Tuesday, July 12, 2022

మీ పాట నా పంచపది విజేతలు






12/07/2022
మీ పాట నా పంచపది లో

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

సత్యవతిగారి పాట..
గోరింట  పూచింది కొమ్మ లేకుండా 
మురిపాల అరచేత తొడిగింది 
ఎంచక్కా  పండేనా


కొమ్మ లేకుండా, ఆకుగా పుాచిందంట
అతివల అరచేత  నిండు గోరింట
ఎంచక్కా అమరిన మురిపాల పంట.
మొగ్గలంటి వేళ్ళకు ఎర్రగా పండెనంట॥
గోరింట ఎంత ఎర్రగా పండితే మగని కంత ప్రేమంట ఈశ్వరీ ॥


నా పాట...
గోదారీ గట్టుందీ..గట్టు మీదా చెట్టుందీ 
చెట్టు కొమ్మని పిట్టుందీ  పిట్ట మనసులో ఏముందీ.....


12/07/2022
మీ పాట నా పంచపది లో

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

నేను ఇవ్వబోయే పాట
ఆనాటి చెలిమి ఒక కల
కలకాదు నిజము ఈ కథ

ఆనాటి రోజులు ఎప్పటికీ రావు 
చెలిమి నిండు స్నేహాలు ఇపుడు లేవు
కలనైనా ఆరోజులు మరచిపోవు
నిజము, ఆనాటి ఈ కధలు కల్లలు కావు॥
నాటి ఆలోచనల ఆనందములో నేటి పంచపదుల నియమమునే మరచితినీశ్వరీ ॥🙏🙏



*పంచపది సాహితీ కవన వేదిక*
*మీ పాట నా పంచపది*-101
తేది:12.07.2022నాటి *విజేతలు:*
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*2.కవి రత్న:* దినవహి సత్యవతి గారు
*3.కవి తేజ:* జోషి మధుసూదన శర్మ గారు
*4.కవి వజ్ర*: శరత్కవి DVR మూర్తి గారు
*5.కవి తేజ:* శిరీష వూటూరి గారు

*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*

Saturday, July 2, 2022

శ్రామికుడు.

శీర్షిక : శ్రామికుడు.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

తర తరాలుగా మారుతున్న
కాలంతో పాటు తమ జీవితాలలో
కుాడా మార్పు వస్తుందన్న ఆశతో
నమ్మకం నిండిన..ఆశయాలతో
అలుపెరుగని జీవిత పోరాటాన్ని
  ఆరాటంగా చేస్తుా ఎదురుచుాస్తున్న
విధి వంచిత శాపాలు కార్మిక జీవితాలు ॥

నేటికీ అతుకు బొతుకుల -
బతుకు బొంతకు అడ్డు కుట్ల అల్లికతో
బీదరికపు బ్రతుకు ఛాయలను
భారంగా కప్పిపుచ్చుతుా బ్రతుకు
నెట్టుకొస్తున్న బలహీనులు కార్మికులు॥

కార్ఖానాలనుండి కర్మాగారాలవరకు
తమ చెమట చుక్కలను చిందిస్తుా
చిత్తడి సీమలో , చిరు దీపాల వాడలో,
అసమర్ధత నిండిన బ్రతుకు అలసటను
ఆవులింతల మత్తుతో నిద్రపుచ్చుతుా
కలత లేని కలల  ప్రపంచంలో జోగుతున్న
కష్టజీవిత కాపుగాళ్ళు నిత్య కార్మికులు ॥

రాజులు మారినా రాజ్యాంగాలు మారినా
రణ నీతుల రాపిడికి రక్తం చిందిస్తుా కుాడా
రాబోయే నాయకుడిపై నమ్మకంతో
తమ ఓటు హక్కును నోటుకు
అమ్ముకుంటుా చదరంగపు టాటలలో
ఎత్తుకు పై ఎత్తు వేయలేని అసమర్ధత
నిండిన అమాయక సిపాయిలు కార్మికులు॥



Friday, July 1, 2022

శ్రామికుడు.

శీర్షిక : శ్రామికుడు.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

తర తరాలుగా మారుతున్న
కాలంతో పాటు తమ జీవితాలలో
కుాడా మార్పు వస్తుందన్న ఆశతో
నమ్మకం నిండిన..ఆశయాలతో
అలుపెరుగని జీవిత పోరాటాన్ని
  ఆరాటంగా చేస్తుా ఎదురుచుాస్తున్న
విధి వంచిత శాపాలు కార్మిక జీవితాలు ॥

నేటికీ అతుకు బొతుకుల -
బతుకు బొంతకు అడ్డు కుట్ల అల్లికతో
బీదరికపు బ్రతుకు ఛాయలను
భారంగా కప్పిపుచ్చుతుా బ్రతుకు
నెట్టుకొస్తున్న బలహీనులు కార్మికులు॥

కార్ఖానాలనుండి కర్మాగారాలవరకు
తమ చెమట చుక్కలను చిందిస్తుా
చిత్తడి సీమలో , చిరు దీపాల వాడలో,
అసమర్ధత నిండిన బ్రతుకు అలసటను
ఆవులింతల మత్తుతో నిద్రపుచ్చుతుా
కలత లేని కలల  ప్రపంచంలో జోగుతున్న
కష్టజీవిత కాపుగాళ్ళు నిత్య కార్మికులు ॥

రాజులు మారినా రాజ్యాంగాలు మారినా
రణ నీతుల రాపిడికి రక్తం చిందిస్తుా కుాడా
రాబోయే నాయకుడిపై నమ్మకంతో
తమ ఓటు హక్కును నోటుకు
అమ్ముకుంటుా చదరంగపు టాటలలో
ఎత్తుకు పై ఎత్తు వేయలేని అసమర్ధత
నిండిన అమాయక సిపాయిలు కార్మికులు॥