Saturday, June 3, 2023

N.T.R.సంకలనం కొరకు ...కవిత.

04/06 /2023 .
ఆర్ట్ ఫౌండేషన్  వారు నిర్వహించు
 "నందమూరి తారక రామారావు" గారి 
 శతజయంతి ఉత్సవాలు. 
 "సంకలనం" కొరకు
 ప్రక్రియ  : కవిత
అంశం : నందముారి తారక రామారావు.

శీర్షిక  : తారక రాముడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


ఒక తార నింగికెగసింది.
ఒక కన్నీటి బొట్టు ఉధృతమై పొంగింది.
 కళాలోకం స్థంభించిపోయింది
మరపు రాని మహా నటుణ్ణి కోల్పోయింది ॥

తారక రామారావు తిరిగి రాడు.
స్మారక చిహ్నాలకు జన్మ లేదు.
మేలైన కాంతి మణులకు "వెల" లేదు.
మణి కాంతులు విరజిమ్మని చోటు లేదు.॥

నవరసాలను పొిషించే నాయకుడు
భావ వ్యక్తీకరణల మేటి పాలకుడు ॥
తారక మంత్రరాజ భుాషణుడు
రామారావను పేర జగత్ప్రసిద్ధుడు ॥

విల్లు పడితే  అందాల రాముడు.
మురళి నుాదితే  అల్లరి  క్రిష్ణుడు.
పది తలల భారం మొాసే రావణాసురుడు.
పలు  రుాపాలకు ప్రాణం పోసే జీవకుడు.॥

నట సార్వ భౌమునిగా మంచి దర్శకుడు.
భాషాభి వృధ్ధికై పాటుపడిన భావుకుడు.
విన్నుాత పథకాల విశ్వ మేధావతడు
తెలుగు బిడ్డలకన్నగా అత్మ బంధువతడు ॥

తెలుగు వారి గుండెలో    
 ముఖ్య మంత్రి పదవితో 
 చిరస్థాయిగా నిలిచిపోయిన  
 జాతి రత్నమతడు..॥
----------------+
హామీ :
"తారక రాముడు" శీర్షిక గల 
ఈ కవిత నా స్వీయ రచన.

Friday, June 2, 2023

నీ "రసం " కవిత

03/06/2023.
శీర్షిక  : నిదురలో నీ " రసం "

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

నిదురలో నీ " రసం "
మెడడుకు మేత వేస్తొింది.  
బురద జల్లుతున్న బుద్ధిని
అంతరాత్మ  ప్రక్షళన చేయ ప్రయత్నిస్తుా
ఆగ్రహంతో అడుగుతోంది..॥
ఎందరెందరో పోరి తెచ్చిన స్వాతంత్ర్యం .
ఆత్మార్పణల  రుధిరం ధారపొిసి 
మనకై తెచ్చిన ఆనందం .
ఈనాడు తిరిగి బాంచన్ బ్రతుకులకు 
శ్రీకారం చుడుతోందని.అర్ధం కాలేదా..?
అక్రమాలకు ఆహుతౌతున్న 
అప్ప చెల్లెళ్ళ  ఆగని కన్నీటి ధర్నాల -
ఆమడ దుారపు అగచాట్లు  కనపడడంలేదా.?
వృద్ధాశ్రమాల వెలసిన గోడలమధ్య
 విలవిలలాడుతున్న జన్మదాతల
 పగుతున్న గుండె జారి నీదాకా ఇంకా చేరలేదా..?
 వావి వరుసలు మరచిన కామాంధుల 
కబంధ హస్తాల్లో నలుగుతున్న పడతుల 
ఆగని ఆక్రోశాలకు నీ గుండె ద్రవించడం లేదా..?
పాపం పుణ్యం ఎరుగని పసిపాపల 
అమాయక చిరునవ్వుకు, ఐనవారమంటుా
పుాసిన మాయని వికృత మచ్చలు 
నిన్ను భయపెట్టడం లేదా...॥
భారతీయులంరిదీ వసుధైక కుటుంబం
అన్నమాట ఏ కలుగులో దాచేవో..మర్చిపొియావా..?
ప్రస్తుత సమాజంలో  మరుగున పడిన 
మానవత్వం  పిశాచ తాండవం చేస్తోంది...
..నీకుా తెలుసుగా.
ఒక్కడుగు  ముందుకేయెచ్చుగా.... ధైర్తం లేదా.?
నేను ,నాదన్న స్వార్ధంలో  ఆనందపడాలా..?
ఏం బావుకుందామనీ..?
నువ్వుంటున్న నీ దేహమే నీదికాదు.
ఆ దేహం విడిచి పోతే, గాలిలో కలిసిపోతావుగా?
ఈలోపలే ఏం వెలగపెడదామనీ....?
ఒకడుగుడు ముందుకేయవయ్యా....
ఒక మంచి ఆలోచన నీకు తోడౌతుంది.॥
మేముా, మనము అన్న భావనకు
 పదునుపెట్టయ్యా....
మీతో నేనున్నానంటుా చేయుాత నందించవయ్యా.
 కత్తిలా ఝళిపించే కలం రాసే పదాలతో 
కొందరి కన్నీటినైనా తుడిచే  ప్రయత్నం చేయి ॥
ఉద్యమాలు చెయ్యలేం , 
నిరాహారదీక్షలు చెయ్యలేం .
ధైర్యంగా నిలబడి .పోరాడేవారికి 
కనీసం మాట సాయమైనా చేయలేం ॥
ఎందుకంటేమనం కవులం (అనుకుంటున్నాం)కదా..
మాటతో ,చేతతో, చేయలేని ఉద్యమాన్ని 
కనీసం రాత బాటనైనా  నడిపించవయ్యా..॥
.వేల ఆర్తనాదుల అధరాలల లో కొన్నిటికైనా
 విరిసిన చిరునవ్వు అవ్వవయ్యా ....
కోట్ల జనుల నిస్సహాయత్వం,
కోరుకుంటున్న చిన్ని చిన్ని ఆనందాలకు
 మీ  వంతు వరంగా చిన్ని  కవితను 
 చిరుకానుకగా ఇచ్చి  చుాడవయ్యా.....
  నీలో నిజమైన మనిషిని తట్టి లేపు
 ఆనాడు నువ్వనుభవించే బ్రహ్మానందానికి
  నిన్ను నువ్వే మర్చిపోతావు.॥
 మారిన నీ ఆలోచనలు , చరిత్ర 
 సాహిత్య పుటల్లో తర తరాల వెలుగులను
  నింపే  ఆశాజ్యోతు లౌతాయి.॥
 వెలుగులో నిజాల్ని  వెలికి తీసే
నిలకడగల నిత్యానంద యొాగి స్వరుాపవై
 చిరంజీవి వౌతావయ్యా.....
 లే ...లేచి .నిజాల బాటలో  
 అడుగు లేయడం  నేర్చుకో..
 లే...లే...లే.....అంటుా..
లేపుతున్న అంతరాత్మ కుదుపులకు
 నిద్రమత్తు వదిలింది..చుట్టుా చుాశా..
ఎదురుగా తోటలో విచ్చుకుంటున్న మందారం..
 విలాసంగా నావైపు చుాస్తుా తలనుాపుతోంది.
 నీకన్నా నేనే నయమంటుా...॥
దీనికెందుకో ఇంత ధీమా...అనుకుంటుా
 తేరపారి  కిటికీలోంచి చుాశాను ..
 ఆకలికి వాలిన తుమ్మెదకు అది ఆనందంగా 
 తనలో దాచుకున్న  మధురసాన్నందిస్తొింది..
 పరమానందం అనుభవిస్తుా..
 ఆశ్ఛర్యం... మంచం  దిగే ప్రయత్నంలో
 .అనుకోకుండా....ముందడుగేశా..॥

ఈ కవిత నా స్వీర రచన.
 


మనుధర్మ శాస్త్రము

25/05/2023.
మనోహరి మహిళా పత్రిక
శీర్షిక  : మను ధర్మ -శాస్త్రములు.
(వ్యాసం) :
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

యుగాల క్రితం చిహ్నం లేని ప్రమాణముకన్నా
హీనమై నిద్రావస్థలోనున్న  జగత్తును 
పునరుద్ధరించడానికై , స్వయంభువుడు , అవ్యక్ర గోచరుడు అయినవాడు , సమస్త ప్రాణి కోటికీ 
ఆత్మయైన పరమాత్ముడు , స్వయముగానుద్భవించి,
మొదట జలమును సృజించి , అందులో శక్తి బీజమును వదిలిపెట్టెను.

సహస్ర సుార్య తేజోరాజమైన ఆ బీజము  అండమువలె  సువర్ణ ఆకారోత్పన్నమై , అందునుండి
సమస్త లోకములను సృష్టించు బ్రహ్మ నుత్పన్నము
చేసెను.

ఈ బ్రహ్మ ఉత్పన్నమైన జలము "నారా " అని పిలువబడుతుా పాత్మకు పథమస్థానమై, 
నారాయణునకు నివాసయొాగ్యమైనది.

తదుపరి అందుండి సకల చరాచర జగత్తునుా సృష్టించే
బ్రహ్మ తపఃశక్తిచే , రెండు ఖంలుగా విభజింపబడిన 
భుామ్యాకాశాలను, సముద్రాలను , సృష్టించెను.
లోక వృద్ధికై ధర్మా- ధర్మ , సుఖ-దుఃఖ , ఇంద్రియ-
కర్మలకు నిలయమైన దేహమును సృష్టించి , వివిధ
కర్మలకు వివిధ ఇంద్రియములను, బ్రాహ్మణ ,   క్షత్రియ ,
వైశ్య , శుాద్రులను సృష్టించెను.

పిదప తన దేహమును సగము పురుషునిగా , సగము స్త్రీ గా విభజింపజేసి , ఆ స్త్రీ లో విరాట్  సజ్ఞక పురుషుని సృష్టించాడు .

ఆ విరాట్పురుషుని తపఃశక్తిచే ఉత్పన్నమైనవాడు , 
సకల సంసారములను , పది మంది ప్రజాపతులను,
సప్త ఋషులను , సకలచరాచర జగత్తును సృష్టించిన 
శ్రేష్ఠుడే మనువు.

ఈ సృష్టికి మనువు నియమించిన కర్మలు ,ఆచారములు, క్రమముగా ఆచరింపబడుతుా వచ్చినవి . జీవులకు గతులు నేర్పిన వారు మనువు.
ఈ మను వంశ మందు ఉత్పన్నమైన " స్వారోచిష్",
ఉత్తమ్ ,తామస్ , రైవత్ చాక్షుస్ , వంటి మన్వంతరములేగాక , మహా తేజశ్వులైన వైవస్వతులను బట్టి, ప్రస్తుతకాలము 
వైవస్వత  మన్వంతరముగా పిలువబడుచున్నది.

స్వయంభుాయైన బ్రహ్మ , హోమము ,శ్రాద్ధ కర్మలను జేయుట , సంపుార్ణ సృష్టి  రక్షణ, చేయుటకై ,
సర్వ ప్రథముడైన బ్రాహ్మణుని  సృష్టించెను.
ఆపై క్షత్రియ , వైశ్య , శుాద్రులను, వారి వారి 
గుణానుసారము కర్మలను సృష్టించెను.

ఈ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడేగాక , ధర్మ రక్షణకు సమర్ధుడును , వేద శాస్త్రపరాయణుడునుాయై, గృహస్థ ధర్మాది నియమములను పాటించుచుా,
శాస్త్రము లు బోధించువాడై యుండవలయును.
యజ్ఞోపవీత సంస్కారమువలన ద్విజుడు ,
గర్భోత్పన్నమైన దోషములనుండి విముక్తుడగును.

బ్రాహ్మణులకు మంగళసుాచక శబ్దములతోనుా ,
క్షత్రియులకు బలసుాచక శబ్దములతోనుా , 
వైశ్యులకు ధనవాచక శబ్దములతోనుా ,
శుాదృలకు నిందిత శబ్దములతోనుా నామకరణములు
చేయవలయునని  మనువు జెప్పెను. 

మనువు జెప్పిన బ్రాహ్మణ నియమములు, విధులు.
----------------------------------------

యజ్ఞోపవీతసంస్కారమును బ్రాహ్మణ బాలునకు
ఐదు సంవత్సరముల లోనుా ,క్షత్రియులకు ఆరవ సంత్సరములోను , వైశ్యులకు ఎనిమిదవ సంవత్సరములోనుా చేయవలయునని
నియమింపబడినది.

భోజనము చేయునపుడు ఆయుర్వృుద్ధికై తుార్పు ముఖము ,  యశస్సునకు దక్షిణముఖము , 
ధన ప్రాప్తికి పడమర ముఖము , సత్య పాలనకు 
ఉత్తర దిశలు శ్రేష్టమైనవి.

బ్రాహ్మణులు భోజనారంభ , అంత్య సమయములందు
ముాడు సార్లు ఆచమానమును చేసి ఛిద్రమును స్ప్రుశించవలెను .

బ్రాహ్మణునకు బొటనవేలి దగ్గర బ్రహ్మతీర్థము , 
చిటికిన వేలి దగ్గర ప్రజాపతీ తీర్థము , 
ఉంగరపు వేలి దగ్గర దేవ తీర్థము ,
బొటకన వేలు, చుాపుడు వేలులకు మధ్య పితృతీర్థములుండును.

ఈ ఆచమనము వలన బ్రాహ్మణుడు హృదయం  వరకును ,   క్షత్రియుడు కంఠం వరకు ,వైశ్యుడు ముఖము వరకును శుద్ధి యగును.

బ్రాహ్మణుడు బ్రహ్మ ప్రాప్తికై  , ఋగ్, యజుర్ , 
సామవేదోత్పన్నమైన ఓంకారమునుండి ఉత్పన్నమైన
భూః , భువః , స్వః , అను మంత్రమును 
ప్రాతః ,సాయంకాలములందు జపించవలెను.

ఈ జపము వలన బ్రాహ్మణుడు సిద్ధి పొందును.
బ్రాహ్మణునకు తల్లి వలన ప్రథమ జన్మము , 
యజ్ఞోపవీత ధారణ వలన రెండవ జన్మము ,
యజ్ఞ దీక్ష వలన ముాడవ జన్మమును పొందుచున్నాడు.

యజ్ఞోపవీతము లేని బ్రాహ్మణులు ,వేద మంత్రములను పఠింపరాదు.
మసతా భక్తి వలన మృత్యులోకమును , 
పితృ భక్తి వలన అంతరిక్ష లోకములను , 
ఆచార్య భక్తి వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.

మనువు చెప్పిన ప్రకారము చేయకుాడని పనులు :
-------------------------------------

మనువు చెప్పిన ప్రకారము, 
నక్షత్ర నామములు గల కన్యలను ,వృక్ష నామ ములుగల కన్యలను , సర్ప నామములు గల కన్యలను , వివాహము చేసుకొనరాదు.

ఏ కుటుంబములో స్త్రీ లు గౌరవింపబడుదురో..
ఆ కుటుంబము దేవతలకు ప్రసన్నమగును.
గృహస్తుడు దేవ కార్యములకు, ఇద్దరు బ్రాహ్మణులను , 
శ్రాద్ధ కార్యములకు ముగ్గురు బ్రాహ్మణులను 
పిలువవలెను.

మనిషి శాస్త్రములను ఎంత మేరకు అభ్యసించునో
అంతవరకే విశేషములను తెలుసుకొనును .
ఇందువలన జ్ఞానము ప్రాప్తించును.

శాస్త్రానుసారము ఉదయాస్తమయములందు , గ్రహణములందు నిటి యందు, సుార్యుని ప్రతి బింబమును చుాడరాదు. అటులనే నీటి యందు తన బింబమును చుాచుకొనరాదు.

వేద స్వరములను , అక్షరములను అస్పష్టముగానుచ్ఛారణ చేయరాదు.
ఋగ్వేదము దేవతలకును , 
యజుర్వేదము మనుష్యులకును ,
సామ వేదము పితృదేవతలకును , చెందినవి.
కనుక సామ  వేద ధ్వని అపవిత్రము.

మధ్యాహ్నము , అర్ధరాత్రి , సంధ్యాసమయములందు
నాలుగు మార్గముల కుాడలికి పోరాదు.

ఈ విధమైన ఎన్నో శాస్త్రములు , ధర్మములు,
మానవ నడవడికావిధానములెన్నియొా మను శాస్త్రము నందు చెప్పబడినవి.

***************************

ఇంకనుా మనము తెలుసుకోవలసినవెన్నియొాఉన్నవి
మను ధర్మ ములను కొంత  మేరకైనా చెప్పే అవవకాశమును కలిగించిన  మనోహరి కార్యవర్గ 
సభ్యులకు నా మనః పుార్వక ధన్యవాదాలతో..🙏🙏