శీర్షిక .
సాక్ష్యం .
---------
ఎన్నటికీ ఆరని
నిత్యాగ్నిహోత్రం , నిరంతర
మారణ హోమాల మహా యజ్ఞం.
అల్లలాడే జనసముాహాల
శోకాలకు సాక్ష్యం.॥
గద్దె కెక్కిన గెద్దల రాజ్యంలో
ఆకలి గొన్న నాయకత్వానికి
ఆహుతైన, అల్పజీవుల ఆక్రోశం,
గతుకు జీవితాల, చితుకు
బతుకుల చావులకు సాక్ష్యం ॥
మంతనాల జగతిలో ,
మారని న్యాయ వ్యవస్థలకు ,
మానాన్ని కోల్పోయిన-
తీర్పు, న్యాయం కోసం
నిరంతరం కార్చే కన్నీటి
కథనాలకు సాక్ష్యం ॥
సాముాహిక బలాత్కారాల-
బలవన్మరణ పీడలతో ,
నిండిన అబలల ఆర్తనాదాలు,
ఏసిడ్ దాడుల కాలిన వాసనలు ,
కృుారమైన కామాంధుల నికృష్ట
చర్యల, నీచ కృత్యాలకు సాక్ష్యం ॥
వలస జీవుల వాస్తవ గాధలు
వార్తా పత్రికల వార పేజీల్లో,
ఆకలి చావుల ఆర్తనాదాల-
అక్షరాశృవులై నిలిచిపోవడం
నిత్య జీవిత సత్యాలకు సాక్ష్యం ॥
ఆకలి తీర్చే రైతన్నల కలలు -
పేక మేడలై కుాలే దారులు ,
నిస్సహాయపు ఆత్మహత్యల
నిర్జీవపు శరీరాలు ,పట్టెడన్నం కోసం
పాకులాడిన జ్ఞాపకాలకు సాక్ష్యం ॥
వీర సైనికుల వరుస సమాధులపై
లిఖింపబడే వారి నామాలు,
బీటలు బారిన పాచి గోడల
కలుగుల్లో, మరుగుపడిన
వారి ఉనికికి సాక్ష్యం ॥,
సమాధుల పేటికల్లో ,
నామ మాత్రంగా నిలిచిపోయే
అమర వీరుల అస్థిపంజరాలు,
వారి దేశభక్తి నిదర్శనమైన -
నిలువెత్తు త్యాగాలకు సాక్ష్యం ॥
హక్కుల పోరాటాల బాటల్లో
అణచివేతల అధికారపు వేటలు.
తాళలేని హింసలకు
మతిచెలించిన మానవత్వం-
కార్చే కన్నీటి శాపాలకు సాక్ష్యం ॥
నశించిన న్యాయ పోరాటంలో ,
నాశనమౌతున్న ధర్మ వ్యవస్థకు-
ప్రకృతి చేసే వికృత వినాశనం-
అవనిని ఆదుకోలేని
వివసత్వానికి సాక్ష్యం .॥
అధికారపు అరాచకాలకు-
అంతమౌతున్న అమాయక ప్రాణుల-
అంతులేని హాఁ హాఁ కారాల
అసహాయపు కసి, మందులేని
మహమ్మారిగా మారిన సాక్ష్యం ॥
వేల వేదనల కన్నీటి "కీటకం,"
"కరోనా" పేరుతో విజృంభిస్తున్న
కాల సర్ప విషపు " కణం."
జాతి, మత భేదా లెరుగని
కాల "మృత్యు పాశం" ॥
మందులేని మహమ్మారియై
మనమధ్యకు దుాసుకొస్తున్న
మారణ హోమపు
"మహా భయంకర శాపం"
పాప కర్మఫలానుభవాన్ని
కాచి వడబోసి చుాపిన,
"కఠిన సత్యానికి సాక్ష్యం "
---------------------------
-------------------------------------
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..( మహరాష్ట్ర ).
-------------------------------
No comments:
Post a Comment