అంశం : స్నేహమేరా జీవితం.
శీర్షిక ; అన్నీ ఉన్న అనాధ.
స్నేహామన్నది చాలా అపుార్వమైన బంధం .
నమ్మకానికి ,విశ్వాసానికి , నిలువెత్తు నిదర్శనం .
అంతరాలు చుాడని కృష్ణ-కుచేలులంటి అనుబంధం.
సుఖ సంతోషాలను కలిసి పంచుకునే
అనురాగ స్నేహం ॥
ఒంటరితనపు అసహనానికి స్నేహం ఒక ఓదార్పు.
ఒడుదుడుకుల ఒత్తిడిలో మానసిక ధైర్యం స్నేహం .
కష్టాల బాటలో చిరునవ్వుల ఆత్మవిశ్వాసం స్నేహం॥
బాధల్లో కార్చే కన్నీటిని ప్రేమగా
తుడిచే ఆపన్న హస్తం స్నేహం.॥
కులమత బేధాలకు అతీతమై నీ -నా
తేడాలు చుాపని హృదయ స్వాంతన స్నేహం.॥
స్నేహమే జీవితమన్న మధురానుభుాతికి
శాశ్వతమైన ఆలంబన స్నేహమే ॥
"ఎవరికెవ"రన్న భాధాపుారిత హృదయానికి
"నేను"న్నానన్న అపారమైన నమ్మకం స్నేహం ॥
.
చనిపోయిన స్నేహితుని మరువలేక ఆత్మహత్య
చేసుకున్న మరొక స్నేహితుని కారణంగా, చలించిన
అమెరికా ప్రభుత్వం,ఆగష్టు మొదటి ఆదివారాన్ని
ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది.॥
అటువంటి అనిర్వచనీయమైన స్నేహ బంధాన్ని
స్వార్ధపుారిత ఆలోచనలతో అపనమ్మకంతో , అనుమానాలతో దుారం చేసుకుంటున్న మనిషి
జీవితంలో అన్నీ ఉన్నా ఎవరుా లేని అనాధే ॥
అటువంటి పవిత్ర బంధానికి నానాటికీ
తగ్గుతున్న విలువకు నేటి రోజులు సాక్ష్యం .
మారుతున్న మనస్తత్వాల్లో తరుగుతున్న మమతలు
మనిషి మీద మనిషికి నమ్మకం లేని మనసులు-,
ఏ కష్టానికి కుాడా చలించని మనస్తత్వాలు.॥
॥ఈ నాడు స్నేహం ఒక నాటకం॥ .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
No comments:
Post a Comment