Friday, November 13, 2020
యతి మైత్రి అక్షరాలు.
నరకాసురు వధ : దీపావళి కధ.
పెన్నా రచయితల సంఘం వారి దీపావళి
మరియు బాలల దినోత్సవ సందర్భంగా రాసిన కవిత.
రచన, శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అంశం..బాలల దీపావళి.
శీర్షిక .
నరకాసురుని వధ.
----------------------
బాలలుా తెలియుమా దీపావళి మహిమ
బహు చక్కనైనది భక్తి నిండెడిది॥
విష్ణు అవతరించెను వరహావతారుడై
భుాలక్ష్మి నేలిన భగవంతుడీతను॥
వారి పుత్రుడు ఇతడు పేరు నరకాసురుడు
అసుర గుణములతోడ జనియించినాడితడు.॥
తెలిసి వగచీ తల్లి భూాదేవి చింతింప
ఆమె చేతిని అతని మృత్యువని ఎరిగించె॥
గురు "జనకు" శిష్యుడై గుణ సంపదల నెరుగు
కడు భక్తి నిండిన కామాఖ్య భక్తుడు.॥
దేవీ ఉపాసనల దేహ బలమును పొంది
దేవతల హింసించి దేవలోకములేలె ॥
దేవతలు మొరలిడగ భామా సమేతుడై
శ్రీకృష్ణుడభయమిడి సమరసంసిద్ధుడయె॥
తల్లి భుామియె సత్య భామావతారిణి
లోక కంటకు దునిమి లోకాలు కాపాడె॥
నరకాసురుని వధకు నరులు పండగ జేసి
దీపాల నలరించి దేవతల పుాజించె ॥
బాణసంచారాల బాలలా సందడుల
ఆనంద దీపావళై అలరె భువిలోన ॥
Wednesday, November 4, 2020
మానవత్వం
చిత్ర కవిత.
గోరసం చిత్ర కవిత కొరకు మాత్రమే రాసినది
శీర్షిక .
చిత్రం...భళారే విచిత్రం.
(వచన కవిత).
--------------------------------
చిత్రాల జగతిలో మనిషొి మహా మేధావి.
జరుగు తున్న చిత్రాలకు ఆసక్తి కరమైన
విషయాలను జోడించి వివిధ చిత్ర పరికరాలలో
చిత్రవిచిత్రాలను వివిధ మాధ్యమాల ద్వార
ప్రచారం చేసేడు. దాంతో మనిషిలో విద్యలతో
మేల్కొన్న మేధావి వివేకాన్ని మరిచేడు .
విలువలని విరిచేడు.బంధాలు బరువయ్యేయి
బాంధవ్యాలు కరువయ్యేయి పుార్తి లోకం చిత్ర
పరికరాలకు బానిసైపోయింది.ఈ నాడు
దుార వాణి , చరవాణిల వింత లోకంలో చరిస్తున్న
మానవుడు మానవత్వాన్ని మరచిన మరోమృగం.
కాలుష్యాన్ని పెంచుతుా కామాంధుడై చరిస్తుా
వికృత చర్యల వికటాట్టహాసాలతో కన్నీళ్ళను
పంచుతుా తనను తానుగా దిగజారిపోతున్న
దిశ నిర్దేశం లేని దశ హీనుడు.చుట్టుా ఎంతమంది
ఉన్నా ఎవరుాలేని-ఎవరికీ కాని ఏహ్యభావాల ఏకైక
ఏకాకి.
---------------------------------------
రచన:శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.