9/07/2021.
తెలుగు వెలుగు లో
అంశం : తొడుా ..నీడ.
శీర్షిక : మరువలేని తోడు..
జీవితంలో ఒంటరిగా బతకలేడు మనిషి
పసితనంలో తల్లిదండ్రుల లాలన
చదువుకొనేటప్పుడు ఈడైన జోడు, తోడు ,
యక్త వయసులో స్నేహ బంధాల జోరు॥
వివాహానంతరం భార్య సహచర్యం
వృద్ధాప్యంలో పిల్లల అండ దండలు.
ప్రతీ ఒక్కరికీ అవసరమే..
ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డ
మనిషి.చివరి వరకు తను ప్రేమించిన
ప్రతి వారు తన కుాడా ఉండాలన్న ఆశతోనే బతుకుతాడు.ఆ ఆశకు ప్రతి రుాపం
భార్య. అన్ని బంధాలకు అతీతమై
నీతోడుగా, నీడగా ఉంటుా నీలో
ఆశలకు, అనందాలకు అర్ఘ్యంపోస్తుా.
చివరిదాకా నీకు వెలుగు బాట చుాపిస్తుా
నీ నీడై మసలే నీ తోడు..
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.
No comments:
Post a Comment