Tuesday, July 12, 2022

మీ పాట నా పంచపది విజేతలు






12/07/2022
మీ పాట నా పంచపది లో

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

సత్యవతిగారి పాట..
గోరింట  పూచింది కొమ్మ లేకుండా 
మురిపాల అరచేత తొడిగింది 
ఎంచక్కా  పండేనా


కొమ్మ లేకుండా, ఆకుగా పుాచిందంట
అతివల అరచేత  నిండు గోరింట
ఎంచక్కా అమరిన మురిపాల పంట.
మొగ్గలంటి వేళ్ళకు ఎర్రగా పండెనంట॥
గోరింట ఎంత ఎర్రగా పండితే మగని కంత ప్రేమంట ఈశ్వరీ ॥


నా పాట...
గోదారీ గట్టుందీ..గట్టు మీదా చెట్టుందీ 
చెట్టు కొమ్మని పిట్టుందీ  పిట్ట మనసులో ఏముందీ.....


12/07/2022
మీ పాట నా పంచపది లో

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

నేను ఇవ్వబోయే పాట
ఆనాటి చెలిమి ఒక కల
కలకాదు నిజము ఈ కథ

ఆనాటి రోజులు ఎప్పటికీ రావు 
చెలిమి నిండు స్నేహాలు ఇపుడు లేవు
కలనైనా ఆరోజులు మరచిపోవు
నిజము, ఆనాటి ఈ కధలు కల్లలు కావు॥
నాటి ఆలోచనల ఆనందములో నేటి పంచపదుల నియమమునే మరచితినీశ్వరీ ॥🙏🙏



*పంచపది సాహితీ కవన వేదిక*
*మీ పాట నా పంచపది*-101
తేది:12.07.2022నాటి *విజేతలు:*
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*2.కవి రత్న:* దినవహి సత్యవతి గారు
*3.కవి తేజ:* జోషి మధుసూదన శర్మ గారు
*4.కవి వజ్ర*: శరత్కవి DVR మూర్తి గారు
*5.కవి తేజ:* శిరీష వూటూరి గారు

*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*

No comments:

Post a Comment