08/10/2023.
*తపస్వి మనోహరం E-book కొరకు కథ*
కథ అంశం:
1..మొగుడు ఊరు వెళ్తే.
అంశం ఇచ్చిన వారు :: అఖిల .
శీర్షిక: ప్లీజ్ ! తొందరగా వచ్చేయ్ ..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
-----------------------
ప్రియం వదకు చెప్పలేని ఆనందంగా ఉంది కారణం
ఈ రోజు తన భర్త ప్రకాష్ , ఊరు వెళ్ళిపోతున్నాడు .అదీ పది రోజులట. ప్రెండ్ కుాతురు పెళ్ళిట. ఆలాగే వాళ్ళ
బంధువుల ఇళ్లకు కుాడా వెలక్ళి వస్తాడుట.
" అబ్బా! ఎంత హాయో . ! "
------------
ఈ కరోనా కాదు గాని, హాయిగా ఆఫీస్ కి వెళ్తున్న మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టి పనిచేయించేస్తోంది .
ఇంట్లోనే ఉంటూ ఎప్పుడూ "వర్క్ ఫ్రం హోం "అంటూ ఒక రూమ్ లో కూర్చుండి పోతాడు . అంతే ! అక్కడి నుంచి "ఆర్డర్లు " వస్తూనే ఉంటాయి .. అదీ ఫోన్ లో.."
ప్రియా! తలనొప్పిగా ఉంది . కొంచెం కాఫీ ఇవ్వూ. "
" ప్రియా! ఆకలేస్తోంది .ఏమైనా చేస్తున్నావా? "
" ప్రియా !మధ్యాహ్నం "టీ "టైం అయింది ..ఏమన్నా స్నాక్స్ చేస్తావా?"
" ప్రియా! కాఫీ కావాలి ప్రియా, గ్రీన్ టీ ఇద్ధూ , కాస్త చేంజ్ గా ఉంటుంది "
ఇలా వేపుకు తినడమే పని. ఆయన చేసే పని ఏంటో గాని,
ఆయన అడిగినవన్నీ అందీయలేక, నేను చస్తున్నాను మధ్యలో. నా అవసరానికి పిలుద్దాం అన్నా ,
ఎప్పుడు ఆయన కూర్చున్న గది తలుపు వేసే ఉంటుంది
తలుపు తీయరు.
ఒకరోజు అనుకోకుండా చేరవేసి ఉన్న తలుపును తీసి లోపలికి తొంగి చూసా .
అబ్బో ! కంప్యూటర్ , నడుస్తూనే ఉంది .
ఈయన గారు హాయిగా కుర్చీలో పడుకుని గుర్రు పెడుతూనేఉన్నారు .
"హమ్మయ్య" కాస్తంత ఊపిరి తీసుకోవచ్చు అనుకున్నా. .అంతే 20 నిమిషాల లోనే ఫోను "ప్రియా! పని చేసి చేసి ,తలనొప్పి వస్తోంది కాస్తా కాఫీ ఇద్ధూ ..అంటూ తనే వచ్చి చెప్పొచ్చుగా.. ఊహూ,
".రాజా గారు ఫోన్ "చేశారు...
-----------------------------
"ప్రకాష్ ఇలాగే ,అప్పుడప్పుడు ఊరికి వెళ్తుంటే ఎంత బాగుంటుందో .ఈసారి ట్రిప్పు పది రోజులు.
ఈ పది రోజులు తను ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఎన్నాళ్లైందో తన స్నేహితులందరినీ కలిసి .
ఎప్పుడూ , వాళ్ళందరూ" కిట్టి పార్టీలు "చేసుకుంటూ ఉంటే, తనను పిలిచినా వెళ్లలేని పరిస్థితికి ఎంత కోపం వస్తూ ఉండేదో. మరి వాళ్ళంతా అంత తీరుబాటుగా ఎలా ఉంటున్నారో?
వాళ్లంతా తనను కూడా ఎన్నిసార్లు పిలిచినా...కానీ ,
ఒక్కసారి కూడా తను వెళ్ళలేకపోయింది ,ఎందుకనో ?"
"ఎందుకని ఏమిటి ? కొంచెం కూడా సమయం లేని ఈ పనుల వల్లే కదా ! ఒక్కరోజు కూడా తనను బయటకు పట్టుకు వెళ్లలేదు తనూ వెళ్లడనుకోండి. "
కానీ ప్రతిరోజు "నీకేమైనా కూరలు కావాలా.".? అంటూ "వాకింగ్" పేరుతో వెళ్లి కూరలు తెచ్చి పడేస్తాడు .
అటుపై పిల్లల్ని స్కుాల్ కి దిగపెట్టి వస్తాడు.
అప్పుడప్పడు పిల్లలకేదైనా ఒంట్లో చికాకు చేస్తే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్తాడు.
తన కెప్పుడైనా ఒంట్లో బాగా నలతగా ఉంటే కాస్తంత
పని చేస్తాడా..ఆమాత్రం దానికే .
తనకేదో ఉపకారం చేస్తున్నట్టు ఫోజొకటి .
ఇక సాటర్డే "ఆఫ్ డే "అని ,సండే "ఫుల్ డే "సెలవు అని, ఎంచక్కా , తన స్నేహితులతో.ఎంజాయ్ చేస్తాడో...
మరి తనకు మాత్రం స్నేహితులు లేరా? అబ్బే! ఆ విషయం ఎప్పుడైనా పట్టించుకుంటే కదా..."
పోనీ ఎప్పుడైనా "పిల్లల్ని అయినా స్కూలుకి దింపి వస్తాను" అంటే అదీ వద్దంటాడు. "స్కూల్ చాలా దూరం ప్రియా! నువ్వు వెళ్లి వస్తే అలిసి పోతావు. ఆ తర్వాత ఏ పని చేయలేవు కూడా" అంటూ పిల్లల్ని కూడా తనే స్కూలుకి పట్టుకెళ్తుంటాడు రోజూ.
"సరేలే ! ఇన్నాళ్లకు దొరికిన ఈ అవకాశంలో , తను, తన సరదాలు కొన్నైనా తీర్చుకుంటుంది."
" ఈ పది రోజులు తన చాలా ఎంజాయ్ చేస్తుంది. అసలు ఇంట్లో వంట వండనే వండదు . తనకిష్టమైనవన్నీ, బయట నుంచే తెప్పించుకుంటుంది.
పాపం , ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ,తేజు .
ఒకడికి ఏడేళ్ళు . మరొకడికి ఐదేళ్ళుాను.
కానీ వాళ్ళకి ఎప్పుడూ ఏవి బయట నుంచి తెచ్చి పెట్టలేదు .వాళ్ళకి పానీపూరీలు అన్నా, పిజ్జాలన్నా ,ఐస్క్రీమ్ అన్నా ఎంత ఇష్టమో..! అవన్నీ వాళ్ళకి తినిపిస్తుంది."
రాత్రంతా ఇదే ఆలోచిస్తున్న. ప్రియంవదకు , సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు . తెల్లారిగానే ప్రకాష్ లేచి బట్టల సర్దుకుంటూ ఉంటే గబగబా వెళ్లి" టీ" పట్టుకొచ్చి ఇచ్చింది ".ఐదు నిమిషాల్లో టిఫిన్ చేస్తానండి." కొంచెం నిద్ర పట్టేసింది అంది.
ప్రకాష్ నవ్వుతూ, పర్వాలేదు ప్రియా , బయట ఎన్నో దొరుకుతాయి గా . ఏదో తినేస్తాలే అంటూ , సూట్ కేసు
పట్టుకుని బయలుదేరాడు.
"వీలున్నంత తొందరగా వచ్చేయండేం. ఆరోగ్యం జాగ్రత్త "అని ప్రేమ వలకబోస్తూ టాటా చెప్పింది.
-ప్రకాష్ 10 రోజులు వరకు రాడన్న సంతోషంతో, ప్రియంవదకు గాలిలో తేలుతున్నట్టుగా అనిపించింది.
"కాఫీ తాగేసేను కదా! "టిఫిన్" హాయిగా బయట నుండి తెప్పించుకుందాం లే . ఈరోజు సండే కదా .పిల్లలు లేచేసరికి ఎటుటూ 9 అవుతుంది."
అనుకుంటూ మళ్ళీ బెడ్ రూమ్ లోకి వెళ్లి ,హాయిగా కాళ్ళు జాజుకు పడుతుంది.
---------------------------
మమ్మీ ! ఈ రోజు ఇంకా లేవలేదేం . ఆకలేస్తోంది మమ్మీ !
లే...అంటుా, తనను, కుదుపుతున్న తీరుకు , పిల్లల అరుపులకు గాభరాగా కళ్ళు విప్పింది ప్రియంవద.
ఒక్క క్షణం , ఆమె కేమీ అర్ధం కాలేదు.
మెల్లగా తల తిప్పి గోడ గడియారం వైపు చుాసి
అదిరిపడింది.
సమయం ఉదయం పదకొండవుతోంది.
ఒక్క ఉదుటను మంచం దిగి, కిచన్ వైపు వెళుతుాన్న ప్రియకు , తెల్లవారి ఐదు గంటలకే ప్రకాష్ ఊరెళ్లిన సంగతి గుర్తుకు వచ్చి , ఆనందంతో గిర్రున వెనక్కి తిరిగింది.
అమ్మ ముఖంలో ఆనందం చుాసిన పిల్లలు ,
తల్లివైపు ఆశ్ఛర్యంగా చుాడసాగేరు.
ప్రియంవద గబగబా పిల్లల దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పింది .
అంతే వాళ్ళిద్దరుా కుాడా , అప్పటికప్పుడు
పది రోజులవరకు తిరగవలసిన జాగాలుా, తినలసిన ఐటమ్స్ అన్నీ ప్లాన్లు చేసేసుకున్నారు.
అందులో, బవాగంగా మొదటిదిగా , ఆరోజు "ఫేమిలీ పిజ్జా "ఆర్డర్ చేసేదారు. ప్రియంవద , పిల్లలతో పాటు చిన్నపిల్ల లాగే గంతులేసింది.
ఆ రొజుాయంత్రం , "కిటీ పార్టీకి" వెళామని ప్లాన్ చేసుకుంది.
పిల్లల్ని పొరుగునున్న రాధతో , ప్రకాష్ ఊరెళ్ళిన సంగతి చెప్పి , కుారలు తేవాలన్న మిషతో , వాళ్ళింట్లో వదిలి , బయట పడింది.
ముందుగా" కిటీ పార్టీ "జరుగు తున్నదెక్కడో ఫోన్ చేసి తెలుసుకునేసరికే , గుండె ఝల్లుమంది.
"అబ్బో। శోభా వాళ్ళింట్లోట. చాలా దుారం ."
అనుకుంటుానే మళ్ళీ అందరినీ కలిసే అవకాశం రాదని బయలుదేరింది . షేర్ ఆటో దొరకక , రెండుందల పై చిల్లర
సమర్పించుకుని శోభా వాళ్ళింట్లోకి అడుగు పెట్టింది
ప్రియంవద.
అక్కడి వాతావరణం చుాసి నివ్వెరపొియింది.
టేబుల్ నిండా రకరకాల తినుబండారాలు , కాఫీ కప్పులు
చెల్లా చెదురుగా ఉన్నాయి. ఓ పదిమంది కింద కుార్చొని
గోల గోలగా పేకాట ఆడుతున్నారు . మధ్యలో వంద రుాపాయల నోట్లు చాలా ఉన్నాయి.
అక్కడే రెండు బీరు బాటిల్స్ కుాడా ఉన్బాయి.
వాళ్ళు తన ని చుాడగానే గోలగా అరచి , తర్వాత బీర్ పోసిన గ్లాసు అందించి , పేకముక్కలు తన చేతికిచ్చి
కుార్చోపెట్టేసారు. ఇవన్నీ తన ప్రమేయం లేకుండానే
జరిగిపోయాయి.
ప్రేమగా ఒక మాట గాని, పలకరింత గానీ లేదు.
సరికదా ఓ ఐదువందలు మధ్యలో వేయించుకున్నారు.
తనకు పేకాట అంత బాగా రాదన్నా వినకుండా
తన ఆట కుాడా వాళ్లే ఆడేసి రెండువేలు దోచుకున్నారు.
దాంతో ప్రియంవదకు కిటీ పార్టీ మత్తు వదిలిపోయింది.
రెండు గంటల తర్వాత , ఏడవలేక నవ్వుతుా ,
వాళ్ళ బలవంతంమీద
"మళ్ళీ తప్పకుండా వస్తానని మాట ఇచ్చి" మరీ
బయటపడింది.
"అయ్యబాబోయ్..ఒక రోజులోనే రెండువేల ఐదువందలు పోయాయే...ఇక ప్రతీ వారం వెళితే ఇంకేమైనా ఉందా...
ఈ మందంతా తన ఇంటికు వస్తే తను ఖర్చులు భరించగలదా ...?
హమ్మొా ..; ఏదో సరదాగా ఉంటుందనుకుంది గానీ,
ఇంత దరిద్రంగా ఉంటే ఎలా...?
, తనకస్సలు నచ్చలేదు.
"మరి చచ్చినా ఇటువంటి పార్టీలకు రాను "
అనుకుంటుా "దేవుడా" అని ఇల్లు చేరింది.--
ఆ రాత్రి అనవసరంగా అంత డబ్బు పోయినందుకు ప్రియ సమంగా నిద్రపోలేకపోయింది.
----------------
రెండు రోజులు అంతా బాగానే గడిచాయి . .
అదిగో అప్పటి నుండే ప్రియకి , మరిన్ని కష్టాలు మొదలయ్యేయి.
పెద్దాడికి ఏ తిండి అరగలేదో , పొట్ట మాత్రం బానలా
పొంగిపోయింది. చిన్న వాడికి కడుపులో నొప్పి వస్తున్నాది
తనకు రోజుకు ఐదారు సార్లన్నా బాత్రుామ్కి వెళ్ళవలసి
వస్తున్నాది.
అక్కడికీ పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళీ , అందరుా
చుాపించుకున్నారు. ఆయన మీ అందరికీ ఫుడ్ పాయిజన్ అయి, అజీర్తి పట్టుకుంది.. బయటి వస్తువులేవీ తినకండి.కొన్నాళ్ల పాటు ఈ తిండి వస్తువులు , కుారలు కుాడా తినకండి .
ఈ మందులు వాడి , తగ్గకపోతే మళ్ళీ రండి " అంటుా
తట్టెడు మందులు రాసేడు
అతడు రాసిన మందులు తెచ్చి వేసుకుంటున్నా
దేని దారి దానిదే అయిపోయింది. మరో రెండు రోజులు గడిచేయి గానీ , ఎవరికీ రోగం తగ్గుముఖం పట్టలేదు .
ఆ రోజు పిల్ల ల పరిస్థితి చుాసి , స్కుాల్ కి , ఒక నాలుగు రోజులకై "లీవ్ లెటర్" ఇద్దామని బయలుదేరింది.
పగటి పుాట అందరికీ ఆఫీస్ టైమ్ లయ కావడంతో ,
ఆటో రిక్షాలు దొకనేలేదు . దిరికిన ఆటో" ట్రాఫిక్ జామ్ "వల్ల అగి ఆగి వెళ్ళడంతో , పొద్దున్న ఏడింటికి వెళ్ళిన తను పది గంటలదాకా ఇంటికి రాలేకపోయింది.
దాంతో పనులన్నీ ఆలశ్యమైపోయాయి.
గబ గబా చేసేసరికి ప్రియంవదకు నడుము పట్టేసింది.
---------------------------
ఎంత ప్రయత్నించినా పిల్లలకు ఏమీ సాయించక ఏమీ తినడంలేదు. .
పిల్లలు ఏమీ తినలేక బాధ పడుతుా ఉంటే ప్రియంవద
చుాడలేకపోతున్నాది.
ఆకారణంగా డాక్టర్ రాసిన కుారలు , వెతికి వెతికి
తేవలసి వస్తొింది. మార్కెట్ ఇంటికి చాలా దుారంలో ఉంది. రోడ్డుమీద నిలబడి చుాస్తే ' ఎన్ని ఆటోలో తన కళ్ళముందునుంచే వెళిపోతాయి . గంటలు గడిచి పోతాయి గానీ ఒక్కటి కుాడా ఆపినా ఆగదు .ఎలాగో దొరికిన ఆటో ఎక్కి వెళితే అదెంత దుారమొా అదెంత రేటో...
.గానీ రావడం కుాడా అంతే లేటవుతోంది. ఆటోకోసం నిల్చొని నిల్చొని, కాళ్ళు విపరీతంగా పీకుతాయి .దాంతో ఇంటి పని చేయలేకపోతున్నాది
మార్కెటింగ్ చేయడం ఎంత కష్టమొా
మొదటిసారి తెలుసుకున్న "ప్రియ" కు భర్త లేని లోటు
మొదటిసారి తెలిసి వచ్చింది .
ఈ నాలుగు రోజులుా పిల్లలు స్కుాలుకు వెళ్ళే లేదు.
పిల్ల లు ఇంట్లోనే ఉండడంతో, ప్రియకి పని పెరిగిపోయింది.
దానికి తోడు ఇద్దరుా ,రోగ బాధ భరించలేక తనచుట్టుా
తిరుగుతుా ఉండడంతో , ప్రియకు తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీకుండా పోయింది.
ఇంట్లో అయనుంటే, పిల్లలకి ఎప్పుడైనా ఇలా చికాకు చేసినా, తనకు ఎప్పుడైనా చికాకు చేసినా, ఎంచక్కా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, తీసుకురావడం, టైమ్ కు మందులు కూడా ఇస్తూ ఉండేవారు ఇప్పుడు అన్నింటినీ తానే చూసుకోవాల్సి వస్తోంది దీంతో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాది ప్రియంవదకి .
ఈరోజు ప్రియంవదకి చాలా ఎక్కువ పని ఉంది .
ఎవరికి ఒళ్లలో బాగులేని కారణంగా నాలుగు రోజులు బట్టి ,
ఎవరి బట్టలు ఉతకడం అవలేదు. అందుకే ఆరోజు పొద్దున లేచి అందరి బట్టలు , వాషింగ్ మెషిన్ లో ఉతకడానికి వేసింది మరో రెండు ట్రిప్పులు వేస్తే గాని బట్టలన్నీ ఉతకడానికి అవ్వదు .
ఈరోజు ఎలాగైనా ఈ పని పూర్తి చెయ్యాలి అనుకుంటూ ,వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళిపోయింది.
"రేపటి నుంచి పిల్లల్ని ఎలాగైనా సరే స్కూల్ కి పంపించాలి నాలుగు రోజులు అయింది వాళ్ళు స్కూల్ కి వెళ్ళలేదు.
ఆబ్సెంట్లు ఎక్కువ అయిపోతే మళ్ళీ పిల్లలకి ,నోట్స్ దొరకడం కష్టమై ,పరీక్షలు రాయడంలో ఇబ్బంది అవుతుంది ."
ఆలోచిస్తునే , వంటకానిచ్ఛేసింది .
"పిల్లల స్కూల్ డ్రెస్సులు ఉతకాలి "అనుకున్నంతలోనే కిట్టీ పార్టీ ఫ్రెండ్స్ అందరూ వబిలబిలమని లోపలికి వచ్చేసారు.
ప్రియంవద , వాళ్ళని చూడగానే" ఓరి దేవుడో " అనుకుంటూనే మనసులో చిరాకుగా ఉన్నా, పైకి నవ్వు పులుముకొని వారిని లోపలికి ఆహ్వానించింది.
ఆ వచ్చిన వాళ్ళు సాయంత్రం ఆరు దాటాకా గానీ
కదల లేదు. వారికి కావలసినవన్నీ అందించి వారిని సాగనంపేసరికి ప్రియందకు తల ప్రాణం తోకకి వచ్చేసింది.
మొారీలో పడున్న బండెడు అంట్లు తోముకొని,
ఇల్లు సవరించేసరికి రాత్రి ఎనిమిది దాటింది.
బాగా అలసిపోయిన ప్రియంవద , స్నేహితులకోసం చేయగా మిగిలిన వంటకాలతో రాత్రి ఎంగిలిపడి , పిల్ల ల్ని సముదాయించి పడుక్కొనేసరికి రాత్రి పది దాటింది.
--------------------------
తెల్లారి ఆరు గంటలకు కొట్టే అలారాన్ని విసుగ్గా ఆపి , బద్ధకంగా లేచి , పిల్లలని స్కుాల్ కు పంపేందుకు వాళ్ళని లేపి బాత్రుామ్ లోకి తోసింది.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాత్రి , పిల్ల ల స్కుాల్ యుానిఫారాలు ఉతికి ఆరెయ్యలేదని.
అదిగో , అప్పుడొచ్చింది ప్రియంవదకు ఎడుపుతోపాటు ప్రకాష్ జ్ఞాపకం.
నిజంగా ప్రకాష్ లేకపొివడం వల్ల ఎంత పని పెరిగిపోయింది.
శనివారం వచ్చేసరికల్లా పిల్ల ల యుానిఫాం ," వాషింగ్ మిషన్లో" వేసి ఎండవేసి , ఆదివారం చక్కగా ఇస్త్రీ చేసి హేంగర్లకి తగిలించేవాడు కదుా..
అప్పుడేమనేది తను " చాల్లెండి మిషన్ లో పడేసే దానికి , అంత ఫొిజ్ ఎందుకో... ఆ పని చిన్న పిల్లలు
కుాడా చేసేస్తారు " అంటుా..తీసి పారేసేది కదుా..
ఇప్పుడు తెలిసొస్తున్బాది . ప్రకాష్ తనకు చేస్తున్న
సాయం వల్ల , తన కెంత " రెష్ట్ " దొరుకుతున్నాదో..."
కళ్ళలో నీళ్ళు తిరుగుతుా ఉంటే, మనస్ఫుార్తిగా
అనుకున్నాది ప్రియంవద ..
"నువ్వు ఊరెళితే ఎంతో హాయిగా ఉంటుందో ""అనుకున్నాను ప్రకాష్ .
కానీ నువ్వు లేని లోటేంటో, నాకిప్పుడు తెలిసి వచ్చింది.
బయటి ఫుడ్ తినడం వల్ల వచ్చే ఇబ్బంది తెలిసింది.
"కిట్టీ పార్టీల" వల్ల , "ఒళ్ళు , ఇల్లు కుాడా గుల్లే " అని
తెలుసుకున్నాను .
" సారీ। ప్రకాష్ ..మరెప్పుడుా నిన్ను , నీ పనినీ హేళన చెయ్యను .
"ప్లీజ్ । తిందరగా వచ్చేయ్ "
"సుఖాంతం ".
---------------------------