్రి
💐💐💐💐💐💐💐🌾🌾🌾🌾🌾🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

[7/16, 12:43] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🌴 సాహిత్య విజ్ఞానం🌳
ఎపిసోడ్ 17
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
తేదీ 16/7/2021 శుక్రవారం జీకే ప్రశ్నలు
💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
1 ప్రశ్న; రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు?
జవాబు
2 ప్రశ్న; అచ్చ తెలుగు రామాయణం రాసింది ఎవరు?
జవాబు
3 ప్రశ్న; తరిగొండ వెంకమాంబ రచించిన కావ్యం ఏది?
జవాబు
4 ప్రశ్న; మంచాన రాసిన కథా కావ్యం ఏది?
జవాబు
5 ప్రశ్న; భోజరాజీయం రాసిన అనంతామాత్యుడు ఏ కాలం వాడు?
జవాబు
*********************************
[7/16, 14:52] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక శుక్రవారం రోజు ప్రశ్నలకు జవాబులు
🌷🌷🌷💐💐💐💐💐💐💐
1 జవాబు చేమకూర వెంకటకవి
2 జవాబు కూచిమంచి తిమ్మకవి
3 జవాబు వెంకటాచల మహత్యం
4 జవాబు కేయూరబాహు చరిత్ర
5 జవాబు శ్రీనాధ యుగం 15వ శతాబ్ది
రచయితలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు🌺🌷🌷🌷🌷🌺🌺🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏🏼


[7/13, 13:26] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🦜 సాహిత్య విజ్ఞానం🦜
ఎపిసోడ్ 14
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🏹🏹🏹🏹🏹🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
తేదీ 13/7/2021 మంగళవారం జీకే ప్రశ్నలు🙏🏽🙏🏽 ఈరోజు తెలుగు కవుల యొక్క పలుకులు👏🏼👏🏼🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
1 ప్రశ్న; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని అన్నది ఎవరు యొక్క పలుకులు?
జవాబు
2 ప్రశ్న దేవుని కంటే మనిషి ఇష్టం దేశం ఇష్టం తెలుగు మరీ ఇష్టం అన్నది ఎవరు?
జవాబు
3 ప్రశ్న; భరతఖండంబు చక్కని పాడియావు అన్నది ఎవరి పద్యం?
జవాబు
4 ప్రశ్న మన స్వతంత్రం మేడిపండు మన దరిద్రం రాచపుండు అన్నది ఎవరు?
జవాబు
5 ప్రశ్న నీవు ఎక్క తలుచుకున్న రైలు ఎప్పుడు ఒక జీవితకాలం లేటు అన్నది ఎవరు?
జవాబు
*************************౮౯౯౯౯
ఈరోజు జీకే ప్రశ్నలు తెలుగు కవుల యొక్క పలుకులు🙏🏽🙏🏽🙏🏽🦜🦜🦜🦜🦜🦜🦜🌻🌻🌻🌻🌻
[7/13, 15:58] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక మంగళవారం రోజు యొక్క ప్రశ్నలకు జవాబులు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲👏🏼👏🏼👏🏼
1 జవాబు దేవరకొండ బాల గంగాధర తిలక్
2 జవాబు కందుర్తి ఆంజనేయులు
3 జవాబు చిలకమర్తి లక్ష్మీ నరసింహం
4 జవాబు ఆరుద్ర
5 జవాబు ఆరుద్ర
🌻🌻🦜🦜🦜🕉️🕉️🕉️🌴🌴


[7/12, 11:29] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🥦 సాహిత్య విజ్ఞానం🌻
ఎపిసోడ్ 13
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬
తేదీ 12/7/2౦21 శనివారం జీకే ప్రశ్నలు
1 ప్రశ్న; నేను సైతం ప్రపంచాగ్నికి అనే గీతానికి జాతీయ అవార్డు అందుకున్న సినీ గేయ రచయిత ఎవరు?

జవాబు
2 ప్రశ్న; తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు?
జవాబు 
3 ప్రశ్న జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి అనే గేయ రచయిత ఎవరు?
జవాబు
4 ప్రశ్న నల్లగొండ జిల్లా నుండి నీలగిరి పత్రిక ఏ సంవత్సరంలో నడప బడింది?
జవాబు
5 ప్రశ్న; మీజాన్ పత్రిక స్థాపకుడు ఎవరు ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
జవాబు 
***********************👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐
గ్రూపులోని రచయితలందరికీ నాయొక్క హృదయపూర్వక అభినందనలు ప్రశ్నలకు జవాబులు క్రిందా మీ పేరు తప్పకుండా పెట్టగలరు🕉️🕉️🕉️🕉️🥦🥦🥦🥦🥦🥦
[7/12, 15:36] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక సోమవారం రోజు ప్రశ్నలకు జవాబులు
🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🌴🌴🌾🌾🍇🍇🍇🍇🍇🍇🍇
1 జవాబు సుద్దాల అశోక్ తేజ
2 జవాబు పి.యశోదారెడ్డి
3 జవాబు అందే శ్రీ జై బోలో తెలంగాణ
4 జవాబు 1922 సంవత్సరం
5 జవాబు ఆడవి బాపిరాజు 1944 సం
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

తోడు నీడ

9/07/2021.
తెలుగు వెలుగు  లో
అంశం : తొడుా ..నీడ.
శీర్షిక : మరువలేని తోడు..

జీవితంలో ఒంటరిగా బతకలేడు మనిషి
పసితనంలో తల్లిదండ్రుల లాలన 
చదువుకొనేటప్పుడు ఈడైన జోడు, తోడు ,
యక్త వయసులో స్నేహ బంధాల జోరు॥
వివాహానంతరం భార్య సహచర్యం
వృద్ధాప్యంలో పిల్లల అండ దండలు.
ప్రతీ ఒక్కరికీ అవసరమే..
ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డ 
మనిషి.చివరి వరకు తను ప్రేమించిన
ప్రతి వారు తన కుాడా  ఉండాలన్న ఆశతోనే బతుకుతాడు.ఆ ఆశకు ప్రతి రుాపం 
భార్య. అన్ని బంధాలకు అతీతమై
నీతోడుగా, నీడగా ఉంటుా  నీలో 
ఆశలకు,  అనందాలకు అర్ఘ్యంపోస్తుా.
చివరిదాకా నీకు వెలుగు బాట చుాపిస్తుా 
నీ నీడై మసలే నీ తోడు..


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


హామీ: ఈ కవిత  ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.

మధురగతి రగడ

అంశం: *చిత్రకవిత*
తేదీ: 12-07-2021
మ. సా.క.సం. *28*
*********************
పేరు: పొర్ల వేణుగోపాలరావు
ఊరు: ఎల్లారెడ్డిపేట
ప్రక్రియ: మధురగతిరగడ
శీర్షిక: అంతా మేమే
ఈమాసం కవితాసంఖ్య: *07*
*********************

మిలమిల మెరుపుల మింటిసితారలు
జలజల యేరుల జారే యాటలు

కిలకిల నవ్వుల కీరపు మాటలు
గలగల సవ్వడి గాలుల గోలలు

తళతళ మెరిసే తామర మోములు
కళకళ లాడే కాంతుల చిందులు

బుడిబుడి నడకల బుడతలు మేమే
వడివడి యడుగుల పరుగుల మేమే

చకచక చదువులు చదవగ మేమే
పకపక నవ్వుతు పనులలొ మేమే

నలుగురు మెచ్చగ నడతయె నచ్చగ
వెలుగులు చిమ్ముతు వేకువ వచ్చెగ

పాపలు పాటలు పాడుతు సాగగ
రేపటి జెండా రెపరెప లాడగ

ఎల్లలు యెఱుగని యీ నవలోకం
పిల్లల భవితకు పెట్టిన తిలకం
*********************
హామీపత్రము: ఇది నా స్వంత రచన. దేనికీ అనువాదం,అనుకరణ కాదు.

అమ్మ

12/07/2021
మెట్రో ఉదయం జాతీయ తెలుగు దినపత్రిక
మరియు ఉదయ సాహితీ వేదిక కర్నూల్ ,& హైదరాబాద్ సంయుక్తంగా  నిర్వహించే కవితల పోటీ

కవితా అంశం " అమ్మ "
శీర్షిక  : ఇల వెలసిన దేవత .



" అమ్మ " అనే రెండక్షరాల లో 
 నిబిడి ఉన్నది అండ పిండ బ్రహ్మాండం.
 ఓంకారమయ నాద తరంగం.--
'అమ్మ "అనే శబ్దానికి  ఆరంభం.
వేల రుాపాల శక్తిగా కాచుతున్న బంధం ॥.
"దైవం మానవ రుాపేణ" అన్న వాక్యానికి
సంపుార్ణ మైన సాదు స్వరుాపం "అమ్మ ".
అమ్మ గర్భంలో నవ మాసాల ప్రయాణం.
ఏ ప్రయత్నముాలేక పోయినా అందుతుాన్న జీవామృుత ఫల స్వరుాపం, అమ్మ.॥
మాటల తరంగాలతో తెలుసుకున్న 
ముచ్చటైన ప్రపంచం అమ్మ.
సృష్టికి ప్రతి సృష్టి చేసిన దేవత ఒడిలో
నిశ్ఛింతగా నిదరోయే పసితనానికి 
స్వాంతన నిచ్చే శాంతం అమ్మ.
తడబడే అడుగుల్లో ఆటల్లో, మాటల్లో, 
మెళకువల వేటల్లో కాచే చేయుాత అమ్మ.
జీవన బాటలో ఒడిదుడుకుల 
ఆరాటాన్న తగ్గించే పోరాటం అమ్మ.॥
బాధ్యతల బరువులో నాన్న లో
సగమైన భావనతో, నడిపే జీవిత
సంసార నావకు చుక్కాని అమ్మ. ॥
అక్షరాల బాటలో మనను అందలాలకు
ఎక్కించి, ఆనందాల కోటలో అందర్నీ 
నిలిపి -ఆనందించే, అహర్నిశల 
ఆరాటాల అలుపెరుగని పోరాటం అమ్మ ॥
తరగని ప్రేమ కు సాక్ష్యం అమ్మ .
నాటి కీర్తి చరితలకు, నేటి భావి తరాలకు 
జీవిత అదర్శాల అరంభం అమ్మ ॥
అనురాగం, ఆనందం,విడలేని  బంధం  
కలబోసిన భువి వెలసిన " దేవత మన అమ్మ" ॥


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య : 127.

హామీ :
ఈ కవిత ఏమాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన .

 


Thursday, July 8, 2021

నేటి అమ్మ...అభిరమ్ గారి రచన.

*తప్పిపోయిన అమ్మ  కావాలి*

ఓనాడు నేలపై నడిచేటి దేవతే అమ్మ 
ఈనాడు ఆ అమ్మనే ఆధునిక భూతమావయించెనమ్మ 

ఆనాడు ముద్దాడి మురిపించి ముద్ద తినిపించేది అమ్మ 
ఈనాడు సెల్లులో సొల్లుతో పసివాడి గుండెల్లో అశ్రద్ధ ముల్లుగుచ్చి కసురుకునేది  నేటికాలపు అమ్మ 

అందాలు త్యజించి రొమ్ములో సొమ్మును ధారపోసేది ఆనాటి అమ్మ 
అందరక్షణ పేరుతో డబ్బాను పసినోట్లో కుక్కేసి 
రసాయనాలను మెక్కేసి మెరిసేది నేటికాలపు అమ్మ 
ఆమె అమ్మ కాదయ్యా నిజానికి ప్లాస్టిక్ బొమ్మ 
ప్లాస్టిక్ బొమ్మ  ప్లాస్టిక్ బొమ్మ 

వీరగాధలు చెప్పి వీరత్వమును నింపేది ఆనాటి అమ్మ 
వెర్రిచేష్టల వలయంలో  సంస్కారహీన రోగానికి చిక్కి వెతలపాలవుతున్నా అనారోగ్య రూపమే నేడున్న  అమ్మ

ఏనాటికైనా అమ్మ గొప్పదేనమ్మ 

ఆ అమ్మలో వచ్చేటి మార్పు నేటి సమాజానికి 
ముప్పేనమ్మ 
ప్రతి మహిళ మలినపు మార్పులను కసురుకుని 
మనుగడకు బీజమేస్తే  
ఏ నాటికైనా అమ్మ 
అపురూప కావ్యమేనమ్మ 
అపురూప కావ్యమేనమ్మ 
అపురూప కావ్యమేనమ్మ 

                               *అభిరామ్*

జన భారతం.

09/07/2021
మనుమసిద్ధి కవన వేదిక లో
అంశం : జన భారతం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : భరత భవిత మీ చేతిలో...

పెరుగుతున్న జనాభాతో 
తరుగుతున్న దేశ ప్రగతి.
పెరుగుతున్న కాలుష్ఞం.
తరుగుతున్న వనరుల
ఉత్పత్తి.
దేశ ప్రజల దుర్భర స్థితి.॥

పెరుగుతున్న జనాభాతో 
తరుగుతున్న భుాభాగం.
కలుషితమౌతున్న ప్రకృతి.
పర్యావరణంలో మార్పులు.॥

నానాటికీ పెరుగుతున్న 
జనాభాల ద్వారా ఎదుర్కోవలసిన
దుష్పరిమాణాల అవగాహన కొరకు
ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన
 "ప్రపంచ జనాభా దినోత్సవం ".॥
 
 నేటికీ  "జుాలై పదకొండున" మనం
 జరుపుకుంటున్నా,జనుల నిర్లక్ష్య వైఖరి 
 అవగాహనలేమితో ఎదుర్కోవలసిన
 దుష్పరిమాణాల దుస్థితి ॥
 
 రేపటి భవితకు భవిష్యత్తులేని
బాధాకర పరిస్థితి.ఆలోచించండి.
. దేశ సౌభాగ్యం ,భావి తరాల
 భవిష్యత్తు మీ చేతిలో...॥
 

Wednesday, July 7, 2021

G. k

ఈ రోజు జీకే ప్రశ్నలు.
-----------------------------

1 ప్రశ్న; శివ కవులలో మొదటివాడు ఎవరు?
జవాబు:  నన్నె చోడుడు

2 ప్రశ్న; పండితారాధ్య చరిత్ర రాసిందెవరు?
జవాబు;  పోల్కురికి సోమనాధుడు.

3 ప్రశ్న: యాదవ వాక్కుల అన్నమయ్య రచన ఏది?
జవాబు; సర్వేశ్వర శతకం.

4 నన్నెచోడుడు రాసిన కావ్యం ఏది?
జవాబు;  కుమార సంభవము.

5 ప్రశ్న; వీర శైవ మత స్థాపకుడు ఎవరు?
జవాబు;
ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు.


రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
*************************

అమ్మల కోసం పాట

వారం వారం కవిత లో
అంశం: అమ్మ.
శీర్షిక : త్యాగశీలి అమ్మ.

అమ్మల కోసం పాట


పల్లవి:
అనురాగం అభిమానం నిండిన కొమ్మా 
ఇల వెలసిన దేవత గద అమే అమ్మా..॥

అను పల్లవి:
కనరాని శాంతమే  కొరత లేని సహనమే
ఆ రెండుా కలిసిన  ఒక త్యాగముార్తి అమ్మా ॥

చరణం.
ఒడి బడిగా చేసి , ప్రేమ పలుకు పంచి పెంచి
తొలి అడుగుల నిలకడకే  ఆధారమె అమ్మా
మన భవితే తన బ్రతుకని 
మన ఘనతే తన సుఖమని
తలచి తలచి మురిసేటీ అనురాగమె  అమ్మా ॥.

చరణం: 
తల్లిపాల అమృతమే మన జీవము సుమ్మీ
తల్లి కష్టమే, పెరిగే మన కాయము తమ్మీ
తను తిన్నా లేకున్నా కడుపు నింపు మనకన్నా
కలిమిలోన లేమిలోన  మన బలమే కద అమ్మా ॥

చరణం: 
పనులెన్ని చేసినా , తనువెంత అలసినా 
సుఖము కోరి సేదతీర తలవదామె అమ్మా..
తన వారి సౌఖ్యమే తన జీవితమని తలచి 
తన కోస మొక క్షణం  కోరదామె  అమ్మా  ॥

చరణం: 
జవసత్వాలుడిగి వృద్ధాప్యమె చుట్టుముట్ట
కన్న పేగు చేయు తప్పు కాచు న్యాయమమ్మా
అవమానం చేసినా ఆశ్రమాల తోసినా 
కన్న బిడ్డ సుఖము కోరి దీవించేదమ్మా ॥

 ఈ పాట ఏ మధ్యమునందునుా ప్రచురితం కాని 
 నా స్వీయ రచన.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
 


Saturday, June 26, 2021

తెలుగు వెలుగు లో కవితలు

[6/19, 13:19] p3860749: SV ఫౌండేషన్ వారి తెలుగు వెలుగు 
కవితల పోటీ కొరకు...

అంశం : నాన్న. (వచన కవిత)
శీర్షిక  :  నిత్య కర్షకుడు.

నా పాలబుగ్గల తళుకుల లో
ప్రతిఫలించే ఆనందపు హరివిల్లతడు.
నా ఉత్తమ విద్యల ,ఉజ్వల జీవితపు 
భవిష్యత్ప్రణాళికల బాధ్యత అతడు.
అమ్మ  అహర్నిశల కష్టానికి ఆలంబనై
జీవిత ఆకాంక్షల మణిపుాసలల్ని
ఒకటొకటిగా పేర్చి కలిపే సుాత్ర మతడు.
తడి -పొడి జీవితపు పోరాటంలో
తన శక్తి అనే అస్త్రాన్ని అడ్డుపెట్టి 
మమ్మల్ని గెలుపు బాటలో నడిపించే
 ఉత్తమ  రక్షక పాలకుడతడు.
విధి నిర్వాహణల పంట భుామిలో
కష్టమనే హలాన్ని చేత బట్టి 
సంసారమనే బీడుభుామిని సాగు చేసి
బాధ్యత ,బరువు అనే చెమటధారలతో 
కుటుంబ సేద్యాన్ని  చేస్తుా ఆకలి దీర్చే
నిస్వార్ధ నిత్య  కర్షకుడతడు ॥
ఎంతో ఎత్తుకెదిగి తలలుాచే పచ్చటి
కంకుల సార సౌందర్యాన్ని ఆస్వాదిస్తుా
తను పడిన కష్టాన్ని మరచి ఆనందంతో
శ్రమించే మహా " మనీషి " అతడు  .
 నా జీవిత వసంలో  నిత్య వసంతుడై
 నిలిచి ఉన్న  మహి వెలసిన మాధవుడు
 ఎవరోకాదు  మా " నాన్న" అతడు.


హామీ:
ఈనా కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన

రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
క్రమ సంఖ్య : 127.
[6/19, 13:20] p3860749: కవన వాహినీ తెలుగు వెలుగులో
అంశం : అక్షరక్రమ కవిత 
శీర్షిక :  ప్రేమ సందేశాలు.

కవన వనంలో కవితాక్షర సుమాలు
వలపు గీతికల సాహిత్య పరిమళాలు
నవ్వుల జల్లుల  ఆనంద గీతికలు
వాసి నిండిన వరుస శృతి లయలు
హిమ పన్నగ శోభల సుందర దీపికలు
నిత్య నిర్మల వాహినీ ఝరీ తరంగాలు
తెలుగు వెలుగుల తేట సందేశాలు
లుఫ్త మై దాగినన మనో భావనా వీచికలు 
గుండెలో పదిలమైన అందమైన జ్ఞాపకాలు 
వెన్నెల రాత్రుల విరహ వేదనా ప్రకంపనలు
లుప్తాంశాల సుదీర్ఘ కావ్య ప్రభంజనాలు
గుండె లయల ఘన జీవన తరంగాలు ॥
నా మది నిండిన నవ్య రస ప్రేమ సందేశాలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
క్రమ సంఖ్య : 127

హామీ:
ఈనా కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[6/26, 08:54] p3860749: 26/06/2021.
అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : మా  తరం  చరిత్ర.

(వం)దనాలు కరువైన  
 పరదేశీ వ్యామొాహం.
(దే)శ ప్రగతి సుాన్యం .
 దైన్య స్థితిలో జనం , మనం.
(మా)రని మనస్తత్వాల 
మారణ హోమపు కాలుష్యం.
దిగజారిపోతున్న ప్రకృతి అందాలు
(త)రిగిపోతున్న మానవ బంధాలు
( రం)కు రాజకీయాలతో 
 రగిలిపోతున్న న్యాయ వ్యవస్థ.
  బీద, బిక్కి, బడుగు, జీవితాల
 భారమౌతున్న బతుకు అవస్థ.
పుటల్లో నిండిన ఉద్యమకారుల పాత్ర
( వందే) ళ్ళైనా మారని భారత చరిత్ర.
 ఇదే ఈ నాటి (మాతరం) జీవన వేధ..
 భరత మాత ఒడి నిండిన కన్నీటి కథ ॥

------------------------------------------

అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక :  భయం-భయం, క్షణ -క్షణం ॥

 వంకర టింకర రాజకీయం
 దేశ ప్రగతి దుఃఖ మయం
 మా,మీ, తగాదాల మారణ హోమం
 తరిగిపోతున్న మానవర్వ వులువలు 
 రంగు మారుస్తున్న రాజకీయ వ్యవస్థ-
  నిండే మా "తరం". అను క్షణం ,
  భయం- భయం ,  క్షణ -క్షణం ॥

Friday, June 25, 2021

నవరత్నాలు

నవ రత్నాలు
1. దీనిలో 4 వరుసలు ఉండాలి
2. ప్రతి వరుసలో 10 నుండి 16 అక్షరాలు రావాలి
3.న గుణింతాము తో 1,2,3 వరుసలు మొదలవ్వాలి
4. చివరి వరుసలో
నవ రత్నాలు మానవ హిత కారకాలు అనే మకుటం రావాలి

Wednesday, June 23, 2021

చిత్ర కవిత.

తెలుగు వెలుగు లో
చిత్ర కవిత.

ప్రక్రియ : ఆట వెలది 

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

విడెను లాకు డౌను  విచ్చలవి డిపెరిగె
చేయి చేయి పట్టి  చెలగి రంత
నియమ పాల నమును  నిశ్చయ మ్ముగవీడి
మాస్కు మాట మరచి  మనిషి మెలగె   ॥

లాకు డౌను వీడ  లాగివీ ధినిబడి
సాకు లెన్నొ జెప్పి   సడలి నిష్ట
బడికి పోవు బాల విడిచెమా స్కునుచుాడు
చేరి కరము బట్టె చెలిమి కొరకు ॥

మాస్కు నొకరు వేసె  మాస్కుతీ సిరొకరు
కదలి పోవు చుండ్రి కరము బట్టి
 కరుణ లేని దైన  కణముమ హమ్మారి  .
 కాటు వేయ వచ్చు  గనుమ బాల ॥

 
చిన్ని మాస్కు మరచె   చిరునవ్వు చిలుకుచుా
అన్ని నియమ ములను  అదెగ విడచి
మన్ని  కైన చదువు మంచిగా నేర్వంగ
 కదలె  బాబు,పాప  కరము బట్టి    ॥

పెక్కు దుారపు చదువు పెక్కుభా రపుమొాత
 మాస్కు మాట మరచె మాదు బాల
 కేలు కేలు బట్టి  ఏగుచు న్నారదిగొ
 చదువు కొరకు బడికి చక్కగాను ॥
  
చిత్ర మైన ప్రీతి చిన్నపి  ల్లలరీతి
మిత్ర భావ మలరు మించు చెలిమి
ఛత్ర మెండ నిడక  చదువు బరువిడక
ఛాత్ర లిరువు రేగె చదువు బడికి ॥




Tuesday, June 22, 2021

గజల్.

గజల్.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥

వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥

మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥

పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥

నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై  పలకాలని ఉన్నది.॥

ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥

Tuesday, June 15, 2021

వందనం

ఈ రోజు అనగా జూన్ 19 జాతీయ చదువు రోజు అనగా National Reading Day, ఇది కేరళ కు చెందిన ఫణిక్కర్ అను వారు చనిపోయిన రోజుకు గుర్తుగా గత 25 సంవత్సరాల నుండి జరుపుతున్నారు. కారణం ఆయన భారతదేశంలో లైబ్రరీ వ్యవస్థ ను తీసుకొచ్చిన ప్రదముడు, ముందుగా తన కేరళ రాష్ట్రం మొత్తము లైబ్రెరీలు పెట్టించారు, తద్వారా ఆ రాష్టం 100% విద్యావంతులు గా మారడానికి దోహద పడింది. ఆ తరువాత దేశం మొత్తం లయిబ్రరీలు రావడానికి కారణభూతం అయ్యింది. చదువు తో పాటు లోకజ్ఞానం విలువ తెలిసిన ప్రతివారూ ఫణిక్కర్ గారికి అభివాదాలు తెలియచెయ్యడం ఒక గౌరవం తో కూడిన బాధ్యత. ధన్యవాదాలు

Thursday, March 4, 2021

జయ- విజయుల ముాడు జన్మలు.

జయవిజయులు తొలిజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులులుగా వరాహ, నరసింహులచేత చంపబడతారు. రెండవ జన్మంలో రావణ కుంభకర్ణులు కాగా రామునిచే చంపబడతారు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్రులుగా పుట్టి కృష్ణునిచే చంపబడతారు.

Friday, February 26, 2021

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

🙏🌹🙏శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణలో ఉచ్చారణ దోషాలు జరగకుండా నామసంఖ్య శ్లోకం.🙏🌹🙏 

🙏🌷🙏1 శ్రీమాతా।   శ్రీమహారాజ్ఞీ।   శ్రీమత్సింహాసనేశ్వరీ।  
చిదగ్నికుండసంభూతా।   దేవకార్యసముద్యతా।  1🙏🌷🙏

🙏🌷🙏6 ఉద్యద్భానుసహస్రాభా।   చతుర్బాహుసమన్వితా।  
రాగస్వరూపపాశాఢ్యా।   క్రోధాకారాంకుశోజ్జ్వలా।  2🙏🌷🙏

🙏🌷🙏10 మనోరూపేక్షుకోదండా।   పంచతన్మాత్రసాయకా।  
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా।  3🙏🌷🙏

🙏🌷🙏13 చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా।  
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా।  4🙏🌷🙏

🙏🌷🙏15 అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।  
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా।  5🙏🌷🙏

🙏🌷🌹17 వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా।  
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా।  6🙏🌷🙏

🙏🌷🙏19నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా।  
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా।  7🙏🌷🙏

🙏🌷🙏21 కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా।  
తాటంకయుగళీభూతతపనోడుపమండలా।  8🙏🌷🙏

🙏🌷🙏23 పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః।  
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా।  9🙏🌷🙏

🙏🌷🙏25శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా।  
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా।  10🙏🌷🙏

🙏🌷🙏27 నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ।  
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా।  11🙏🌷🙏

🙏🌷🙏29 అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా।  
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా।  12🙏🌷🙏

🙏🌷🙏31 కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా।  
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా।  13🙏🌷🙏

🙏🌷🙏33 కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ।  
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ।  14🙏🌷🙏

🙏🌷🙏35 లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా।  
స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా।  15🙏🌷🙏

🙏🌷🙏37 అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ।  
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా।  16🙏🌷🙏

🙏🌷🙏39 కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా।  
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా।  17🙏🌷🙏

🙏🌷🙏41 ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా।  
గూఢగుల్ఫా।   కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా।  18🙏🌷🙏

🙏🌷🙏44 నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా।  
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా।  19🙏🌷🙏

🙏🌷🙏46 శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా।  
మరాళీమందగమనా।   మహాలావణ్యశేవధిః।  20🙏🌷🙏

🙏🌷🙏49 సర్వారుణా।  అనవద్యాంగీ।  సర్వాభరణభూషితా।  
శివకామేశ్వరాంకస్థా।  శివా।  స్వాధీనవల్లభా।  21🙏🌷🙏

🙏🌷🙏55 సుమేరుమధ్యశృంగస్థా।  శ్రీమన్నగరనాయికా।  
చింతామణిగృహాంతస్థా।  పంచబ్రహ్మాసనస్థితా।  22🙏🌷🙏

🙏🌷🙏59 మహాపద్మాటవీసంస్థా।  కదంబవనవాసినీ।  
సుధాసాగరమధ్యస్థా।  కామాక్షీ।  కామదాయినీ।  23🙏🌷🙏

🙏🌷🙏64 దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా।  
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా।  24🙏🌷🙏

🙏🌷🙏66 సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా।  
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా।  25🙏🌷🙏

🙏🌷🙏68 చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా।  
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా।  26🙏🌷🙏

🙏🌷🙏70 కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా।  
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా।  27🙏🌷🙏

🙏🌷🙏72 భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా।  
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా।  28🙏🌷🙏

🙏🌷🙏74 భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా।  
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా।  29🙏🌷🙏

🙏🌷🙏76 విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా।  
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా।  30🙏🌷🙏

🙏🌷🙏78 మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా।  
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ।  31🙏🌷🙏

🙏🌷🙏80 కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః।  
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా।  32🙏🌷🙏

🙏🌷🙏82 కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా।  
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా।  33🙏🌷🙏

🙏🌷🙏84 హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః।  
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా।  34🙏🌷🙏

🙏🌷🙏86 కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ।  
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ।  35🙏🌷🙏

🙏🌷🙏88 మూలమంత్రాత్మికా।  మూలకూటత్రయకళేబరా।  
కులామృతైకరసికా।  కులసంకేతపాలినీ।  36🙏🌷🙏

🙏🌷🙏92 కులాంగనా।  కులాంతస్థా।  కౌళినీ।  కులయోగినీ।  
అకులా।  సమయాంతస్థా।  సమయాచారతత్పరా।  37🙏🌷🙏

🙏🌷🙏99 మూలాధారైకనిలయా।  బ్రహ్మగ్రంథివిభేదినీ।  
మణిపూరాంతరుదితా।  విష్ణుగ్రంథివిభేదినీ।  38🙏🌷🙏

🙏🌷🙏103 ఆజ్ఞాచక్రాంతరాళస్థా।  రుద్రగ్రంథివిభేదినీ।  
సహస్రారాంబుజారూఢా।  సుధాసారాభివర్షిణీ।  39🙏🌷🙏

🙏🌷🙏107 తటిల్లతాసమరుచిః।  షట్చక్రోపరిసంస్థితా।  
మహాశక్తిః।  కుండలినీ।  బిసతంతుతనీయసీ।  40🙏🌷🙏

🙏🌷🙏112 భవానీ।  భావనాగమ్యా।  భవారణ్యకుఠారికా।  
భద్రప్రియా।  భద్రమూర్తి।  భక్తసౌభాగ్యదాయినీ।  41🙏🌷🙏

🙏🌷🙏118 భక్తప్రియా।  భక్తిగమ్యా।  భక్తివశ్యా।  భయాపహా।  
శాంభవీ।  శారదారాధ్యా।  శర్వాణీ।  శర్మదాయినీ।  42🙏🌷🙏

🙏🌷🙏126 శాంకరీ।  శ్రీకరీ।  సాధ్వీ।  శరచ్చంద్రనిభాననా।  
శాతోదరీ।  శాంతిమతీ।  నిరాధారా।  నిరంజనా।  43🙏🌷🙏

🙏🌷🙏134 నిర్లేపా।  నిర్మలా।  నిత్యా।  నిరాకారా।  నిరాకులా।  
నిర్గుణా।  నిష్కలా।  శాంతా।  నిష్కామా।  నిరుపప్లవా।  44🙏🌷🙏

🙏🌷🙏144 నిత్యముక్తా।  నిర్వికారా।  నిష్ప్రపంచా।  నిరాశ్రయా।  
నిత్యశుద్ధా।  నిత్యబుద్ధా।  నిరవద్యా।  నిరంతరా।  45🙏🌷🙏

🙏🌷🙏152 నిష్కారణా।  నిష్కళంకా।  నిరుపాధిః।  నిరీశ్వరా।  
నీరాగా।  రాగమథనా।  నిర్మదా।  మదనాశినీ।  46🙏🌷🙏

🙏🌷🙏160 నిశ్చింతా।   నిరహంకారా।   నిర్మోహా।   మోహనాశినీ।  
నిర్మమా।   మమతాహంత్రీ।   నిష్పాపా।   పాపనాశినీ।  47🙏🌷🙏

🙏🌷🙏168 నిష్క్రోధా।  క్రోధశమనీ।  నిర్లోభా।  లోభనాశినీ।  
నిస్సంశయా।  సంశయఘ్నీ।  నిర్భవా।  భవనాశినీ।  48🙏🌷🙏

🙏🌷🙏176 నిర్వికల్పా।  నిరాబాధా।  నిర్భేదా।  భేదనాశినీ।  
నిర్నాశా।  మృత్యుమథనీ।  నిష్క్రియా।  నిష్పరిగ్రహా।  49🙏🌷🙏

🙏🌷🙏184 నిస్తులా।  నీలచికురా।  నిరపాయా।  నిరత్యయా।  
దుర్లభా।  దుర్గమా।  దుర్గా।  దుఃఖహంత్రీ।  సుఖప్రదా।  50🙏🌷🙏

🙏🌷🙏193 దుష్టదూరా।  దురాచారశమనీ।  దోషవర్జితా।  
సర్వజ్ఞా।  సాంద్రకరుణా।  సమానాధికవర్జితా।  51🙏🌷🙏

🙏🌷🙏199 సర్వశక్తిమయీ।  సర్వమంగళా।  సద్గతిప్రదా।  
సర్వేశ్వరీ।  సర్వమయీ।  సర్వమంత్రస్వరూపిణీ।  52🙏🌷🙏

🙏🌷🙏205 సర్వయంత్రాత్మికా।  సర్వతంత్రరూపా।  మనోన్మనీ।  
మాహేశ్వరీ।  మహాదేవీ।  మహాలక్ష్మీ।  మృడప్రియా।  53🙏🌷🙏

🙏🌷🙏212 మహారూపా।  మహాపూజ్యా।  మహాపాతకనాశినీ।  
మహామాయా।  మహాసత్త్వా।  మహాశక్తిః।  మహారతిః।  54🙏🌷🙏

🙏🌷🙏219 మహాభోగా।  మహైశ్వర్యా।  మహావీర్యా।  మహాబలా।  
మహాబుద్ధిః।  మహాసిద్ధిః।  మహాయోగీశ్వరేశ్వరీ।  55🙏🌷🙏

🙏🌷🙏226 మహాతంత్రా।  మహామంత్రా।  మహాయంత్రా।  మహాసనా।  
మహాయాగక్రమారాధ్యా।  మహాభైరవపూజితా।  56🙏🌷🙏

🙏🌷🙏232 మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ।  
మహాకామేశమహిషీ।  మహాత్రిపురసుందరీ।  57🙏🌷🙏

🙏🌷🙏235 చతుష్షష్ట్యుపచారాఢ్యా।  చతుఃషష్టికలామయీ।  
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా।  58🙏🌷🙏

🙏🌷🙏238 మనువిద్యా।  చంద్రవిద్యా।  చంద్రమండలమధ్యగా।  
చారురూపా।  చారుహాసా।  చారుచంద్రకళాధరా।  59🙏🌷🙏

🙏🌷🙏244 చరాచరజగన్నాథా।  చక్రరాజనికేతనా।  
పార్వతీ।  పద్మనయనా।  పద్మరాగసమప్రభా।  60🙏🌷🙏

🙏🌷🙏249 పంచప్రేతాసనాసీనా।  పంచబ్రహ్మస్వరూపిణీ।  
చిన్మయీ।  పరమానందా।  విజ్ఞానఘనరూపిణీ।  61🙏🌷🙏

🙏🌷🙏254 ధ్యానధ్యాతృధ్యేయరూపా।  ధర్మాధర్మవివర్జితా।  
విశ్వరూపా।  జాగరిణీ।  స్వపంతీ।  తైజసాత్మికా।  62🙏🌷🙏

🙏🌷🙏260 సుప్తా।  ప్రాజ్ఞాత్మికా।  తుర్యా।  సర్వావస్థావివర్జితా।  
సృష్టికర్త్రీ।  బ్రహ్మరూపా।  గోప్త్రీ।  గోవిందరూపిణీ।  63🙏🌷🙏

🙏🌷🙏268 సంహారిణీ।  రుద్రరూపా।  తిరోధానకరీ।  ఈశ్వరీ।  
సదాశివా।  అనుగ్రహదా।  పంచకృత్యపరాయణా।  64🙏🌷🙏

🙏🌷🙏275 భానుమండలమధ్యస్థా।  భైరవీ।  భగమాలినీ।  
పద్మాసనా।  భగవతీ।  పద్మనాభసహోదరీ।  65🙏🌷🙏

🙏🌷🙏281 ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః।  
సహస్రశీర్షవదనా।  సహస్రాక్షీ।  సహస్రపాత్।  66🙏🌷🙏

🙏🌷🙏285 ఆబ్రహ్మకీటజననీ।  వర్ణాశ్రమవిధాయినీ।  
నిజాజ్ఞారూపనిగమా।  పుణ్యాపుణ్యఫలప్రదా।  67🙏🌷🙏

🙏🌷🌷289 శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా।  
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా।  68🙏🌷🙏

🙏🌷🙏291 పురుషార్థప్రదా।  పూర్ణా।  భోగినీ।  భువనేశ్వరీ।  
అంబికా।  అనాదినిధనా।  హరిబ్రహ్మేంద్రసేవితా।  69🙏🌷🙏

🙏🌷🙏298 నారాయణీ।  నాదరూపా।  నామరూపవివర్జితా।  
హ్రీంకారీ।  హ్రీమతీ।  హృద్యా।  హేయోపాదేయవర్జితా।  70🙏🌷🙏

🙏🌷🙏305 రాజరాజార్చితా।  రాజ్ఞీ।  రమ్యా।  రాజీవలోచనా।  
రంజనీ।  రమణీ।  రస్యా।  రణత్కింకిణిమేఖలా।  71🙏🌷🙏

🙏🌷🙏313 రమా।  రాకేందువదనా।  రతిరూపా।  రతిప్రియా।  
రక్షాకరీ।  రాక్షసఘ్నీ।  రామా।  రమణలంపటా।  72🙏🌷🙏

🙏🌷🙏321 కామ్యా।  కామకళారూపా।  కదంబకుసుమప్రియా।  
కళ్యాణీ।  జగతీకందా।  కరుణారససాగరా।  73🙏🌷🙏

🙏🌷🙏327 కళావతీ।  కలాలాపా।  కాంతా।  కాదంబరీప్రియా।  
వరదా।  వామనయనా।  వారుణీమదవిహ్వలా।  74🙏🌷🙏

🙏🌷🙏334 విశ్వాధికా।  వేదవేద్యా।  వింధ్యాచలనివాసినీ।  
విధాత్రీ।  వేదజననీ।  విష్ణుమాయా।  విలాసినీ।  75🙏🌷🙏

🙏🌷🙏341 క్షేత్రస్వరూపా।  క్షేత్రేశీ।  క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ।  
క్షయవృద్ధివినిర్ముక్తా।  క్షేత్రపాలసమర్చితా।  76🙏🌷🙏

🙏🌷🙏346 విజయా।  విమలా।  వంద్యా।  వందారుజనవత్సలా।  
వాగ్వాదినీ।  వామకేశీ।  వహ్నిమండలవాసినీ।  77🙏🌷🙏

🙏🌷🙏353 భక్తిమత్కల్పలతికా।  పశుపాశవిమోచినీ।  
సంహృతాశేషపాషండా।  సదాచారప్రవర్తికా।  78🙏🌷🙏

🙏🌷🙏357 తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా।  
తరుణీ।  తాపసారాధ్యా।  తనుమధ్యా।  తమోఽపహా।  79🙏🌷🙏

🙏🌷🙏362 చితిః।  తత్పదలక్ష్యార్థా।  చిదేకరసరూపిణీ।  
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః।  80🙏🌷🙏

🙏🌷🙏366 పరా।  ప్రత్యక్చితీరూపా।  పశ్యంతీ।  పరదేవతా।  
మధ్యమా।  వైఖరీరూపా।  భక్తమానసహంసికా।  81🙏🌷🙏

🙏🌷🙏373 కామేశ్వరప్రాణనాడీ।  కృతజ్ఞా।  కామపూజితా।  
శృంగారరససంపూర్ణా।  జయా।  జాలంధరస్థితా।  82🙏🌷🙏

🙏🌷🙏379 ఓడ్యాణపీఠనిలయా।  బిందుమండలవాసినీ।  
రహోయాగక్రమారాధ్యా।  రహస్తర్పణతర్పితా।  83🙏🌷🙏

🙏🌷🙏383 సద్యఃప్రసాదినీ।  విశ్వసాక్షిణీ।  సాక్షివర్జితా।  
షడంగదేవతాయుక్తా।  షాడ్గుణ్యపరిపూరితా।  84🙏🌷🙏

🙏🌷🙏388 నిత్యక్లిన్నా।  నిరుపమా।  నిర్వాణసుఖదాయినీ।  
నిత్యాషోడశికారూపా।  శ్రీకంఠార్ధశరీరిణీ।  85🙏🌷🙏

🙏🌷🙏393 ప్రభావతీ।  ప్రభారూపా।  ప్రసిద్ధా।  పరమేశ్వరీ।  
మూలప్రకృతిః।  అవ్యక్తా।  వ్యక్తావ్యక్తస్వరూపిణీ।  86🙏🌷🙏

🙏🌷🙏400 వ్యాపినీ।  వివిధాకారా।  విద్యావిద్యాస్వరూపిణీ।  
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ।  87🙏🌷🙏

🙏🌷🙏404 భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః।  
శివదూతీ।  శివారాధ్యా।  శివమూర్తిః।  శివంకరీ।  88🙏🌷🙏

🙏🌷🙏409 శివప్రియా।  శివపరా।  శిష్టేష్టా।  శిష్టపూజితా।  
అప్రమేయా।  స్వప్రకాశా।  మనోవాచామగోచరా।  89🙏🌷🙏

🙏🌷🙏416 చిచ్ఛక్తిః।  చేతనారూపా।  జడశక్తిః।  జడాత్మికా।  
గాయత్రీ।  వ్యాహృతిః।  సంధ్యా।  ద్విజబృందనిషేవితా।  90🙏🌷🙏

🙏🌷🙏424 తత్త్వాసనా।  తత్।  త్వం।  అయీ।   పంచకోశాంతరస్థితా।  
నిస్సీమమహిమా।  నిత్యయౌవనా।  మదశాలినీ।  91🙏🌷🙏

🙏🌷🙏432 మదఘూర్ణితరక్తాక్షీ।  మదపాటలగండభూః।  
చందనద్రవదిగ్ధాంగీ।  చాంపేయకుసుమప్రియా।  92🙏🌷🙏

🙏🌷🙏436 కుశలా।  కోమలాకారా।  కురుకుళ్ళా।  కుళేశ్వరీ।  
కులకుండాలయా।  కౌళమార్గతత్పరసేవితా।  93🙏🌷🙏

🙏🌷🙏442 కుమారగణనాథాంబా।  తుష్టిః।  పుష్టిః।  మతిః।  ధృతిః।  
శాంతిః।  స్వస్తిమతీ।  కాంతిః।  నందినీ।  విఘ్ననాశినీ।  94🙏🌷🙏

🙏🌷🙏452 తేజోవతీ।  త్రినయనా।  లోలాక్షీ కామరూపిణీ।  
మాలినీ।  హంసినీ।  మాతా।  మలయాచలవాసినీ।  95🙏🌷🙏

🙏🌷🙏459 సుముఖీ।  నళినీ।  సుభ్రూః।  శోభనా।  సురనాయికా।  
కాలకంఠీ।  కాంతిమతీ।  క్షోభిణీ।  సూక్ష్మరూపిణీ।  96🙏🌷🙏

🙏🌷🙏468 వజ్రేశ్వరీ।  వామదేవీ।  వయోఽవస్థావివర్జితా।  
సిద్ధేశ్వరీ।  సిద్ధవిద్యా।  సిద్ధమాతా।  యశస్వినీ।  97🙏🌷🙏

🙏🌷🙏475 విశుద్ధిచక్రనిలయా।  ఆరక్తవర్ణా।  త్రిలోచనా।  
ఖట్వాంగాదిప్రహరణా।  వదనైకసమన్వితా।  98🙏🌷🙏

🙏🌷🙏480 పాయసాన్నప్రియా।  త్వక్స్థా।  పశులోకభయంకరీ।  
అమృతాదిమహాశక్తిసంవృతా।  డాకినీశ్వరీ।  99🙏🌷🙏

🙏🌷🙏485 అనాహతాబ్జనిలయా।  శ్యామాభా।  వదనద్వయా।  
దంష్ట్రోజ్జ్వలా।  అక్షమాలాదిధరా।  రుధిరసంస్థితా।  100🙏🌷🙏

🙏🌷🙏491 కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతా।  స్నిగ్ధౌదనప్రియా।  
మహావీరేంద్రవరదా।  రాకిణ్యంబాస్వరూపిణీ।  101🙏🌷🙏

🙏🌷🙏495 మణిపూరాబ్జనిలయా।  వదనత్రయసంయుతా।  
వజ్రాదికాయుధోపేతా।  డామర్యాదిభిరావృతా।  102🙏🌷🙏

🙏🌷🙏499 రక్తవర్ణా।  మాంసనిష్ఠా।  గుడాన్నప్రీతమానసా।  
సమస్తభక్తసుఖదా।  లాకిన్యంబాస్వరూపిణీ।  103🙏🌷🙏

🙏🌷🙏504 స్వాధిష్ఠానాంబుజగతా।  చతుర్వక్త్రమనోహరా।  
శూలాద్యాయుధసంపన్నా।  పీతవర్ణా।  అతిగర్వితా।  104🙏🌷🙏

🙏🌷🙏509 మేదోనిష్ఠా।  మధుప్రీతా।  బందిన్యాదిసమన్వితా।  
దధ్యన్నాసక్తహృదయా।  కాకినీరూపధారిణీ।  105🙏🌷🙏

🙏🌷🙏514 మూలాధారాంబుజారూఢా।  పంచవక్త్రా।  అస్థిసంస్థితా।  
అంకుశాదిప్రహరణా।  వరదాదినిషేవితా।  106🙏🌷🙏

🙏🌷🙏519 ముద్గౌదనాసక్తచిత్తా।  సాకిన్యంబాస్వరూపిణీ।  
ఆజ్ఞాచక్రాబ్జనిలయా।  శుక్లవర్ణా।  షడాననా।  107🙏🌷🙏

🙏🌷🙏524 మజ్జాసంస్థా।  హంసవతీముఖ్యశక్తిసమన్వితా।  
హరిద్రాన్నైకరసికా।  హాకినీరూపధారిణీ।  108🙏🌷🙏

🙏🌷🙏528 సహస్రదళపద్మస్థా।  సర్వవర్ణోపశోభితా।  
సర్వాయుధధరా।  శుక్లసంస్థితా।  సర్వతోముఖీ।  109🙏🌷🙏

🙏🌷🙏533 సర్వౌదనప్రీతచిత్తా।  యాకిన్యంబాస్వరూపిణీ।  
స్వాహా।  స్వధా।  అమతిః।  మేధా।  శ్రుతిః।  స్మృతిః।  అనుత్తమా।  110🙏🌷🙏

🙏🌷🙏542 పుణ్యకీర్తిః।  పుణ్యలభ్యా।  పుణ్యశ్రవణకీర్తనా।  
పులోమజార్చితా।  బంధమోచనీ।  బంధురాలకా।  111🙏🌷🙏

🙏🌷🙏548 విమర్శరూపిణీ।  విద్యా।  వియదాదిజగత్ప్రసూః।  
సర్వవ్యాధిప్రశమనీ।  సర్వమృత్యునివారిణీ।  112🙏🌷🙏

🙏🌷🙏553 అగ్రగణ్యా।  అచింత్యరూపా।  కలికల్మషనాశినీ।  
కాత్యాయనీ।  కాలహంత్రీ।  కమలాక్షనిషేవితా।  113🙏🌷🙏

🙏🌷🙏559 తాంబూలపూరితముఖీ।  దాడిమీకుసుమప్రభా।  
మృగాక్షీ।  మోహినీ।  ముఖ్యా।  మృడానీ।  మిత్రరూపిణీ।  114🙏🌷🙏

🙏🌷🙏566 నిత్యతృప్తా।  భక్తనిధిః।  నియంత్రీ।  నిఖిలేశ్వరీ।  
మైత్ర్యాదివాసనాలభ్యా।  మహాప్రళయసాక్షిణీ।  115🙏🌷🙏

🙏🌷🙏572 పరాశక్తిః।  పరానిష్ఠా।  ప్రజ్ఞానఘనరూపిణీ।  
మాధ్వీపానాలసా।  మత్తా।  మాతృకావర్ణరూపిణీ।  116🙏🌷🙏

🙏🌷🙏578 మహాకైలాసనిలయా।  మృణాలమృదుదోర్లతా।  
మహనీయా।  దయామూర్తిః।  మహాసామ్రాజ్యశాలినీ।  117🙏🌷🙏

🙏🌷🙏583 ఆత్మవిద్యా।  మహావిద్యా।  శ్రీవిద్యా।  కామసేవితా।  
శ్రీషోడశాక్షరీవిద్యా।  త్రికూటా।  కామకోటికా।  118🙏🌷🙏

🙏🌷🙏590 కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా।  
శిరఃస్థితా।  చంద్రనిభా।  ఫాలస్థా।   ఇంద్రధనుఃప్రభా।  119🙏🌷🙏

🙏🌷🙏595 హృదయస్థా।  రవిప్రఖ్యా।  త్రికోణాంతరదీపికా।  
దాక్షాయణీ।  దైత్యహంత్రీ।  దక్షయజ్ఞవినాశినీ।  120🙏🌷🙏

🙏🌷🙏601 దరాందోళితదీర్ఘాక్షీ।  దరహాసోజ్జ్వలన్ముఖీ।  
గురుమూర్తిః।  గుణనిధిః।  గోమాతా।  గుహజన్మభూః।  121🙏🌷🙏

🙏🌷🙏607 దేవేశీ।  దండనీతిస్థా।  దహరాకాశరూపిణీ।  
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా।  122🙏🌷🙏

🙏🌷🙏611 కళాత్మికా।  కళానాథా।  కావ్యాలాపవినోదినీ।  
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా।  123🙏🌷🙏

🙏🌷🙏615 ఆదిశక్తిః।  అమేయా।  ఆత్మా।  పరమా।  పావనాకృతిః।  
అనేకకోటిబ్రహ్మాండజననీ।  దివ్యవిగ్రహా।  124🙏🌷🙏

🙏🌷🙏622 క్లీంకారీ।  కేవలా।  గుహ్యా।  కైవల్యపదదాయినీ।  
త్రిపురా।  త్రిజగద్వంద్యా।  త్రిమూర్తిః।  త్రిదశేశ్వరీ। 🙏🌷🙏 125

🙏🌷🙏630 త్ర్యక్షరీ।  దివ్యగంధాఢ్యా।  సిందూరతిలకాంచితా।  
ఉమా।  శైలేంద్రతనయా।  గౌరీ।  గంధర్వసేవితా।  126🙏🌷🙏

🙏🌷🙏637 విశ్వగర్భా।  స్వర్ణగర్భా।  అవరదా।  వాగధీశ్వరీ।  
ధ్యానగమ్యా।  అపరిచ్ఛేద్యా।  జ్ఞానదా।  జ్ఞానవిగ్రహా।  127🙏🌷🙏

🙏🌷🙏645 సర్వవేదాంతసంవేద్యా।  సత్యానందస్వరూపిణీ।  
లోపాముద్రార్చితా।  లీలాక్లప్తబ్రహ్మాండమండలా।  128🙏🌷🙏

🙏🌷🙏649 అదృశ్యా।  దృశ్యరహితా।  విజ్ఞాత్రీ।  వేద్యవర్జితా।  
యోగినీ।  యోగదా।  యోగ్యా।  యోగానందా।  యుగంధరా।  129🙏🌷🙏

🙏🌷🙏658 ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ।  
సర్వాధారా।  సుప్రతిష్ఠా।  సదసద్రూపధారిణీ।  130🙏🌷🙏

🙏🌷🙏662 అష్టమూర్తిః।  అజాజైత్రీ।  లోకయాత్రావిధాయినీ।  
ఏకాకినీ।  భూమరూపా।  నిర్ద్వైతా।  ద్వైతవర్జితా।  131🙏🌷🙏

🙏🌷🙏669 అన్నదా।  వసుదా।  వృద్ధా।  బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ।  
బృహతీ।  బ్రాహ్మణీ।  బ్రాహ్మీ।  బ్రహ్మానందా।  బలిప్రియా।  132🙏🌷🙏

🙏🌷🙏678 భాషారూపా।  బృహత్సేనా।  భావాభావవివర్జితా।  
సుఖారాధ్యా।  శుభకరీ।  శోభనాసులభాగతిః।  133🙏🌷🙏

🙏🌷🙏684 రాజరాజేశ్వరీ।  రాజ్యదాయినీ।  రాజ్యవల్లభా।  
రాజత్కృపా।  రాజపీఠనివేశితనిజాశ్రితా।  134🙏🌷🙏

🙏🌷🙏689 రాజ్యలక్ష్మీః।  కోశనాథా।  చతురంగబలేశ్వరీ।  
సామ్రాజ్యదాయినీ।  సత్యసంధా।  సాగరమేఖలా।  135🙏🌷🙏

🙏🌷🙏695 దీక్షితా।  దైత్యశమనీ।  సర్వలోకవశంకరీ।  
సర్వార్థదాత్రీ।  సావిత్రీ।  సచ్చిదానందరూపిణీ।  136🙏🌷🙏

🙏🌷🙏701 దేశకాలాపరిచ్ఛిన్నా।  సర్వగా।  సర్వమోహినీ।  
సరస్వతీ।  శాస్త్రమయీ।  గుహాంబా।  గుహ్యరూపిణీ।  137🙏🌷🙏

🙏🌷🙏708 సర్వోపాధివినిర్ముక్తా।  సదాశివపతివ్రతా।  
సంప్రదాయేశ్వరీ।  సాధుః।  ఈ।  గురుమండలరూపిణీ।  138🙏🌷🙏

🙏🌷🙏714 కులోత్తీర్ణా।  భగారాధ్యా।  మాయా।  మధుమతీ।  మహీ।  
గణాంబా।  గుహ్యకారాధ్యా।  కోమలాంగీ।  గురుప్రియా।  139🙏🌷🙏

🙏🌷🙏723 స్వతంత్రా।  సర్వతంత్రేశీ।  దక్షిణామూర్తిరూపిణీ।  
సనకాదిసమారాధ్యా।  శివజ్ఞానప్రదాయినీ।  140🙏🌷🙏

🙏🌷🙏728 చిత్కళా।  ఆనందకలికా।  ప్రేమరూపా।  ప్రియంకరీ।  
నామపారాయణప్రీతా।  నందివిద్యా।  నటేశ్వరీ।  141🙏🌷🙏

🙏🌷🙏735 మిథ్యాజగదధిష్ఠానా।  ముక్తిదా।  ముక్తిరూపిణీ।  
లాస్యప్రియా।  లయకరీ।  లజ్జా।  రంభాదివందితా।  142🙏🌹🙏

🙏🌷🙏742 భవదావసుధావృష్టిః।  పాపారణ్యదవానలా।  
దౌర్భాగ్యతూలవాతూలా।  జరాధ్వాంతరవిప్రభా।  143🙏🌷🙏

🙏🌷🙏746 భాగ్యాబ్ధిచంద్రికా।  భక్తచిత్తకేకిఘనాఘనా।  
రోగపర్వతదంభోళిః।  మృత్యుదారుకుఠారికా।  144🙏🌷🙏

🙏🌷🙏750 మహేశ్వరీ।  మహాకాళీ।  మహాగ్రాసా।  మహాశనా।  
అపర్ణా।  చండికా।  చండముండాసురనిషూదినీ।  145🙏🌷🙏

🙏🌷🙏757 క్షరాక్షరాత్మికా।  సర్వలోకేశీ।  విశ్వధారిణీ।  
త్రివర్గదాత్రీ।  సుభగా।  త్ర్యంబకా।  త్రిగుణాత్మికా।  146🙏🌷🙏

🙏🌷🙏764 స్వర్గాపవర్గదా।  శుద్ధా।  జపాపుష్పనిభాకృతిః।  
ఓజోవతీ।  ద్యుతిధరా।  యజ్ఞరూపా।  ప్రియవ్రతా।  147🙏🌷🙏

🙏🌷🙏771 దురారాధ్యా।  దురాధర్షా।  పాటలీకుసుమప్రియా।  
మహతీ।  మేరునిలయా।  మందారకుసుమప్రియా।  148🙏🌷🙏

🙏🌷🙏777 వీరారాధ్యా।  విరాడ్రూపా।  విరజా।  విశ్వతోముఖీ।  
ప్రత్యగ్రూపా।  పరాకాశా।  ప్రాణదా।  ప్రాణరూపిణీ।  149🙏🌷🙏

🙏🌷🙏785 మార్తాండభైరవారాధ్యా।  మంత్రిణీన్యస్తరాజ్యధూః।  
త్రిపురేశీ।  జయత్సేనా।  నిస్త్రైగుణ్యా।  పరాపరా।  150🙏🌷🙏

🙏🌷🙏791 సత్యజ్ఞానానందరూపా।  సామరస్యపరాయణా।  
కపర్దినీ।  కళామాలా।  కామధుక్।  కామరూపిణీ।  151🙏🌷🙏

🙏🌷🙏797 కళానిధిః।  కావ్యకళా।  రసజ్ఞా।  రసశేవధిః।  
పుష్టా।  పురాతనా।  పూజ్యా।  పుష్కరా।  పుష్కరేక్షణా।  152🙏🌷🙏

🙏🌷🙏806 పరంజ్యోతిః।  పరంధామ।  పరమాణుః।  పరాత్పరా।  
పాశహస్తా।  పాశహంత్రీ।   పరమంత్రవిభేదినీ।  153🙏🌷🙏

🙏🌷🙏813 మూర్తా।  అమూర్తా।  అనిత్యతృప్తా।  మునిమానసహంసికా।  
సత్యవ్రతా।  సత్యరూపా।  సర్వాంతర్యామినీ।  సతీ।  154🙏🌷🙏

🙏🌷🙏821 బ్రహ్మాణీ।  బ్రహ్మ।  జననీ।  బహురూపా।  బుధార్చితా।  
ప్రసవిత్రీ।  ప్రచండా।  ఆజ్ఞా।  ప్రతిష్ఠా।  ప్రకటాకృతిః।  155🙏🌷🙏

🙏🌷🙏831 ప్రాణేశ్వరీ।  ప్రాణదాత్రీ।  పంచాశత్పీఠరూపిణీ।  
విశృంఖలా।  వివిక్తస్థా।  వీరమాతా।  వియత్ప్రసూః।  156🙏🌷🙏

🙏🌷🙏838 ముకుందా।  ముక్తినిలయా।  మూలవిగ్రహరూపిణీ।  
భావజ్ఞా।  భవరోగఘ్నీ।  భవచక్రప్రవర్తినీ।  157🙏🌷🙏

🙏🌷🙏844 ఛందస్సారా।  శాస్త్రసారా।  మంత్రసారా।  తలోదరీ।  
ఉదారకీర్తిః।  ఉరద్దామవైభవా।  వర్ణరూపిణీ।  158🙏🌷🙏

🙏🌷🙏851 జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ।  
సర్వోపనిషదుద్ఘుష్టా।  శాంత్యతీతకళాత్మికా।  159🙏🌷🙏

🙏🌷🙏854 గంభీరా।  గగనాంతస్థా।  గర్వితా।  గానలోలుపా।  
కల్పనారహితా।  కాష్ఠా।  అకాంతా।  కాంతార్ధవిగ్రహా।  160🙏🌷🙏

🙏🌷🙏862 కార్యకారణనిర్ముక్తా।  కామకేళితరంగితా।  
కనత్కనకతాటంకా।  లీలావిగ్రహధారిణీ।  161🙏🌷🙏

🙏🌷🙏866 అజా।  క్షయవినిర్ముక్తా।  ముగ్ధా।  క్షిప్రప్రసాదినీ।  
అంతర్ముఖసమారాధ్యా।  బహిర్ముఖసుదుర్లభా।  162🙏🌷🙏

🙏🌷🙏872 త్రయీ।  త్రివర్గనిలయా।  త్రిస్థా।  త్రిపురమాలినీ।  
నిరామయా।  నిరాలంబా।  స్వాత్మారామా।  సుధాసృతిః।  163🙏🌷🙏

🙏🌷🙏880 సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా।  
యజ్ఞప్రియా।  యజ్ఞకర్త్రీ।  యజమానస్వరూపిణీ।  164🙏🌷🙏

🙏🌷🙏884 ధర్మాధారా।  ధనాధ్యక్షా।  ధనధాన్యవివర్ధినీ।  
విప్రప్రియా।  విప్రరూపా।  విశ్వభ్రమణకారిణీ।  165🙏🌷🙏

🙏🌷🙏890 విశ్వగ్రాసా।  విద్రుమాభా।  వైష్ణవీ।  విష్ణురూపిణీ।  
అయోనిః।  యోనినిలయా।  కూటస్థా।  కులరూపిణీ।  166🙏🌷🙏

🙏🌷🙏898 వీరగోష్ఠీప్రియా।  వీరా।  నైష్కర్మ్యా।  నాదరూపిణీ।  
విజ్ఞానకలనా।  కల్యా।  విదగ్ధా।  బైందవాసనా।  167🙏🌷🙏

🙏🌷🙏906 తత్త్వాధికా।  తత్త్వమయీ।  తత్త్వమర్థస్వరూపిణీ।  
సామగానప్రియా।  సౌమ్యా।  సదాశివకుటుంబినీ।  168🙏🌷🙏

🙏🌷🙏912 సవ్యాపసవ్యమార్గస్థా।  సర్వాపద్వినివారిణీ।  
స్వస్థా।  స్వభావమధురా।  ధీరా।  ధీరసమర్చితా।  169🙏🌷🙏

🙏🌷🙏918 చైతన్యార్ఘ్యసమారాధ్యా।  చైతన్యకుసుమప్రియా।  
సదోదితా।  సదాతుష్టా।  తరుణాదిత్యపాటలా।  170🙏🌷🙏

🙏🌷🙏923 దక్షిణాదక్షిణారాధ్యా।  దరస్మేరముఖాంబుజా।  
కౌళినీకేవలా।  అనర్ఘ్యకైవల్యపదదాయినీ।  171🙏🌷🙏

🙏🌷🙏927 స్తోత్రప్రియా।  స్తుతిమతీ।  శ్రుతిసంస్తుతవైభవా।  
మనస్వినీ।  మానవతీ।  మహేశీ।  మంగళాకృతిః। 🙏🌷🙏 172

🙏🌷🙏934 విశ్వమాతా।  జగద్ధాత్రీ।  విశాలాక్షీ।  విరాగిణీ।  
ప్రగల్భా।  పరమోదారా।  పరామోదా।  మనోమయీ।  173🙏🌷🙏

🙏🌷🙏942 వ్యోమకేశీ।  విమానస్థా।  వజ్రిణీ।  వామకేశ్వరీ।  
పంచయజ్ఞప్రియా।  పంచప్రేతమంచాధిశాయినీ।  174🙏🌷🙏

🙏🌷🙏948 పంచమీ।  పంచభూతేశీ।  పంచసంఖ్యోపచారిణీ।  
శాశ్వతీ।  శాశ్వతైశ్వర్యా।  శర్మదా।  శంభుమోహినీ।  175🙏🌷🙏

🙏🌷🙏955 ధరా।  ధరసుతా।  ధన్యా।  ధర్మిణీ।  ధర్మవర్ధినీ।  
లోకాతీతా।  గుణాతీతా।  సర్వాతీతా।  శమాత్మికా।  176🙏🌷🙏

🙏🌷🙏964 బంధూకకుసుమప్రఖ్యా।  బాలా।  లీలావినోదినీ।  
సుమంగళీ।  సుఖకరీ।  సువేషాఢ్యా।  సువాసినీ।  177🙏🌷🙏

🙏🌷🙏971 సువాసిన్యర్చనప్రీతా।  ఆశోభనా।  శుద్ధమానసా।  
బిందుతర్పణసంతుష్టా।  పూర్వజా।  త్రిపురాంబికా।  178🙏🌷🙏

🙏🌷🙏977 దశముద్రాసమారాధ్యా।  త్రిపురా శ్రీవశంకరీ।  
జ్ఞానముద్రా।  జ్ఞానగమ్యా।  జ్ఞానజ్ఞేయస్వరూపిణీ।  179🙏🌷🙏

🙏🌷🙏982 యోనిముద్రా।  త్రిఖండేశీ।  త్రిగుణా।  అంబా।  త్రికోణగా।  
అనఘా।  అద్భుతచారిత్రా।  వాంఛితార్థప్రదాయినీ।  180🙏🌷🙏

🙏🌷🙏990 అభ్యాసాతిశయజ్ఞాతా।  షడధ్వాతీతరూపిణీ।  
అవ్యాజకరుణామూర్తిః।  అజ్ఞానధ్వాంతదీపికా।  181🙏🌷🙏

🙏🌷🙏994 ఆబాలగోపవిదితా।  సర్వానుల్లంఘ్యశాసనా।  
శ్రీచక్రరాజనిలయా।  శ్రీమత్త్రిపురసుందరీ।  182🙏🌷🙏

🙏🌷🙏998 శ్రీశివా।  శివశక్త్యైక్యరూపిణీ।  లలితాంబికా।  
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః।  183🙏🌷🙏

🙏🌷🙏ఇతి శ్రీ బ్రహ్మండపురాణే, ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే🙏🌷🙏

🙏🌷🙏శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర కధనం నామ ద్వితీయోధ్యాయః 🙏🌷🙏

🙏🌷🙏ఓం శ్రీ మాత్రే నమః🙏🌷🙏

🙏🌹🙏అఖిలాండ కోటి
బ్రహ్మానందనాయకి శ్రీ రాజరాజేశ్వరీ దేవి కి జై🙏🌹🙏

🙏🌹🙏 !! సర్వం శ్రీ రాజరాజేశ్వరీ దేవి చరణాలవిందార్పణమస్తు !! 🙏🌹🙏

Tuesday, February 2, 2021

సంక్షేమం సంక్షామం

💐మహతీ సాహితీ కవిసంగమం💐ప్రతిరోజూ కవితా పండుగే💐

పర్యవేక్షణ:డాక్టర్ శ్రీ అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ:శ్రీ దాసరి చంద్రమౌళి గారు

తేదీ:1/2/2021
పేరు:చంద్రకళ. దీకొండ
ఊరు:మల్కాజిగిరి
అంశం:సంక్షేమం... సంక్షామం

శీర్షిక:పేరు గొప్పల ప్రణాళిక
🌷🌷🌷🌷🌷🌷🌷

అత్యవసరం కాని వస్తువుల 
ధరల తగ్గింపు...
నిత్యావసరాల ధరల పెంపు...!

స్వదేశీ నూలువస్త్రాల ఖరీదు హెచ్చింపు...
విదేశీ నైలాన్ దుస్తుల ధర తగ్గింపు...!

గంటకు తొంభై కోట్ల ఆదాయాల
అంబానీలకు పన్నుల మినహాయింపు...
వచ్చే జీతంతో తృప్తిపడి...
వస్తువుల కొనుగోళ్లతో అంబానీల
ఆదాయం పెంచే...
వేతన జీవులకు పన్నుల పెంపు...!

అటు "అగ్రిసెస్" వెన్న ...
ఇటు ట్రాక్టర్ కవసరమైన డీజిల్ ధరపెంపు "సున్నం"...!

ఉద్యమిస్తున్న రైతును ఊరడించే ప్రయత్నం...
సెస్సు పేరుతో వ్యాపారం...
రైతును మాత్రం చేరని సాయం...!

ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు
వరాల లంచాలు...
కానివాళ్ళకు ఖాళీ కంచాల్లో వడ్డింపులు...!

 ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ...
"ఆత్మనిర్భర" ప్రచారం...
సామాన్యుడి బ్రతుకును మరింత దుర్భరం చేస్తూ సాగిస్తున్న వ్యవహారం...!

ప్రజాసంక్షేమమంటూ చాటింపు...
సగటు జీవికి మిగిలేది సంక్షామమే...!!!
*****************************
చంద్రకళ. దీకొండ

Monday, February 1, 2021

సాహిత్యం ఎందుకు...?

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపోటీలు*
⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు*
తేది: *02-02-2021: మంగళవారం*
అంశము: *సాహిత్యం ఎందుకు?*
ప్రక్రియ: *వచనము*
రచన: ముక్కా సత్యనారాయణ
         పెనుగంచిప్రోలు
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

సాహిత్యమనగ సహితము కాదె సాలోచనగ చూడ ,
సర్వజనులకు శ్రియము కోరగ చేయవలె కవనము.
జగతిలోన శాంతి కలుగచేయును సాహిత్యమే
జనులలోన మార్పులు తేగలది కూడా సహితమే.
వెంకటేశునలరించిన అన్నమయ్య కీర్తనలు , వెంగమాంబ కృతులు
వెండికొండ వాసుని కొలిచి పిలిచిన ధూర్జటి శతకము,
భోజుని కడ కవిరత్నములు , విక్రమార్క నవరత్నాలు
దేవరాయని అష్టదిగ్గజాలు చేసె రచనలు ప్రయోజనముతోడ.
ఆరోగ్య, అస్త్ర శస్త్ర, యాంత్రిక సాంకేతికతల నాడె రచియించె.
నేటి సాహిత్యమే రేపటి భవితకు దిక్సూచి కాగలదు.
పలు ఉద్యమాల స్ఫూర్తి , పలు జాతుల కీర్తి , 
ప్రేమ కథల ఆర్తి , విజయగాథల దీప్తి సాహిత్యమే కదా!
నాడు భగవానుడు చేసిన వ్యక్తిత్వ వికాస గీతయు సహితమే.
దేశభక్తి రగిలించిన ఆనందమఠ, వివేకానంద వికాసము
భర్తృహరి సుభాషితాలు , గాంధీజీ సత్యశోధన , దాస్ క్యాపిటల్
ఏది చూసిన దాగినది ప్రయోజనమె, యుద్ధము శాంతి ఏదైనను.
అక్షరము చాలదె అగ్గిపుల్ల వలె అగ్ని రగిలించగ..
ఆహ్లాదమైన , ఆనందమైన , భక్తి రక్తి ముక్తి పథముల యేదైనను
విప్లవమైన ,వికాసమైన , సాంకేతికమైన విశ్వశ్రేయస్సు కోరగ
అదియె సాహిత్యమును , విశ్వజనుల అభివృద్ధియె కోరునెపుడూ..