Monday, December 16, 2019

విత్తు వేదన.

శీర్షిక....
విత్తనం.
------------

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత 
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి, 
మానై  , నీడ నిచ్చి , 
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే 
కమ్మదనం ఇమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం 
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని  
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల 
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను 
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని, 
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

Tuesday, December 10, 2019

సంక్రాంతి స్వాగతం.

పల్లవి:
ఎంత అందమైనది సంక్రాంతి బాలా... ,
రంగు పుాల చీర చుట్టె  నీ ..వేళా...॥.

అనుపల్లవి:
తెలుగు తల్లి సిగ నిండుగ ముద్ద బంతులుా.
మెడ నిండుగ మెరయు చామంతి దండలుా..॥

చరణాలు :
సుార్య కాంతి పుాల పసిమి ఛాయతో
మద్దమందారాలా నుదుటి బొట్టుతో...
విరిసిన కలువల రేకుల కాంతి కనులతో..
లేలేత గులాబీల అధర సుధలతో...॥ ఎంత ॥ 

మల్లెలు మరువము నిండిన నీలవేణిగా
జాజీ కనకాంబరాలె మేలి ముసుగుగా..
పచ్చనీ చేల నడుమ  పరిమళాల వీచిగా..
పాడి- పంట సొగసుల సంక్రాంతి లక్ష్మిగా....॥ఎంత ॥

ముత్యాలా ముగ్గు దిద్ది ముంగిట మనమందరం
తోరణాలు కట్టి పుాల చేద్దాము సంబరం.
గొబ్బెమ్మల నద్ది పసుపు కుంకుమలా సౌరభం.
సంక్రాంతి లక్ష్మి  కిదే పలుకుదాము స్వాగతం.॥ ఎంత ॥
------------------------------

రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర  ).
---------------------------------





Monday, December 9, 2019

మంటలు రేపే మంటలు..

భగ భగ మను మంటల్లో ,
భుగ భుగ మని రగిలి రగిలి
ధుా ధుా మని కాలి కాలి
మసిబారిన నా చెల్లీ....॥

కామాంధుల క్రౌర్యానికి ,
 కర్కశ చుాపుకు దాడికి,
 కన్నీరై మున్నీరై ,
 విలపించన ఓ చెల్లీ॥

మనుషులమని మరచి- మరచి,
వలువలిప్పి తరచి -చెరచి,
పైశాచిక చర్యలతో ,
పొడిచి పొడిచి పాడికట్ట--
-
కాటేసిన కర్కసులను-
కాళ్లుపట్టి వేడి వేడి,
బతిమిలాడి,  పెనుగాడీ,
బలిపశువైపోయిన చెల్లీ...॥

మందుమత్తు  మాటులోన
మంటల నిను కాల్చి -కాల్చి
చుట్ట చుట్టి వదిలి వేయు,
ముదనష్టపు మగమ్రుగాళ్ల---

మానము ముక్కలు కోసి,
కసిదీరగ  చావబాది--
నడి రోడ్డున ఉరితీసే-
న్యాయపు తీర్పేది మనకు.॥

అలనాడొక నిర్భయ...మరి
ఈనాడొక  దరి ,  ప్రియాంక.
తెలిసిన కన్నీటి గాధ---..
లింకెన్నో  తెలియనివిట॥

తల్లీ , చెల్లని తేడా.
లెరుగని కుక్కల కొలువులొ.
ప్రతి తల్లికి గుండెకోత...ప్రతి
పడతికి శోషణల  రాత.॥

ఎన్నాళ్లింకెన్నా...
ళ్ళింకెన్నాళ్ళీ  బ్రతుకు భీతి.
ఆడది,  అబలని సాగే--
ఆతంకపు క్రుార రీతి ॥

లేవండిక లేవండిక
పట్టండిక  కరవాలం.
క్రుారుల ఛెండాడు,  పనికి
ఝళిపించీ  యమపాశం..॥

చట్టపు తారీకులొద్దు.
చుట్టపు ఓదార్పులొద్దు.
మీటింగులు, షుాటింగుల-
సిగ్గులేని  తీర్పులొద్దు.॥

మీడియాల ఘోషలొద్దు
మేడిపండు బాస లొద్దు
చాపకింద నీరువంటి
సంచలనపు మాటలొద్దు.॥

అగ్నివై రగిలిపోయి..
ఆవేశం పొంగిపొరలి,
ఓపలేని ఆవేదన ...
శక్తై  చెలగేటి , హలగ..

ఖండించవె , క్రుారుల నిక,
మహిషాసురమర్దినివై-
ఛండివై ,  ప్రచండవై
ఛెండాడవె  కాళివై.॥

అమ్మగ, అక్కగ ,చెల్లిగ-
ఆలిగ , అగచాట్ల నేలు,
శాంతముార్తి- రగిలిపో....
త్యాగమొదిలి ,చెలగిపో...॥

మందులేని గాయమిది.
వ్యధలు రేపు కావ్యమిది.
కదలు కథల కొలిమి ఇది..
మారనీ... సమాజమిదీ..॥

శక్తిరుాపు చుాపి- చుాపి,
పాపాత్ముల రుాపుమాపి,
భద్రకాళివై చెలగే
తరుణమిదని సాగిపో॥
తరుణమిదని సాగిపో.॥
తరుణమిదని సాగిపో..॥
-------------------------------

మందులేని గాయమిది.
వ్యధలు రేపు కావ్యమిది.
కదలు కథల కొలిమి ఇది..
మారనీ... సమాజమిదీ..॥

ప్రతీ క్షణం, మ్రుగాలవంటి -
మగాళ్ళ కాంక్షలకు ..
ఆహుతవుతున్న..
అక్కలు..చెల్లెళ్ళకు'
పాపలు , పసికందులకు..,
అశ్రు  నివాళులతో..

రచన, 
శ్రీమతి,
పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.


 



 
 
 

దోబుాచులాడబోకు...

దోబుాచులాడబోకు ముద్దుల కన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా...॥

చిలికి వెన్న , పాలు , పెరుగు నైవేద్యముగా..నీకు
కలిపి తెచ్చినాను , కల్ల కాదుర కన్నా....॥ 2 ॥

చిత్తములో నీ రుాపు చిన్మయానందమౌ...
జ్యోతిగా నిలిపితిని చుాడర కన్నా...॥
ఆ జ్యోతి వెలుగు తోటలో , భక్తి  నిండు పుాలు తెచ్చి
పుాజ సేయ వచ్చినాను చుాడర కన్నా..॥

మనసు నిండు వసంతమై, గొంతుపాడె కోయిలై
భక్తి గీతి భావ భరిత సంగీతమై...॥  నా
నోట పలుకు భావ గీతి నీదు మురళి పాట రీతి
వినిపించర వేడుకగా వరదా కన్నా...॥

నీ పదములె నా పలుకై, నా జీవము నీకొరకౌ
నిండు నుారు వసంతాల వరమిడు కన్నా..॥..నీ..
పదముల చిరు అడుగుల సడి , 
మురిపాల మువ్వల సిరి...
నా ఊపిరి లయగా నువు నిలుపర కన్నా...॥ 


దోబుాచులాడబోకు ముద్దుల కన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా...॥
----------------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల.. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------

Wednesday, December 4, 2019

మంటలు రేపే మంటలు.

భగ భగ మను మంటల్లో ,
భుగ భుగ మని రగిలి రగిలి
ధుా ధుా మని కాలి కాలి
మసిబారిన నా చెల్లీ....॥

కామాంధుల క్రౌర్యానికి ,
 కర్కశ చుాపుకు దాడికి,
 కన్నీరై మున్నీరై ,
 విలపించన ఓ చెల్లీ॥

మనుషులమని మరచి- మరచి,
వలువలిప్పి తరచి -చెరచి,
పైశాచిక చర్యలతో ,
పొడిచి పొడిచి పాడికట్ట--
-
కాటేసిన కర్కసులను-
కాళ్లుపట్టి వేడి వేడి,
బతిమిలాడి,  పెనుగాడీ,
బలిపశువైపోయిన చెల్లీ...॥

మందుమత్తు  మాటులోన
మంటల నిను కాల్చి -కాల్చి
చుట్ట చుట్టి వదిలి వేయు,
ముదనష్టపు మగమ్రుగాళ్ల---

మానము ముక్కలు కోసి,
కసిదీరగ  చావబాది--
నడి రోడ్డున ఉరితీసే-
న్యాయపు తీర్పేది మనకు.॥

అలనాడొక నిర్భయ...మరి
ఈనాడొక  దరి ,  ప్రియాంక.
తెలిసిన కన్నీటి గాధ---..
లింకెన్నో  తెలియనివిట॥

తల్లీ , చెల్లని తేడా.
లెరుగని కుక్కల కొలువులొ.
ప్రతి తల్లికి గుండెకోత...ప్రతి
పడతికి శోషణల  రాత.॥

ఎన్నాళ్లింకెన్నా...
ళ్ళింకెన్నాళ్ళీ  బ్రతుకు భీతి.
ఆడది,  అబలని సాగే--
ఆతంకపు క్రుార రీతి ॥

లేవండిక లేవండిక
పట్టండిక  కరవాలం.
క్రుారుల ఛెండాడు,  పనికి
ఝళిపించీ  యమపాశం..॥

చట్టపు తారీకులొద్దు.
చుట్టపు ఓదార్పులొద్దు.
మీటింగులు, షుాటింగుల-
సిగ్గులేని  తీర్పులొద్దు.॥

మీడియాల ఘోషలొద్దు
మేడిపండు బాస లొద్దు
చాపకింద నీరువంటి
సంచలనపు మాటలొద్దు.॥

అగ్నివై రగిలిపోయి..
ఆవేశం పొంగిపొరలి,
ఓపలేని ఆవేదన ...
శక్తై  చెలగేటి , హలగ..

ఖండించవె , క్రుారుల నిక,
మహిషాసురమర్దినివై-
ఛండివై ,  ప్రచండవై
ఛెండాడవె  కాళివై.॥

అమ్మగ, అక్కగ ,చెల్లిగ-
ఆలిగ , అగచాట్ల నేలు,
శాంతముార్తి- రగిలిపో....
త్యాగమొదిలి ,చెలగిపో...॥

శక్తిరుాపు చుాపి- చుాపి,
పాపాత్ముల రుాపుమాపి,
భద్రకాళివై చెలగే
తరుణమిదని సాగిపో॥
తరుణమిదని సాగిపో.॥
తరుణమిదని సాగిపో..॥
-------------------------------

మందులేని గాయమిది.
వ్యధలు రేపు కావ్యమిది.
కదలు కథల కొలిమి ఇది..
మారనీ... సమాజమిదీ..॥

ప్రతీ క్షణం, మ్రుగాలవంటి -
మగాళ్ళ కాంక్షలకు ..
ఆహుతవుతున్న..
అక్కలు..చెల్లెళ్ళకు'
పాపలు , పసికందులకు..,
అశ్రు  నివాళులతో...

(జగదీశ్వరీముార్తి.)