Saturday, January 23, 2021

పాటవెలదులు ప్రక్రియలో

పద్య ప్రక్రియ.
పాట వెలదులు.
-----------------------
శీర్షిక .
శ్రీ కృష్ణ శరణం మమ.
------------------------------
1.
నభము లేలు వాడు            నరుని గాను
అవత రించ  బుానె             అవని లోన
దేవ కింట  బుట్టె                  దేవ విభుడు.
జయము జయము లింక       జగతి లోన  ॥
2.
మాయ లెన్నొ జేసి             మాత వీడి
నందు నింట  జేరె               నగవు తోడ 
గోప బాలు జేరి                   గోవు   లేలు
వెన్న దొంగ అతడె               వేద విదుడు ॥
3.
వేడ్క మురళి బట్టి          వేగ బ్రోవ
వెతలు దీర్చి ఇలను        వెలిగు నింప
దుష్ట రక్క సులను          దునిమె ధరణి
ముద్ధు కృష్ణు డౌచు         ముదము తోడ ॥
4.
ధర్మ క్షేత్ర  మందు          ధర్మ మెంచి
అర్జు నుండు వీడ          అస్త్ర  ములను
సార గీత జెప్పె             సరళ ముగను
పార్ధ సార ధతడు         సార్ధ సఖుడు ॥
5.
పాల సంద్ర మందు       పవ్వ ళించి
కుాడి  లక్ష్మి  తోడ          కులుకు వాడు
వేడ్క నిలను వెలసె      నేడు గిరుల 
విశ్వ మేలు ఘనుడు    విష్ణు  డతడు ॥
--------------------------------------------------
 రచన శ్రీమతి ,
 పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్, మహారాష్ట్ర .
 8097622021.
 ---------------------

Friday, January 22, 2021

గెలుపు..కధానిక.

20-01-2021

అంశం:  అనుకోకుండా ఒక రోజు ( కథానిక.)
శీర్షిక : తీరిన కోరిక.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

----------------------------------------


         "సాంప్రదాయ ఋచులు " రెష్టారెంట్ , 
         
వచ్చి పోయే జనం తో కోలాహలంగా ఉంది. ప్రతీ చిన్న ఫంక్షన్ కు, పండగలకు కుాడా ఇక్కడే 
అందరుా ఆర్డర్స్ ఇవ్వడంతో , జనం లైన్ కట్టి 
మరీ టోకెన్స్  ప్రకారం ఐటమ్స్ పేకింగ్ చేయించు కుంటున్నారు.
ఎంత మంది ఆర్డర్ ఇచ్చినా తరగని "క్వాలిటీ ఫుడ్" గా
ప్రతీ సంవత్సరం కుాడా , ఉత్తమ స్థానంలో నిలిస్తొింది
"సాంప్రదాయ ఋచులు " రెష్టారెంట్.
పైన ఎ. సి. రుామ్ లో  కొంచం నెరిసిన జుట్టుతో , కాటన్ చీర కట్టుకొని , వేలుముడి వేసుకొని , సి.  సి. ట.వి  స్క్రీన్ లో ఇదంతా చుాస్తున్న  జానకమ్మ , తన కోర్కెను
ఈ రకంగా తీర్చినందుకు భగవంతుడికి పదేపదే 
నమస్కరిస్తుా .. "అనుకోకుండా, ఆ రోజు జరిగిన సంఘటన" స్పరణకి రాగానే. గతం లోకి జారిపోయింది.

************************************"""""

తనకు చిన్నప్పటినుంచీ  చదువుకోవాలని,  ఏదైనా స్వయం కృషితో సాధించాలని చాలా ఆశగా ఉండేది
కానీ అమ్మా నాన్న కుాడా ,ఆడపిల్లవు ,అణిగి మణిగి
ఉండాలంటుా, ఎంత చదివినా పెళ్ళి చేసుకొని ఇంటి పనులేకదా  చేయాలి,  ఆడపిల్లకి పెద్ద పెద్ద
చదువులెందుకంటుా...పదవతరగతి అవ్వగానే పెళ్ళి
చేసీసేరు .
తన మనసులో కోరిక అలాగే ఉండిపోయింది.
అత్తవారింట్లో చాకిరీ ,  పిల్లలు  బాధ్యతలతో
క్షణం తీరికలేని జీవితం.
పొద్దున్నే  తయారై తమ కారును తామే డ్రైవింగ్ చేసుకుంటుా వెళుతున్న సంపాదనాపరులైన  
సాటి స్త్రీలను  చుాడగానే
తన మనసులో కోరిక తిరిగి ఉవ్వెత్తున లేచేది.
ఆగలేక భర్త తో చెప్పింది గానీ , అతను కుాడా
ఇప్పుడేం చదువుతావు..ఎప్పటికి పుార్తవుతుంది..
ఇంక ఉద్యోగమెప్పుడు....
 ఐనా  పిల్ల లచదువులకే  ఉన్నది చాలడంలేదు...
అంటుా...లెక్కలు -జమలు చెప్పేసరికి మరేం
 మాట్లడ లేకపోయింది.
 పని వంట -,పని-వంట,  పని తో అలా ఇంట్లోనే ఉండడం చాలా విసుగ్గా ఉండేది.
 నవరాత్రి పండగ దగ్గర పడుతుా ఉంటే చాలా మందికి
 చాలా ఉత్సాహంగా ఉండేది.
 కారణం తమ సొసైటీలో  ఆ తొమ్మది రోజులుా 
 అమ్మవారి పండగ చాలా బాగా జరిగేది. జనం బాగా వస్తారు. చాలా మంది గృహిణులు  ఎవరికి తోచిన
వంటకాలు వారు చేసి చిన్న చిన్న జాగాల్లో కట్టిన  దుకాణాల వంటి వాటిలో పెట్టి అమ్మేవారు .ఆ వచ్చిన డబ్బులో కొంత సొసైటీకి ఇచ్చే ఒప్పందం తో వారికి 
ష్టాల్ వాడుకొనే హక్కుండేది.
 అమ్మవారిని  చుాడడానికి పిల్లలతో వచ్చేవారు ,
 ఆడి పాడి అలసిన పిల్లలకు
" హోమ్ మేడ్ ఫుడ్"  అంటుా కొని పెట్టడమేకాక 
వారు కుాడా తినేవారు.
 కొంచం ఎక్కువ ఖరీదైనా అందరివీ అమ్ముడుపోయేవి.
అనుకున్న దానికంటే సొమ్ము ఎక్కువ రావడం తో అమ్మేవారి ముఖం ఆనందంతో కళ కళ లాడేది.
ఇవన్నీ చూస్తున్న జానకమ్మకు తను కూడా ఇందులో పాల్గొంటే బాగుందన్న కోరిక ఎక్కువైంది.  

 ఈ ఏడు తనుకుాడా పాల్గొనాలని సంకల్పించుకొంది.
 దీనికి తను ఎవరి పెర్మిషనుా తీసుకో అక్కర లేదు.
కానీ ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. స్టాల్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. తనకు దొరుకుతుందో, దొరకతో ,అనుకుంటూనే సాయంత్రం" హారతి" కోసమని కిందకు వెళ్ళింది. దేవి హారతిభక్తిగా చేసింది .ప్రసాదం తీసుకుని బయటకు వస్తూ ఉంటే స్టాల్స్ అన్నిటిలోకీ చివరిగా ఉన్న స్టాల్ ఖాళీగా కనిపించింది. దాంతో జానకమ్మ ఆనందపడుతూ అక్కడి యాజమాన్యం వారికి తనకు "ఆ చిన్న స్టాలు మూడు రోజుల కోసం కావాలని" అభిమానపడుతూ మొహమాటంగానే అడిగింది. 
అది. ఖాళీగా ఉండటంతో,  వాళ్ళు కొంచెం సేపు  ఆలోచించి, ఆ తర్వాత ఒప్పుకోగానే, ఆనందంతో సంబరపడిపోయింది జానకమ్మ..
"అనుకోకుండా ఈ రోజు" తన కోరికను తీర్చినందుకు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది జానకమ్మ..
************************************
రాత్రంతా నిద్ర పట్టలేదు జానకమ్మకు. మూడు రోజుల కోసం స్టాల్ అంటే బుక్ చేసింది గాని
తనకు ఇప్పటి కాలం వంటలు అంటే ....
పిజ్జాలు ,బర్గర్లు , సమొాసాలు వంటివి అంత 
బాగా రావు.కానీ  తన సరదా కోసం ఒక్కసారి తమ సాంప్రదాయ వంటలైన పులిహోర , దద్దోజనం, 
బుార్లు , పెరుగువడలు , చక్కెరపొంగలి చేద్దామని నిర్ణయించుకొంది . తెలుగు స్టాల్ ఇస్తామన్న విషయం భర్త తో చెప్పింది. సొసైటీ లోని
చాలా మంది ఆడవారు అలా చేసే వారు ఉన్నారు
కనుక అతనేమీ అనలేదు కానీ తను చేసే ఈ వంటలు
ఎవరు తింటారంటుా ఎద్దేవా చేయడంతో తను చిన్నబోయింది. కానీ తను చేద్దామనుకున్న పని  మానదలుచుకోలేదు. ఆలోచనల్లో ఉండగానే నవరాత్రి రానే వచ్చింది. పగలు రాత్రి తేడాలేని వెలుగుల సంబరం. పగలంతా పుాజలు, ఆరతులు, నైవేద్యాలుా ,ఐతే సాయంత్రం ఐదు నుండే ప్రోగ్రాములు..రాత్రి
పది గంటలనుండి,  తెల్లారి రెండుా ముాడు గంటలవరకు కోలాటం ఆటలతో సందడే సందడి.

అందరితో పాటుగా తను కుాడా చిన్న ష్టాల్ తీసుకొని
పైన "సాంప్రదాయ ఋచులు " అన్న బో్ర్డ్ పెట్టి
తనుచేసిన తినుబండారాలు పెట్టింది. చీర కట్టు బొట్టుతో , వేలుముడి వేసుకొని వచ్చిన తనను
చుాసి మిగిలిన వారు వ్యంగ్యంగా నవ్వుకోవడం చుాసి బాధ వేసింది . సాయంత్రం వరకు ఎవరుా తన వంటలు రుచి కుాడా చుాడలేదు.మిగిలిన వారివి
అన్నీ చెల్లిపోయి  సాయంత్రానికి మళ్ళీ చేసుకు  వస్తున్నారు. రాత్రి తొమ్మదికే వారందరు చేసినవి
ఖాళీ ఐపోయాయి. తనకు కళ్ళనీళ్ళొక్కటే తరువాయి.
నిరాశగా అన్నీ తీసి ఇంటికివెళిపొిదా మని అనుకుంటుండగా, సొసైటీవారు బుక్ చేసిన గుజరాతీ
కోలాటం గ్రుాప్ వారు వచ్చీ , మిగిలిన ఐటమ్స్ ఏవీ
లేకపొివడంతో   తన దగ్గరకు వచ్చేరు. పొద్దున్న నుంచీ చాలా చోట్ల ఆడుతుా ఉండడంతో ఆకలిగా ఉన్నామంటుా పులిహోర, చక్కెరపొంగలి ముందు తీసుకున్నారు. 
అంతే ఆ తరువాత ఐదు నిముషాల్లో అన్ని వంటలు  
ఖాళీ..
అవన్నీ తిని చాలా బాగున్నాయంటుా...
అనడమే కాక తమకు అవే ఐటమ్స్ మరునాడు కుాడా
కావాలనడంతో, తను ఆనందంతో తబ్బుబ్బైపోయింది.
తను మిగిలినవారు తనను చుాసి నవ్వేరన్న కోపంతో
తన వంటలు చెల్లలేదన్న  అక్కసుతో వీరికి రేట్లు చాలా ఎక్కువగానే చెప్పింది.  కానీ అనుకోకుండా ,వారు అదే రేటుతో కొనుక్కొని
మరునాడు కుాడ యాభైమందికోసం చేయగలవా 
అని ఆడగడంతో  ఆశ్ఛర్య పోయింది.
అంతే । ఆ రోజుతో తన దశ తిరిగిందనే చెప్పాలి.
ఆ తొమ్మది రోజుల్లో తను ఖర్చు పెట్టినదానికి  నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం రావడమేకాక , చాలా చోట్ల నుండి ఆర్డర్స్ రావడం,  డబ్బు కుాడా రావడంతో ఇంట్లో తనకు ప్రత్యేకత పెరిగింది. చేతి సాయంకి మనుషులను పెట్టుకొని
ఆర్డర్స్ పుార్తి చేయడానికి భర్త , ఇంటి సభ్యులు కలిసి సహాయం చేయడంతో తన ఆనందం రెట్టింపయ్యింది.

పండగ అయ్యేక కుాడా , చాలా మంది ఏదైనా 
పండగ వస్తే  , చుట్టాలు వస్తున్నారంటుా తన దగ్గర 
 పిండివంటలు ఆర్డర్ చేసేవారు. దాంతో పరపతి పెరిగింది. అర్డర్స్ ఎక్కువయ్యేయి. అంతే...
 ఆరోజు నుండీ తను వెను తిరిగి చుాడలేదు.
పర్యవసానం సిటీ లో పేరెన్నిక గల స్థాయిలో "సాంప్రదాయ ఋచులు "   రెష్టారెంట్. పైన
దుర్గమ్మ తల్లి  ఫొటో ..అన్నపుార్ణ అవతారిణిగా ..
ఈ రోజు ఈ స్థాయికి తనను తీసుకెళ్లి, 
తన "గెలుపు" కు కారణమై ,తనకొక గుర్తింపు నిచ్చిన తన సొసైటీ లో జరిగే "దసరా పండగకు " 
ఈనాటికీ  తను ఫ్రీగా  అవే "సాంప్రదాయ ఋచులను " సప్లై చేస్తున్నాది .అంతేకాదు..ఆ గుజరాతీ గ్రుప్ వారు
తమ సొసైటీలో "కోలాటం" ఆడడానికి వచ్చినపుడల్లా
వారికి కుాడా తను ఫ్రీగా "సాంప్రదాయ ఋచులను "ఇవ్వడం పరిపాటైంది. 
ఒక రకంగా తన" గెలుపు" కు కారకులు వారేకదుా...

*********************†****

Thursday, January 21, 2021

భారత రాజ్యాంగం..

వారం వారం కవిత

కవిపేరు:డా.రామక కృష్ణమూర్తి
ఊరు:బోయినపల్లి,సికింద్రాబాద్.
చరవాణి:9948285353.
కవిత అంశం:రాజ్యాంగం
శీర్షిక:సర్వోత్కృష్టం


భారతదేశానికి సర్వోత్కృష్ట చట్టంగా రూపొందింపబడి,
మేధావుల రూపకల్పనలో
పటిష్ఠంగా తీర్చిదిద్దబడి,
సర్వసత్తాక,ప్రజాస్వామ్య,
గణతంత్ర,సామ్యవాద అస్తిత్వానికి సూచికయింది.
ప్రాథమిక హక్కులే కాక విధులు,ఆదేశసూత్రాలతో నిర్మించబడింది.
పరిపాలనకు దన్నుగా,
ప్రభుత్వ నిర్మాణానికి అండగా,
శాసన,కార్యనిర్వాహక,న్యాయవ్యవస్థలతో దుర్భేధ్యంగా కూర్చబడింది.
న్యాయం,స్వేచ్ఛ,సమానత్వం,
సౌభ్రాతృత్వాల దర్పణమై
ప్రతిబింబిస్తున్నది‌.
షెడ్యూళ్ళలో అనేక విషయాల క్రోడీకరణతో,
పౌరులకు,పాలకులకు ఆధారగ్రంథమై,
భారత కీర్తిప్రతిష్ఠలకు తలమానికమై నిలిచినది.

హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం, అనుకరణ కాదు.
Dr.R.Krishnamurthy
21-1-2021.

పాశురాలు 1 or 25

1..వ పాశురము 


మేలుకొల్పులు చేయ  వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని

పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి  వేద కీర్తుల వేడ॥మేలుకో

తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో

స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥ 

నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ  రేపల్లె బాలునీ ॥

సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥ 
-----------------------------------------------------



పాశురము 2 .


నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను  పరమాత్ము రంగనీ

తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను  సాగరే..॥నోము  ॥

పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే  నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥  నోము ॥

కురుల పుాలిడకండి   మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే  పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన  రారండీ  ॥నోము॥

సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥

నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥

--------------------------------------------
పాశురము 4.

శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా

మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడు

కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ 
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే 

లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె 

శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే  వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥
------------------------------------------------------
[
పాశురము 5.

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు

పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... 

మధురాధి పతి మేటి  మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు 
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు 

ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటి
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... 
----------------------

పాశురము  6. 

యదువంశ కులతిలక యాదవ సర్వోత్తమ
రమాపతి రక్ష రక్ష  మాధవ మనోహరా

అక్షరాహంకార ఆది  నియామక
హృదయనామాలంకృత  హృన్నిలయ మాధవా
                                           
చెలియ లారే రండి  చేరి కొలువగ హరిని
శ్రీ రంగ నాధుని  శ్రితజన పాలునీ  

గరుడవాహనుడైన హరి ఆలయమునదెే
సుర శంఖ నాదములు  విను పంకజాక్షీ
పురుషోత్తముడు పుాతనా స్తన్యము గ్రోలుా
ఘనుడు  మొాక్షమునిచ్చు కేశవ ముార్తి 

శేష శయనము సేయు యొాగ నిద్రా వరుడు
దాస పోషణుడితడు దానవారీ
ఋషులు యొాగులు మునులు 
మొాదమున మేల్కొల్ప.....
యశములిడ మత్తు విడు 
మధుర మంగళు డితడుా
                                              
చెలియలారా రారే చేరి కొలువంగ హరిని
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ 
-----------------


పాశురము 7. 

ఎంత పిలుతును నేను ఏమని  పలికెద
వింతగాదే చెలులుా వివరించి తెలుపగా॥

తొలొపొద్దు పొడిచేను తెమిలిరారే చెలులుా..
కులదైవమును తలచి కుార్మి రంగని కొలువ॥ఎంత ॥

ముాడు వేదములకు ముాలమైన స్వామి
ముాడులోకాలకుా  ముార్తి పరమాత్ముడు
సర్వము తానై వ్యాపించు నాధుని
త్రైలోక్య ముార్తిని  తిరుగోవిందుని 

సుక-పికా  రవముల ఆనంద గీతాల-
మేలుకొల్పులు వినవె మీన నేత్రీ...
కేశిని దునిమినా కేశవ ముార్తితడు
వెన్న పాల దొంగ  వేంచేయు వేళాయె 

విద్యలెరిగిన మీకు విజ్ఞతలు తెలియవా
వంద్యమానుని కొలువ వడిగ రారేలనే
తగదు తగదోయమ్మ ఈ నడత మీకు
తడయుటలు మాని తరలి రారండే చెలులుా 
--------------

8. వ పాశురము.

జ్ఞానానందుడు  ధ్యాన ప్రాప్తుడుా
సర్వోత్తముడుా   శ్రీ హరి " విష్ణువు".
అనుపల్లవి:
దేశతః  కాలతః  వ్యాప్తి చెందెడువాడు
నిత్య సత్యుడుా  నిర్మలానందుడుా

చైత్రమాస ప్రియ చక్ర గదా ధరుని
క్షీర సాగర శయను శ్రీ పద్మనాభుని..
క్షీర రాశికిని  సింహ రాశికినీ
నియామకుని ఆ నీల వర్ణమువాని..
చేరి కొలువగా రారే చెలులుా
శ్రీ వల్లభునీ  శ్రీ రంగ ధామునీ..


పొన్న పుారంగుతో  భానుడుదయించేను
సన్న సన్నగ నింగి తురగలించేనుా
ఎనుములదె మేతకై మేల్గాంచి పరుగులిడె
వినవె చిరు గంటల సవ్వడులు మీనాక్షి.

నీరాడ బోవుమా  నీదు వాకిట నిలచి
నిను పిలువ వచ్చేము ఓ నీరజాక్షీ
కీర్తింప పర నిచ్చు కేశవ ముార్తి ...మా
కుశల మడిగీ సేద దీర్చె శ్రీ విష్ణువు 

జ్ఞానానందుడు  ధ్యాన ప్రాప్తుడుా
సర్వోత్తముడుా   శ్రీ హరి " విష్ణువు".

దేశతః  కాలతః  వ్యాప్తి చెందెడువాడు
నిత్య సత్యుడుా  నిర్మలానందుడుా

-----------------------------------------------------------

పాశురము-9

శంఖ పద్మ గదా చక్రము ధరియించీ 
మధుసుాదన నామకా అసురుని దృుంచీ...

సాత్విక లోకానందా  సార జన శుభేచ్ఛా
మధుర భక్ష్య  ఫలదాతా మాధవ మదుసుాదనా ॥
కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా 
పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥

రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా
దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా
మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ 
మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥

వేల నామాల విభుని కీర్తించు చుండగా
యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా
పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన
చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా॥

అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !
చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..
పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !
కీర్తింప మముగుాడీ  పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥

రండి రండే చెలులుా  చెలియ లేపి రండే 
రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥
---------------------

పాశురము  10. 


అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని ॥


చెలియలారా రండే  సేవింప హరినీ

  శ్రీ రంగ నాధునీ శ్రీరంగ నాధునీ ॥


ముాడు వేదాల లో ముాడు లోకాల లో

ముాడైన గుణములు, ముాడు కాలాల లో

చేతనాచేతనల  భుాతాది జీవుల లో

చేరియుండెడువాని చెంగల్వ పుాధరుని॥


చెలియలారా రండే  సేవింప హరినీ 

  శ్రీ రంగ ధాముని   శ్రీరంగ ధామునీ ॥


ముాడు లోకాలకుా ముాలమైనా స్వామి

త్రైలోక్య నాధునీ త్రివిక్రమ ముార్తిని  ॥

అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని..॥


శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥

  శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥

సంగతిది వినికుాడ ఉలకవుా? పలుకవుా?

శ్రీరంగనీ నోము నోచియుంటివిగదా..॥


కుంభకర్ణుని  నిదుర నిను చేరెనా ఏమి?

కంబు కంఠీ నిదుర విడువ రావే చెలియ ॥


ఇంపైన తులసీ. సుమ మాల గళము నిడి

సొంపుగా మంగళములందె శ్రీ కరుడుా..

ఒంపు సొంపుల ఘనుడు నందనందనుడు

పురుషార్ధములనిచ్చు సిరి పుణ్యముార్తీ ॥


వేగ తెమిలీ రావే వర మందగమనీ

వేలకీర్తులు పాడి వేల్పు కొలువగ హరిని ॥

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని..


శ్రీరంగ నాధునీ శ్రీ రంగ నాధునీ.

------------------------------------------

పాశురము 11.

చక్ర గదా పద్మ శంఖ ధారీ మురారీ
దైత్య కుల నాశకారి వామనావతారీ
సుఖాభీష్ట సిద్ధి ప్రద ముక్తి మొాక్షకారీ..
జిహ్వ తత్త్వ  నియామకా జిత వైరి మురారినీ ॥

కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగనాధునీ...॥
:
శ్రాత్రవ బలముల గొల్ల పట్టివి నీవుా 
పేరుగల పుణ్యవతి పెద్దింటి పడతి
వాలు కన్నులదోయి వంపు నడుము కల్గిన
నెలత, నెమలిని బోలు నడత వన్నెల బోడి॥

చెలయ రావే తెమిలి కొలువంగ హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి విష్ణు నీ..॥

తిరునామముల  పాడి తీరైన వన్నె కాని 
శ్రీకృష్ణుని  పరమాత్ముని సేవింప వస్తిమి
ద్యాన మగ్నవై ఇహమును మరచిన మాయమ్మా
ఉలుకు పలుకు మాని నిదుర నటియించకమ్మా॥

రావే నీ రాకకై వేచి యుంటిమి మేము
బంధు జనుల కుాడి భవుని కొలువ
రావే రమణి నామ కీర్తనల రంగని
సేవింప గానముల పుాజింప హరినీ ॥

కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగ నాధునీ....॥

-----------------

పాశురము 12.

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా.

లేగ దుాడలు తల్లి గోవు పొదుగు  తడమగ
పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...
యేరులై పారేటి  పాడి నిండిన నల్ల-
గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.

కొలువగ!  నాధుని,  లెమ్మా!  నిదుర వీడు మమ్మా
వినవే ! శ్రీ విభు కీర్తన ! బంగారు బొమ్మా..

రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ
నామ గానము కన్నా మించు జపము ఏదీ...
సీమాటి ! నిను పిలువ  నిదుర మత్తేలనే
నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ..

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా.

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ ..

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....
-------------------

పాశురము:  13.

చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.
పాహి  పరంధామ హృషీ -కేశావతారీ

రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ
ఇంద్రియా నియామకునీ  ఇహ పర హితకారునీ 

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ 

పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ
పోరులో రావణుని మదమణచి దునిమేటి
జగదేక వీరునీ జానకీ రాముని
కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి 

పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని
కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ 

మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా
శుభములను సుాచింప శుక్రుడుదయించగా
అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా
మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా

చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ 

---------------
పాశురము:  14. 

చక్ర పద్మ శంఖ గదా  ధరుడు హృషీకేశుడుా..
వాక్ తత్త్వ సారుడుా  వైకుంఠ  ధాముడుా

ఇంద్రియ నియామకుడు ఇందిరా రమణుడుా
రమ ! బ్రహ్మ  ! రుద్రాదుల కానందమిడువాడు 

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా నోయమ్మా
నటనలింక చాలించి !  నిదుర లేచి రావమ్మా 

ఎంత గడుసు దానవే  ముద్దుల గుమ్మా
నటనలింక చాలు చాలు మాటకారి వమ్మా

పెరటి తోట కొలనులో కలువలు వికశించెనమ్మ
నిదుర లేచి తలుపు తెరచి మము చేరగ రావమ్మా

"మిమ్ము ! లేపెద "ననుచుా  మాటిచ్చీ మరచితివి
నమ్మికిక  లేటికినే  మధుర వచనా...మాకు
సీమాటి సిరిమల్లీ  సిగ్గులేదటె నీకు
శమము దీరిన రావె సమకట్టి తడయకిక 

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీ గిరి శ్రీ వాసునీ  శ్రీ రంగ నాధునీ .॥

దేవళముల జేరె మునులు   దేవుని పుాజింపగా
దేవ దేవుని హరిని  కీర్తించీ కొలువగా..
ధవళ దంతపు దివ్య తేజ మలరగ నిలచెే
కమలనేత్రుని కొలువ కదలిరా మీనాక్షీ..

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా నోయమ్మా
నటనలింక చాలించి !  నిదుర లేచి రావమ్మా
------------------------
పాశురము:  15 . 

భక్త హృదయ తేజ భాగవోత్తముడుా
భవబంధ మొాచనుడు శ్రీ పద్మనాభుడుా
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువరావే సఖియ కోరి శ్రీ రంగనీ ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

మున్ను తెలియదు నీదు ముద్దు మాటల తీరు
నమ్మినారము నిన్ని ఓర్మి వేచితిమిచట
కదలి ఇక లేచిరా  కఠినాత్మురాలా....
గోష్టి కలియగ  రావె  గోవిందు కొలువగా..॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

కంసాది దుష్టులా   దునిమి నట్టీ ధవుడు
నంద గోపాలుడుా ఆనంద ధాముడుా...
గొల్ల భామల  తోడ కొల్ల లాడెడు 
మేటి  మాయావి మేల్కొనవె  ముదము 
రంగని కొలువ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

గోపబాలికలార ! కోపమేటకిలింత !
విదితమాయెను తప్పు వదరుటలు మానరో.....
అందరిట జేరితిర !  అతివలారా నాదు-
జాప్యమిక లేదింక ! జలజాక్షు లాగరో...॥

మీ మాట మీపాట పాల మీగడ ముాట
మిము గుాడి వత్తు  నే  జలజాక్షు లాగరో...॥

భక్త హృదయ తేజునీ భాగవోత్తమునీ
భవబంధ మొాచనునీ  శ్రీ పద్మనాభునీ
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువవత్తునే సఖియ  శ్రీ రంగ నాధునీ ॥
శ్రీ రంగ నాధునీ     శ్రీ రంగ నాధునీ.....ఆ.....
----------------------------

పాశురము 16.

భక్తుల చిత్తము నెరిగిన భవబంధమొాచనునీ
భక్తి వైరాగ్య మొసగు శ్రీహరి సంకర్షణునీ 

ఎలమి నాధుని కొలువ మేల్కొల్ప వచ్చితిమి
మలయు శ్రీ రంగనీ వ్రత దీక్ష బుానీ.

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

అందమైన తోరణాల అద్దంపు మెరపులా...
మణి కాంతులు చిమ్మి మెరయు బంగారు పుాతలా...
ధగధగలా మెరయుచున్న ద్వారముల తెరువుమా
మహనీయుని రంగనీ మాళిగ కాపరులారా ॥

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...

అతులిత సౌందర్యమలరు నంద ధామము గాచు
వికసిత వదనారవింద రేపల్లె రేడా...
డెప్పరమ్ములైనట్టి  టెక్కపు కంబము లున్న
రంగారు వాకిలినీ తెరువయ్య రంగా...॥

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

విస్మయపు చేతలా విజ్ఞత లెరిగినవాడు
పరనిత్తు  నని   మమ్ము  నమ్మించినాడుా...
వన్నెకానిని లేపి ఎరిగించు మారాక
తెరిపించవే తలుపు తోయజాక్షీ సఖీ..॥
 

భక్తుల చిత్తము నెరిగిన భవబంధమొాచనునీ
భక్తి వైరాగ్య మొసగు శ్రీహరి సంకర్షణునీ
ఎలమి నాధుని కొలువ మేల్కొల్ప వచ్చితిమి
మలయు శ్రీ రంగనీ వ్రత దీక్ష బుానీ.


మహనీయుని రంగనీ మాళిగ కాపరులారా
తీయరే తలుపులనుా మా రంగని కొలువగా ॥
----------------------------+

పాశురము:  17. 

త్రైలోక ఆవాస ముక్తి మొాక్ష కారకునీ
యశములిచ్చు  వానినీ యశోదా తనయునీ ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

అక్కసమున ఆదరించి అన్నము  జలముల నిచ్చే
చక్కనైన మాసామీ నందా గోకుల బాలా
మలయు నీ నుతుల పాడ చయమున వేంచేసితిమీ
నిర్గమించు నీరజాక్ష వామన సుర వంద్యమాన  ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

అతులిత బలధామా భ్రాత శ్రీ బలరామా
తురగలించు పాటనలిడి పరమాత్ముని పిలువుమా
మహితుడౌ శ్రీ పాదుని అనుజుని తోడ్కొని రావే
ఈకొని మా మన్ననలను యెలమి హరిని మేల్కొల్పవె॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ   శ్రీహరి శ్రీ కృష్ణునీ...

ఆనందా అనిరుద్ధా ఆదినారాయణా
పసరె నీ ఖ్యాతులెల్ల పరమాత్మా చిద్ఘనా
సొంపైన బంగారు కడియంపు పాదమును
కొలువంగ  చయమున,  గుాడి వచ్చితిమయ్య ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ   శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగనాధునీ శ్రీహరి శ్రీ విష్ణు నీ ॥
----------------------------------------

పాశురము 18.  

తెల్లవారెను కోడికుాసెను 
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను 
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక తలుపు తెరుమా  ॥


పల్లె లేచెను నిదురలేపుమ    
నీల వర్ణుని శ్యామునీ
వేడు చుంటిమి వేల నుతులా 
వేల నామములున్న వానీ
నంద నందను కోడలా  
నాధు లేపుమ ....నీరజాక్శీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ..తలుపు తెరుమా  ॥

మదపుటేనుగు బలము కలిగి 
భుజబలమ్మున పోరు సలిపే
పద్మనాభుని రాణివమ్మా  
పలుకు మొకపరి.... నీలవేణీ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ....తలుపు తెరుమా  ॥

విరతి నేలెడు వాని పొలతి 
విడుమ నలవట్టమును నీవు
విభుని వలపుల రాణి వీ... 
నప్పిన్న  నేర్పరి ... నీవు  సుమ్మ ॥

లలిత రాగపు కంఠి  కలికి
కలల రేడుని ...లేపవమ్మా ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక...... తలుపు తెరుమా  ॥

తరుణి రో ఇక తరలిరమ్మా 
తడయుటలు ఇక  వదలిరమ్మా.
కరపు కంకణ  గలగలల తో 
కురుల కమలిక కోమలాంగీ
చలిపి నవ్వుల కులుకు కొమ్మ 
హరిని కుాడి ...రావె కొమ్మఁ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ...తలుపు తెరుమా  ॥

తెల్లవారెను కోడికుాసెను 
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను 
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక తలుపు తెరుమా  ॥

----------------------------

పాశురము:  19 


గుణ పుార్ణ సంపుార్ణ  జ్ఞాన , ధ్యానానంద
వేద -విరుద్ధఆచార నిరతీ దుార
బోగాది భాగ్యప్రద  భుారి కరుణాపాంగ
యొాగనిద్రామయా యొాగిజన వంద్యా...

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీల మేఘశ్యామ ॥
నీళా హృధీశా

 గజరాజు దంతంపు కోళ్ళ పానుపు పైన
పవళించు పరమసత్మ పాహి పరమానంద
నీలవేణి ని గుాడి నిదురించు మా సామి
నిత్య పుాజలనందు కొనగ రావేమయ్య ॥

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనుమయ్య  నీళాహృధీశా ॥

మత్తునిండిన మల్లె పుాలు సిగ ముడిచీ
చిత్తు చేసితి వమ్మ మా సామి చిత్తమును
హత్తుకొన్నది  చాలు అలరు నీ హొయలతో
తగదు తగదోయమ్మ ఈరీతి నీకుా...॥

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥

చరణం:
తురగలించెడు దివ్య మణిరత్నములు పొదుగు
పంచ గుణముల మేటి పరుపు నలరించీ
నీళ వక్షముపైన నిదురించు మా సామి
తలిరు బోడిని వీడి తరలి రావయ్యా...।

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥

చరణం:
విరతి చాలించి ఇక విమలయశు వీడవే
నాధు విడువగ నీకు నిదురనటనేలనే ...
తఱచి వెన్నుని నీవు వలచినది చాలులే
మఱుగు సదనము వీడి మాటాడనీయవే ॥


నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥---
-----------------------------

పాశురము: 20. 

కోరినంతనె మాదు కోర్కె తీర్చెడు వాని
మాఇచ్ఛ తీర్తునని  మాట యిచ్చెడువాని ।

సాధు సంరక్షకుని సరసీరుహేక్షుని
హరి పురుషోత్తముని ఆది నారాయణుని
సత్య పరాక్రమ మెరిగిన మాయమ్మ 
మక్కువ మీరగ విభుగొని రమ్మా... ॥

నీదు వాకిట మేము నిలచితి మొాయమ్మ 
పుానిక హరిగుాడి నీరాడ నోయమ్మ ॥

ముక్కోటి దేవతల భయము బాపెడు దేవ
డెప్పరము లౌ లీలనసురుల దునిమేవ
అక్కసముతో  మమ్ము ఆదరింపగ రావ 
కొల్లలాడుట చాలు నప్పిన్న విడిరావ ॥
నప్పిన్న విడిరా......

నీదు వాకిట నిలచి వేచి యుంటిమి సామి
నిదుర చాలించి యిక  నీరాడ వేమీ ॥
నీరాడ రావేమి...?

ఎఱ్ఱన్ని పెదవులా   ఏపు  గుబ్బలదాన
సన్నన్ని కటిగల సతి నీళ  సిరి వదన
అలవట్ట మిడి, కుాడ అద్దమిచ్చీ పొమ్మ 
నాధు విడువగ పోము నీరాడ నళినాక్షి  

నీదు వాకిట మేము నిలచితి మమ్మా 
పుానిక హరిగుాడి నీరాడ నమ్మా॥

కుక్కుటములదె కుాసె  కెందమ్మి వికసించె 
 విరతి నిక చాలించి విభు గొని రామ్మా ॥
సారసాక్షుని గుాడి సరిగంగ తానాల
కనుమతించ చోయమ్మ కమలాక్షి మాయమ్మ ॥

కోరినంతనె మాదు కోర్కె తీర్చెడు వాని
మాఇచ్ఛ తీర్తునని  మాట యిచ్చెడువాని 
సాధు సంరక్షకుని సరసీరుహేక్షుని
హరి పురుషోత్తముని ఆది నారాయణుని॥

నీదు వాకిట మేము నిలచితి మమ్మా 
పుానిక హరిగుాడి నీరాడ నోయమ్మ॥

----------------------

పాశురము 21.

నందా...గోపాలబాలానందా  ఆనంద లీలా...
విందులే నీ వేణునాదము వినగ మధురము ఈ జగాన॥ నందా...

పల్లెలో రేపల్లెలో మా చల్ల ముంతల కొల్లగొట్టి
ముందుగా మావెన్న  పాలను ఆరగించిన చిన్ని కృష్ణా 
ఆదుకొన భువినవతరించిన ఆది దేవుడ వీవయ్యా
నిన్ను కలువగ వస్తిమయ్యా నిదురలేవర కన్నయ్యా॥నందా...


పాలకయండలు నిండిన పాలిచ్చు పాడిగల వాడవుా
పాలకుడు ఆ నందునీ పరమ ముద్దుల బాలవుా...
శీల సద్గుణ రాయ గ్వాలా కృష్ణ మేల్కొని రావయ్య
జాలమేలర మాదు మొరవిన జగములేలిన వాడవయ్యా ॥ 


ఆశ్రయించితిమీ..నిన్ను ఆదుకొనగా రావయ్యా...
విశ్రమించుట చాలు చాలిక వేద వేద్యా యొాగి వంద్యా
మధరగీతములాలపించి మంగళ శాశనములిడుచు
నీదు పదముల పుాజింప నీదు వాకిట వేరచియుంటిమి.॥  

యఖుడ వీవని తలచి వస్తిమి
యాదవా కుల దీప ధన్య..
చిన్న నాటీ సఖుల చేరగ 
రార కృష్ణా  రయముగాను
సుప్రభాతము పాడు చుంటిమి 
సుార్య తేజా లేచి రమ్మా ॥ 
---------------------------------------

పాశురము 22.

ఏ పుార్వ పుణ్యమొా ఏ నోము ఫలమొా
రేపల్లె వాసుల మైతిమొా క్రిష్ణయ్య
విరిసిన కలువల రేకు కన్నులవాడ
ఒకపరి మము జుాడ మరుగేలనయ్యా..।॥

ఉభయ శరీరాల ఉన్మాదాకృతితో
ఉరికిన రంగా శ్రీ నారసింహా 
ధర నుద్ధరించిన దానవారివి నీవు
అరమొాడ్పు కన్నుల అలసి పరుండేవ...॥

రణరంగ ధీరులౌ రాజాధిరాజులు
పణమొడ్డి పోరాడి ఓడి దర్పము వీడి
క్షణమైన నిను విడక  నీ దాసులౌ రీతి
వేల నుతులను వేడి నిను జేర నిలచితిమి ॥

డెప్పరములౌ నీదు  నామ కీర్తన తోడ
పులకరింతల మేని నిన్ను కొలిచేము
సుార్య చంద్రుల పోలు కాంతి కన్నుల విప్పి
పాపాలు మడియించి మ మ్మేల రావయ్య.. ॥

కరుణతో మమ్మేల  కన్నడించగనేల 
ప్రహ్లాద వరదా  ప్రభు పాండురంగా...
అతులితమౌ నీదు బల అవతారముల
శాప పాపము గాల్చ  మేల్గాంచుమయ్యా ॥
----------------

పాశురము 23.

అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.

ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ 

శుద్ధ జ్ఞానానంద శుభ గుణ సంపుార్ణ
అవని కార్యము గనుమ అచ్యుతా అనంతా...
శృతి సార సంపుార్ణ  సిరి నిలయ శ్రీరంగ
మాకోర్కెలను దీర్చ మన్నించి వెలికిరా...

వర్ష ఋతువందునా  వర్షించు మేఘాల
సవ్వడికి మేల్గాంచి సింగమ్ము లంఘించి
భీకరాకృతి తోడ  భీషణపు ఘర్జనల
గుహను వదలీ బయలు వెడలు రీతీ....

నిర్గమించర సామి నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్పు నీవేగద పరమేశ 

విచ్చు తామర వోలె వరలు కన్నులు తెరచి
యిచ్చ మము గావుమా సమకట్టి నార్తితో
విజయ పీఠమునెక్కి విను మా విన్నపాలు
హృన్నిలయ శ్రీ చరణ సమ్మతిని  మము బ్రోవ ॥


అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.
ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ 
-----------------------------------------------------



పాశురము: 24 .


మంగళ ధాముడవు మంగళ నాముడవు 
అవతారములనెత్తి  ఆదుకొను దేవుడవు..


మంగళమ్ముల నిడి మము బ్రోవ వత్తువని
నమ్మి కొలిచేమయ్య  వ్రత దీక్ష పుానీ ॥

కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

నీ పుాజ చేయంగ నిత్య స్నానములిడి
నీ లీల గానాల నీ పాదముల గొల్చి
మార్గశీర్షపు వ్రతము మనసార సలి్పి
నిత్యమంగ ళముకోరి నిను  కోరి వచ్చితిమి ॥

 కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

ముల్లోకములు గొలువ మలయు పాదములకుా
రావణాది అసురుల మడియించు శక్తికి
పుాతనాదుల గుాల్చు పురుషోత్తమా నీకు 
నిత్య శుభ నీరా జన- మంగళములివే  ॥

కనులు తెరచీ మమ్ము కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

గోవర్ధనము నెత్తి   గోవుల గాచేటి
గిరిధారి కృష్ణునకు  ఘన మంగళం ..ఘన మంగళంబిదే
వెన్నిడౌ శ్రీ ముార్తి యఖుడు మా కనినమ్మి
మహిత గుణముల మేటి మంగళము పాడేము  ॥

కనులు తెరచీ మమ్ము కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥ .


వేలాయుధమ్మునకు వేద వేద్యా జయము
వేల నామాల శ్రీ హరి  క్రిష్ణ జయము
పురుషార్ధముల నిచ్చి పరనిచ్చు పరమేశ
 నాధ  శ్రీ జనార్దన  గొనుమయ్య  మంగళం ॥

 కనులు తెరచీ చుాచి కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥
మంగళమ్ముల గొని మమ్మేలుమయ్యా
రంగ శ్రీనాధా సిరివర గోపాల .॥

----------------------------

పాశురము 25.

రేపల్లె వాడలో  నడయాడు గ్వాలా 
నంద యశోదల  ముద్దుల బాలా  
ఆపద్బాంధవ  హరి అవతారా
అందాల  శ్రీ క్రిష్ణ మురళి మనోహర ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

పాపి కంసును దునుమ  పాపనిగ వచ్చితివి
దేవకి వసుదే వులకు జన్నించితివి
నడి రేయిలో నందు నింట జేరితివి
కొల్ల లీలలు జేసి  కులముద్ధరించితివి ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

పురుషార్ధములనిచ్చు పుణ్య చరితవు శ్రీశ
వరముగ సంపదల నొసగు శ్రీ వల్లభా
కెరలుకొను నీ కీర్తి కొనియాడ లేమనీ 
వరలు భక్తిని కీర్తనలు పాడ వస్తిమి ॥ 

అండగ నీవుండ  ఆపదలు మాకేల
 ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

సంపదలనిచ్చేటి శ్రీలక్ష్మి  నిను కోరి
ఇంపైన కోర్తనల నిను కీర్తించీ
హృదయ పీఠము నలరు వలపందలేదా
మొాదమలరగ విరతి నిడి మనలేదా ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళిీ మనోహర ॥
---------------------------------------------





అంశం :గాంధీ గారి జాతీయత, అహింస తత్వం ..శీర్షిక : అహింసోద్యమ పోరాటకుడు.

సర్వోదయ ప్రచార కమిటీ వారి ఆధ్వర్యములో,
అంశం :గాంధీ గారి జాతీయత, అహింస తత్వం ..
శీర్షిక : అహింసోద్యమ పోరాటకుడు.

రచన.. శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర.
    8097622021.

పోరుబందరులో జన్మించిన పోరాట యొాధుడు.
సత్యహరిశ్ఛంద్రచనాటకంతో సత్యాహింసలకు
తల ఒగ్గిన స్వాతంత్ర్య  ఉద్యమకారుడు.॥
ఇంగ్లాండ్ లో బారిష్టర్ చదువుకు వెళ్ళే
ప్రయాణంలో  ఆంగ్లేయులచే అవమానింపబడ్డ తరువాత  మొదలైన జీవిత పోరాటం.॥
కుల వివక్షతకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.
బ్రిటిష్ వారి ఆధీనంలో బానిసత్వ దశలో
ఉన్న భారతదేశ స్వరాజ్యం కోసం  ఆందోళన .
అటుపై స్వాతంత్ర్య పోరాటం కోసమే
జీవితం అంకితం చేసిన నేషనల్ కాంగ్రేస్ లీడర్.
ఉప్పు పై పన్ను వేసిన కారణంగా చేసిన
ఉప్పు సత్యాగ్రహం తో చేసిన దాండీమార్చ్.
భగవద్గీతలో నిష్ణాతులు .శాంతి పోరాటకులు.
నిమ్న కులాలవారిని, ముస్లిమ్ లను
వేరుచేయడానికి ప్రయత్నించినపుడు చేసిన
నిరాహారదీక్ష.  హరిజనులను ,
"హరి" జనులుగా గౌరవించిన మహనీయుడు.
రెండవ  ప్రపంచ యుద్ధానంతరం,
ఆందోళను కొనసాగిస్తుా   "  భారత్ ఛోడో  " 
"కరో యా మరో" అంటుా   ఉధృతంగా చేసిన
  "క్విట్ ఇండియా" ఉద్యమమం. 1947 లో
భారత్ ను రెండుగా విభజన చేసి మత కల్లోలాలను
సృష్టించి, భారత్ ను వీడిన ఆంగ్లేయులు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని
విభజించకుండా ఐకమత్యంగా ఉంచాలన్న
తాపత్రయపు  ఒంటరి పోరాటం లో విఫలుడైన
మతద్వేషాలకు కుంగిపోయిన  అసలైన
దేశ ప్రేమికుడు.
హిందుా ముస్లిమ్ విభేదాలకు వ్యతిరేకంగా
దిల్లీ లో ఆమరణ దీక్ష చేపట్టి గెలుపొందిన ఘనుడు.
అంతర్గత శత్రువు ల చేతుల్లో ముాడు సార్లు హత్యా ప్రయత్నానికి  గురైన గాంధీ , సామ్రాజ్యవాదం ,
హింసా విధానాలను వ్యతిరేకించేరు.
అహింసతత్వాన్ని బోధిస్తుా నిజాయతీ , నిబద్ధత
నిగ్రహాలను అలవర్చుకున్న గాంధీజీ
తన ఆత్మకధను రాసుకొని దానికి "సత్య శోధన "
అని పేరు పెట్టేరు.
సత్య పోరాటంలో " సత్యమేవ జయతే " అంటుా..
1948 లో దిల్లీ లో నథుారామ్ గాడ్సే చేతిలో
దుర్మరణంపాలయ్యేరు.
అతని మరణానంతరం అతనిపేర "
" గాంధీ శాంతి బహుమతిని" ప్రముఖులకు ,
ప్రొంచ నాయకులకు ,ఇస్తున్న భారత ప్రభుత్వం
వారు అహింసా పద్ధతిలో" దేశ స్వాతంత్ర్య "
  పోరాటానికి తన జీవితాన్నే అంకితం చేసి
  మనకు మన దేశానికి  "స్వాతంత్ర్యాన్ని "
  తెప్పించిన గాంధీజీకి మాత్రం ..
  "నోబెల్ శాంతి బహుమతిని"  ఈయలేదు.
  దేశభక్తికి మారుపేరైన గాంధీజీని ఈనాటికీ
  మనం తలుచుకుంటుా, ఆతని జన్మదినాన్ని,
  వర్ధంతినీ ,కుాడా జరుపుకుంటున్న మనం-
  జాతి మత భేదాలు విడచి , శాంతి,
  అహింసల బాటలో నడుద్దాం.
  భారత దేశ ఖ్యాతిని పెంచుదాం
                      ".జై హింద్  ". .



ఈ వచన కవిత ఏమాధ్యమునందుా ప్రచురితంకాని
నా స్వీయ రచన.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కవిత ఎన్ని లైన్ల లో రాయాలో తెలుపనందున
రాసిన ఈ వచన కవిత నిడివి ఎక్కువైనచో
తెలుప ప్రార్ధన .
తిరిగి రాసి పంపుటకు అనుమతి కోరుచుా...

 
 







తెల్ల పావురాలు.

19 /01/2021.
మనుమసిద్ధి కవన వేదిక కై
అంశం: తెల్లపావురాలు.

శీర్షిక : శాంతి కపోతం.

రచన.. శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర.
    8097622021.

  "వేక్సీన్ "తో కరోనా కట్టడి ఔతుందన్న
 
ఆనందంతో కొత్త  జీవితానికి  శ్రీకారం॥

దురమైన బంధు జనుల ఆలింగనాలతో

ఆత్మీయ పలకరింతల పులకరింతలతో.॥

భారత కేతనంపై శాంతి కపోతాల

సమాగమ సంగమం , తర-తమ  భేదాలకు..

  అతీతంగా  అందరుా ఒక్కటిగ పంచుకొనే
  .
ఆనంద సంబరాలకు మురిసిపోతుా ,ఎప్పటికీ

  శాంతి కోరుకొనే  విశ్వ విహంగాలై...

ప్రపంచ  ప్రశాంత జీవనానికి నాందిగా...

                 ॥  తెల్ల పావురాలు॥
                 ------------------------------

Tuesday, January 19, 2021

నమస్తే కు పంపినది.శీర్షిక .జీవిత పోరాటం.

నమస్తే కు పంపినది.
శీర్షిక .
జీవిత పోరాటం.
----------------------+
భగవంతుడు మనకిచ్చిన 
గొప్ప వరం , ప్రతీ కష్టాన్నీ.. 
తాత్కాలికంగా  మరచిపోవడం ॥
నిన్నటి నెత్తుటి గాయం  , ఈ రోజు 
ఉపశమనంతో, రంగుమారుతుంది.॥
గడచిన కష్టకాలపు స్మృతులు,
గడిచిపోతున్న సమయ -గమనానికి
చెల్లా చెదురై , మెదడు పొరల్ల్లో 
అంతర్లీన జ్ఞాపకాలై నిలిచిపోతాయి.॥
లేమి తనపు కన్నీటి మరకలు,
సంపాదన  నిండిన సంతృప్తి నవ్వుల
మాటున , వెలిసి, వెల-వెలబోతాయి.॥
బీదరికపు పాత చెలిమి ఛాయలు, 
కొత్త దనపు,కాంతి మాద్యాల మార్పుకు
మనసులో నే మరుగుపడిపోతాయి.॥
విరహవేదన నిండిన అంతరంగం,
మరో ప్రేమ కాసారంలో మునిగి
పద్మరాగమై పరిమళిస్తుంది.॥
ఎవరుా లేరన్న ఒంటరితనం, 
ఆశల ఆలోచనల విహంగమవుతుంది.॥
అన్నీ కోల్పోతుా కుాడా, 
ఆశలు-ఆశయాల పయనం, 
పరిమళాల  సుమ వీచికయై,  
మధురమైన స్వాంతన కలిగిస్తుా, 
మజిలీదాకా నెట్టుకు వెళ్తుానే ఉంటుంది.॥
నీదైనా' నీ చేతిలో లేని జీవితం
ఏ రోజు,  ఎలాగుంటుందో తెలీని ,
బ్రహ్మ రాతల, బంధాల నిలయం.॥
అన్ని అవాంతరాలనుా అధిగమించి
ఆనంద స్వప్న లోకాల్లో పయనిస్తుా- '
ఎడారిలో ఒయాసిస్సును చేరుకోవాలనే-
తపన నిండిన, సద్దుబాటు సాధనం.
ఇది.!  పోరాటాల పరుగు పందెం.
ఎందుకంటే..ఇది ,  కష్ట- సుఖాలు 
కలబోసిన   "జీవితం.".
-----------------------------------------
రచన, శ్రీమతి  -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  ( మహరాష్ట్ర ).
---------------------------------------
                
                
                ---------------------


నంది తిమ్మన.

శీర్షిక: మణి మాణిక్యాలు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


అల్లసాని పెద్దన , ధుార్జటి, రామభద్రుల వంటి
ఘన కవుల సమకాలీకులు నంది తిమ్మనగారు.
అఘొార శివాచార్యుల శిష్యులైన ఈతను
శ్రీక్రిష్ణదేవరాయలి  అస్థాన కవులైన
అష్ట దిగ్గజాల లో ఒకరైనవారు.
పారిజాతాపహరణం , వాణీవిలాసం వంటి
అద్భుత కావ్య రచనా ఘనులు.
నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. జన్మతః శైవ కుటుంబీకులు.

 ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవిగా వైష్ణవ సాంప్రదాయానికి
 చెందిన రాయల సంస్థానం లో ఉన్నందున 
 కొన్ని వైష్ణవ రచనలు కుడా చేసేరు.కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో ఈయన తాతగారు నంది మల్లయ్య, మేనమామ ఘంట సింగన్నగారుా  జంటకవులుగా ఉండేవారు.

 సున్నితమైన, సులువైన పద్ధతిలో  చేసిన 
 నంది తిమ్మనగారి  రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షిస్థాయి. అందువల్ల ఆయన రచనలను " ముక్కు తిమ్మన ముద్దు పలుకులు  అని  వ్యవహరిస్తారు .
 పారిజాతాపహరణంలో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

పాత్రను బట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైనవి ఈతని 
రచనలలోని ప్రత్యేకతలు.
తిమ్మనగారి ముక్కు పెద్దది కావడం వలన 
ఆయనకి "ముక్కు తిమ్మన" అనే పేరు వచ్చిందంటారు. 
తిమ్మనగారు రాసిన పారిజాతాపహరణము” కావ్యం తెలుగు "పంచమహాకావ్యాలలో" ఒకటిగా పేరుగాంచింది.

 పారిజాతాపహరణం ఐదు ఆశ్వాసాల కావ్యం.
శ్రీక్రిష్ణ తులాభార ఘట్టాన్ని అద్భుత రచనా శైలి తో
వర్ణించిన సందర్భంలో 
నారదుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేసిన పది పద్యాలను నందితిమ్మన బంధకవిత్వముతో రాశారు.
ఈ క్రింది పద్యాలు చుాడండి.
 పద్యం:
నాయ శరగ సార విరయ
తాయన జయసార సుభగధర ధీ నియమా
మాయ నిధీ రధ గ భసుర
సారజనయ తాయరవిర సాగర శయనా!

ఈ పద్యం  లో  మొదటి రెండు పాదాలూ వెనక్కి తిరగేస్తే మూడు నాలుగు పాదాలు వస్తాయి. ఇలా రాసిన కంద పద్యాన్ని “అర్ధ భ్రమక కందము” అంటారు

రెండవ పద్యం –

క॥ ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవన నవసరసా
దారద సమ తారహార తామస దరదా

ఈ కంద పద్యంలో ప్రతి పాదం ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. దీన్ని “పాద భ్రమక కందము” అంటారు.

మూడవ పద్యం –

క॥ మనమున ననుమానము నూ
నను నీ నామమను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానానూనా

“న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది.

ఈవిధంగా  అద్భుత మైన శైలి తో వివిధ  రీతుల లో 
రాసిన పద్యాలతో  పారిజాతాపహరణమే కాక 
 అష్ట దిగ్గజాల వంటి ఎంతో మంది కవులు , 
 వారు  రాసిన  ఎన్నో ప్రబంధ కావ్యాలు, మన దేశ  చరితకు  వన్నెతెచ్చిన మణి మాణిక్యాలు. 
ఇటువంటి కావ్య నిధికి,  సంస్కృుతి -సాంప్రదాయాలకు నిలయమైన మన దేశ సంపదను కాపాడుకోవడం
మన బాధ్యతకదుా...

Sunday, January 17, 2021

బాగా చెప్పేరు..

*1. *పేపర్లు పుస్తకాలు చదవకండి ఎందుకంటే ప్రింటిగ్ ప్రెస్ కనిపెట్టింది *జాన్* *గూటన్* *బర్గ్*
*2. *గడియారం వాచ్చీలు వాడకండి ఎందకంటే కనిపెట్టింది మ్యాన్ ఫ్రడ్ క్రీస్టియన్ ఇటలీ*
*3. *రైలు ఎక్కకండి ఎందుకంటే రైలు కనిపెట్టింది రిచర్డ్ శ్రివితన్ క్రీష్టియన్*
*4. *కంప్యూటర్ వాడకండి ఎందుకంటే కంప్యూటర్ కనిపెట్టింది అలన్ క్రీష్టియన్ బ్రిజల్ దేశానికి చెందినవాడు*
*5. *కుట్టుమిషన్ లతో కుట్టిన బట్టలు తొడగకండి అంటించుకొండి గుడ్డముక్కలు కొనుక్కొని ఎందుకంటే కుట్టుమిషన్ కనిపెట్టింది దిమేనియార్ ఫ్రాన్స్ క్రీష్టియన్*
*6. *విధ్యుత్ బల్బులు వాడకండి పవర్ కనిపెట్టింది క్రీష్టియనే బల్బ్ కనిపెట్టింది క్రీష్టియనే పవర్ బల్బ్ కనిపెట్టింది థామస్స్ ఆల్వా ఎడిషన్ అమెరికా*
*7. *వాహనాలు దేనికీ రబ్బర్ వాడకండి ఎందుకంటే రబ్బర్ కనిపెట్టింది చార్లస్ గుడియర్ అమెరికా*
*8. *బట్టలు ఇస్త్రీ చేయకండి ఎందుకంటే ఇస్త్రీ పెట్టి కనిపెట్టింది షీలే అమెరికా*
*9. *మోటార్ బైక్స్ వాడకండి ఎందుకంటే మోటార్ సైకిల్స్ కనిపెట్టింది కాన్ ష్టాన్ క్రీస్టియన్*
*10. *పెన్లు వాడకండి ఎందుకంటే బాల్ పెన్లు కనిపెట్టింది జోమ్ లేడర్ క్రీస్టియన్*
*11. *పెట్రోల్ కార్లు వాడకండి ఎందుకంటే పెట్రోల్ కనిపెట్టింది కార్ల్ బెంజ్ జర్మనీ క్రీస్టియన్*
*12. *టీవిచూడకండి టెలివిజన్ కనిపెట్టింది ప్రాన్స్ వర్త్ క్రీస్టియన్*
*13. *లేజర్ చికిత్సలు చేయించుకోకండి ఎందుకంటే లేజర్ కిరణాలు కనిపెట్టింది ప్రైమ్ క్రీస్టియన్*
*14. *సైట్ కి కళ్ళజోడు వాడకండి ఎందుకంటే సైట్ కి కళ్ళజోడు కనిపెట్టింది బెంజిమిన్ ఫ్రాంక్లిన్ క్రీస్టియన్*
*15. *బ్యాటరీ వాడకండి ఎందుకంటే బ్యాటరీని కనిపెట్టింది వోల్టా ఇటలీ క్రీస్టియన్*
*16. *లిఫ్ట్ లు ఎక్కకండి ఎందుకంటే లిఫ్ట్ కనిపెట్టింది ఎలీషా వోటీన్ క్రీస్టియన్*
*17. *ఫ్రిజ్ లు వాడకండి ఎందుకంటే రిఫ్రిజిరేటర్ కనిపెట్టింది అలగ్జేండర్ జేమ్స్ క్రీస్టియన్*
*18. *విమానములో ప్రయాణం చేయకండి ఎందుకంటే విమానం కనిపెట్టింది రైట్ బ్రధర్స్ క్రీస్టియన్*

*ప్రేమతో మీ సహోదరుడు 🙏🙏

Wednesday, January 6, 2021

దిశా నిర్దేశకుడు

6/01/2021.
అంశం :వివేకానంద.
శీర్షిక : దిశా నిర్దేశకుడు.

రచన: శ్రీమతి  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
-------------------
అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు.
.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. 
అంటుా వేదాంత , యొాగ ,తత్త్వ  శాస్త్ర సారాన్ని 
మానవాళికి బోధించిన వేదాంత గురువు , రామక్రిష్ణ పరమహంస ప్రియ శిష్యుడు ,అయిన వివేకానందుడు  ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకునిగా పేరు పొందేరు.

అతని పుార్వ నామం నరేంద్రదత్తా. సహనం లేని వ్యక్తి
విజయం సాధించలేడని , బలమే జీవనమని , బలహీనతే మరణమని , మన విధికి మనమే విధాతలమని , ఔన్నత్యానికి విశ్వాసమే మార్గమని
వితంతువు కన్నీళ్ళు తుడవనివారు, అనాధకు అన్నంపెట్టనివారినెవరినీ  విశ్వసించకుాడదంటుా, 
నిరంతరం వెలిగే సుార్యుణ్ణి చుాసి చీకటి, 
నిరంతర సత్య పోరాటకుని చుాసి ఓటమి 
భయపడతాయన్న స్ఫుార్తిని యువతలో మేల్కొల్పిన
జ్ఞాన ధనుడు.రోజులో ఒకసారైన మనతో మబం మాట్లాడుకుంటే మనలోనే ఒక మహావ్యక్తిని మనం కనుగొనగలమన్న సత్యాన్ని దర్ముంపజేసిన 
ఆత్మ జ్ఞాన సంపన్నుడు. 
కెరటం నా ఆదర్శం , లేచి పడుతున్నందుకు కాదు.పడుతుా లేస్తున్నందుకంటుా తనదైన ఒక నిర్దిష్ట
నిశ్ఛయ సాధనా పటిమతో అందరిమనసుల లోనికి చిచ్చుకుపోయిన వాడు  తొలిసారిగా పాశ్ఛాత్య ప్రపంచానికి మన భారతీయ తాత్విక విశిష్టతను 
బోధించిన ఆధ్యాత్మిక గురువు,  మొదటి సన్యాసి
శ్రీ వివేకానంద స్వామి. యువతకు దిశా నిర్దేశం చేసిన వాడు ,రామకృష్ణ మఠస్థాపకుడు అయిన ఈతని జన్మదినాన్ని జాతీయ యువ దినోత్సవంగా నిర్ణయించి
ఈ నాటికీ మనం జరుపుకుంటున్నామంటే అతని సిద్ధాంతాలను  ఈనాటికీ మనం ఆదరించడంతో పాటు ఆచరిద్దాం....

-----------------

Tuesday, January 5, 2021

పాశురము 21.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.



శీర్షిక : 
నందా ఆనందా...
----------------------

నందా...గోపాలబాలానందా  ఆనంద లీలా...
విందులే నీ వేణునాదము వినగ మధురము ఈ జగాన॥ నందా...

చరణం: 
పల్లెలో రేపల్లెలో మా చల్ల ముంతల కొల్లగొట్టి
ముందుగా మావెన్న  పాలను ఆరగించిన చిన్ని కృష్ణా 
ఆదుకొన భువినవతరించిన ఆది దేవుడ వీవయ్యా
నిన్ను కలువగ వస్తిమయ్యా నిదురలేవర కన్నయ్యా॥నందా...

చరణం:
పాలకుండలు నిండిన పాలిచ్చు పాడిగల వాడవుా
పాలకుడు ఆ నందునీ పరమ ముద్దుల బాలవుా...
శీల సద్గుణ రాయ గ్వాలా కృష్ణ మేల్కొని రావయ్య
జాలమేలర మాదు మొరవిన జగములేలిన వాడవయ్యా ॥ నందా...

చరణం :
ఆశ్రయించితిమీ..నిన్ను ఆదుకొనగా రావయ్యా...
విశ్రమించుట చాలు చాలిక వేద వేద్యా యొాగి వంద్యా
మధరగీతములాలపించి మంగళ శాశనములిడుచు
నీదు పదముల పుాజింప నీదు వాకిట వేరచియుంటిమి.॥  నందా...

యఖుడ వీవని తలచి వస్తిమి
యాదవా కుల దీప ధన్య..
చిన్న నాటీ సఖుల చేరగ 
రార కృష్ణా  రయముగాను
సుప్రభాతము పాడు చుంటిమి 
సుార్య తేజా లేచి రమ్మా ॥  నందా...

Friday, January 1, 2021

తెలుగుతల్లి విలాపం బాగుంది

*అఆఇఈ అఆఇఈ అఆఇఈ*

*తెలుగుతల్లి విలాపం*

*మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది. అమ్మా! బాగున్నావా? అంటే కంట నీరు పెట్టుకుంది.*

*ఏమమ్మా, ఎందుకా కన్నీరు?  అంటే ఇలా చెప్పుకొచ్చింది.*

కామేశం!

అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసేసేరు.ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక  ఌ, ౡ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది. ఇక హల్లుల విషయానికి వస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండాపోయింది. "చ" వర్గంలో ఉన్న మరో ౘ, ౙ లను అందరూ మరచిపోయేరు.

ఇక ఉభయాక్షరాలకొస్తే శకట రేఫ అదేరా!  బండి  "ఱ" వాడకమే లేదు. అందరూ 'ర' తో సరిపెట్టుకుంటున్నారు.
పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా!

'ళ' బదులు 'ల', 'ణ' బదులు 'న' వాడేస్తున్నార్రా!
కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ.
ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన,జాన అంటునారు, వేణుని వేను అంటున్నారు.

ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు! అంటూ వాపోయింది.పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక, నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా!

ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్‌  మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వుల పాలొనరించు చుండ తా కాటుక కంట నీరొల్కగా తెలుగమ్మయె కుంగి పోదొకో మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు టంకణం (టైపింగ్) నేర్చుకుందాం. వ్యాఖ్యలన్నీ చక్కగా తెలుగులోనే వ్రాసుకుందాం. చరవాణీలలో తెలుగును ఉపయోగిద్దాం. ఎటిఎంలలో తెలుగు భాషను ఎంచుకుందాం. తరువాతి తరాలకు తెలుగు నేర్పుకుందాం. తెలుగు కథలు, పద్యాలు, సామెతలు, పలుకుబడులూ చదివిద్దాం మన తరువాతి తరాలకు తెలుగు నేర్పుకుందాం. మన భాషను సజీ చేద్దాం. ఏమంటారు? తెలుగుకు పట్టిన తెగులుకు దేహశుద్ధి చేద్దాం. 

జై తెలుగు తల‌్లి