Friday, December 18, 2020

తిరుప్పావై అర్ధం ప్రవచనం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం నుండి....

 తిరుప్పావై 4 వ పాశురము* 


 ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్ 
 ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
 ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
 పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
 ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
 తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
 వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
 మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది

. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. 

మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా  వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి. 

ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది.  అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి, వివిద పదార్థాలలో  నే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు.

సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు,  లోకంలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు:  అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా "ఏకైక లభాయ:" కాని  "సర్వ లాభాయ కేశవ" అంటారు.  ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు.

అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. 

భారతంలో అజామయుడి సన్నివేషంలో  ఇది చెప్పబడి ఉంది.

 అలాగే ఏ దేవతను కొలిచినా,ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని  భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.

అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. 

ఆళి మళైక్కణ్ణా! - సముద్రమ్లో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా-పర్జన్యా.

 ఒన్ఱు నీ కై కరవేల్ - ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు-ఉదారంగా ఇవ్వు, ఆళి ఉళ్ పుక్కు - సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , ముగందు కొడార్ త్తేఱి -  పిల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు నిమ్పుకోని - చాలా ఎత్తుకు వెల్లాలి. 


ఊళి ముదల్వన్-సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో, ఊరువం పోళ్  మెయ్ కఱుత్తు - అట్లాగే  నీ  ఆకారాన్ని సరిదిద్దుకో, పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్  ఆళిపొల్ మిన్ని -  బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు,  మొదటగా మెరవవలె,తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె. 


ఆ మెరవడం ఎట్లా అంటే సుదర్షన చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి.

 వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు - ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా-శంఖం ద్వనిలా  ఉరుమవలె.

 ఆ ద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాళ్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. 

తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ - ఇక కురవడం స్వామి వేసే బాణాల వలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు.

 ఆంగళుం మార్గళి నీరాడ మగిళుంద్ - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.



🌸ఆండాళ్ తిరువడిగలే శరణం 🌸


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

సీతా రాముల వంశం ( ప్రవర).

వాల్మీకి రామాయణం

7వ దినము, బాలకాండ

జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు.......వీళ్ళ ఇద్దరికీ నీ దెగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.

పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.

ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలొ పుట్టిన దేవరాతుడు అనే రాజు దెగ్గర న్యాసంగా( అంటె కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలొ(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.

అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ |
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా ||

అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము(జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా( అంటె పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.

ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భుమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దెగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు.

అప్పుడు జనకుడు " ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను" అన్నాడు.

ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.

ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జెరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు.
ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.

ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః |

ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్ |

తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||

రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.


భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః |
అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా ||

అప్పుడు జనకుడు " మహానుభావ విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది " అన్నాడు.

అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దెగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జెరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దెగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.

వెంటనే దశరథుడు తన గురువులతొ, పురోహితులతొ సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, " మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు.

వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.

దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు.

ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం ||

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు " అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటె కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.
ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.


మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు " మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు.

అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు........
మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడ వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘా, శశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జెరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని ( గరము అంటె విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు( ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు" అని వశిష్ఠుడు చెప్పాడు.

ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు " మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి( ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది" అని జనకుడు చెప్పుకున్నాడు.

సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక.......
వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం |
ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః ||

నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.

నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.

దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,(బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.

దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు.
మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు.

అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహొత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు..................
ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |

పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||

రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామ! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. [ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.]






అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జెరిపించారు.

అలా వివాహం జెరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజూ జెరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.

మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.

అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జెరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు.

ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దెగ్గరికి వచ్చి.......

మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.

అప్పుడు రాముడు ఇలా అన్నాడు " పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను " అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. " నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను " అన్నాడు.

అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు " రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను " అని అన్నాడు. అయితే నీ తపఃశక్తితో  సంపాదించిన తపోలోకాలు(తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టెస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలేదని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.

దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.

సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు..........

ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి |

గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే ||


రాముడికి సీతమ్మ అంటె చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే, మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట.

సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట.


అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది..........

Friday, November 13, 2020

యతి మైత్రి అక్షరాలు.

జగదీశ్వరీమూర్తి గారు పద్యాలు బాగున్నాయండి. అయితే యతిమైత్రి విషయంలో ఖచ్చితత్వం కొరవడినట్లుంది. ఈ - ఓ యతి చెల్లదండీ. చివరి పద్యంలో బాగానే ఉంది. 
ఇఈఋౠఎఏ యియీయృయౄ యెయేహిహీహృహౄ హెహే -- ఇవి యతిమైత్రి అక్షరాలు 
ఉఊఒఓ యుయూయొయోహుహూ హొహో -- ఇవి యతిమైత్రి అక్షరాలు 
అఆఐఔ యయాయైయౌ హహా హైహౌ-- ఇవి యతిమైత్రి అక్షరాలు 
సదయ్య గారు కవి సంగమం గ్రూపులో పెట్టి యున్నారు చూడగలరు 
అన్యధా భావించక యతి సవరణ చేయగలరని విన్నపం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                                    శ్రీహరికోటి

నరకాసురు వధ : దీపావళి కధ.

పెన్నా రచయితల సంఘం వారి  దీపావళి
మరియు  బాలల దినోత్సవ సందర్భంగా రాసిన కవిత.

రచన, శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అంశం..బాలల దీపావళి.
శీర్షిక .
నరకాసురుని వధ.
----------------------

బాలలుా  తెలియుమా దీపావళి మహిమ
బహు చక్కనైనది భక్తి నిండెడిది॥

విష్ణు అవతరించెను వరహావతారుడై
భుాలక్ష్మి నేలిన  భగవంతుడీతను॥

వారి పుత్రుడు  ఇతడు పేరు నరకాసురుడు
అసుర గుణములతోడ జనియించినాడితడు.॥

తెలిసి వగచీ తల్లి  భూాదేవి చింతింప
ఆమె చేతిని  అతని మృత్యువని ఎరిగించె॥

గురు "జనకు" శిష్యుడై  గుణ సంపదల నెరుగు
కడు భక్తి నిండిన కామాఖ్య భక్తుడు.॥

దేవీ ఉపాసనల  దేహ బలమును పొంది
దేవతల హింసించి  దేవలోకములేలె ॥

దేవతలు మొరలిడగ భామా సమేతుడై
శ్రీకృష్ణుడభయమిడి   సమరసంసిద్ధుడయె॥

తల్లి భుామియె సత్య  భామావతారిణి
లోక కంటకు దునిమి లోకాలు కాపాడె॥

నరకాసురుని వధకు నరులు పండగ జేసి
దీపాల నలరించి దేవతల పుాజించె ॥

బాణసంచారాల బాలలా సందడుల
ఆనంద దీపావళై   అలరె భువిలోన ॥



Wednesday, November 4, 2020

మానవత్వం

15/10/2020.
అంశం
మానవత్వం.
-----------------

శీర్షిక.
"మరుగుజ్జు"
-----------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
---------------------
అసహనంతో అటుా ఇటుా తిరుగుతున్నాను.
ఇంకా పనిలోకిరాని ఆదెమ్మను ఆడిపోసుకుంటుా..॥
అరగంట  లేటుగా ,  ఆదెమ్మ అలసటతో
జ్వరంలో ఉన్న చంటిదాని మీద నున్న బెంగతో॥
 చంటిదాన్ని గుడ్డ పరచి వేసింది నేలపై 
అడిగింది  పది రుాకలు చంటిదాని  మందుకై॥
నాగాల లక్కల్లో  నయాపైస రాదంటుా  
కసుర్ల విసుర్ల తొనాదెమ్మను, తరిమేసా పొమ్మంటుా॥
కవి  సమ్మేళన సన్మానం, లేటయ్యిందనుకుంటుా
మనవత్త్వం పై భాషణ చెప్పాలిగ  అనుకుంటుా॥
అద్ధ ముందు నిల్చున్నా అలంకరణ కోసమై
అద్ధం లో నా రుాపమె అగుపించె వికారమై॥
అదిరి పడ్డ నా ముందు ,ఆదెమ్మే అందమై
ఎదిగిపోయె కనుల ముందె మానవత్త్వ శిఖరమై॥ 
అనాధ పిల్ల పై పుట్టెడు మమకారం నింపుకొని
ఖర్చు కై వెనుకాడని ,మమతలనే పంచుకొని ॥
కుాడు- గుడ్డ లేకున్న ,నిండు మనసు  అదెమ్మది
పాచి పనుల జీతంలో , కొట్టి వేత లెక్క నాది॥
పెంచుకున్న చంటి బిడ్డ నెత్తుకున్న ఘనతామెది
పది రుాకలు ఇవ్వలేని హీన మైన మనసు నాది॥
చెప్పకనే చుాపించెను మానవత్వం విలువేమిటొ  
కరగె నాలో కఠినత్త్వము కంటి  నీటి ధారలతో .॥.
మరుగుజ్జై నిలచి నాను అమె ముందు తలవాల్చి
భాషణలకె పరిమితమౌ మాట లేటి కని తలచి॥. 
"మీడియాల మొాజు లేలు,మాటలనే వీడమని
మనసుంటే ఇంటి నున్న పనివారికి సాయపడని --"॥
మనసు చెప్పి నట్టి మాట నాటుకుంది నా మదిలో  
మేలుకుంది  మరోమనిషి మానవత్వ రుాపముతో॥
చేతికందు రుాక లన్ని  సంచిలోన  వేసి నేను
ఆదెమ్మ ఇంటి వేపు కడుగు లేసి కదలినాను॥ .
చెప్ప లేని ఆనందం చేరువైన సంతోషం
శాంతి నిండు మనసిపుడొక  ఆశయాల విహంగం.॥
-------------------------------------------------------------


హామీ...
శీర్షిక.
"మరుగుజ్జు"
 .అనే  ఈ కవిత,
 ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

చిత్ర కవిత.

గోరసం చిత్ర కవిత కొరకు మాత్రమే రాసినది
శీర్షిక .
చిత్రం...భళారే విచిత్రం.
(వచన కవిత).
--------------------------------
చిత్రాల జగతిలో మనిషొి మహా మేధావి.

జరుగు తున్న చిత్రాలకు ఆసక్తి కరమైన

విషయాలను జోడించి వివిధ చిత్ర పరికరాలలో

చిత్రవిచిత్రాలను వివిధ మాధ్యమాల ద్వార

ప్రచారం చేసేడు. దాంతో మనిషిలో విద్యలతో

మేల్కొన్న మేధావి వివేకాన్ని మరిచేడు .

విలువలని విరిచేడు.బంధాలు బరువయ్యేయి

బాంధవ్యాలు కరువయ్యేయి పుార్తి లోకం చిత్ర

పరికరాలకు బానిసైపోయింది.ఈ నాడు

దుార వాణి , చరవాణిల వింత లోకంలో చరిస్తున్న

మానవుడు మానవత్వాన్ని మరచిన మరోమృగం.

కాలుష్యాన్ని పెంచుతుా కామాంధుడై చరిస్తుా

వికృత చర్యల వికటాట్టహాసాలతో కన్నీళ్ళను

పంచుతుా తనను తానుగా దిగజారిపోతున్న

దిశ నిర్దేశం లేని దశ హీనుడు.చుట్టుా ఎంతమంది

ఉన్నా ఎవరుాలేని-ఎవరికీ కాని ఏహ్యభావాల ఏకైక
                                    ఏకాకి.
---------------------------------------

రచన:శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

Thursday, October 29, 2020

ఇష్టపది కవితలు మహతీ సాహితీ సంగమం లో రాసినవి

[10/27, 14:51] iswarimurthy: మహతి కవిసంగమం , ప్రతిరోజు కవితా పండగే -
అంశం : పోతన భక్తి తత్వం
నిర్వాహకులు:  శ్రీ.బి. అనంతయ్య
పర్యవేక్షణ డా. శ్రీ అడిగొప్పుల సదయ్య  గారు
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక : పోతనామాత్యుడు
ప్రక్రియ: ఇష్టపది .


శైవ కుటుంబీకులు సోమనాధు శిష్యులు 
రామ కృపకు పాతృలు  రచనోత్తమొాత్తములు॥

భక్తి మాధుర్యముల భాగవతము రాసిన
బమ్మెర పోతనుడుా బ్రాహ్మణోత్తముడితడు॥

తెలుగు పద్య రచనలు తేనెలొలుకు విధమున
తేలిక గరచియంచు  తెలుగు పండితుడితడు॥

సంస్కృత కావ్యములను   సరళ భాషను రాసి
పామరుల మెప్పించు ప్రజా కవియె పోతన॥

భోగిని దండకమిడె భోగ చాపల్యతగ
సర్వజ్ఞ భుాపాలు సతికై సమర్పణగ॥

శ్రీనాధు సరి జోడు  శ్రీ సమ కాలీనుని
వీరభద్ర విజయము  విశ్వ మేలె కావ్యము॥

నారాయణ శతకము నాధుని గుణ కావ్యము
పద్య పాదములవియె పలు చక్కని పదములు॥

తేనె లొలుకు తెలుగుకు  తేట జిలుగు వెలుగుగ
భక్తి కవిత లేలెను బమ్మెర పోతనుడుా॥

భాగవతపు గాధను భక్తి నిండు చరితను
భగవతోపాఖ్యాన  భాగముల రచించెను॥

రామన్నే శ్రోతగ రాసీ వినిపించెను
భాగవత పురాణము పరమ భక్తి కావ్యము॥

ఎంచ శివ కేశవులు  ఏక తత్త్వ రుాపని
సమానతను చాటిన సమన్వయ దృక్పథుడు॥

రామ భద్రుని ఆజ్ఞ  రసమయమై నిండెగ
అజరామర కీర్తి ని అవని తెలుగు కవిగా॥
[10/28, 11:45] iswarimurthy: రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
"శీర్షిక "థేంక్యుా కరోనా.."

-------.."కధ కాని కధ.-------------

"అమ్మాయ్ స్నానం చేసి వంట చేయమ్మా...
ఆ దేముడికి కాస్తా దీపం పెట్టి ధుాపం వేసి
కొంచం నైవేద్యం పెట్టు.ఇంటికి చాలా మంచిది."
"నానీని  బయటి నుండి రాగానే కాళ్లుా చేతులుా సుభ్రంగా కడుక్కో మనమ్మా।
చీడ- పీడా కదుా..ఏం తొక్కి వచ్చేడో ఏమొా.."
"బట్టలు మార్చుకొచ్చేక అన్నం పెట్టమ్మా..
అవతల దుమ్ము ధుాళి లో ఆడి ఆడి వచ్చేడు.
క్రిములన్నీ వాడి బట్టల పైనే ఉంటాయి 
.అనారోగ్యం కదా.
ఇదుగో అమ్మాయ్..."

ఆబ్భ బ్బ బ్బ బ్బ..
రోజుా ఇదే గోల మీతో...భరించలేక పోతున్నాను.
మడి ,తడి ,పొడి..అంటుా..వెధవ చాదస్తం..వెధవ 
చాదస్తమా అని...అరుపు, విసుగు, నిర్లక్ష్యం 
గోల,  గోల ,గోల....

అటుా ఇటుా అసహనంగా  కదులుతుా గబుక్కున 
లేచేడు నానీ...నిద్ర నుండి. చుట్టుా చుాసేడు...
అవతలి నుంచి "అమ్మ" అరుస్తున్నాది.
"నానీ ।..లేచి సబ్బుతో  సుభ్రంగా చేతులు కడుక్కురా.
ఆ పక్క మీది బట్టలు విప్పి  ఉతికిన బట్ట లేసుకురా..
టిఫిన్ తిందుాగాని.."బయటకు వెళ్ళకు.
ఎవరొచ్చినా  దుారంగా నిల్చొనే మాట్లాడు.
కలగా పులగం అయ్యి కాకెంగిళ్ళు అంటుా తినకు..".
"రేయ్.నానీ....నానీ....నానీ..వింటున్నావా...?"
పొద్దుటి నుంచి అలా అరుస్తునెే ఉంది "శాంతి."

నానీ.ఆలోచిస్తుా మౌనంగా అమ్మ చెప్పినవన్నీ చేస్తున్నాడు.ఎప్పుడుా లేనిది,ఈమధ్య
అమ్మ కుాడా చాలా సుభ్రతలు
పాటిస్తున్నాది. "కరోనా" భయంతో...
రోజుా టి.వి ల్లో సుభ్రతల మీద ఎంతమంది మాట్లాడుతున్నారో...
"కరోనా"..వైరస్ ప్రమాదమైనదట.
సుభ్రత లేకపోతే మనని ఆక్రమిస్తుందట...
చంపేస్తుందట..మహమ్మారట..."

ఇవే మాటలు నానమ్మ చెప్పేది.కానీ అమ్మ వినేది కాదు. సరికదా,రోజుా కసురుకుంటుా...
ఛాదస్తం భరించలేనంటుా విసుక్కుంటుా..
 విరుచుకు పడుతుా...నానమ్మని వ్రుద్ధాశ్రమంలో
వదిలే దాకా నాన్న ని పోరింది.

పాపం..నానమ్మ...చెప్పినట్టు చాలా మంది చెప్పినట్టున్నారు
ఆశ్రమంలో ఎంత మంది నానమ్మలో...ఆలోచిస్తుా...
నానీ అమ్మ చెప్పినవన్నీ చేసేడు.
రెడీ అయ్యి , బయటకు వచ్చేడు.
అమ్మ నాన్నకు టిఫిన్ పెడుతున్నాది.
నాన్న దగ్గరగా వెళ్లేడు..నాన్న...బయటకు వెళ్ళాలి..అన్నాడు.
ఎక్కడికిరా..? అన్నాడు నాన్న..
"అమ్మను ఆశ్రమంలో వదిలి వద్దాం.
అమ్మ కుాడా నానమ్మ లాగే రోజుా అరుస్తున్నాది.
సుభ్రత, మడి, దుారం...అంటుా..
నాకు విసుగొస్తున్నాది...అమ్మ ఇక్కడొద్దు..."

నానీ మాటలు విన్న శాంతి  కళ్ళ ల్లో గిర్రున తిరిగిన కన్నీళ్లు  చటుక్కున లోపలికెళ్ళిపోయింది.
తలవంచుకున్నాడు నాన్న.

ఐదు నిముషాల్లో తయారై వచ్చిన శాంతి "పదండి ---
అత్తయ్యను ఇంటికి తీసుకువద్దాం "అంది.
నాన్న కళ్ళల్లో ఆశ్చర్యం ..అమ్మ ముఖంలో పశ్ఛాత్తాపం..నానీ కళ్ళల్లో ఆనందం..
ముగ్గురి మనసుల్లోనుా
ఒకటే మాట..థేంక్ యుా---
       "  కరోనా."
       ----------------
[10/29, 14:13] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శీర్షిక : వందే వాణీ.

బ్రహ్మ మానస పుత్రి బ్రాహ్మీ హంసాసని
సామగానాది ప్రియ సంగీత వినోదిని॥

కరధృత వీణా ధరి ఘన పుస్తక పాణీ
వాగ్విలాసి వరదే  వనజ భవు ప్రియ రాణి॥

మణి మయాది భుాషణి మదనాంతకు సోదరి
సత్య లోకవాసిని  సామ గాన లోలిని ॥

అక్షయ తేజోమయి  అక్షరస్వరుాపిణి
ఈప్సిత వర దాయకి ఈశ్వరీ హృత్సదని॥ా

Friday, October 23, 2020

భగవద్గీత లింక్

మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి.

💐🚩🕉️🚩💐

Tuesday, October 20, 2020

దాంపత్య జీవితం.

రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
--------------------------
ప్రక్రియ.
సమ్మొాహనాలు.
శీర్షిక .
దాంపత్య జీవితం.
------------------------
అందమైనది ఇల్లు
ఇల్లంత సందళ్ళు
సందళ్ళ పెరిగారు పిల్లలుా  ఈశ్వరీ॥

పెరిగి  పెద్దయ్యేరు
పెద్దయిన పిల్లలుా
పిల్లలకు పెళ్ళిళ్ళ సందళ్ళు ఈశ్వరీ ॥

కోడళ్ళు అల్లుళ్ళు 
అల్లుళ్ళ సందళ్ళు
సందళ్ళ బాధ్యతల బరువులుా ఈశ్వరీ ॥

గడ్డు కాలము వచ్చె
వచ్చి వయసే తెచ్చె
తెచ్చె ముదుసలి తనము నేయిచ్చె ఈశ్వరీ॥

పనిచేయ లేకున్న
లేకున్న చేసినా
చేసినా ఆరళ్ళు తప్పనైన  వీశ్వరీ ॥

విసుగు , ఛీత్కారాల
ఛీత్కార  బతుకుల
బతుకేల యనుచునుా విల-విలలు ఈశ్వరీ  ॥

వృధ్ధాశ్రమాలగతి
గతి తమకు పోగ మతి
మతిపోయి పయనము మారాతి దీశ్వరీ ॥

లేదు చావుకు భయము
భయము సహచరి, గనుము
గనిన మే మొంటరిగ మనలేము ఈశ్వరీ ॥

ఒకరికొకరము తోడు
తోడుగా మని జోడు
జోడుగనె పోవరుగ ఏనాడు ఈశ్వరీ..॥

ఈనాటి పిల్లలే
పిల్లలు పెద్దలు లే
రేపటికి ఔదురుగ ముదుసలులె ఈశ్వరీ ॥

పిల్లలకై  జీవము
జీవితము అంకితము
అంకితము  అనర్ధమని తెలియము  ఈశ్వరీ॥

ఋణము తీర్చెడి గుణము
గుణ హీనకు స్వార్ధము 
స్వార్ధమేలె ఇలలో ఇది నిజము ఈశ్వరీ ॥

ఈతీరు మారనిది
మారని  సమాజమిది
సమాజము మనము గద, నీతేది ఈశ్వరీ ॥

తామరను అంటదు 
అంటదు నీరంటదు
అంటదు విషయములను అంటదుా  ఈశ్వరీ॥

నమ్ము సతిని వీడకు
విడచి  అతిగా చెడకు
చెడి సతి కంటనీరు రానీకు ఈశ్వరీ. ॥

అమ్మ రుాపు తానై
తానై చెలి తానై
తానే నీ వలపై  నీ తోడు ఈశ్వరీ ॥ 

కష్ట-సుఖములతోడు.
తోడునీ సరి జోడు
జోడు  చివరి వరకు వదలకెపుడు ఈశ్వరీ ॥

  










Sunday, October 18, 2020

ఆడపిల్ల.

రచన, శ్రీమతి, 
 పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. ( మహరాష్ట్ర ).
 8097622021
 ------------------------------
శీర్షిక .
ఆట బొమ్మ.
---------------
కాలుష్య మెరుగని, కల్లక పటము లేని
చిన్ని పాపను నేను , చింత లేవెరుగను॥
చిందులేయుచు ,అమ్మ ఒడి చేరి నిదురించు
చిన్న పిల్లను చిన్ని  పసి పాపను నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥

అన్న ,నాన్నా, తాత,మామ, నాదీ యనుచు
వలపు పంచెడి పసిడి పాల పలుకు ను నేను॥
అంత రంగమునల్ల కల్లోల మైనట్టి
అలోచనలు రాని చిన్ని ప్రాణి ని నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥

ఆడ -మగలను వేరు, భావమ్ము తెలియని- 
పసి మనసు కలగిన పసిడి పట్టిని నేను. ,
ఏ చేయి రక్షించు ,నే చేయి బక్షించు నను
మర్మ మెరుగని , మమత  కొమ్మను నేను॥

 ముద్దు మురిపెపు వలపు..సద్దు మణగిన పిలుపు_
 సరి కీడు లెరుగని , వట్టి వెర్రిని నేను.
 పసి దేహమును కామ, చింతనతో చుాచేటి
 కాముకుల చిత్తమును ఎరుగనైతిని నేను
 ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
 
 ఆదరించిన  చేయి ,అన్న మెట్టిన చేయి, 
 అమ్మ ఒడి సాటనీ...నమ్మి మురిసితి నేను.
 నటన నేర్చిన నరుల, వికట రీతుల వలల
 చిక్కి చితికిన చిన్ని, ముద్దు గుమ్మను నేను.
 ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
 
  నాది , నా వారనుచు నమ్మ,  నను గద్దించి
  నిలిపి నలిపిన , భీతి నేడ్చు బేలను నేను
  విధి వంచనకు  లొంగి , తోలు బొమ్మగ మారి,
  నయ వంచకుల , వేటకాట బొమ్మను నేను
  ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
  
  వికసించనటువంటి  వట్టిపుాలను పట్టి
  నలిపేటి దుష్టులను దునిమేది ఎవరు..?
  ఆడతనమున అమ్మ ,అక్క ,చెల్లెల , కనని
  క్రుారులను నరికేటి  కత్తి పట్టే దెవడు..?
  కన్నీటి కార్చిచ్చు..రగిలి మంటగ మారి
  కాముకుల దహియించు దినము వచ్చేదెపుడు ?

  -----------------------------------------------------
 

Friday, October 16, 2020

భుామి గుండ్రంగా ఉంది

శీర్షిక .
భుామి గుండ్రంగా ఉంది.
---------------------------------------

తెల తెల వారుతుాండగా వినిపించే
పక్షుల కువకువలు మనసు వీణను
మీటుతుా భుాపాల రాగం పాడుతుా 
మేల్కలొపే మధురానుభుాతి....ఏదీ...?

ఆరు బయట నీరెండ తో చెలిమి చేస్తుా,
కళ్ళాపి చల్లిన ,పచ్చని వాకిలి పై
 ఇంద్రధనుసు తో పోటీపడుతుా 
 అలరించే అందాల రంగవల్లులు  ఏవీ...?
 
నీలి మేఘాలతో దోబుాచులాడే అందమైన
పడుచు సోయగాలు , గాలి గంధాల తో సాగే
ఆడతనపు  సిగ్గు సింగారాలు,  పట్టు పావడాల..
రెప- రెప లుా , కాలి మువ్వల గల గల లుా..ఏవీ. , 

సిగ్గు సింగారాల నడుమ..
కొంటె చుాపుల వాడి పరిమళాలు , 
వన్నె చిన్నెల ,వలపు పిలుపుల,
వావి వరుసల , అందాల బంధాలు...ఎక్కడ..?

చుాస్తుాండగానే అందమైన 
ఆవరణలు కరువయ్యేయి..
పచ్చదనం కనుమరుగై 
గాలికి గంటుపడింది

పుట్టగొడుగుల్లాంటి కట్టడాలతో
కాలుష్యం నిండిన కంపు సందుల్లో
మానవీయత, మాన మర్యాదలుా
మత కల్లోల ,మారణహోమాల్లో  
మట్టుకొట్టుకుపోయేయి॥

మనిషి తనం , పరువు ధనం
 కళేబరాల ముసుగుల్లో
వాత, పిత్త , కఫాల బారిన  పడి
," కరోనా " పేరుతో కలబడి
 పొడిదగ్గు  సొగసుల్తో 
 పాపాడికెక్కుతున్నాయి.
 
మంద లాంటి జనం మతి  కోల్పోయిన 
కోతుల్లా , పళ్ళేల చప్పుళ్ల మధ్య
చప్పట్ల ,సవ్వడులు చేస్తుా..
చిరుదీపాలతో కరోనాను
తరిమే ప్రయత్నం చేస్తున్నారు.॥

కణం చేసే కర్కశ చర్యలకు
దిక్కు తోచని జనం  , దీర్ఘకాల
గృహ నిర్బంధాలకు బానిసలై
బేడీలు లేని దొంగల్లా
తమ తమ ఇళ్ళ లో 
తమకి  తామే బందీలౌతున్నారు.॥

పాశ్ఛాత్య పద్ధతులకు 
పట్టం కట్టిన జనం
పరదేశపు కణాన్ని చుాసి
పరుగులంకించుకుంటున్నారు.॥

ఇంతలోనే వింత మార్పు.
విచ్చలవిడితనం ఇంటిదారి పట్టింది.
స్వశ్ఛత నిండిన చేతలకు శ్రీకారం చుట్టింది
సంప్రదాయాలకు సాదరాహ్వానం పలికింది ॥

ఆ దెబ్బతో
పాత పద్ధతులను 
చీదరించుకున్న జనం
అవే ఆచారాలను పట్టి పట్టి  
పాకులాడుతున్నారు ॥

ముాతికి గుడ్డలు
ముఖానికి ముసుగులు వేసుకొని
ఆచారాలు , మడి ,తడులను
సానుకుాలంగా సద్దుబాటు 
చేసుకుంటున్నారు.హత విధీ
భుామి గుండ్రంగా ఉందంటే
ఇదే నేమొా...॥
------------------
రచన,  శ్రీమతి -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
------------------------------

Thursday, July 2, 2020

బుద్ధుని బోధలు

మానవాళికి  నూతన మార్గాన్ని వేసి దుఃఖ విముక్తికి దారి చూపిన  గౌతమ బుద్ధుని బోధనలు హేతుబద్ధమైనవి. ఇప్పటి వరకు సైన్స్ చెప్పిన, చెప్పని అనేక అంశాలను బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చర్చించాడు. 

బుద్ధుని బోధనలలో ప్రధానమైనవి..

*అనాత్మ సిద్ధాంతం* : (ఆత్మ లేదు అని బుద్ధుడు స్పష్టం చేశాడు). ఆత్మ ఉన్నదని చెప్పే ఏ మతమైన అది అనుసరణీయం కాదు అన్నాడు... అలా చెప్పడం మూఢత్వమే అన్నాడు.

*అనిత్య సిద్ధాంతం*: నిత్యమైనది ఏది ఉండదు అని చెప్పాడు. ప్రతీది అనిత్యమై మార్పు చెందుతుంది అన్నాడు.

*కార్యకారణ సిద్ధాంతం* : ప్రతి కార్యానికి కారణం ఉంటుంది అన్నాడు. ప్రతిదానికి హేతువు ఉంటుంది అన్నాడు. హేతువు లేకుండా ఉన్న దేనిని నమ్మకూడదు అన్నాడు. ప్రతీది పరిశీలించి, చూసి, మీ పరిశీలనలో నిజమని తెలితేనే నమ్మండి అన్నాడు. ఎవరో చెప్పినది నమ్మడానికి వీలులేదు అన్నాడు.

*ప్రతిత్యాసముత్పాద సిద్ధాంతం* : దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఇక్కడ ప్రదానం కాదు.దేవుడు ఈ సృష్టిని దేనితో నిర్మించాడు అనేదే ప్రధానం. ఈ సృష్టి శూన్యం లో నుండి నిర్మించబడింది అనడం సహేతుకమైనది కాదు. అది అబద్దమే అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక పదార్థం నుండి సృష్టిని సృజిస్తే దేవుడు సృష్టికర్త కాడు. ఎందుకంటే తను సృష్టించడానికంటే ముందే ఒక పదార్ధం ఉంది కాబట్టి. కనుక సృష్టికర్త అంటూ ఎవరు లేరు (ఇంతవరకు ఎవరు చూడలేదు) కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మడం మూఢత్వమే అవుతుంది.

*చేతన సిద్ధాంతం* : విద్యుత్తు ఎక్కడ ఉంటుందో అక్కడ అయస్కాంత శక్తి కూడా ఉంటుంది. విద్యుత్తుని వెన్నంటి అయస్కాంత శక్తి ఉన్నట్టే శరీరం రూపుచెందడంతో పాటు చేతనత్వం కూడా ఏర్పడుతుంది.

ఏది బౌద్దం?

నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ స్వబుద్ధితో నీకు నీవుగా బుద్ధుడిగా మారడమే బౌద్ధం.
సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధం.
సత్యాన్ని గ్రహించినవాడిగా అనేకులకు ఆ సత్యాన్ని తెలియజేస్తూ, ధమ్మాన్ని ఆచరిస్తూ సంఘంలో జీవించడమే బౌద్ధం.

కర్పుారం..రకాలు

#కర్పూరం ఎన్ని రకాలు?

కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం.

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు. చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది.

కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి
(కర్పూర తులసి)జాతులనుడి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగ పడుతుంది.

#పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.

#హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.

#రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

#భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.

#సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.

#హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.

#ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.

#హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.

2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.

5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.

6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.

7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.

8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.

9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.

11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.

12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.

14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, నిర్ములనకు ఉపయోగిస్తుంటారు.

Monday, June 29, 2020

హిజ్రాల గురించి

శ్రీదేవి శ్రీకాంత్
+26776279761

హిజ్రా అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చింది. పూర్వం నవాబులు వాళ్ళ స్త్రీల దగ్గర కాపలాగా ఉండేందుకు చిన్నప్పుడే  కొంతమంది బాలురను పట్టుకొని వాళ్ళ వృషణాలను పురుషాంగ ములను తెసేసేవారు. వాళ్లలో అప్పుడు పురుష హార్మోనులు(testosterone, etc) ఉత్పత్తి అవవు కనుక , సహజంగా ఉత్పత్తి అయ్యే స్త్రీ హార్మోనుల (estrogen, etc) ప్రభావం వల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు బాహ్యంగా స్త్రీ లక్షణాలతో , స్త్రీల లాగా ప్రవర్తించే వారు. వీళ్లు అంతఃపురం స్త్రీలకు కాపలా ఉండే వారు. ఆ స్త్రీ లకు ఏ ఇబ్బంది ఉండేది కాదు...వీళ్ళను మనం artificial trans sexuals  అని అనవచ్చు...
అలాకాకుండా, natural గా by birth, chromosomes తేడా వల్ల నిన్న నేను వ్రాసి నట్లు XX,XY (normal sex chromosomes) ఉంటే క్లియర్ గా ఆడ (XX), మగ (XY) అవుతారు. ఆలా కాకుండా కొన్ని biological accidents వల్ల XXY లేదా XYY లాంటి chromosomes ఉంటే వారు complete ఆడ లేదా మగ లాగా ఉండలేరు...వీళ్ళను మనం సాధారణంగా హిజ్రా లని కొజ్జా లని అంటుంటాం. 
మనం ఇక్కడ confuse కాకూడదు: Sex అనేది physical body కి సంభందించింది, gender అనేది మనసుకి సంభందించింది అని. 
Homosexuals ఆంటే gender identity కి సంభందించిన విషయం. So they are called in reproductive science as transgenders...

హిజ్రాలు Sex identity కి సంబంధించిన వాళ్ళు...అంటే వాళ్ళ body లో sex organs విభిన్నంగా ఉంటాయి...అందుకే వాళ్ళను Transsexuals or intersexuals అంటారు సైన్స్ లో.

కానీ వాడుక భాషలో పై రెండు వర్గాలను కలిపి transgenders అని అంటుంటారు. అందరికి సైన్స్ తెలియాలని లేదుకదా. So, no problem.

ట్రాన్స్ sexuals కి...Miss transqueen India  అనే పోటీ జరుగుతుంది.
అదే ప్రపంచ సుందరిగా అయితే
Miss International Queen ...అంటారు.
పోటీకి కేవలం అర్హత
ట్రాన్స్ సెక్సువల్ అయి వుండాలి. దీనిని రీనా రాయ్ అనే ఆమె...2016 లో మొదలు పెట్టీ..2017 స్థాపించారు.
ఈ కాంటెస్ట్ interesting gaa వుంటుంది. ఇందులో కూడా చాలా రౌండ్స్ వుంటాయి. 
నితాషా బిశ్వాస్ 2018 లో మొదటి
Miss Transqueen. ఇప్పుడు
  Miss Transqueen ...Miss Neetu.

రోహిణి గారు రాశారు కథ లో Dr చెప్పింది నా ఊహ అని.  ఊహ లను సైన్స్ కు ఆపాదించ కూడదు కదా. కథ  మాత్రం చాలా బాగా రాశారు అనడం లో సందేహం లేదు. కథలో బేస్ మాత్రం తప్పింది.

తెలుగు వారు ఇజ్రాలను ఇంట్లోకి రానిచ్చి.... దీవించ మని అడుగుతారా?
అలాగే...సెక్స్ మార్పిడి అందరి విషయం లో వడ్డించిన విస్తరి కాదు.
ఒక్కొక్క సారి ప్రాణాలకు ముప్పు కలగ వచ్చు.
లేదా...side effects వల్ల ఇబ్బందులు ఎదుర్కో వలసి రావచ్చు.

సమాజంలో ఇజ్రాలను  మార్చడానికి ధనికుల వద్ద నుండి డబ్బు కలెక్ట్
చేయడం...వగైరా.... ప్రాక్టికల్ గా కుదరదు.
ఇది పర్మనెంట్ పరిష్కారం కాదు.
ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలలో ఎన్నో సమస్యలు వున్నాయి.  ఇజ్రాల సెక్స్ మార్చడం...సమస్యకు పరిష్కారం కాదు. వారిని సరైన రీతిలో ఎడ్యుకేట్ చేయాలి. కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారిని గురించి మంచి ఆర్టికల్స్ రాయాలి.
ఈ education సాధారణ మానవులకు కూడా అవగాహన కలిగే రీతిలో ఇవ్వాలి.

పూర్వం ఇజ్రాలుగా పుట్టడం ఒక అసాధారణ మైనది గా పరిగణించేవారు.
వారిని చాలా హింసించే వారు. Biological accident అనేది గ్రహించాలి.
అలాగే homosexuals/స్వలింగ సంపర్కులు  బయట ప్రవర్తించే విధానం మామూలుగానే వుంటుంది. సినిమాలలో చూపించినట్లు వొంపులు తిరగడం వగైరా వుండదు. వీళ్ళల్లో ఎంతో గొప్ప గొప్ప ఉద్యాగాలల్లో వున్న వారు వున్నారు. వారి ప్రైవేట్ జీవితం వారి పడక గదివరకే పరిమితం.
ట్రాన్స్ sexuals మాత్రం ...వారిలో జరిగే హార్మోనల్ మరియు శరీరం నిర్మాణం లో  మార్పుల వల్ల కొంచం తేడాగా ప్రవర్తిస్తుంటారు.

వీరు కాక... సోషల్ life lo...చాలా మంది...వారి ప్రవర్తనలో తేడా వచ్చిన వారిని చూస్తాం.
మగపిల్లలకు సాధారణంగా...ఆడపిల్లల దుస్తులు వేస్తుంటారు. కొందరు పిల్లలు తరువాత వాటినే ఇష్ట పడటం...ఆడపిల్లల లాగా నడవడం చేస్తుంటారు. మలయాళం లో "చాందు పుట్టు" అనే సినిమా.
తెలుగులో ఏమైనా సినిమాలు వచ్చాయి ఏమో తెలీదు. ఇంగ్లీష్ సినిమాలు, అనేక పుస్తకాలు వీరిపైన వున్నాయి.
ఉదాహరణ.
రీసెర్చ్ లో చెప్పేదేమిటంటే.... పిల్లలకు పదే ప దే...ఇలా వేసి వారిని ముద్దుగా చూడడం మొదట బాగానే ఉంటుంది. అది విగటించినప్పుడు...పశ్చాతాపం చెందాల్సి వుంటుంది.

కృతజ్ఞతలు.

Friday, June 26, 2020

సాక్ష్యం .

శీర్షిక .
సాక్ష్యం .
---------
ఎన్నటికీ ఆరని 
 నిత్యాగ్నిహోత్రం , నిరంతర
మారణ హోమాల మహా యజ్ఞం.
అల్లలాడే జనసముాహాల
శోకాలకు సాక్ష్యం.॥

గద్దె కెక్కిన గెద్దల రాజ్యంలో
ఆకలి గొన్న నాయకత్వానికి
ఆహుతైన, అల్పజీవుల ఆక్రోశం,
గతుకు జీవితాల, చితుకు
బతుకుల చావులకు సాక్ష్యం ॥

మంతనాల  జగతిలో ,  
మారని న్యాయ వ్యవస్థలకు ,
మానాన్ని కోల్పోయిన-
తీర్పు, న్యాయం కోసం 
నిరంతరం కార్చే కన్నీటి 
కథనాలకు సాక్ష్యం ॥

సాముాహిక బలాత్కారాల-
బలవన్మరణ  పీడలతో ,
నిండిన అబలల ఆర్తనాదాలు, 
ఏసిడ్ దాడుల కాలిన వాసనలు ,
కృుారమైన కామాంధుల నికృష్ట
చర్యల, నీచ కృత్యాలకు సాక్ష్యం  ॥

వలస జీవుల వాస్తవ గాధలు
వార్తా పత్రికల వార పేజీల్లో,
ఆకలి చావుల ఆర్తనాదాల-
అక్షరాశృవులై నిలిచిపోవడం
నిత్య జీవిత సత్యాలకు సాక్ష్యం ॥

ఆకలి తీర్చే రైతన్నల కలలు -
పేక మేడలై కుాలే దారులు ,
నిస్సహాయపు ఆత్మహత్యల 
నిర్జీవపు శరీరాలు ,పట్టెడన్నం  కోసం
పాకులాడిన జ్ఞాపకాలకు  సాక్ష్యం  ॥

వీర సైనికుల వరుస సమాధులపై
లిఖింపబడే  వారి నామాలు,
బీటలు బారిన  పాచి గోడల 
కలుగుల్లో, మరుగుపడిన
వారి ఉనికికి సాక్ష్యం ॥, 

సమాధుల పేటికల్లో ,
నామ మాత్రంగా నిలిచిపోయే
అమర వీరుల అస్థిపంజరాలు,
వారి దేశభక్తి  నిదర్శనమైన -
నిలువెత్తు త్యాగాలకు సాక్ష్యం ॥

 హక్కుల పోరాటాల బాటల్లో
 అణచివేతల అధికారపు వేటలు.
 తాళలేని హింసలకు 
మతిచెలించిన మానవత్వం-
కార్చే కన్నీటి శాపాలకు సాక్ష్యం  ॥

నశించిన న్యాయ పోరాటంలో ,
నాశనమౌతున్న ధర్మ వ్యవస్థకు-
ప్రకృతి చేసే వికృత  వినాశనం-
అవనిని ఆదుకోలేని 
వివసత్వానికి సాక్ష్యం .॥
 
అధికారపు అరాచకాలకు-
అంతమౌతున్న అమాయక ప్రాణుల-
అంతులేని  హాఁ హాఁ కారాల 
అసహాయపు కసి, మందులేని 
మహమ్మారిగా మారిన సాక్ష్యం ॥
 
వేల వేదనల కన్నీటి  "కీటకం," 
"కరోనా" పేరుతో విజృంభిస్తున్న 
 కాల సర్ప విషపు " కణం."
 జాతి, మత  భేదా లెరుగని  
   కాల "మృత్యు పాశం" ॥
         
మందులేని మహమ్మారియై 
మనమధ్యకు దుాసుకొస్తున్న 
       మారణ హోమపు
    "మహా భయంకర శాపం"
    పాప కర్మఫలానుభవాన్ని
     కాచి వడబోసి చుాపిన, 
     "కఠిన సత్యానికి సాక్ష్యం "
     ---------------------------
 
-------------------------------------
రచన శ్రీమతి , 
పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..( మహరాష్ట్ర ).
-------------------------------

           





 

  
 
 


 





Monday, June 22, 2020

సాహిత్యపేజీలు ..

సాహిత్య పేజీలు: Emails
🎯


నవతెలంగాణ(దర్వాజ)
darwajapage@gmail.com

మన తెలంగాణ (కలం పేజి)
editor@manatelangana.org

ఆంధ్రజ్యోతి(వివిధ)
vividha@andhrajyothy.com

ఆంధ్రజ్యోతి ఆదివారం
sunday.aj@gmail.com

సాక్షి(సాహిత్యం)
sakshisahityam@gmail.com

ప్రజాశక్తి(అక్షరం)
prajasavvadi@gmail.com

ప్రజాశక్తి ఆదివారం - స్నేహ
snehaweekly.praja@gmail.com

ఆంధ్రభూమి(సాహితి)
sahiti@andhrabhoomi.net

ఆంధ్రప్రభ(సాహితీ గవాక్షం)
sahitigavaksham@gmail.com

సూర్య(అక్షరం)
editpage@suryaa.com

మనం (సాహితి)
manamlekhalu@gmail.com

ఆదాబ్ హైదరాబాద్
aadabhydeditor@gmail.com

నేటి నిజం
netinijam93@gmail.com

అరుణతార
arunatara1977@gmail.com

పాలపిట్ట
palapittabooks@gmail.com

ప్రస్థానం
ssprasthanam@gmail.com

తెలుగు వెలుగు
teluguvelugu@ramojifondation.org

గోదావరి
godavarisahithimithrulu@gmail.com

విశాలాక్షి
visalakshi.nlr@gmail.com

చినుకు
chinuku2005@gmail.com

మూసి
editormusi@gmail.com

::Web Magazines::

సారంగ -వెబ్ పత్రిక
editor@saarangabooks.com

నెచ్చెలి - వెబ్ పత్రిక
editor.neccheli@gmail.com

కొలిమి - వెబ్ పత్రిక
kolimimag@gmail.com

కొలిమి - వెబ్ పత్రిక
kolimimag@gmail.com

ఈమాట - వెబ్ పత్రిక
submissions@eemaata.com

Telugu Asianet news
oddirajupk@gmail.com

Monday, June 1, 2020

కాలం ముసుగేసింది.

కాలం ! 
  గతించిన ఎన్నో గాయాల్ని  రుాపుమాపింది.

కాలం !
 ఎన్నో కన్నీటి కథనాలని , కష్టాల సెగలనీ
 మస్తిష్కపు మబ్బుల చాటుకు నెట్టి వేసింది.
 
 కాలం ! గతించిన ఎన్నో చరిత్రాత్మక సంఘర్షణలకు,
 సవాలుగా నిలిచింది.
 
 కాలం ! 
 రక్తాక్షరాలతో లిఖించిన  ఎందరో త్యాగముార్తుల , ఆత్మ సమర్పణల చితాగ్ని  జ్వాలల్లో
 దగ్ధమైపోయిన  న్యాయ వ్యవస్థలకు , సాక్షీభూతమై నిలిచింది.
 
 కాలం !
  నిరంతర అన్యాయాక్రమాల ,  అరాచకపు దాడుల్ని,  అరికట్ట లేని , చేతకాని సామాజిక వ్యవస్థ కు
 మరింత సమయాన్ని జోడిస్తుా , ధర్మ బద్ధ రాజకీయ
 వ్యవస్థా ప్రలోభాన్ని చుాపిస్తుా మాయ ముసుగు వేస్తునే ఉంది.
 
 కాలం!  
 జీవితపు ,  ఒడు- దుడుకుల దారుల్లో
 కష్ట సుఖాల , కన్నీటి వ్యధల , ఎడారి దారుల గమనానికి ఒయాసిస్సులాంటి  గమ్యాన్ని చుాపిస్తుా,  
 ఊరడిస్తుానే ఉంది .
 
 కాలం! 
 ఎప్పటికప్పుడు ,తారుమారౌతున్న  ప్రజా వ్యవస్థలకు  ,  ఐదేళ్ళకు ఒకసారి , రాజకీయ  రంగుల్ని పులుముతుా,  మనసులకు స్వాంతన కలిగిస్తుానే ఉంది. 
 
 కాలం! 
 కల్లబొల్లి మాటలతో , కపట వాగ్దానాలు చేసే 
 రాజకీయ నాయకుల ముఖాలకు,  ఖరీదైన మాస్కులు వేసి ,  మాటల గారడీల మాటున  మభ్యపెడుతుా , అమాయక ప్రజలతో చప్పట్లు , తాళాలతో భజన చేయిస్తునే ఉంది.
 
మానవ జీవితాలను , ఏదో ఒకరుాపంలో వచ్చి
రోగ గ్రస్తుల్ని చేసి, కబళించే మ్రుత్యువు , 
నేడు కనిపించని "కరోనా కణపు " రుాప మెత్తి  
కార్చిచ్చు  రేపుతుా ఉంటే...ఏంచెయ్యాలో తెలీకా 
"కాలం" గడ గడ లాడింది.  ఐనా సరే....

"లాక్ డౌన్" పేరుతో యావత్  ప్రపంచాన్నీ  జైలుగా మార్చి ,  స్వయం మానవ నిర్బంధాన్ని , మరో కోణంలో చుాపుతుా ,  మారణ హోమాల దాడికి కారణ భుాతమైన  "కరోనా" ను , సవాలు చేస్తుా ఎదురు నిలిచి , పోరాడుతుానే ఉంది.

విపత్తుల దాడిలో 
 నిర్దాక్షణ్యంగా  నలిగిపోతున్న  మనిషికి , మనిషే శత్రువై , అధికారికంగా కొందరుా , రాజకీయపుటెత్తులతో  మరికొందరుా ,
చదరంగం ఆడుతుా., ఆట తెలీని అమాయకపు
 జీవుల కష్టాని కి  "చెక్  " పెడుతుా ఉంటే , 
 కాలం "మౌనంగా" కన్నీరు కార్చింది .
 
 అన్యాయానికి ఎదురునిలిచి పోరాడే వారి తో, చేతులు కలుపుదామనుకున్న కాలం...
అడిగిన వాడిని అరాచకంగా అణచివేసే ,
క్రుార చర్యలకు భయపడి , అడుగు వెనకేసింది .

ఎటు వెైపు చుాసినా స్వార్దం నిండిన  మనస్తత్వాలు  ,
విలువలు తగ్గిన బంధాల దాడుల్లో, రాబందుల్లాంటి బంధువుల కాటుకు గురైన అబలల ఆర్తనాదాలు,
మానవీయత లోపించిన ముతక రాజ్యాంగాల మధ్య - ఊపిరాడని "కాలం ", మురికి కంపు భరించలేక 
మఖానికి ముసుగేసుకుంది.

దయ చుాపాల్సిన దైవం కుాడా,  
"కరోనా " కణపు  దారుణ దాడికి , 
తలుపులు ముాసుకు కుార్చునే సరికి,
అదిరి పడిన "కాలం " కఠిన నిర్ణయంతో ,
కళ్ళు ముాసుకుని పలాయనం సాగించింది
 
తన అస్థిత్వాన్ని కోల్పోతానేమొా 
అన్న భయంతో ",కాలం" పెట్టే పరుగులకు , 
ఋతువులు కుాడా జతకలిసి , 
సమయానికి ముందుగానే 
తమ వంతు ప్రకోపాన్ని చుాపించడంతో , 
ప్రపంచంలో, మరో చరిత్ర  చోటు చేసుకుందా..?
అన్న అనుమానం మొదలైంది.

సమయం కాని సమయం లో 
ఉధ్రుతంగా  కురిసిన వర్షాల వల్ల  ,
పంటలు నాశనమయ్యేయి , దానికి తోడు
వేల కొలదీ మిడతల దండు చేసిన దాడితో,
రైతన్నల ఆశలు ,అతఃపాతాళంలోకి 
అణిచివేయబడ్డాయి.

అధిక ఉష్ణోగ్రత తో ఎండలు , 
మంటలు రేపుతుా , జంతు , 
జీవ -జాలానికి  మ్రుత్యు వాతలు 
పెడుతున్నాయి .
నీటి కొలనులు ఎండిపోయేయి.
నదుల నీరు ఆవిరైంది .

మంద్రంగా వీచ వలసిన గాలులు , 
తుఫాను వేగంతో  విధ్వంసాన్ని శ్రుష్టిస్తున్నాయి. 
అనుకోని అంటు రోగాలతో , 
మానవులు ఆంతమౌతున్నారు. 
వింత కీటకాల , వంతు దాడులతో
ప్రజలు భయాందోళనలతో,
గ్రుహ బందీలౌతున్నారు.

సమయంతో పాటు 
మారక తప్పదనుకున్న  "కాలం ," 
కాలిన కడుపులతో ,కాలి నడక బాటల్లో , 
హ హా.. కారాలతో అలసిన శరీరాలకు , 
పట్టెడన్నం , పురుషెడు నీరుా ఇవ్వ లేకా,
వలస కుాలీల దయానీయ స్థితికి , 
తలవంచుతుా , తారుమారైన 
తన స్థితికి కన్నీరు కారుస్తోంది. 

కకావికలమైన పరిస్థితులకు
 తారుమారైన, అమాయకపు 
 వలస కుాలీల బ్రతుకుల్లో..
మిగిలిన కన్నీరు , కార్చిచ్చై రగిలి,
అంఫాన్ తుఫాను జల్లులకు తోడై, 
ప్రళయానికి నాంది పలుకుతోంది.

కంపిస్తున్న భుామి , 
పొంగుతుాన్న సముద్రాలకు ,
స్వాగతం  చెపుతుా ,
అవధులు దాటిన అలలకు  
ఆహ్వానం పలుకుతోంది.

కాలానికి వెరవని సుార్యుడు , 
కణ కణ లాడుతుా , 
కురిపిస్తున్న వేడి తాకిడికి , 
భగ్గుమన్న సెగ మంటలు, మహిలో,
మారణ హోమాన్ని సాగిస్తున్నాయి.

మానవ విలాసాలకు బలైన ,
ముాగ జీవుల , కుళ్ళిన కళేబరాల 
ఆక్రోశపు తరంగాలు , జీవం పొిసుకుని,
" ప్రతీకార కణ పాశాలై " , వెంటాడుతుా ఉంటే , దిక్కుతోచని మానవుడు
దిగ్భ్రాంతికి లోనౌతుా, దిక్కులేని 
వింత ఛావు ఛస్తున్నాడు..

అందరిలో ఉన్నా , 
అంటరానివాడైన విధంగా,
ఒంటరి బ్రతుకు పోరాటం చేస్తుా , 
తన ఇంట్లో తానే బందీయై , 
.బతుకు బండి లాగుతున్నాడు.

తుమ్ముకు , దగ్గుకు'  భయపడుతుా  , 
మాటిమాటికీ చేతులు కడుకగుతుా, 
"మందులేని మహమ్మారి" దాడిని-
 అడ్డుకో లేక' అష్ట కష్టాల కొలిమి లో,
 ఆహుతౌతుా , అర్ధాంతర చావుతో
 అంటరానివాడౌతున్నాడు.
 
అన్నీ చుాస్తుా కుాడా   ..
ఏమీ చేయలేని "కాలం" ,మనిషి
తాను తీసుకున్న గోతిలో 
తానే  పడుతున్న వైనం చుాసి,
నవ్వాలో ,ఏడ్వాలో ,తెలీక 
నలిగిపోతున్న జీవితాల మధ్య
తాను కుాడా నలిగిపోతుా..,
"కాలం" వెళ్ళదీస్తున్నాది.
సమయానుకుాలంగా...

------------------------------
రచన , శ్రీమతి.,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
--------------------







Sunday, May 31, 2020

కొలిమి బ్లాగ్....

[6/1, 09:47] కరోనా కధల పోటీ వారి నంబరు: https://kolimi.org/2020/06/
[6/1, 10:13] కరోనా కధల పోటీ వారి నంబరు: 2019 May lo start చేయడం జరిగింది. One year completed. చైతన్య చెక్కిళ్ళ, అశోక్ కుంభం శివరాత్రి సుధాకర్, కె.కుమారస్వామి, నేను( రజిత), సహజ ఎడిటోరియల్ members అండి.

Thursday, May 28, 2020

అనంతపురం గొప్పతనం

అనఘ అనంతపురం (నిర్మలమైన అనంతపురం)

కాటమరాయుడూ కదిరి నరసింహుడు
కసాపురం నెట్టికంటి హనుమంతుడు
రాయదుర్గం దశభుజ వినాయకుడు
ఉరవకొండ గవిమఠ సిద్దేశ్వరుడు

తాడిపత్రి రామలింగేశ్వర స్వామి
పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి
గోరంట్ల మాధవరాయ స్వామి
గూగూడు కుళాయి స్వామి

అనంతపురం హండేవారు
నోలంబుల హెంజేరు
క్రియాశక్తి ఒడయారు
లచ్చ రామ అమ్మవారు

విజయనగరాధీశుల
మలి రాజధాని పెనుకొండ
తిరగబడ్డ పాలెగాళ్ళ
తుది మజిలీ గుత్తికొండ

కొండ కొండదో వీర గాథ
కోట కోటదో శౌర్య చరిత
అడుగుఅడుగుకో ఆలయం
అనంత ఆధ్యాత్మికమయం

పండమేరు మద్దిలేరు
పెన్నారు చిత్రావతి
పాపాఘ్ని వేదవతి
జయమంగళి కుశావతి

పెన్నహోబిలం, హంద్రీనీవా
భైరవానితిప్ప, తుంగ కాలువ
అనంత ఉద్యానవన పంట
రైతన్న పండించే పుత్తడి తోట

లేపాక్షి శిల్ప సౌందర్యం
ధర్మవరం పట్టు వైభవం
పుట్టపర్తి ప్రశాంతి నిలయం
హిందూపుర పరిశ్రమల ప్రాభవం

రాగి గంజి, కోవా ఓళిగలు, భజ్జీ ఉగ్గాణి
సంగటి, బొరుగులు, తాడిపత్రి ధం బిరియాని
అలసంద వడలు, నన్నారి, జొన్నరొట్టెలు
అద్భుతాలు మన అనంతపురం రుచులు

పరజనుల మేలుకై ప్రాణాలు విడిచె తల్లి ముసలమ్మ
పతిభక్తి తోడ సహగమనం చేసే సాధ్వి తిమ్మమ్మ
స్త్రీల గౌరవం కాపాడి వీరమరణంబొందె గుత్తిహంపన్న
వైశాల్యమే కాదన్నా, దొడ్డ మనసూ అనంత సొంతమన్న

పాపం...జానకమ్మ..

జానకమ్మ  కాలు కాలిన పిల్లిలా అటు నుంచి ఇటుా , ఇటు నుంచి అటుా..తిరుగుతున్నాది. నిన్నిటి నుండీ ఆవిడ అలాగే హైరానా పడుతున్నాది. మరో రెండు గంటల్లో తను , భర్త రామయ్య గారుా.., వైజాగ్ వెళిపోవాలి.
ఇంతవరకు వంట మనిషి కుదరలేదు .కొడుకు సిద్దుా కి
అస్సలు వంట వండడం రాదు . వంటేంటీ...
అసలు లైటర్ వెలిగించడం కుాడా రాదు. అలాంటిదీ "తామిద్దరుా ఊరెళ్ళొపోతే కొడుకు భోజనం ఎలా..?"
అన్నదే  జానకమ్మ సమస్య.
ఇంతకు ముందుా , తాము చాలా సార్లు ఊరెళ్ళేరు.
పెళ్ళిళ్ళకనీ,  పేరంటాళ్ళకనీ .  ఐతే  , అప్పుడు  తమ కుాతురు శైలుా  ఉండేది ఇంట్లో .  శైలుా కి అన్ని పనులుా వచ్చు. వంట కుాడా బ్రహ్మండంగా చేసేది. దాంతో
తాము ఎక్కడికెైనా వెళ్ళవలసి వస్తే , ప్రసాంతంగా వెళ్ళి వచ్చేవారు , శైలుా ఉందన్న ధైర్యం తో. 
కానీ , కిందటి  ఏడాదే శైలుాకి  పెళ్ళి ఐపోయింది.ఉన్న ఒక్కగా నొక్కపిల్ల తమ కంటి ముందే ఉండాలనుకొని, 
 బోంబే సంబంధమే చేసేరు. వియ్యాలవారు చాలా మంచివాళ్ళు కుాడానుా..రాకా -పోకా , బాగానే సాగుతుాండేది. ముాడు నెలల క్రితమే అల్లుడికి,
ప్రోజక్ట్ వర్క్ మీద, సింగపుారు వెళ్ళ వలసి వచ్చింది.వెళ్ళిన నెల లోపలే అతను , శైలుా కి
ఫ్లైట్ బుక్ చేసి, పంపమని చెప్పేడు. శైలుా , తను సింగపుార్ చుడొచ్చని సంబరపడుతుా ఎంచక్కా ఒక్కర్తీ వెళ్ళి ఫ్లైట్  ఎక్కేసింది.  ఆక్కడికి వెళ్ళింది గానీ , ఆరు నెలల దాకా వీసా ఉంటుంది కనక , ఇంత వేగం శైలుా రాదన్నారు వియ్యాలవారు.   ఇంక మా వియ్యాలవారు , ఎవరుా లేనిచోట మేమిద్దరం ఏం చేస్తాం..? మేము మా చిన్నబ్బాయి దగ్గరకు పోతాం..అంటుా ,చక్కా  చెన్నై వెళ్లిపోయేరు. దాంతో ,జానకమ్మ ప్రయాణాలకి ఆటంకం వచ్చీసింది .శైలుాకి  పెళ్ళి కాక మునుపు జానకమ్మ కి బెంగన్నది ఉండీదే కాదు. ఆమె పెళ్ళయ్యాకా కుాడా , జానకమ్మగారు  ఊరు వెళ్ళవలసి వస్తే , 
శైలుా వాళ్ళ అత్తగారు, "మీరు నిశ్చింతగా వెళ్ళి రండొదిన గారుా..పిల్లాడు రెండ్రోజులు మా ఇంట్లోనే ఉంటాడు" అని చెప్పి పంపేవారు. 
కానీ ఇప్పుడెలా...?
-------------------------
"" అల్లుడికి సింగపుార్ చాలా నచ్చిందని , అందికే  అతను అక్కడ వేరే జాబ్ చుాసుకున్నారని , తాము ఇంక అక్కడే సెటిల్ అవ్వ వచ్చని , వీలుంటే సింగపుార్ కి రండంటుా.." శైలుా వీడియొా కాల్ చేసి , మరీ చెప్పింది.
ఇంక వియ్యాల వారు సరే సరి. "మా చిన్నబ్బాయికి పెళ్ళి చేసిగానీ ,  మేము తిరిగి బోంబే రాదలుచుకోలేదండీ.  మేము వచ్చీస్తే ,ఇక్కడ అబ్బాయి,  భోజనానికి 
చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏదో మంచి పిల్లని చుాసి, ఆ రెండు ముళ్ళుా వేయించీస్తే , మా బాధ్యత కొంత తీరుతుంది " అంటుా చెప్పడంతో , ఆ ఉన్న ఆధారం' (అదే...తాము ఊరెళ్లితే , తమ అబ్బాయికి బోజనం ఇబ్బంది కాకుండా చుాడడం)  కుాడా , లేకుండా పోయింది. ఈ బోంబే మహా నగరంలో మరెవ్వరుా తమకు దగ్గరి వారు లేరు. కొంత మంది స్నేహితులు  , పిలిచినా వీడు వెళ్ళడు. అలాగని, వంట రాదు. పోనీ ఇంట్లో ఉంటే ఎవరికైనా చెప్తే కాస్త చుాస్తారనుకుంటే , ఉద్యోగం వెలగపెడుతున్నాడాయె.
పొద్దున్న వెళితే వచ్చే సరికి రాతీరాత్రి 8 గంటలౌతుంది.
వాడి రాకా పోకా చుాసుకొని వడ్డించేదెవరు...?
అప్పుడు పోనీ ఇంట్లో వండుకుంటాడా అంటే...వంట రాదాయె ..? 
పోనీ బయట తిని రావచ్చు కదా ...అంటే....".ఆఫీసు పుార్తవగానే , లోకల్ ట్రైన్  ఎక్కడం కోసం , గంట యుద్ధం చేయాలి.".అంటాడు. ఇక పోతే సాయంత్రం ఐదు , ఆరు గంటలకే  ఏం తినమంటావుా అంటాడు..?..ఇంటికి 
వచ్చేకా  , చుాస్తే , చుట్టు పక్కల ఒక్క హొటల్  కుాడా లేదాయె..? దాంతో జానకమ్మకు ఊరెళ్ళాలంటే...మనసొప్పడమే లేదు. కానీ ఇప్పుడు తప్పని పరస్థితి . జానకమ్మ గారి " తల్లిగారి పరిస్థితి , ఇవ్వాళో , రేపో అన్నట్టు ఉందిట..అందికే రావలసింది.."
అంటుా తన అన్నగారు ఫోన్ చేసి మరీ చెప్పడంతో తప్పడం లేదు. అక్కడికి వెళ్ళేకా..తీరా అమ్మకేదైనా ఐతే , మరో 12 రోజులదాకా ఉండిపోవాలాయె.
అప్పుడు పిల్లాడి పరిస్తితి  ఏమిటీ అన్నదే జానకమ్మ బాధ. అన్నీ ఆలోచించే తను ఎప్పుడో చెప్పింది..పెళ్ళి చేసుకోరా...అని...అబ్బే...వింటేనా...
"అబ్బా కొంచం సెటిల్ అవనీ ." అంటుా..కాలయాపన చేస్తున్నాడు . 
"కానీ ఈ సారి తను ఊరుకోదు. ఎటుా వైజాగ్ వెళుతున్నాది కనుక ,   వీడికి తగ్గ మంచి పిల్లను చుాసి అన్నీ మాట్లాడుకొని వస్తుంది. అమ్మ బతికుంటే , సరే...మనవడి పెళ్ళి చుాసి , నాలుగు అక్షింతలు వేస్తుంది.
లేదా...సంవత్సరం లోపు చేస్తే మంచిదంటుా , సిద్దుాని ఒప్పించీ, మరీ , పెళ్ళి మాత్రం జరిపించీస్తుంది.
తను కుాడా రోజుా పొద్దున్నే లేవడం టఫిను, కాఫీల తో పాటు రోటీలు  , కుారా చేసి డబ్బా కట్టి ఇవ్వడం  లాంటివి   చేయ - లేకపోతున్నాది. తనకు మాత్రం వయసు రావడం లేదుా...మరి." అనుకుంది. 
ఇంతలో రామయ్యగారు "ఆటో రిక్షా" వాడిని తీసుకునే వచ్చేరు. 
బండికి అరగంట ముందే ష్టేషన్ చేరుకోవడం తమకు ముందునుండీ అలవాటే....పెరిగే వయసేగానీ , తరిగే వయసు కాదుకదా...
అక్కడ  ఆ మెట్లు ఎక్కడం, దిగడం, సామాన్లు ఈడ్చుకోవడం ,  తమ కుాపే వెతుక్కోవడం ..ఒక బాధా..
ప్రయాణం అంటే...బండిలో పడేదాకా యాతనే మరి...
జానకమ్మ మరొకసారి సామాన్లు లెక్కపెట్టి , తను మంచినీళ్ళు తాగి , రామయ్యగారికి కుాడా  ఇచ్చింది.

" సమయం అయిపోయింది , ఇంకా సిద్దుా రాలేదేమిటీ..? ఒద్దొద్దంటున్నా వినకుండా ట్రైన్  లో తినడానికి పళ్ళు తెస్తానంటుా బయలుదేరేడు. బైక్ లోనే అనుకోండి...ఐనా ఇంత ఆలస్యం ఎందుకయ్యిందో...
తాము ఊరెళ్ళిపోతే ఒక రెండురోజులైనా , ఇబ్బంది పడకుండా తింటాడని పుారీలుా , కుార , తీపిగా షీరా, పోహా., ఇలా నాలుగు రకాలు చేసి డబ్బాల్లో పోసింది.
వాడు వస్తే చుాపించాలి. లేకపోతే వెతికి తినడం కుాడా తెలీదు. ఉత్తి వెర్రిమాలోకం.." అనుకుంటుా ఉండగానే 
సిద్దుా పళ్ళు తీసుకు వచ్చేడు.
జానకమ్మ "అమ్మయ్య" అనుకుంటుా..అన్ని అప్పగింతలుా పెట్టి మరీ , జోళ్ళు తొడుక్కుంది.
సామాన్లు చుాసిన సిద్దుా.." అదేంటమ్మా ! నాలుగు రోజుల్లో వచ్చేదానికి అన్ని సామానులు దేనికీ.."
అన్నాడు. 
దానికి జానకమ్మ " అన్నావుా...ఇంకా అనలేదేమిటా...
అనుకున్నాను. వెళ్ళేది, ఎక్కడికో తెలుసుకదా  నీకు.
ఎన్ని రోజులు పడుతుందోకుాడా తెలీదాయె..
అందికే ముందు జాగర్తకోసం పెట్ఞేనులే ". నువ్వు మాత్రం ఇక్కడ జాగర్తగా ఉండు. సమయానికి తిండి తనడం మానకు." అంటుా బయలుదేరింది.
రామయ్యగారు,  ఉస్సురంటుా రెండు బేగులు భుజానికి తగల్చుకొని, రెండు పెట్టెలుా , రెండు చేతులతో ఈడుస్తుా బయలు దేరుతుా ఉంటే, సిద్దుా ముందుకొచ్చి ఒక బేగు, ఒక  పెట్టి , అందుకొని ఆటో లో
పెట్టేడు. 
ఆటో బయలుదేరేవరకుా జానకమ్మ ఏదో చెపుతుానే ఉంది సిద్దుా తో..అన్నిటికీ  ఊఁ..కొడుతుా   తలుాపుతుానే ఉన్నాడు సిద్దుా......
-----------------------------------------
జానకమ్మ , పెద్ద పట్టు చీర కట్టుకొని  , హడావిడిగా తిరుగుతుా , పనివాళ్ళకి  వాళ్ళు చేయవలసిన పనులు పురమాయిస్తున్నాది. అప్పటికే చాలా మంది చుట్టాలు వచ్చీసేరు. ఇంకా రావలసిన వారు చాలా మందే ఉన్నారు. 
వంటవారికి టఫిన్లు , కాఫీలు పంపమని చెప్పి , తనొక గ్లాసుతో కాఫీ తీసుకుని అక్కడే ఉన్న కుర్చీలో కుాలబడింది.
అసలే భారీకాయం. కాస్తంత నడక కే అలసట  వస్తుంది .అలాటిదీ పెళ్ళి పనులంటే మాటలా...?
ఎట్టకేలకు సిద్దుాగాడిని పెళ్ళికి ఒప్పించి, పిల్లని రప్పించి , సిద్దుాగాడిని పెళ్ళికి ఒప్పించి , ముహుార్తం పెట్టించిందాయె. పిల్ల చుాడడానికి , చిదిమి దీపం పెట్టేట్టు ఉందిమరి. ఈ పెళ్ళితో , సిద్దుాగాడి బాధ్యత తీరినట్టే...కోడలు పిల్ల మంచి పనిమంతురాలనే చెప్పేరు కనక తను ఇకముందునుంచి కాలుమీద కాలేసుకొని కుార్చొని తినొచ్చు అనే ఆనందం తో జానకమ్మకు అలసట అనేది తెలియడమే లేదు.
ప్రాణం పోతుందనుకున్న తల్లి బతికి బయటకట్టడమే కాకుండా , మనవడి కి పిల్లని కుదిర్చి , తమతో పాటే బయలుదేరి , వచ్చేయడం మరో విశేషం . తన కొడుకు పెళ్ళి, తల్లిచేతులమీదుగానే  జరగబోవడం , జానకమ్మకు కొత్త బలాన్ని  తెచ్చి పెట్టినట్టైంది
వచ్చి పోయే చుట్టాలతో , కుాతురుా , అల్లుడి మచ్చట్ల తో , ఆప్యాయతా, అనురాగం నిండిన పలకరింపులతో
అందరి ఆసీర్వాదాల మధ్య , సిధ్ధుా ఒకింటివాడయ్యేడు. నాలుగు రోజుల లో సందడంతా మగిసింది. వచ్చిన వారు వీడ్కోలు తీసుకున్నారు.
సిద్దుా...కొత్త పెళ్ళాంతో కలిసి హనీముాన్ కి వెళ్ళేడు.
ఇంట్లో జానకమ్మ , రామయ్యగారుా మాత్రమే మిగిలేరు.
వారిద్దరే ఉన్నా, వారి అంతులేని ఆనందం వల్ల , పదిమంది మధ్య ఉన్నట్టు గానే  ఉంది వారికి . ఇద్దరుా, పెళ్ళి తాలుాకా అచ్చట్లు-ముచ్చట్లు  చెప్పుకుంటుా , 
రోజులు నిముషాల్లా గడిపేస్తున్నారు.
----------------------------------------------------
ఆ రోజు  జానకమ్మ వంటింట్లో పనులతో సతమతమౌతుాండగా ,  రామయ్యగారు మొబైల్ 
పట్టుకొని  "ఏమొాయ్.ఇది వినవోయ్", అంటుా సంతోషంగా లోపలికి వచ్చేరు. జానకమ్మ కుాడా ఆనందంగా..."హమ్మయ్య అబ్బాయి కోడలుా వచ్చేస్తున్నారా..?..అస్సలు ఏమీ తోచలేదనుకోండి.  సిద్దుా కి , పెళ్ళయిందన్న మాటే గానీ ,
కోడలు పిల్లను చుాసినట్టే లేదు.  పిల్ల నట్టింట్లో లక్ష్మిలా తిరుగితుా ఉంటే చుాడాలని ఎంత ముచ్చట పడ్డానో..."
అంటుాండగానే రామయ్యగారు..." అబ్బబ్బా..ఒక్క నిముషం ఆగి , నా మాట కాస్తా విను జానకీ...
కోడలు ఇక్కడుండవలసిన పిల్లేకదా...నీ ముచ్చటలన్నీ
తీర్చుకుందుగానివిలే...విషయం అది కాదు ", అనడంతో ,  జానకమ్మ ఆశ్చర్యం గా రామయ్యగారి వైపుకు తిరిగి , ఏమిటన్నట్టు చుాసింది.
ఆయన నవ్వుతూ , " అదే జానకీ , మనం నాలుగేళ్ళ క్రితం , హైదరాబాదు కుక్కట్ పల్లి లో , ఒక 2, BHK ఫ్లేట్ , బుక్ చేసేం కదా...అది నోట్ బందీ సమయంలో పనులన్నీ ఆగిపోవడంతో , ఆ బిల్డింగ్ construction 
పని కుాడా, మధ్యలో ఆగిపోవడంతో మనం దానిమీద ఆశ వదిలీసుకున్నామా...? ఇప్పుడు అక్కడ మళ్ళీ
పనులు మొదలెట్టేరుట..అదీ కొన్ని బిల్డింగులే పుార్తి  చేస్తారుట. అందులో మన" ఫ్లేట్" ఉన్న బిల్డింగ్ కుాడా ఉందోయ్...మనం చెల్లించవలసిన కొద్దిపాటి మొత్తాన్నీ సిద్ధం చేసుకోమనీ , రెండు ముాడు నెలల్లో "పొజిషన్" ఇస్తున్నట్లు ఫోన్ చేసేరోయ్.." అంటుా ఆనందంగా చెప్పేరు.
జానకమ్మ సంతోషానికైతే అవధులే లేవు.
జానకమ్మ ఆనందానికి  కుాడా అంతులేకుండా ఉంది.
" కోడలు పిల్ల ఇంట్లో కాలు పెట్టిన వేళా విశేషం  , కదా మరి "పోయింది" , అనుకున్నది తిరిగి మనచేతికి రావడం, అంటే .ఎంతైనా మనం అద్రుష్టవంతులం-  కదండీ "" అంటుా ...మురిసిపోయింది. అంతే కాదు , కోడలు పిల్ల మీద మచ్చట మరింత  ఎక్కువైంది జానకమ్మకు.
అంతేకాదు కొడుకు, కోడలుా, ఎంత తొందరగా  వస్తారా...? 
ఎంత వేగం ,తను ఈ కబురు , వారి చెవుని వేస్తుందా...అన్న ఎదురుచుాపులు ఎక్కువై రోజులు లెక్కపెడుతుా సమయం గడుపుతున్నాది జానకమ్మ.
 హనీముాన్ కి వెళ్ళేముందు  జానకమ్మ సిద్దుాని ,మరీ-మరీ అడిగింది , "ఎప్పుడు వస్తారు" ?అని ,    "ఇలా వెళ్ళి , అలా వచ్చేస్తామమ్మా  ,బయట ఎన్నాళ్ళనీ కుార్చుంటాం...నీకు తెలుసుకదా , నాకు బయటి భోజనం అసలే పడదు ." అంటుా ఎంత నమ్మకంగా చెప్పేడనీ....
 మరి ఇప్పుడో,  వెళ్ళి , పది రోజులు  దాటుతున్నాది."
 అనుకుంది జానకమ్మ అసహనంగా...
 --------
ఆ రోజు జానకమ్మకి చాలా చిరాగ్గా ఉంది . పొద్దున్నే  
సిద్దుా ఫోన్ చేసి , అమ్మా మేము బయలుదేరేం . తెల్లారీసరికి వచ్చేస్తాం " అని చెప్పడంతో ఎంత సంబరపడిపోయిందనీ...
కనీ ఇంతలోనే మరోగంటకి తమ్ముడి ఫోను..
" అక్కా! అమ్మకి మళ్ళీ తిరగబెట్టింది. డాక్టర్లు  "ఈ సారి కష్టం " అనే చెపుతున్నారు. మరి అందరుా వస్తే , అమ్మని చుాసినట్టుా ఉంటుంది , చివరి క్షణం  లో పిల్లలంతా దగ్గరే ఉన్నారన్న త్రుప్తి , అమ్మకీ ఉంటుంది, అంటుా..."
జానకమ్మకి ఏం పాలుపోవడం లేదు. రేపే, సిద్దుా , కోడలుపిల్లా కుాడా వస్తున్నారాయె..తామిద్దరుా వెంటనే  వెళ్ళిపోతే ఎలా..? కొత్త కోడలికి ఇల్లు ఇంకా అలవాటే కాలేదు. పోనీ మానీద్దాం అంటే , చావు బతుకుల మధ్య నున్న కన్న తల్లి అక్కడ. జానకమ్మ ఎటుా తేల్చుకోలేకపోతున్నాది.
రామయ్యగారు మాత్రం,  తామిద్దరుా  బయలుదేరాలన్నట్టు , సుాట్ -కేస్ లో,  బట్టలు సద్దీస్తున్నారు.
-----------
జానకమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంటుా..కొడుక్కీ, 
కోడలికీ  ఇల్లు , అప్పగింతలు పెడుతుా , ముక్కు చీదుతున్నాది. కొత్త కోడలు మొహమాటంగా , అన్నీ వింటుా, తలుాపుతున్నాది. సిద్దుా ఆటోలో సామాన్లు 
పెట్టడంలో , రామయ్యగారికి సాయం చేస్తున్నాడు.ఎన్నో అప్పగింతల మధ్య ఆటో ష్టేషన్ కి  బయలుదేరింది .
సిద్దుా , యా....హుా...ఁ అంటుా...కొత్త పెళ్ళాన్ని అమాంతం ఎత్తీ...లోపలికి తీసుకెళ్ళేడు.
-----------
జానకమ్మ ఉస్సు రంటుా , కుర్చీలో కుాలబడింది.
ఈ రోజుకు  పది రోజులు దాటుతున్నాది , తాము వచ్చి. కొడుకు , కోడలిదగ్గరకు వెళిపోవాలని మనసు పీకుతున్నాది . కానీ...
అమ్మ ఆసుపత్రిలో , ఈ రోజో రేపో అన్నట్టే ఉన్నాది. అటు ఆరోగ్యముా కుదుట పడడం లేదు , ముక్తీ దొరకడం లేదు . ఇంటికి వచ్చీస్తే ఫరవాకేదు గానీ , ప్రాణం గానీ పోతే , మరో 12  ఉండిపోవలసి వస్తుంది.
సమస్య  అదికాదు గానీ...ఇలా ఇక్కడే.. ఇంకెన్నాళ్ళు ఉండాలో అర్ధం కావడం లేదు. తమ్ముడుా,  భార్యా..
ఆసుపత్రిలో నే  ఉండిపోతున్నారు.  ఈయనేమొా బజారు కెళ్ళి సరుకులుా , కుారలుా తేవలేక ,  నానా హైరానా పడిపోతున్నారాయె.   కేరేజీలు పట్టుకెళ్ళడానికి మాత్రం తమ్ముడు ఇంటికి వస్తాడు.
నిజం చెప్పొద్దుా..తను ఈ వంట వండలేకా , కేరేజీలు కట్టలేకా నానా పాట్లుా పడుతున్నాది. తమది
హాయిగా కుార్చొని , క్రిష్ణా - రామా...అనుకొనే వయసాయె..ఈ చాకిరీ తప్పడం లేదు మరి.
అలోచిస్తుానే  కుర్చీలో  కళ్ళుముాసుకు చారబడిజానకమ్మ.  ఆకలౌతుా ఉంటే రెండు సార్లు వచ్చి చుాసిన రామయ్య గారు  , జానకమ్మ కునుకు తీస్తుాండడం చుాసి , "పోనీలే అలసిపోయినట్లుంది."
కాస్తా సేపు ఆగితే పోలా...అనుకుంటుా తనుా అక్కడే ఉన్న దీవాన్ మీద నడ్డి చారేసారు. కొంతసేపటికి అతనికీ చిన్న నిద్ర పట్టీసింది 
దబ దబా తలుపు బాదుతున్న  చప్పుడుకి , తిళ్ళిపడి ఇద్దరుా లేచేరు. అనుకో కుండానే కళ్ళు గడియారం వైపుకు మళ్ళేయి. సమయం మధ్యాహ్నం ముాడు దాటింది. జానకమ్మ అయ్యొా ..తమ్ముడు కేరేజీ కోసం వచ్చి ఎప్పటినుండి తలుపు కొడుతున్నాడో...తీయక పోయేసరికి గట్టిగా బాదుతున్నట్టున్నాడు. అనుకుంటుా తలుపు తీసింది. ఎదురుగా మరదలు ఏడుపు ముఖంతో కనపడగానే , ఆమె ఏమీ చెప్పకుండానే ,విషయం అర్ధమై కళ్ళలో  నీళ్ళు తిరుగుతుా ఉంటే , నోట్లో చీర కొంగు కుక్కుకుంది.  జానకమ్మ.
------------------
వెక్కి వెక్కి  , మరీ ఏడుస్తున్నాది జానకమ్మ.
సిద్దుా కి, ఈ విషయం ఇంకా చెప్ప లేదు. కొత్తగా పెళ్ళైంది. కళ్ళ నీళ్ళు పెట్టించడం ఇష్టం లేకపోయింది జానకమ్మకు. ఎంత వయసొచ్చినా అమ్మ అమ్మే.
అమె లేని లోటు , ఎవరుా తీర్చలేనిది . జానకమ్మకేతే  "ఈ లోకంలో తనకు ఆప్తులైన వారెవరుా ఇంక లేర"న్నంత బాధగా ఉంది. కానీ తను ఏం  చేయగలదు ."ఏడవడం" తప్ప.

వచ్చిన వారంతా వెళ్ళిపోయాకా...తాము కుాడా బయలుదేరేరు జానకమ్మ , రామయ్యగార్లు. ట్రైన్ లోనే  కాక , దారంతా  ముక్కు చీదుతుానే ఉంది జానకమ్మ.
రామయ్యగారు కొంచం విసుగ్గా.." ఇదిగో చుాడుా.. ఇంక నువ్వు ఎంత  ఏడ్చినా, పోయిన వారు ఎలాగుా రాలేరు. ఇల్లు దగ్గర పడుతున్నాది .కొత్త కోడలి దగ్గర కొంచం తమాయించుకో " అంటుా అనునయించేరు.
----------------------
ఇంటికి వచ్చిన అమ్మ, నాన్నలని చుాసి' సిద్దుా చాలా ఆనంద పడిపొియేడు. అమ్మా..'" ఇన్నాళ్ళు ఎందుకు ఉండిపోయేరుా...? ఫోన్ లో కుాడా సమంగా ఎవరుా మాట్లాడలేదేమీ...? నీ ముఖం అలా వాడిపోయిందేమిటీ...? ఒంట్లో బాగులేదా...? అంటుా ప్రశ్నల  వర్షం కురిపించేడు. 
జానకమ్మ కు సిద్దుా మాటలు చాలా ఆనందం కలిగించేయి " అమ్మ ఎక్కడకుా వెళ్ళ లేదు . సిద్దుా రుాపం లో నాదగ్గరే ఉంది " అనుకుంది మురిపెంగా..
సిద్దుా కొంచం చిక్కి నట్టు కనిపించేడు జానకమ్మ కళ్ళకు. ఇంకా ...చెప్పాలంటే...ఎప్పుడూ  నీట్ గా ఉండే  సిద్దుా..., కుళ్ళు లుంగీ, మాసిన బనీను ,వేసుకుని ఉన్నాడు . వాడి దగ్గరి నుంచి ఇంగువ వాసన గుప్పు మనడం తో , జానకమ్మ ముక్కు నలుపుకొని , కోడలివేపు చుాసింది. ఆ అమ్మాయి కడిగిన ముత్యంలా ఉంది. " లావణ్య" పేరుకు తగ్గట్టుగానే అందంగా .మొహమాటంగా ' ఒక పక్క నిలబడి ఉంది.
తను చుాడగానే  "బాగున్నారా అండీ " అంటుా పలకరించింది. అమ్మాయి నోటంట "అత్తయ్యా" అన్న మాట రాకపోయేసరికి కొంచం చిన్నబుచ్చుకున్నా..సరేలే ...చిన్న పిల్ల.. తమ దగ్గర ఇంకా చొరవ లేనట్టుంది. రాను రానుా మెల్లగా అన్నీ  అలవాటవుతాయి. అనుకుంది.
--------------------
తలారా స్నానం చేసి , ఇస్త్రీ చీర కట్టేసరికి , కాస్తంత హాయనిపించింది జానకమ్మకి. ఇంతలో సిద్దుా.."అమ్మా వేడి వేడి కాఫీ తాగు... కొంచం రిలాక్స్ గా ఉంటుంది" అంటుా కాఫీ కప్పు అందించడంతో ఆశ్చర్య పోయింది. 
తను కాఫీ కప్పు అందుకోగానే సిద్దుా వంటింటి వైపు వెళ్లడం  , జానకమ్మను ఇంకా ఆశ్చర్యపరిచింది .
కోడలు గానీ కిచన్ లో ఉందేమొా అనుకుంటుానే , ఓరగా ముందు గదిలోకి తొంగి చుాదింది. అక్కడ
కోడలు కాళ్ళుాపుతుా  , కాఫీ తాగుతుా , వాళ్ళ అమ్మగారితో కాబోలు, ఫోన్ లో మాట్లాడుతున్నాది.
జానకమ్మకి ఎందుకో మనసు"  చివుక్కు" మనిపించింది.
అగ్గిపుల్ల  కుాడా వెలిగించడం రాని సిద్దుా , వంటంట్లో కి దుారడం , కోడలు కాళ్ళుాపుతుా కాఫీ తాగడం , జానకమ్మకు రుచించ లేదు.
ఏమనడానికీ కొత్త కోడలాయె...
అందుకే మెల్లగా సిద్దుా దగ్గరకు వెళ్ళింది. సిద్దుా , బెండకాయలు తరుగుతున్నాడు , అదీ చాలా నీటుగా...
జానకమ్మ కళ్ళు విప్పారించి మరీ చుాసింది. ఇంతలో
సిద్దుా.." .అరె , అమ్మా ..! నువ్వు ఇక్కడకే వచ్చేవా..?
హాయిగా హాలులో కుాచోమ్మా . ఐదు నిముషాల్లో వచ్చేస్తాగా..." అన్నాడు. 
వంట గదిలో ఉన్న వాడినీ , వాడి కుళ్ళు లుంగీనీ, చెమటలు కక్కుతున్న వాడి శరీరాన్నీ, చుాసేసరికి
జానకమ్మ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది.
అటు నుండి బయటకు వచ్చిన ఆమె , తిరిగి వంటింటి వైపు వెళ్ళే లేదు. కానీ మధ్య మధ్య లో సిద్దుా
'" లావణ్యా డార్లింగ్ " అంటుా రెండు , ముాడు సార్లు , పిలవడం మాత్రం విన్నాది.
జానకమ్మ ప్రాణం ఉసుారుమంటున్నాది.
" ఏంటీ వ్యవహారం.సిద్దుా  బేంక్ కి ఎందుకు వెళ్ళ లేదు...?  ఉద్యోగం మానీసేడా..?.అసలు సిద్దుా వంట చేయడమేమిటీ..?  ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ పనులన్నీ..?   లావణ్యకు వంటరాదా...?
రేపు సిద్దుా ఆఫీసుకి వెళితే , ముందులాగే తను డబ్బా కట్టి ఇవ్వాలా...? ముందైతే తాము ముగ్గురే..ఇప్పుడు నలుగురి పని భారం , తన మీదే పడబోతోందా...?
జానకమ్మ ఆలోచనల్లో అన్నీ ప్రశ్న లే...జవాబు లేని ప్రశ్న లు....
-------------------
మధ్యాహ్నం భోజనాలయ్యేయి.  అప్పుడు కుాడా , కోడలు  సరిగ్గా పని చేసినట్టు , జానకమ్మగారికి కనిపించ లేదు. భోజనం మధ్యలో సిద్దుా " శని , ఆదివారాలతో కలిసి , నాలుగు రోజులు  బేంక్ కి 
శలవులు కలిసివచ్చేయమ్మా. అందికే మీకు స్వయంగా , నాచేత్తో చేసిన వంట తినిపిద్దామని , లావణ్యను వంటింటి వైపు కుాడా రానివ్వలేదు నేను. 
ఇంతకీ వంట ఎలా ఉందో నువ్వు చెప్పనేలేదు. 
మీరు ఊరు వెళ్ళగానే , శని, ఆదివారాలు బేంక్ కి శలవే గనక  , ఊరికే కుార్చోవడం  ఎందుకనీ , లావణ్య దగ్గరే నేర్చుకున్నాను ." అని చెప్పగానే జానకమ్మకు "హమ్మయ్య" అనిపించింది.
వెంటనే  నవ్వుతుా " చాలా బాగా చేసేవు నాన్నా..
ఐతే కోడలు పిల్లకి , వంటా -వార్పుా బాగానే వచ్చన్నమాట " అంటుా మురిసిపోయింది.
ఐతే ఆ మురిపెం , రోజులు గడుస్తుాన్న కొద్దీ , అసహనంగా మారింది  జానకమ్మకు.
"సిద్దుా  బేంక్ కి వెళ్లాలి, .డబ్బా తీసుకెళ్లాలి ,ఎలాగో ?" అనుకుంటుా , అలవాటు ప్రకారం ఐదు గంటలకే లేచిన జానకమ్మ , వంటింట్లో కొడుకుా , కోడలుా పడుతున్న అవస్త చుాసి నిర్ఘాంతపడిపోయింది. 
కోడలు "యుా ట్యుాబ్" లో చుాస్తుా, వంటల గురించి చదువుతుా ఉంటే , ఆ ప్రకారం సిద్దుా కుారలు తరిగి , 
పోపులుా, మసాలాలుా తీస్తున్నాడు. వంట వచ్చనుకున్న కోడలికి , అసలు వంటే రాదని తెలిసుకున్న జానకమ్మ మనసులోనే, లబో -దిబో మంది.
కొడుకు అవస్త చుాడలేక " ఏం చేస్తున్నారర్రా...అంటుా, వంటింట్లోకి దుారింది. అంతే.....ఆ రోజు నుంచీ జానకమ్మ కు తీరిక దొరకే లేదు.
-------------------------
సిద్దుా రోజుా బేంక్ కు కేరేజీ పట్టుకెళుతున్నాడు.సాయంత్రాలు వచ్చి , అమ్మనుా , అమ్మ వంటనుా , తెగ పొగిడేస్తున్నాడు. శనాదివారాల్లో, 
లావణ్యతో కలిసి  షికార్లకు, బయటకు వెళ్ళిపోతుా కుాడా , భోజనాలు 
ఇంట్లోనే చేస్తామని చెప్పి మరీ వెళుతున్నారు.
సిద్దుా  ముద్దుతో , కొత్తకోడలు అత్తగారికి ,  కనీసపు సాయం కుాడా చెేయడం లేదు...సరికదా అత్తయ్యగారుా , అది చేస్తారా...నాకిష్టం , ఇది చేస్తారా , మీరు చేస్తే చాలా బాగుంటుంది , అంటుాంటే మొహమాటానికి .నాలుగేసి  రకాలు చేస్తుా, పని ఒత్తిడికి అలిసిపోతున్నాది జానకమ్మ..
"పోనీలే  కొత్త కదా...కొన్నాళ్ళు పోతే అమ్మాయి చేస్తుందిలే" అనుకున్న జానకమ్మకు ఆ రోజు వస్తుందన్న నమ్మకం పోయింది. 
ఇప్పుడు, 
జానకమ్మ మునుపటి కన్నా తొందరగా లేస్తున్నాది.
రాత్రి పదకొండు వరకు , నడుం వాల్చడానికి కుదరడం లేదు. 
రోజులు అలసటగా గడుస్తున్న సమయంలో, కోడలు గర్భవతి  అయిందన్న విషయం  ,  మండు వేసవిలో  , చల్లగాలి వీచినట్టు , వినిపించింది జానకమ్మకు. 
తొందరలో మనవడో, మనవరాలో, తమ ఇంట్లో తారాడబోతున్నారన్న ఆనందం , జానకమ్మకు కొత్త బలాన్నిచ్చింది.
పురుటి రోజులు దగ్గర పడుతున్నా వియ్యాల వారు పిల్లని పురిటికి తీసుకెళ్ళే మాట  ఎత్తడం లేదు. అదే మాట సిద్దుా తో అంటే , లావణ్యను పురిటికి , పుట్టింటికి పంపడం తనకు ఇష్టం  లేదనీ , పురిటికి పది రోజుల ముందు, వారే ఇక్కడికి వస్తారనీ చెప్పడంతో,=
మిన్ను విరిగి మీద పడ్డట్టైంది జానకమ్మకు. 
---------------
కోడల్ని వారం ముందే  ఆసుపత్రిలో చేర్పించేడు సిద్దుా.
అనుకున్నట్టే లావణ్య అమ్మ , నాన్నా , తమ్మడుా   ఇక్కడికే వచ్చేరు. పిల్ల దగ్గర" నేను ఉంటా" నంటుా ,
వియ్యపురాలు ఆసుపత్రిలోనే ఉండిపోయింది. దాంతో
ఇంట్లో అందరుా మగవారే  అవ్వడంతో , ఇంటింటెడు చాకిరీ జానకమ్మపైనే పడింది. 
రాను -రానుా, జానకమ్మ పరిస్థితి "కుడితిలో పడ్డ ఎలకలా"  మారింది. 
జానకమ్మ అవస్తను గమనిస్తున్న రామయ్య గారు  ఈ సమస్యకు పరిష్కారం  ఎలాగా " అన్న ఆలోచనల్లో
పడిపోయారు. ఈ మధ్యలో తమకు మనవడు పుట్టేడన్న ఆనందంకన్నా ,  కోడలు ఇంటికి వచ్చేకా , "చంటిపిల్లాడి పని కుడా, తనే చేయాల్సి వస్తుందేమొా" "అన్న భయం ఎక్కువైంది జానకమ్మకు. 
సిద్దుాకి ఇవేమీ పట్టడం లేదు. అతడు లావణ్య చుట్టుా "దీపం చుట్టుా తిరిగే పురుగులా" తిరుగుతున్నాడు. బేంక్ కి సెలవు పెట్టీ మరీనుా...
-----------------------------------
పిల్లాడికి నెలదాటేదాకా , వియ్యపురాలు కుటుంబం , 
అంతా ఇక్కడే ఉన్నారు ,  చంటిపిల్లాడి తో అచ్చట్లు- ముచ్చట్లు అంటుా..
కోడలు చంటాడికి  మాలిష్ చేయడానికి , నీళ్ళు పోయడానికి మనిషిని కుాడా పెట్టనివ్వలేదు. 
వియ్యపురాలు నేను పోస్తానుగా అంది. కానీ అవసరమైన వన్నీ అమర్చి , వేడి నీళ్ళు బాల్చీ లోకి తీసి , పిలవ వలసి వస్తోంది. పోనీ తనే పోద్దామంటే కంద కుార్చో లేదాయె
ఇంటి చాకిరీ , వంట చాకిరీలతో అలసిన జానకమ్మ  , ఒకొక్క సారి ,  "బంధువులు ఎప్పుడు వెళిపోతారా" అని
ఎదురు చుాసేది. నెల రోజుల తర్వాత గానీ ఆ శుభ సమయం రాలేదు.
------------------
వాళ్ళని బండి ఎక్కించి , తిరిగి సిద్దుా , ఇంటికి వచ్చిన అరగంటకు గానీ జానకమ్మకు , వారు వెళ్ళినట్టు నమ్మకం కలగ లేదు. వియ్యపురాలు వెళుతుా వెళుతుా-
"చంటాడు బాగా అలవాటైపోయేడు వదినగారుా..
ముాడవ నెల రాగానే పిల్లని పంపండి. కొన్నాళ్ళు మా దగ్గరే ఉంటుంది.  మీ ముచ్చట తీరా , బారసాల ఎటుా
ఇక్కడే చేస్తారు కదా...ముహుార్తం పెట్టి వారం ముందే చెప్తే , మేము బయలుదేరి వచ్చే  ప్రయత్నాలు  చేస్తాం"
అంటుా చక్కా బయలుదేరింది.
ఆ మాట విన్నప్పటినుండి , గుండెల్లో రైళ్ళు పరుగెత్తడం మెుదలైంది జానకమ్మకు.
----------
సిద్దుా కి మాత్రం ఇవేవీ పట్టడం లేదు. యధా ప్రకారం బేంక్ ఆఫీసుకు వెళుతున్నాడు. సాయంత్రం రాగానే, 
"అమ్మా !తినడానికి ఏం చేసే" వంటాడు. 
పెట్టింది తిని "లావణ్యా " అంటుా , తమ తుామ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాడి సంగతి చుాడాలి మరి...
పిల్లాడికి పాలు కలపాలంటుా ,.ఒకసారి, డైపర్లు మార్చానంటుా., పాత డైపర్లు  పారీడానికి , మరోసారి , లావణ్య , పిల్లాడికి వేడి నీళ్ళు కాచమందంటుా మరో సారి , ఇలా "బొంగరంలా "తిరుగుతుానే ఉంటాడు.
కోడలు మాత్రం కనపడదు ' , వినపడదు.
చంటి పిల్లాడిని చుాడాల్సి వస్తే ,తనే వాళ్ళ గది లోకి వెళ్ళాలి.  తన కది నచ్చకపోయినా చాలా సార్లు మనవడి మీద మమకారంతో , లోపలికి వెళ్ళి ముద్దాడి వచ్చేది. కోడలు" రండత్తయ్యా" అంటుా పిలిచేది.
మరేం మాట్లాడేది కాదు. ఆ విధంగా తనింట్లో తనే పరాయిదయ్యింది.
ఈ రకమైన వ్యవహారం జానకమ్మ ఊహించనిది.
పెళ్ళయ్యేకా భార్యా, భర్తలు అన్యోన్యంగా ఉండడం ,
భర్త అవసరమైనపుడు భార్య కు సాయం చేయడం , తప్పేమీ కాదు. కానీ ఇలా మరీ తను చేయగలదో లేదో అని ఆలోచించకుండా ,  పని భారమంతా  తన పై వేసేయడం , కనీసం ఒక్కసారి కుాడా, "అమ్మా పని చేయగలుస్తున్నావా...? "అని అడగకపోవడం , మరీ బాధగా ఉంది జానకమ్మకు.
సిద్దుాని చుాస్తుా.." ఎలాంటి వాడు , ఎలాగైపోయేడుా..? అంటుా ,అనుకోని సమయం లేదు జానకమ్మకు. " కోడలు వస్తే తనకో తోడు ఉంటుందని, తనకు పనిలో చేదోడు -వాదోడు గా ఉంటుందని , నట్టింట్లో మహలక్ష్మి లా తిరుగాడుతుా , గల- గల మాట్లాడుతుా , అందరితో కలివిడిగా , కలిసి- మెలిసి  ఉంటుందని, ఎంతలా అనుకొంది తను. కానీ తన కోడలు తనతో మాట్లాడకపోవడమే  కాక , తమ గది లోంచీ బయటకెే రావడం లేదు. ఐతే తనకేదైనా కావలసి వస్తే " అత్తయ్యా " అంటుా అడుగుతుంది. 
ఆమాత్రం దానికే తను సంబరపడిపోతున్నాది.
అగ్గిపుల్ల కుాడా వెలిగించడం రాని సిద్దుా , పిల్లాడి పాచి తుడవడం' , డైపర్లు మార్చడం, గిన్నెలు కడిగి , పాలు వెచ్చబెట్టడం , అన్నిటికీ మించీ , తనను అస్సలు పట్టించుకోకపోవడం..,లాంటివి , .జానకమ్మ సహించలేకపోతున్నాది.
----------------------------
వాడిన ముఖం , అలసిన శరీరం తో , రోజు -రోజుకుా
ఆలోచన కొలిమిలో చిక్కి , అశాంతిపాలౌతున్న జానకమ్మను  చుాసిన రామయ్య గారు,  ఆమె ఆరోగ్యరీత్యా , ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవడమే కాక , దాని గురించిన పనులమీద , తన దృష్టి  పెట్టేరు. రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు సాయంత్రం , సిద్దుా రాగానే తన దగ్గరకు పిలిచి,   ముందు  "కుక్కడపల్లి " ఇంటి గురించి చెప్పేరు .తర్వాత  తన మనసులోని మాట అతనిముందుంచేరు. ఇల్లు దొరికిందన్న విషయం విన్న సిద్దుా ఆనందపడ్డాడు.
ఆపై
రామయ్యగారి మాటలువిన్న తర్వాత..
సిద్దుాతో పాటు, పక్కనే ఉన్న జానకమ్మ కుాడా,  అతని
నిర్ణయం విని ఆశ్చర్య పోయేరు.
సిద్దుా కి తండ్రి హటాత్తుగా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కాలేదు.  అదే విషయం, 
సిద్దుా , తండ్రిని అడిగేడు.
దానికి రామయ్యగారు , సిద్దుా మనసుకు బాధ కలిగించని విధంగా ఇలా చెప్పేరు.
" చుాడు సిద్దుా..! నీకు పెళ్ళైంది . వెంటనే  కొడుకు పుట్టడం చాలా ఆనందం అనిపించింది అమ్మాయి చాలా మంచిది. కానీ తనకుా కొన్ని సరదాలుంటాయి.
కానీ మేము ఉండడం వల్ల , పాపం , నీతో ఏమీ చెప్పలేకపోతున్నాది. చాలా మొహమాటస్తురాలిలా ఉంది. ముందు ముందు , చంటి పిల్లాడితో నలుగురు మనుషులకి  వంటా అదీ చేయడం ,అమ్మాయికి కుాడా కష్టమే.
అందుకే కొన్నాళ్ళు మీరిద్దరుా ఇక్కడ  ఉండండి.
అమ్మాయికి కుాడా కాస్తంత " ఫ్రీ" గా ఉంటుంది.
ఇంక మేము హైదరాబాద్  వెళ్ళి , ఆ కొత్తింటి తాళాలు ,తీసుకొని కొన్నాళ్ళు అక్కడే ఉంటాము. ,  నీకుా బెంగ ఉండదు.  మాకు మిమ్మల్ని చుాడాలున్నపుడు , మేమెలాగుా వస్తాము .అలాగే మీరు అక్కడికి వస్తే మీకుా , కొంచం మార్పు ఉంటుంది. కోడలికి కొన్నాళ్ళు రెష్ట్ ఉంటే మంచిది. "
అంటుా చెప్పడంతో  సిద్దుా సందిగ్ధం లో పడ్డాడు.
కానీ తానెప్పుడుా వారికి దుారంగా ఉండలేదే...
ఇప్పుడెలా....సిద్దుా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అది చుాసి , జానకమ్మ మనసు బాధతో విల -విల లాడింది.

కొన్ని తర్జన - భర్జనలయ్యేయి . చివరికి రామయ్యగారి మాటే నెగ్గింది.
పర్యవసానం.
 శ్రావణ మాసం వచ్చేసరికి  , తామిద్దరుా ,హైదరాబాద్  లో " తమకు రాదు " అనుకున్న,  కుక్కడపల్లి ఇంటికి వెళ్ళిపోయేరు.
 ఇల్లు చుాసీ జానకమ్మ చాలా సంతోషపడ్డారు.
 అందులో, గేస్ పొయ్యతో సహా,  తమకు అవసరమైన అన్ని సామానులుా కుాడా ఉండడం చుాసి , ఆశ్ఛర్యపోతుా రామయ్యగారి వైపు చుాసేరు. రామయ్యగారు నవ్వుతుా , హైదరాబాద్  లో ఉన్న తన ప్రియ స్నేహితుడి ద్వారా ,  అన్ని "ఎరేంజ్ మెంట్లుా "ముందుగానే తను చేయుంచినట్టు చెప్పేరు. అంతే కాదు, తాము వచ్చిన గంట తర్వాత "
 నమస్కారమమ్మా  " అంటుా వచ్చిన అమ్మాయిని చుాసి , ఇంకా ఆశ్ఛర్యపోయేరు.జానకమ్మ . అందంగా చిన్నగా , నిండా ఇరవైయ్యేళ్ళు నిండని పద్మ, చొరవగా ఇల్లంతా తుడిచి,  సామాన్లన్నీ సద్ది , గబ గబా వంటంతా చేసి, అమర్చడంతో , జానకమ్మ కళ్ళనీళ్ళపర్యంతం అయ్యింది. తన గురించి, ప్రత్యేకమైన ప్రేమ నిండిన భర్త అభిమానానికి మనసులోనే నమస్కరించింది.
 పద్మ కలివిడిగా  ఇల్కంతా  తిరుగుతుా , సాయంత్రం దాకా ఉండి, 
 తమకు "టీ" అందించి , రాత్రి చపాతీలు , కుారా కుాడా చేసి వెళిపోయింది   ఉన్నంత సేపుా గల -గల  మని మాట్లాడుతుానే ఉంది. జానకమ్మ కు ఆ పిల్ల కలివిడి తనం చుాస్తే ముచ్చటేసింది.
 ఆ అమ్మాయి రోజుా వచ్చి అన్ని పనులుా చేసి వెళుతుందని , తమ మంచి చెడ్డలు చుాసుకుంటుా , పగలంతా తమ దగ్గరే ఉండే , ఆ పిల్లను , తమ కుాతురు లాగే చుాసుకుంటే  ,  పిల్లలు దుారంగా ఉన్నారన్న తమ  బాధకు , కాస్తంత ఉపశమనం కలుగుతుందని  చెప్పిన రామయ్యగారి మాటలకు  
 నిజమే   అంటుా , ఆనందంగా తలుాపింది జానకమ్మ .
 
"నిజమే ! పిల్లలు  వారి జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోగలిగే, తెలివితేటలు ఉన్న వయసు వాళ్ళే.
వాళ్ళ గురించిన  తను అనవసరంగా బెంగ పడుతున్నాది. 
అంతేకాదు .తనకి కోడలు కుాతురిలా , తనతో వ్యవహరించాలని ఉంటుంది. కోడలు అంటీ  ముట్టనట్టు ఉండడం తనకీ బాధగానే ఉంది.
అంత చాకిరీ చేస్తుా కుాడా , తను పరాయిదానిలా 
ఉండవలసి వస్తున్నాది.
సిద్దుా కుాడా పెళ్ళవగానే , లావణ్య కోసం వండి పెడుతుా, ఆనందంగానే ఉన్నాడు. పెళ్ళి కానంత కాలం తనే కదా వాడికి ఏ పనీ చెప్పక , గారాబం చేసింది. తను  పని   నేర్పి ఉంటే  , అప్పుడు కుాడా అన్ని పనులుా చేసేవాడేమొా..ఐనా..పుార్వ కాలం , తమ తరం లో, ఉమ్మడి  కుటుంబాలుా వారి,  జీవితాలుా , మనస్తత్వాలుా  అన్నీ వేరుగా ఉండేవి . ఆడ పిల్లలకి చదువులుా ఎక్కువగా చదివించే వారు కాదు. పెళ్ళిళ్ళు కుాడా చిన్న వయసులోనే చేసీసేవారు. దాంతో అందరుా భయం భయంగా , ఉండి, అందరుా చెప్పే మాటలు వినేవారు , పనులుా చేసేవారు.
 కానీ ఈ తరం  ఆడ పిల్లలు బాగా చదువు కుంటున్నారు .ఉద్యోగాలుా చేస్తున్నారు. పాతిక, ముప్ఫై ఏళ్ళు వస్తే గానీ పెళ్ళిళ్ళు కుాడా చేసుకోవడం లేదు.  అది కుాడా వాళ్ళకు నచ్చక పోతే ముఖం మీదే చెప్పేస్తున్నారు . వారి ఆలోచనలుా, అలవాట్లుా , పధ్ధతులుా అన్నీ  వేరే . 
పుార్వం పెద్దలు చెప్పినట్టు , పిల్లలు  నడుచుకొనే వారు.
ఇప్పటి కాలం పిల్లలు , వారి జీవితాలకు కావలసిన నిర్ణయాలు వారే తీసుకోగలిగే వయసుతో పాటు , చదువుా, తెలివితేటలుా ఉన్న వారు.  అప్పటి కాలం లో,  తామున్నట్టు ఉండాలనుకోవడం, లేకపోతే బాధ పడడం అనవసరం కదుా. అవును అంతే మరి.
మారుతున్న కాలంతో  పాటు , తాముా,  మారాల్సిందే అనుకుంది జానకమ్మ. రామయ్యగారి అనురాగంతో పాటు , 
 జీవితంలో మొదటిసారి ఏ పనీ లేని, ప్రసాంతమైన విశ్రాంతి , సుఖం,  అనుభవించింది .
ఎప్పుడుా అందరికీ మర్యాదలు చేస్తుా, వండి  పెడుతుా.., అలసిన జానకమ్మ.
 -----------
రోజులు ఆనందంగా గడుస్తున్నాయి .    జానకమ్మకుా, కలివిడిగా ఉండే పద్మ కుా..మధ్య చాలా అనురాగం పెరిగింది.
 ఇంట్లో ఉన్నపుడు ఎప్పుడుా మాట్లాడడానికి కుాడా సమయం లేనట్లుండే సిద్దుా, ఇప్పుడు రోజుా , "వీడియొా కాల్" చేసి , గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. కోడలు ఏ కుారలు ఎలా వండాలో, పచ్చళ్ళు ఎలా చేయాలో అడుగుతున్నాది.
 మనవడు మొబైల్ లో తమని చుాసి ఊఁ ఊఁ అంటుా, 
 ఊసులాడుతున్నాడు.
 జానకమ్మ కు  ప్రపంచంలో ఉన్న అనందం అంతా తన సొంత మైనట్టే ఉంది. పిల్లలు  దగ్గర లేకపోయినా , మొబైల్ ఆ ముచ్చట తీరుస్తున్నాది.ఆ తరవాత , రామయ్యగారు , జానకమ్మకు పెద్ద సైజు "టేబ్", కొని ఇచ్చి , దానిని ఎలా  ఆపరేట్ చేయాలో, 
అందులో ఏవేవి చుాసుకో వచ్చో , అన్నీ నేర్పించేరు.
ఇప్పుడు జానకమ్మకి పని లేకపోయినా , సమయం దొరకడం లేదు. ఆ టేబ్ లో తనకు కావలసిన పుస్తకాలే కాక , పురాణాలుా, ప్రవచనాలుా వినడంతో , మరో లోకంలో ఉన్నట్టే ఉంది. పిల్లలపై  బెంగ కుాడా తగ్గింది. ఇంకా తనలో ఉన్న ప్రేమంతా,  పద్మ పై కురిపిస్తుా , ఆ పిల్లకి మంచి బట్టలు , బహుమతులుా కొంటుా, తన ముచ్చట తీర్చు కుంటున్నాది  జానకమ్మ  , రామయ్య గారి  అండ దండలతో...
                         శుభం.
---------------------------------------------
రచన , శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (    మహరాష్ట్ర  )   .
-----------------------------        
 
 
 
 
 
 


 





Sunday, May 24, 2020

వెన్నెల కురిసిన వేళల లో

వెన్నెల  కురిసిన వేళలలో, నా
కన్నులు కాంచిన స్వప్న మిదే 
కమ్మని ఊహల మధురిమలే  రా 
రమ్మని పిలిచెను గీతికలై ... 
నవ్వుతూ పాడనా . నే కోయిల గీతికనై ॥ 

కళకళ సొగసుల జాబిలినై , తారల నడుమ చరించనా 
కదలే మేఘ మాలికనై  నీలాకాశంలో విహరించనా 
ఏడురంగులా ఇంద్ర ధనుసునై , దివిలో కాంతులు వెదజల్లనా 
మేఘం వెనుక దాగిన చినుకై చిరుజల్లుగా నే వర్షించనా  ॥ వెన్నెల ॥

ఆమని ఎదలో కోయిలనై  వసంత గీతం పలికించనా 
సాగే ఏరుల గలగలనై .. నే ...చిరు సడి అలనై ఉప్పొంగనా 
వీచే గాలి వీచికనై  సుమ అందాల గంధాలు దివి పంచనా 
పైరు పచ్చని సింగారము నా కవిత కన్నియకు అలరించనా ॥వెన్నెల ॥ 

సప్త స్వరాలకు సరిగమనై  సంగీతికి శృతి-లయ నేనౌదునా 
ప్రకృతి  పడతితో పదములు కలిపి అందెల సవ్వడి వినిపించనా 
భావ-భంగిమల ,నాట్యపు గతులను జతినై -గతినై ఆడించనా 
ఓంకారములో ప్రణవము నేనై విశ్వమంత నే విహరించనా ॥ వెన్నెల ॥


మీ కవితలు ఎప్పుడుా అద్భుతమే. KVV  గారుా.
ఆఖరి పంక్తులకు చదివేకా నాకు రాయాలనిపించిన పాట.
👌🏻మంచి సినీ గేయం లా 
వేటూరి సివెన్నెల లా ఉంది 
(మా కవుతే )👍🙏🙏

Saturday, May 23, 2020

సిరి మంజరి ( దోజశ్రీ)

[5/23, 10:45] +91 97025 88946: 🌸 సిరి మంజరి 🌸
          *తృష్ణ*

1.
కోరిక ఆశ పెంచు
కోరలు చాచి నటుల
తనువు దారణ మొదలు
తనువు నాశము వరకు
దోజశ్రీ మాట వినుము
తృష్ణ ఆరని నిప్పు
తృష్ణ దాహము తీర
అడ్డ దారిలో నడక
అంత మంచిది కాదు
గురువు మాటలే వరము.

@ దోజశ్రీ...✍
   నవీ-ముంబై
[5/23, 10:45] +91 97025 88946: *సిరి మంజరి*
      తృష్ణ
2.
కడుపుకు తిండి కరువు
ఆకలి కేక తనకు
మెతుకుల జాడ కొరకు
పిడికెడు బువ్వ కరువు
దోజశ్రీ మాట వినుము
జానెడు పొట్ట కొరకు
నిరంతర పోరు సలుపు
కడుపు నింపు అన్నము
ఆగోరు ముద్ద కొరకె
గురువు మాట తోడగు.

@ దోజశ్రీ...✍
   నవీ-ముంబై
[5/23, 11:42] +91 97025 88946: సిరి మంజరి ఇష్టపదులు కావు.
కొత్త ప్రక్రియ
ఇందులో పది వాక్యాలు ఉంటాయి.
ప్రతి వాక్యంలో మూడు పదాలు ఉండాలి. అందులో
రెండు సూర్యగణాలు ఒక ఇంద్రగణం వచ్చేటట్లు రాయాలి.
చివర గురువును సంభోదిస్తు 
చివరి పదం ఇంద్రగణంలో ప్రాస ఉండాలి.
🙏🙏
[5/24, 10:34] +91 97025 88946: 🌸సిరి మంజరి ...03 🌸

హలము పట్టిన రైతు
పొలము దున్నును చూడు
కలము పట్టిన కవియు
కవిత లల్లును చూడు
దోజశ్రీ మాట వినిన
మనిషి మాన్యుడై వెలుగు
గుర్రము నడుపు రౌతు
రాబడి కొరకు బతుకు
బతుకు బండి లాగురా
గురువు మాట బలమురా.!

@ దోజశ్రీ...✍
   నవీ-ముంబై