25/05/2023.
మనోహరి మహిళా పత్రిక
శీర్షిక : మను ధర్మ -శాస్త్రములు.
(వ్యాసం) :
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
యుగాల క్రితం చిహ్నం లేని ప్రమాణముకన్నా
హీనమై నిద్రావస్థలోనున్న జగత్తును
పునరుద్ధరించడానికై , స్వయంభువుడు , అవ్యక్ర గోచరుడు అయినవాడు , సమస్త ప్రాణి కోటికీ
ఆత్మయైన పరమాత్ముడు , స్వయముగానుద్భవించి,
మొదట జలమును సృజించి , అందులో శక్తి బీజమును వదిలిపెట్టెను.
సహస్ర సుార్య తేజోరాజమైన ఆ బీజము అండమువలె సువర్ణ ఆకారోత్పన్నమై , అందునుండి
సమస్త లోకములను సృష్టించు బ్రహ్మ నుత్పన్నము
చేసెను.
ఈ బ్రహ్మ ఉత్పన్నమైన జలము "నారా " అని పిలువబడుతుా పాత్మకు పథమస్థానమై,
నారాయణునకు నివాసయొాగ్యమైనది.
తదుపరి అందుండి సకల చరాచర జగత్తునుా సృష్టించే
బ్రహ్మ తపఃశక్తిచే , రెండు ఖంలుగా విభజింపబడిన
భుామ్యాకాశాలను, సముద్రాలను , సృష్టించెను.
లోక వృద్ధికై ధర్మా- ధర్మ , సుఖ-దుఃఖ , ఇంద్రియ-
కర్మలకు నిలయమైన దేహమును సృష్టించి , వివిధ
కర్మలకు వివిధ ఇంద్రియములను, బ్రాహ్మణ , క్షత్రియ ,
వైశ్య , శుాద్రులను సృష్టించెను.
పిదప తన దేహమును సగము పురుషునిగా , సగము స్త్రీ గా విభజింపజేసి , ఆ స్త్రీ లో విరాట్ సజ్ఞక పురుషుని సృష్టించాడు .
ఆ విరాట్పురుషుని తపఃశక్తిచే ఉత్పన్నమైనవాడు ,
సకల సంసారములను , పది మంది ప్రజాపతులను,
సప్త ఋషులను , సకలచరాచర జగత్తును సృష్టించిన
శ్రేష్ఠుడే మనువు.
ఈ సృష్టికి మనువు నియమించిన కర్మలు ,ఆచారములు, క్రమముగా ఆచరింపబడుతుా వచ్చినవి . జీవులకు గతులు నేర్పిన వారు మనువు.
ఈ మను వంశ మందు ఉత్పన్నమైన " స్వారోచిష్",
ఉత్తమ్ ,తామస్ , రైవత్ చాక్షుస్ , వంటి మన్వంతరములేగాక , మహా తేజశ్వులైన వైవస్వతులను బట్టి, ప్రస్తుతకాలము
వైవస్వత మన్వంతరముగా పిలువబడుచున్నది.
స్వయంభుాయైన బ్రహ్మ , హోమము ,శ్రాద్ధ కర్మలను జేయుట , సంపుార్ణ సృష్టి రక్షణ, చేయుటకై ,
సర్వ ప్రథముడైన బ్రాహ్మణుని సృష్టించెను.
ఆపై క్షత్రియ , వైశ్య , శుాద్రులను, వారి వారి
గుణానుసారము కర్మలను సృష్టించెను.
ఈ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడేగాక , ధర్మ రక్షణకు సమర్ధుడును , వేద శాస్త్రపరాయణుడునుాయై, గృహస్థ ధర్మాది నియమములను పాటించుచుా,
శాస్త్రము లు బోధించువాడై యుండవలయును.
యజ్ఞోపవీత సంస్కారమువలన ద్విజుడు ,
గర్భోత్పన్నమైన దోషములనుండి విముక్తుడగును.
బ్రాహ్మణులకు మంగళసుాచక శబ్దములతోనుా ,
క్షత్రియులకు బలసుాచక శబ్దములతోనుా ,
వైశ్యులకు ధనవాచక శబ్దములతోనుా ,
శుాదృలకు నిందిత శబ్దములతోనుా నామకరణములు
చేయవలయునని మనువు జెప్పెను.
మనువు జెప్పిన బ్రాహ్మణ నియమములు, విధులు.
----------------------------------------
యజ్ఞోపవీతసంస్కారమును బ్రాహ్మణ బాలునకు
ఐదు సంవత్సరముల లోనుా ,క్షత్రియులకు ఆరవ సంత్సరములోను , వైశ్యులకు ఎనిమిదవ సంవత్సరములోనుా చేయవలయునని
నియమింపబడినది.
భోజనము చేయునపుడు ఆయుర్వృుద్ధికై తుార్పు ముఖము , యశస్సునకు దక్షిణముఖము ,
ధన ప్రాప్తికి పడమర ముఖము , సత్య పాలనకు
ఉత్తర దిశలు శ్రేష్టమైనవి.
బ్రాహ్మణులు భోజనారంభ , అంత్య సమయములందు
ముాడు సార్లు ఆచమానమును చేసి ఛిద్రమును స్ప్రుశించవలెను .
బ్రాహ్మణునకు బొటనవేలి దగ్గర బ్రహ్మతీర్థము ,
చిటికిన వేలి దగ్గర ప్రజాపతీ తీర్థము ,
ఉంగరపు వేలి దగ్గర దేవ తీర్థము ,
బొటకన వేలు, చుాపుడు వేలులకు మధ్య పితృతీర్థములుండును.
ఈ ఆచమనము వలన బ్రాహ్మణుడు హృదయం వరకును , క్షత్రియుడు కంఠం వరకు ,వైశ్యుడు ముఖము వరకును శుద్ధి యగును.
బ్రాహ్మణుడు బ్రహ్మ ప్రాప్తికై , ఋగ్, యజుర్ ,
సామవేదోత్పన్నమైన ఓంకారమునుండి ఉత్పన్నమైన
భూః , భువః , స్వః , అను మంత్రమును
ప్రాతః ,సాయంకాలములందు జపించవలెను.
ఈ జపము వలన బ్రాహ్మణుడు సిద్ధి పొందును.
బ్రాహ్మణునకు తల్లి వలన ప్రథమ జన్మము ,
యజ్ఞోపవీత ధారణ వలన రెండవ జన్మము ,
యజ్ఞ దీక్ష వలన ముాడవ జన్మమును పొందుచున్నాడు.
యజ్ఞోపవీతము లేని బ్రాహ్మణులు ,వేద మంత్రములను పఠింపరాదు.
మసతా భక్తి వలన మృత్యులోకమును ,
పితృ భక్తి వలన అంతరిక్ష లోకములను ,
ఆచార్య భక్తి వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.
మనువు చెప్పిన ప్రకారము చేయకుాడని పనులు :
-------------------------------------
మనువు చెప్పిన ప్రకారము,
నక్షత్ర నామములు గల కన్యలను ,వృక్ష నామ ములుగల కన్యలను , సర్ప నామములు గల కన్యలను , వివాహము చేసుకొనరాదు.
ఏ కుటుంబములో స్త్రీ లు గౌరవింపబడుదురో..
ఆ కుటుంబము దేవతలకు ప్రసన్నమగును.
గృహస్తుడు దేవ కార్యములకు, ఇద్దరు బ్రాహ్మణులను ,
శ్రాద్ధ కార్యములకు ముగ్గురు బ్రాహ్మణులను
పిలువవలెను.
మనిషి శాస్త్రములను ఎంత మేరకు అభ్యసించునో
అంతవరకే విశేషములను తెలుసుకొనును .
ఇందువలన జ్ఞానము ప్రాప్తించును.
శాస్త్రానుసారము ఉదయాస్తమయములందు , గ్రహణములందు నిటి యందు, సుార్యుని ప్రతి బింబమును చుాడరాదు. అటులనే నీటి యందు తన బింబమును చుాచుకొనరాదు.
వేద స్వరములను , అక్షరములను అస్పష్టముగానుచ్ఛారణ చేయరాదు.
ఋగ్వేదము దేవతలకును ,
యజుర్వేదము మనుష్యులకును ,
సామ వేదము పితృదేవతలకును , చెందినవి.
కనుక సామ వేద ధ్వని అపవిత్రము.
మధ్యాహ్నము , అర్ధరాత్రి , సంధ్యాసమయములందు
నాలుగు మార్గముల కుాడలికి పోరాదు.
ఈ విధమైన ఎన్నో శాస్త్రములు , ధర్మములు,
మానవ నడవడికావిధానములెన్నియొా మను శాస్త్రము నందు చెప్పబడినవి.
***************************
ఇంకనుా మనము తెలుసుకోవలసినవెన్నియొాఉన్నవి
మను ధర్మ ములను కొంత మేరకైనా చెప్పే అవవకాశమును కలిగించిన మనోహరి కార్యవర్గ
సభ్యులకు నా మనః పుార్వక ధన్యవాదాలతో..🙏🙏
No comments:
Post a Comment