Monday, November 22, 2021
కార్తీక పౌర్ణమి
కణ్వ మహర్షి .
దత్తపది
Saturday, November 13, 2021
అన్నీ ఉన్న అనాధ
Monday, November 8, 2021
బాల భారతం.
*బాలభారతం ఈ-కవితాసంకలనం*కొరకు
శీర్షిక : బాల భారతం.
పద్య ప్రక్రియ : ఆటవెలది.
కల్ల కపట మెల్ల కానరాని వయసు
మర్మ మెరుగ నట్టి మనసు దినుసు
వావి-వరుస లెంచి వరుసపి లుపుతోడ
పరుల నమ్ము లేత పసిడి వయసు॥
ఆట పాట లాడి అల్లర్ల మునిగేరు
ముద్దు జేయ ఒడిని మురిసి జేరు
మామ తాత యనుచు మనసార నదెనమ్మ
తనదు ప్రాయ మెల్ల తారు మారు॥
కాము కులకు జిక్కి కమిలి కుమిలె బాల
రక్ష ణిలను గనక రగిలె బేల
పశువు కన్న హీన పరుడైన మగవాడు
గనడు వావి వరుస గార్ధభుండు ॥
నమ్ము పిల్ల దాని నట్టేట ముంచేటి
నరులు రాక్షసు లిల నమ్మ బోకు
కామ మెంతో పెరిగె కాముకులిల నిండె
ఆడ జన్మ మదియె అరటి ఆకు॥
.రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
8097622021.
హామీ:
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన
చిత్రకవిత
మహతీ సాహితీ కవి సంగమంలో.
తేది: *08-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
(వచన కవిత ).
మ.సా.క.సం. 19
కవిత సంఖ్య .1.
శీర్షిక : మనో యుద్ధం.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
నోటితో మాట్లాడుతూ
నొసటితో వెక్కిరించే మనిషి నైజం.
అందితే కాళ్ళు అందకపోతే పిలక వైనం
మానవ మస్తిష్కం , స్వార్ధపుారిత
ఆలోచనల మరో ప్రపంచం.॥
మనిషిలో మరో మనిషి చేసే హెచ్చరిక
మనిషి బుద్ధికి అందక తనకు తానే
చేసే అహంకారపు అణచివేత. ॥
తన "లో "తనను అణచివేసే ప్రయత్నంలో
తనను తాను కోల్పోతున్నా
తెలీని అజ్ఞానపు చీకటి కోట ॥
మనిషకి , మానవత్వానికి
జరిగే యుద్ధంలో మత్సరం నిండిన
ఆలోచన చేసే పతనానికి
బలౌతున్న మనిషి బుద్ధి-॥
బురదగుంటలో బుద్ధి వేసే
అడుగుతో, మనిషికి మనసుకి
మధ్య జరిగే అంతర్యుద్ధం॥
కళ్ళెదురుగా "మన"ను మనకు
పరిచయం చేస్తున్న మనసు పుటలను,
మనను మనమే చదువుకోలేని అజ్ఞానం .॥
రెండు నాల్కల పాములా, రెండు
ఆలోచనల మెదడుతో
ఎవరికీ ఎవరుాకాని అశాంతి జీవితానికి
బలౌతున్న మానవ మేధావి
తను తవ్వుకున్న గోతిలో
తానే పడుతున్న స్థితి.
మారని మనుషుల
మాయాజాలపు మనోగతి ॥