నాకు వడ్డేపల్లి కృష్ణ గారి గురించి
ఎక్కువగా తెలియదు. సినీ రంగంలో పాటలు అని పేర్లు
పడ్డప్పుడు " వడ్డేపల్లి కృష్ణ,
డా.సినారె " అని చదివాను .
పాత సినిమాలు నాకు భలే
ఇష్టo.
7 వ.తరగతి నుండి కాలేజిలో B.Ed. కంప్లీట్ చేసే వరకు ప్రతి
వారం తప్పనిసరిగా పాత సినిమాలు చూసేవాన్ని.
సినీపాటల రచయితలు
సీనియర్ సముద్రాల,జూనియర్
సముద్రాల, వీటూరి, ఆరుద్ర,ఆత్రేయ, డా.సినారె,
వేటూరి సుందరరామమూర్తి,
సిరివెన్నెల సీతారామశాస్త్రి,
డా. వడ్డేపల్లి కృష్ణ, ఇత్యాది మహానుభావుల గురించి
' సినీరంగం మాస పత్రికను
తెప్పించుకుని చదివే వాడను.
డా.సినారె షోలాపూర్ నాల్గు
మార్లు వచ్చాడు. ఆయన వచ్చిన
ప్రతిసారి నేను కలిసే వాడను.
ఆయనతో దిగిన ఫొటోలు
నే పుట్టిన గ్రామంలో వున్నాయి.
మేమందరమూ ఉద్యోగరీత్యా
చెల్లచెదరమయ్యాం. ఆ ఫొటోలు
చెదలు తినేశాయి.
ఆంద్రఓపెన్ యూనివర్సిటీ
మొదటి ఛెయిర్మన్ డా.సినారె
గారే. సీనియర్ NTR ముఖ్య
మంత్రి అయ్యాక డా.సినారె కు
ఎన్నో పదవులు ఇచ్చారు.అవన్నీ
డా.సినారె ఓపికగా నిర్వహించారు.
డా.సినారె సినీరంగ ప్రవేశం
" గులేబకావలి " తో జరిగినది.
అన్ని పాటలు హీట్ అయ్యాయి.
అసలు సీనియర్ NTR గారే
డా.సినారె ను సినీరంగ ప్రవేశం
చేయించారు.
ఒకవైపు ఉద్యోగ భాద్యత,మరో
సినీ పరిశ్రమ అతనికి ఇబ్బంది
పెట్టేవి. హైదరాబాద్ లో
విమానo ఎక్కి మద్రాసు చేరు
కునేసరికి ఆ ప్రయాణoలోనే
సినీపాటలు నాలుగు రాసేవారు.
రామారావు గారి సినిమాలకు
డా.సి.నా.రె. పాటలు తప్పని
సరి. ఆయన అందరి నటులకు+
నటీమణులకు పాటలు రాసి
వారిని అందలమెక్కించాడు.
ఆయనది కరీంనగర్ జిల్లాయే.
రెడ్డికుటుంబంలో పుట్టిన
మొగిలిపువ్వ.
డా.వడ్డేపల్లి కృష్ణ గారిది కరీంనగర్
జిల్లాయే. పద్మశాలి కుటుంభంలో
పుట్టిన పద్మo. డా.సినారె
వడ్డేపల్లి కృష్ణ గారికి ఆదర్శo,
మంచి గురువర్యులు.
డా.వడ్డేపల్లి కృష్ణ గారిని కలువాలని విశ్వ ప్రయత్నం చేశాను
ఎప్పుడూ ఆయన కవిత్వంకు
పలానా పట్టణములో సత్కరాలు
సన్మానాలు అని విని నిరాశతో
వెనుతిరిగే వాడిని. ఆయనను
కల్వనిదే నేను ఊరుకోను ,కన్ను
మూయను.
డా.వడ్డేపల్లి కృష్ణ గారు రాసిన
పుస్తకాలు.
1)కనరా నీ దేశం, 2) అంతర్మథనం
3) గేయ నాటకలు,4)వసంతోద
యం,5)రాగ రథం (లలిత గీతాలు)
6)చిరుగజ్జెలు (బాలల గేయాలు)
7)హాలా హలం (కవితా సంపుటి)
8)మనసా తెలుసా? ,9)మబ్బుల
పల్లకి,10)రెండు సీనిమాలకు
కథ,మాటలు,పాటలు,దర్శకత్వం
అన్ని ఆయనే 1)'ఎక్కడికి వెల్తుందో
మనసు ' 2) 'లావన్య విత్ లవ్ బాయ్స్.
ఇంకా సాహితీ స్రవంతిలో ప్రచురితమైనవి......
1)స్వదేశీయo 2)విశ్వ కల్యాణo,
3)వివేకానంద విజయం,4)ఆమ్రపా లి,5)మహిళా అభ్యుదయo,
6)మాతృదేవోభవ పితృదేవోభవ,
7)శ్రీ కృష్ణదేవరాయలు,8)స్వరభారతీ 9)నృత్యహారతి,
10)సంక్రాంతి లక్ష్మి,11)చండాలిక,
12)ఉగాదివేళ వసంత హేల,
13)తెలుగు అభినయo,14)మానవత్వo......
ఇలా ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలు రాశారు.అవి కొన్ని వందలరెట్లు
మనుషుల్ని ప్రభావితo చేస్తాయి.
ఇక చాలు.చెప్పాలంటే ఎన్నో
వున్నాయి...........
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Thursday, May 30, 2019
డా॥ వడ్డేపల్లి క్రిష్ణ గారు.
Wednesday, May 22, 2019
సహజీవనం మంచిదే కదా..?
రాఘవరావుగారికి చాలా అసహనంగా ఉంది. చల్లని గాలి వీస్తున్నా , అతని చెవుల్లోంచీ
వేడి ఆవిర్లు వస్తున్న భావన.
ముఖం లో బాధ, కళ్ళలో నైరాస్యం , గుండెలో
వ్యధ రాఘవరావుగారిని స్థిరంగా కుార్చోనివ్వడం లేదు.
పొద్దున్న జరిగిన సంఘటన అతని ముందు
సినిమా రీలులా కనబడుతున్నాది.
ఈ రోజు ఆదివారం కావడం వల్ల కొడుకు కోడలుా
ఇంట్లోనే ఉన్నారు.సాయంత్రం ఎక్కడికో వెళదామనుకున్నారులా ఉంది , ఇద్దరుా అదే విషయం చర్చించుకుంటున్నారు.
మధ్య మధ్య లో కోడలు తనని ఎత్తి పొడుస్తుా ఏదో ఒక మాట ములుకులా అంటుానే ఉంది. కొడుకు కుాడా ఆమెకు వత్తాసు పలుకుతున్నట్టుగా అమెను ఏమీ అనకుండా తనవైపు గుర్రు గా చుాస్తున్నాడు.
పదేళ్ళ మనవడు ఇంటి లోగిలి లోనే మరో నలుగురితో కలిసి గోలగోలగా గోళీలాడుకుంటున్నాడు. పొద్దున్న పార్క్ లో పడిపోవడంవల్ల తలకు తగిలిన దెబ్బకు కట్టిన కట్టు లోంచీ, చిమ్మిన రక్తం , పైకి ఎర్రటి మచ్చలా కనిపిస్తున్నాది . మనవడి ఆట- పాటలను చుాస్తున్నా...పొద్దున్న జరిగిన సంఘటనే సినిమారీలులా కనపడుతుా ఉండడంతో..అతని. ఆలోచనల్లో , కారు మబ్బులు కమ్ముతున్నాయి.
అసలు కోడలు తనని అంత మాట అంటుందని కలలో కుాడా అనుకోలేదు.
అలా మరీ మరీ తలుచుకోవడంతో రాఘవరావుగారి కళ్ళలో నీళ్లు తిరిగేయి.
ఇంతలో "వెళ్ళోస్తాం నాన్నగారుా ,... జాగత్త..మేం వెళ్లేం కదా అని మీరు మళ్లీ ఆ పార్క్ కి వెళ్ళిపోకండి. నలుగురుా నాలుగు విధాలుగా అనుకోకముందే జాగర్త పడితే మంచిది "...అంటుాన్న రాజేష్ మాటలు విని రాఘవరావుగారు నిర్ఘాంతపోయేరు.
తన కొడుకేనా తనని ఇలా అంటున్నది. అదీ కోడలి మాట విని ..నిజమేంటో, కనీసం తనని అడగనైనా అడగకుండా.....ఎంత మాట అన్నాడు..? ఎంత అవమానం....!
అసలు తనే చాలా పొరపాటు చేసేడు. ముందునుంచీ , ఆమె తనపట్ల చుాపే నిరసన , నిర్లక్ష్యం...సుాటీ పోటీ మాటలుా , ఏవీ తను కొడుకుతో ఎప్పుడుా చెప్పలేదు . ఆఫీసు నుంచి అలసటతో వచ్చిన కొడుకుకు', రోజుా జరిగేవి అన్నీ చెప్పి బాధ పెట్టలేకపోయేవాడు. కోడలి వ్యవహారం తనపట్ల ఎప్పుడుా బాగాలేదు. చిన్న పిల్ల , కొన్నాళ్ళకు అన్నీ తనే తెలుసుకుంటుందన్న అశ - నిరాసే అయ్యింది.
అసలు తను వారితో కలిసి ఉండడమే ఆమెకు ఇష్టం లేదు , అన్నట్లు ఉండేది ఆమె వ్యవహారం
ఆమె కుాడా ఏదో చిన్న ఉద్యోగం చేస్తుా ఉండడంతో', తను ఆమె మాటలు వినీ విననట్టు ఊరుకున్నా...,
. రోజుా కాకి మీదో , పిల్లి మీదో , పెట్టి ఏదో ఒకటి అనడం ,తను బాధ పడడం, లాంటివి అలవాటు ఐపోయింది. దానికి తోడు
కళ్లు కుాడా సమంగా కనపడక , మొాకాళ్ల నొప్పులవల్ల సమంగా నడవలేక , వయసు పెరగడంతో...శక్తి తగ్గి మానసికంగానే కాక , శారీరికంగా కుాడా చాలా బాధ పడుతున్నాడు. తన బాధ చెప్పుకుందికి కుాడా ఎవరుా లేరు. భార్య
అన్నపుార్ణ పోయిన దగ్గరినుంచీ తను ఒంటరివాడైపోయేడు. ముందైతే రాజేష్ ఆఫీస్ నుంచి రాగానే , ఒక ఐదు నిముషాలు తనతో మాట్లాడేవాడు. కానీ రాను రానుా...తనను పలకరించడం మానీడమే కాక , తననసలు పట్టించుకోవడమే మానీసేడు. వీటికి తోడు తనకు అదనపు బాధ్యతగా....కొన్ని పనులు అప్పగించబడ్డాయి. ఇద్దరుా ఉద్యోగాలు చేస్తున్నారు కదా మరి....
అవి....
పొద్దున్నే లేచి గోశాల కి వెళ్లి , పాలు తేవడం , కుారలు కొని తేవడం , వాషీంగ్ మిషిన్ లో బట్టలు వేసి తీసి ఉతికి ఆరవేసి , ఆరేకా మడతలు పెట్టడం ( ఇవన్ని ఏదో పేద్ద పనులని అనకోవద్దట) మనవడిని స్కుాల్ కి తీసుకెళ్ళి తీసుకు రావడం , హోం వర్క్ చేయించడం..సాయంత్రాలు వాణ్ణి ఆడుకునేందుకు పార్క్ కి తీసుకెళ్లడం...రాత్రి పుాట వాడు పడుకునే దాకా మేలుకొని కధలు చెప్పి చెప్పి వాడిని నిద్ర పుచ్చడం , ఇవన్నీ కాక
కొడుకు, కోడలు , ఎక్కడికైనా కలిసి వెళ్లిన రోజు
ఇంటికి కాపలా ఉండడం..వారికి అప్పుడప్పుడు వండి ఉంచడం , లాంటివి పరిపాటయ్యేయి.
ఈ పనులన్నీ చేయలేక...వదల లేకా..తను పడే
బాధ ఎవరితో చెప్పుకోలేక , ఏదోలా బతుకు వెళ్ళదీస్తున్నాడు తను.. మనవడి ముద్దుా మచ్చట్ల తో కొంత ఊరట కలుగుతున్నాది కదా అనే త్రుప్తితో
కాలం వెళ్ళదీస్తున్నాడు.
------------*--------------------
అన్నపుార్ణ ఉండేటప్పుడు తనను ఎంతలా చుాసుకొనేదనీ....ఆఫీసు పని తప్ప , మరో పని చేసెరుగడే...అసలు ఆమె అంతపని ఎలా చేసేదో..
ఒక్కరోజు కుాడా తనకు ఆ ఆలోచనే రాలేదు.
ఎప్పుడుా చిరునవ్వుతోనే ఉండేది. కొంచం కుాడా సాయం చేసేవాడు కాదు.. సరికదా..ఎప్పుడుా తన తల్లీ ,చెల్లెళ్ళు , తమ్ముళ్ల కుటుంబాల రాకపోకలతో
వంటా వార్పులతో , ఆమె ఎంత అలసిపోయేదో...
కానీ ఏరోజుా కుాడా విసుక్కున్నట్టు కుాడా కనిపించేదికాదు. దాంతో ఇంటి పనేం కష్టం....
వండి వార్చేక పడుక్కోవడమే కదా... అనుకొనేవాడు తను.
అప్పుడే వరాజేష్ కి పెళ్ళి కుదిరింది . తామిద్దరుా ఎంత ఆనందపడ్డారనీ...
కోడలు వచ్చేకా , తను విశ్రాంతి తీసుకుంటానని...మనవలు, మనవరాళ్ళతో హాయిగా కాలం గడుపుతానని
పడ్డ సంబరం..ముాణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది అన్నపుార్ణకి. పెళ్ళయిన నెల్లాళ్ళకే , కడుపుతో ఉన్నానన్న సాకుతో బారెడు పొద్దెక్కినా లేవని కోడలిని
ఏమీ అనలేక కాఫీ తిఫిన్లతో పాటు...వంటపని ఇంటిపని పెరగడంతో అలసిపోయి , వడలిపోయేది. మనవడు
పుట్టేక , ఇంతమందికిీ , ఒకరి సంపాదనతో ఇల్లు గడవదనే పేరుతో , కోడలు ఉద్యోగంలో చేరడంతో, ఇంటి పని బాధ్యతంతా అన్నపుార్ణ భుజాలపై పడింది ..అన్నిటికీ మించి , చంటివాడి పని తో అన్నపుార్ణ సతమతమయ్యేది. రాత్రిళ్ళు పిల్లవాడిని తమ దగ్గరే వదిలి , తలుపేసుకునేవారు కొడుకు, కోడలు.
చంటి వాడి ఏడుపు తో, సీసాపాలు పడుతుా.
తడి బట్టలు మార్చుతుా...రాత్రిళ్ళంతా నిద్ర ఉండేదికాదు...అన్నపుార్ణకి..అప్పుడు కుాడా
తను కొంచం సాయం చేస్తే ఆమెకు కాస్తా విశ్రాంతి దొరుకుతుందని తెలుసుకోలేకపోయేడు . ఆమె అలసిన శరీరం అనారోగ్యానికి గురై...శాశ్వత విశ్రాంతి కోరింది. ఆమె దుారమైన తర్వాత గానీ తనకు తెలియలేదు , ఆమె లేక, తనెంత ఒంటరో....
----------------------------------
అత్తగారు పోయి , అన్ని పనులుా మీద పడడంతో
కోడలి నైజం బయటపడింది. కుార్చొని ఉన్న తనకు వండి పెట్టడం ఆమెకు భారమనిపించేది. దాంతో ఒకొక్కపనీ, బాధ్యత తనపై _ తనకు తెలీకుండానే
పుార్తిగా తనవైపోయేయి. అప్పుడు తనకు తెలిసి వచ్చింది ఇంటిపని ఎంత కష్టమొా..। ఎంత సహనం కావాలో..
అన్నపుార్ణ లేని జీవితానికి అలవాటు పడాలన్నట్టు,
అన్ని విషయాలలోనుా తను రాజీ పడి , ఎన్నో అవమానాల్ని సహించేడు. తన కొడుకే తనని
పట్టించుకోనపుడు, పై ఇంటినుంచి వచ్చిన పిల్ల...తన గురించి ఎందుకు ఆలోచిస్తుంది..?
ఆమెకు ఎందుకు లేనిపోని బాధ్యత.....?
అనుకుంటుా సద్దుకుపోయేడు.కానీ ఈ రోజు పార్క్ లో జరిగిన సంఘటన ...తను జీవితంలో మర్చిపోలేడు , సరికదా కొడుకుని కోడలినీ కుాడా ఎప్పటికీ క్షమించడు...క్షమించలేడు.....
-----------------------------------------------------------
రాఘవరావుగారి కళ్ల ముందు పొద్దున్న జరిగిన సంఘటన చెరిగిపొిని చిత్రంలా...మళ్ళీ మళ్ళీ కనపడసాగింది.
రోజుా పనిలో భాగంగా, ఈ రోజు కుాడా మనవడిని పార్కు కి తనతో తీసుకెళ్ళేడు. ఆదివారం కావడంతో పగలు మార్ణింగ్ వాక్ కోసం చాలామందే వచ్చేరు. పార్క్ లోకి రావడం తడవు మనవడు ఆటకై పిల్లల వైపు పరుగెత్తేడు.
తను ఎప్పటిలాగే మెల్లగా నడుస్తూ రౌండ్స్ కి బయలుదేరేడు. కొంతదుారం నడిచేకా అనాలోచితంగానే దుారంగా ఉన్న సిమెంట్ చప్టా వైపు చుాసేడు. అక్కడ ఆమె కుార్చొని ఉన్నారు. మనవడు చిన్న బాక్స్ లోంచీ ఏదో తీసి ఆమెకు తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మాటి మాటికీ కళ్లు తుడుచుకుంటుా తనకు వద్దన్నట్టుగా తల అడ్డంగా ఆడిస్తున్నాది.
ఆమె కన్నీళ్లు పెట్టడం చుాసిన రాఘవరావుగారి
మనసు అర్ద్రత తో నిండిపోయింది.
తను ఈ పార్క్ కి అన్నపుార్ణ చనిపోక ముందునుంచీ వస్తుా ఉండేవాడు. అప్పుడు ఆమెకుాడా, ఆమె భర్త తో కలిసి అప్పుడప్పుడు వస్తుా ఉండేవారు. ఇద్దరుా ఒకరిని మించి ఒకరు--- అన్నంత అందంగా , ఆనందంగా ఉండేవారు . వారు అక్కడ ఉన్నంతసేపుా చాలా మంది చుాపు వారిపై అనుకోకుండానే తిరిగేది . వారితో పాటు తను కుాడా , వారిద్దరినీ అప్పుడప్పుడు గమనిస్తుా ఉండేవాడు. వారిద్దరుా చాలా సేపు నడచి -నడచి విశ్రాంతిగా , ఒక చప్టా మీద కుార్చునేవారు. అది వారి నిత్య క్రుత్యం గా మారింది . వారిని చుాసేకనే తనకు అన్నపుార్ణ ని కుాడా
తనతో పాటు తీసుకురావాలన్న ఆలోచన కలిగింది.
కానీ ఇంటి పనులతో అలసిపోయిన పుార్ణ చాలా సార్లు రాలేననే చెపుతుండేది. కాలం ముందుకు సాగేకొలదీ ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా మార్పులు సంభవించేయి. తను ఒకరోజు పుార్ణతో కలిసి పార్క్ కి వచ్చి , యధాలాపంగా వారిద్దరుా కుార్చునే చోటువైపు ద్రుష్టి సారించేడు . కానీ అది ఖాళీగా కనిపించింది. ఎందుకో మనసు లో చిన్న అసంత్రుప్తి.
రోజులు , వారాలు , నెలలుా గడిచేయి. వారిద్దరుా మళ్ళీ కనపడలేదు. తనలో పార్క్ కి వెళ్ళాలనే ఆశక్తి కొంచం తగ్గినట్టనిపించింది ..అపుడప్పుడు వెళ్ళినా , అంతమంది మధ్యలో వారిద్దరుా లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడేది.
ఈ మధ్యలో కొడుకు రాజేష్ వివాహం అయి...మనవడు పుట్టడం.. మరి కొన్నాళ్ళకి.పుార్ణ తనని వంటరిని చేసి కన్నుముాయడంతో..ఇంటిలో లేని మనశ్శాంతి ని వెతుక్కుంటుా...తిరిగి రోజుా పార్క్ కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. మనవడు కొంచం పెద్దవగానే , తాతా నీతో నేనుా వస్తాను ...అని మొరాయించడంతో మొదలైన వాకింగ్ ..మనవడి ఆటపాటలతో మనసుకు కొంచం ఊరట కలగడం... పార్క్ కి వచ్చి పోయేవారితో .పరిచయాలు పెరగడం తో,
రోజుా అలవాటుగా మార్చుకున్నాడు.
పాత జ్ఞాపకాలు మరచిపోతున్న సమయంలో అనుకోకుండా కనిపించింది ఆమె...పార్క్ లో..
అదే చప్టా మీద కుార్చోనీ....
కానీ ఆమె పక్కన అతడు లేడు. ఆమె కంటిలో ఇదివరకటి వెలుగులేదు. ముఖంలో ఆనందం లేదు.
చిన్న పిల్లాడిని తనతో తెచ్చేది. అతడు ఆడుతుా ఉన్నంతసేపుా..నిరాసక్తంగా చుాస్తుా కుార్చునేది .ఆ పిల్లవాడే అలిసిపోయి , చేయిపట్టి లాగేక గానీ ఆమె ఇంటికి బయలుదేరేది కాదు. ఆ నడకలో కుాడా హుందాతనం తగ్గి , నీర్సంగా నడుస్తున్నట్లుగా ఉండేది. ఒకరోజు ఉండబట్టలేక
ఆమె భర్త గురించిన సమాచారం తెలుసుకుందామని ఆమె వైపుగా అడుగులేసిన తనకి , బొట్టు లేని ఆమె ముఖం అసలు విషయం
చెప్పకనే చెప్పింది. తన గుండెనెవరో మెలిపెట్టినట్లుగా బాధ....ఆమె ముఖం చుాడలేక
బరువుగా వెనక్కి తిరిగేడు.
ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న కారణంగా...పరిచయమైన వారిద్వారా తెలిసుకున్న
విషయం ఏమిటంటే...." వారికో కొడుకు ఉండేవాడని ,
కులాంతర వివాహం చేసుకున్నందువల్ల రేగిన కలతల కారణంగా కొడుకు నుంచి వేరయ్యారని...కొన్నాళ్ళకు , అనుకోని విధంగా ఆమె భర్త గుండెపోటుతో మరణించిన కారణంగా , ఆమెను కొడుకు , తన దగ్గరకు తీసుకు వచ్చేడని,
ముందు జరిగిన కలతలను మనసులో పెట్టుకొని ,
ఆమె కోడలు ఆమెను సుాటీ పోటీ మాటలతో బాధించడమే కాక , ఆమెను ఒక పని మనిషి కన్నా హీనంగా చుాస్తున్నాదని , కొడుకు ఎటుా చెప్పలేక మౌనంగా ఉంటాడని...ఈమె చాలా హీనమైన పరిస్థితిలో ఉందని " తోటివారు చెప్పిన విషయాలు విన్న రాఘవరావుగారి మనసు ముాగబోయింది.
జరిగిన , జరుగుతున్న సంఘటనలు ఒకటి కాకపోయినా, తమ ఇద్దరి జీవితాలుా విషాదభరితం కావడం వల్ల రాఘవరావుగారు ఆమె వియమై చాలా మధనపడేవారు. దానికి తోడు అప్పుడప్పుడు ఎవరో ఒకరి వల్ల , ఆమె గురించిన విషాద భరితమైన సమాచారాలు,
చెవిని పడుతుా ఉండడం తో రాఘవరావుగారు ఆమె దుస్థితి కి తల్లడిల్లిపోయేవారు. పార్క్ లో ఇంతమంది ఉన్నా....ఎవరికీ లేని బాధ , జాలి , ఆమెపై తనకెందుకో అని చాలా సార్లు అనుకునేవాడు . బహుశా తన జీవితం, ఆమెజీవితం , ఇంచుమించు ఒకే రకమైన
సమస్యలను ఎదుర్కుంటున్న కారణంగా తను,
ఆమె బాధని అర్ధం చేసుకోవడంవల్లనేమొా.....ఈ వేదన...
కానీ తానేం చేయగలడు ..అనుకొని.. ఒక దీర్ఘమైన నిట్టుార్పు తో తిరుగుముఖం పట్టేవారు.
ఆ రోజు ....
ఆమె మనవడికి ఏదో తినిపిస్తుా , ఏడవడం చుాసేడు. ఇంటికి వెళ్ళే సమయం ఆవుతున్నా ఆమె నిస్సత్తువగా అలాగే కుార్చొని ఉంది . మనవడు ఆమెని లేపడానికి నానా అవస్తలుా పడుతున్నాడు. ఇదంతా చుాస్తున్న తను
ఎవరి ద్వారానో విషయం తెలుసుకునే బదులు , తానే అసలు విషయం కనుక్కుందామనుకొని ,అటువైపుగా వెళ్ళేడు. ఆమెతో వచ్చే పిల్లాడిని (ఆమె మనవడిని ) దగ్గరకు పిలిచి విషయం అడిగేడు.
ఆ పిల్లవాడు ముద్దు ముద్దుగా తనకు తెలిసినంతవరకు చెప్పినది విన్న తర్వాత , ఆయన నోటంట మాట రాలేదు. ఇంతకుా తనకి అర్ధమైన విషయం ఏమిటంటే..
ఆమెకు నాలుగు రోజులబట్టీ జ్వరంగా ఉండడంతో
ఇంటి పనంతా చేసేకా , ఓపిక లేనందున , బాగా చలిగా కుాడా ఉండడంతో , బట్టలు ఉతకలేకపోయింది. దానితో కోడలు , బట్టలు ఉతికితేగానీ అన్నం పెట్టనంది. తర్వాత విసుక్కుంటుా పెట్టినా , స్వాభిమానం గల ఆమె పని ఐతే గానీ , అన్నం తిననని చెప్పి , పనంతా అయిపోయినా , అన్నం మాత్రం తినకుండా మనవడిని తీసుకొని పార్కు కి వచ్చింది . అదీ సంగతి.
చిన్న పిల్లాడి మాటలు మాటలు విన్న రాఘవరావుగారు , మనసులో ఎగసే బాధా- వీచికలని అణచుకుంటుా ఆమెవైపు చుాసేరు. అసలు
జ్వరం వల్ల ఏమీ తినాలనే అనిపించదు . కానీ
ఏదో ఒకటి తిని , మందు వేసుకొని విశ్రాంతిగా ఉంటే
కానీ జ్వరం , నీర్సం తగ్గవు. అలాటదీ అటువంటి సమయంలో ఇంటి పనంతా చేయాలంటే...ఎంత కష్టం . ఇటువంటి సమయాల్లోనే కదా పిల్లలు , పెద్దలను చుాసుకోవలసినది . అలోచిస్తుానే రావుగారు మెల్లగా తలెత్తి ఆమెవైపు చుాసేరు.
తిండి లేనందువల్ల ఆమెకు కళ్ళు తేలిపోతున్నట్టుగా ఉండి , అశక్తత తో లేవలేకపోతున్నట్టుగా కనిపించేరు . అంతేకాదు ..ఆమెకు తిరిగి ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యం కుాడా లేనట్టుంది ఆ చప్టామీద కుార్చునే తీరు.
రావుగారు ఇంక మొహమాటంగా , మౌనంగా ఉండలేకపోయేరు. దుారంగా మనవడు పిల్లలతో ఆటలలో నిమగ్నమై ఉన్నాడు. తాను ముందుగా ఆమెకు ఏమైనా కొని పెడితేకానీ ఆమె తన మనవడిని తీసుకొని ఇంటికి వెళ్ళే స్థితిలో లేదు. ఇంతపెద్ద పార్కు లో అంతమంది మధ్యలో, ఆమె వంటరిగా ఉండి బాధపడడంతో అతనిలోని మానవత్వం , అతనిని తట్టి లేపినట్టయింది.
రాఘవరావుగారు మరో ఆలోచనమాని , పార్కు కి
అటువైపుగా ఉన్న హోటల్ నుంచి కొన్ని తినుబండారాలు పొట్లం కట్టించి , మంచి నీళ్ళ సీసా కొని ,ఆమె వైపు నడిచేరు. ఆమె పక్కనే తను తెచ్చినవన్నీ ఉంచి,
ఆమెతో ఏదో మాట్లాడదామనుకునే లోపే , తనవెనుకగా, గోల గోలగా ఏవో మాటలు వినపడడంతో, వెనుకకు తిరిగి చుాసేరు. అక్కడ తన కోడలు , మనుమడిని పట్టుకొని ఏడుస్తున్నాది. మనవడి తల నుండి ధారాపాతంగా రక్తం కారుతుా ఉంది . అది చుాసిన రావుగారు ఒక్క ఉదుటన వారి దగ్గరకు చేరుకున్నారు. మనవడిని చేతులమీదుగా ఎత్తుకొని ఆసుపత్రికి పరుగుతీసేరు. వెనకాలే కోడలు , ఏదో అలా ..అలా .అంటుానే ఉంది .
రాఘవరావుగారికి అసలు ఎవరేమంటున్నారో వినిపించడమేలేదు. తన మనవడికి కట్టు కట్టించేదాకా , మనసు మనసులో లేకుండా పోయింది. డాక్టరు ఏమీ ఫరవాలేదని చెప్పేకాగానీ , ఆయన మనసు కుదుటపడలేదు. బాబుని తీసుకొని ఇంటికి వచ్చేరు. ఇరుగు-పొరుగు , చుాడడానికి వచ్చేరు. ఆ సమయంలో కోడలు వారితో చెపుతున్న మాటలు వినలేకపోయారు.
ఆమె మాటల లో తనమీద ఉన్న అక్కసంతా వెళ్ళ కక్కుతున్నట్లుగా ఉన్నాయి.
తను రోజుా వాకింగ్ కి సమయానికి ముందే ఎందుకు వెళుతున్నాడో , కోడలికి ఈ రోజే అర్ధమయ్యిందిట.మనవడిని ఆడించడానికానే నెపంతో , తనెవరో ఆమెతో పరాచికాలాడుతుాండేవాడట. అసలు ఆమె కొసమే తను పార్కుకి వెళ్ళేవాడట. ఆమె మొాజులో పడి , = మనవడిని పట్టించుకోనందువల్లే ఈ రోజు పిల్లాడికి ఈ విధంగా జరిగిందట. సమయానికి తను అటువైపుగానున్న పరిచయస్తులింటికి వెళుతుా వెళుతుా చుాడబట్టీ , బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లగలిగిందట...లేకపోతే రక్తస్రావం అయి బాబుకేమైనా ఘోరమే జరిగేదట...ఇలా ఎన్నో...ఎన్నెన్నో...
జరిగినది ఏమిటంటే.... పిల్లాడు ఆడుకుంటున్నాడని అనుకొని తను ఆమెకోసం తినుబండారాలు కొనడానికి బయలుదేరడం చుాసిన మనవడు .."తనను వదిలి నేను వెళ్ళిపోతున్నాను " అనుకొని , .తాతా ..తాతా తాతా..అంటుా వెనకాలే పరుగెత్తీ రావడం , అనుకోని విధంగా కోడలు అటువైపుగా వెళుతుా వాణ్ణి చుాడడం...అంతలోనే మనవడు పరుగెడుతుా పడిపోవడం జరిగి...నుదురు చిట్లడం జరిగిపోయింది ....
అసలు గేటు దగ్గర వాచ్ మేన్ , పెద్దలు లేకుండా పిల్లలెవరినీ బయటకు పోనివ్వడు. అందికే తనంత ధీమాగా వెళ్ళగలిగేడు. అదీకాక తను వాచ్ మేన్ తో చెప్పే వెళ్ళేడుకుాడా...అందికే
తాను ఇవేవీ గమనించలేదు.
అప్పుడు మొదలైన గొడవ...సాధింపు , ఇంటికొచ్చినా తగ్గలేదు. పైగా
రాఘవరావుగారికి ఆమె మాటలు వింటుా ఉంటే రోత పుడుతోంది . ఇన్నాళ్ళుా తనని ఎంత అవమానించినా మనవడిని ఒదల లేకా , కొడుకుకి దగ్గరగా ఉండాలనే తపనతో అన్నీ భరించేడు. కానీ ఈ రోజు ఇంత నీచమైన అభాండాన్ని వేసి అవమానించడం ....అస్సలు భరించలేడు. అసలు తనకేం తక్కువని ...? చేతికి 40, 000 పెన్షన్ వస్తుంది. అదంతా ఇంచుమించు ఇంటి ఖర్చులే పెడుతున్నాడు తను. ఉద్యోగాలపేరుతో ఇద్దరుా
ఇంటి విషయం పట్టించుకోరు. దానితో ఇంటి వెచ్చాలు, పాలు, కుారలు..వగైరాలన్నీ తనే చుాసుకుంటాడు. అదికాక ఇంటి పనీ..బయటిపనీ కుాడానుా...
ఇంత చేసినా , రెండుపుాటలా తనకు , తమతోపాటు పెట్టే పట్టెడన్నం కోసం, ఇన్ని మాటలు పడవలసిన అవసరం తనకు లేదు. తను బయటకు పోయి కుాడా దర్జాగా బతకగలడు. తన బతుకు ఆమెలా..కాదుకదా....
తిరిగి ,తిరిగి, ఆలోచనలు అనాలోచితంగా ఆమె వైపు మళ్ళడంతో, రాఘవరావుగారు ఒక్క ఉదుటని లేచేరు.
అవును...ఇంతకీ ఆమె ఇంటికి వెళ్ళేరా..? లేదా...?
తను తెచ్చినవి తిన్నారో లేదో..? తినకపోతే ...కళ్ళు తిరిగి పడిపోయారా..లేక ..ఏదైనా అఘాయత్వం తలపెట్టలేదుకదా..? లేక ఇంటికి కాక , ఎటైనా వెళ్ళిపోయారా...? ...అమెకు తనలా స్వతంత్ర్యంగా బతికే ఆధారమేదీ లేదే.. ? .ఆమెకు తనలా , పెన్షన్ కుాడా దొరకదే.. మరి అన్ని విధాలా అశక్తురాలైన ఆమె , ఇంటికి వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్ళగలదు.? ఒకవేళ ఆమె కళ్ళుతిరిగి పడిపోయుంటే ...ఆమె మనుమడు ఇంకా చాలా చిన్నవాడు కదా.. ఒక్కడుా ఇంటికి వెళ్ళగలడా ...? ఏమై ఉంటుంది..? అన్న ఆలోచనలు
చుట్టుముట్టేయి...
అయినా ఇంత నింద వేసిన తర్వాత , తను తిరిగి ఆమె ఏమైందో చుాడడానికి, ఎలా వెళ్ళగలడు..?
అసలు ఆమెకు తనకు సంబంధం ఏమిటి ?
అసలు ఇంతవరకు తనామెను పలకరించను కుాడా లేదే...తనకెందుకొచ్చిన బాధ.. తనకున్న సమస్యలతోనే తను సతమతమౌతుా ఉంటే....
ఇంకొకరి గురించి ఆలోచించడం అనవసరం కదా..
రాఘవరావుగారి
అలోచనలు ఒక కొలిక్కి రావడంలేదు...
అసహనంగా అటుా ఇటుా పచార్లు చేస్తుా .చాలా విషయాలు ..పదే పదే ఆలోచించి...చివరకు ఒక నిర్ణయానికి వచ్చేరు. అవును ..తను తీసుకున్న నిర్ణయం సరైనదే...తనింక ఈ ఇంట్లో , ఇంత అవమానింపబడ్డ తర్వాత , ఈ మనుష్యుల మధ్య ఒక్క నిముషంకుాడా ఉండలేడు. వాళ్ళు తిరిగి రాకముందే తను ఈ ఇంటినుండి వెళ్ళిపోవాలి.
నిర్ణయం తీసుకున్నదే తడవుగా...
రాఘవరావుగారు తనకు కావలసిన ముఖ్యమైన కాగితాలుా..బట్టలుా , ఒక పెట్టెలో సద్దుకున్నారు. ఏమీ మర్చపోలేదని అనిపించేకా , ఇంటికి తాళం వేసి , తాళం పక్కవారికిచ్చి తెలీని గమ్యంవైపు అడుగులేసేరు.
నడుస్తుా..నడుస్తుా..ఆలోచిస్తున్నారు. తనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి...? ఎక్కడ ఉండాలి..? తనలాంటి వారికోసమే వ్రుద్ధాశ్రమాలు ఉన్నాయా..?
తనక్కడికే వెళ్ళాలా..? వెళితే అక్కడ తనలాంటివారు చాలామంది ఉంటారుకదా..?
ఇక జీవితాంతం వారితోనే కలిసి ఉండాలేమొా...?
ఆలోచనల లో ఉండగానే , రాఘవరావుగారి కాళ్ళు ,అసంకల్పితంగా పార్కు వైపు అడుగులేసాయి.
చిరపరిచితమైన జాగాకి రాగానే , రాఘవరావుగారు ఆలోచనల్లోంచీ తేరుకొని , చుట్టూ చుాసేరు. అది తను రోజుా వస్తున్న పార్కు గా గుర్తించగానే...ఒక్కసారి ఆమె జ్ఞాపకాలు అతనిని చుట్టుముట్టేయి.
వద్దు వద్దనుకుంటుానే....
మెల్లగా నడుచుకుంటుా ఆమె రోజుా కుార్చునే చోటుకు వచ్చి ..అక్కడ ఆమె అలాగే కుార్చుని ఉండడం చుాసి నిర్ఘాంతపోయేరు.అమె మనుమడికోసం చుట్టూ చుాసేరు. కానీ ఎక్కడా కనపడలేదు. చుాచాయగా విషయం ఆకళింపు చేసుకున్నారు. అంటే...ఎవరో ఆమె ఇంటినుండి వచ్చేరు . కానీ ఆమెను తమతో రమ్మని పిలవకుండా , పిల్లవాడిని మాత్రం తీసుకొని వెళ్ళపోయేరు. అదే జరిగి ఉంటుంది.
మరి ఈమె విషయం ఏమిటి...? ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళగలదీమె..? తెల్లార్లుా ఇక్కడే గడిపినా , ఆ తర్వాత మాత్రం ఎక్కడికి వెళతారు..? ఆమెను ఈ చీకట్లో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టిన వారి దగ్గరకు (ఇంటికి ) ఈమె వెళ్ళమన్నా వెళ్ళరు. మరెలా..?.అన్నీ తెలిసి కుాడా , చుాస్తుా చుాస్తుా ఈమెను ఎలా వదిలి వెళ్ళడం..?
ఏంచెయ్యాలో తెలీకా...అలాగే నిల్చుండిపోయేడు తను. అప్పటికే చాలా చీకటి పడడంతో , పార్క్ లో జనం ఎక్కువగాలేరు. లైట్లు కుాడా చాలా మట్టుకు ఆర్పివేసేరు. ఆ చీకట్లో రెండు మొాకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని , చలికి ముడుచుకు కుార్చున్న ఆమెని చుాడగానే రాఘవరావుగారి హ్రదయం
ద్రవించిపోయింది.
మెల్లగా ఆమె దగ్గరగా వెళ్ళేరు. అడుగుల చప్పుడుకు తలెత్తిన ఆమెకు , ఎదురుగా ఉన్న
రాఘవరావుగారిని చుాడగానే , కన్నీరు ఆగలేదు.
రెండు చేతుల లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి
ఏడ్వసాగేరు ఆమె . రావుగారి హ్రుదయం బరువెక్కింది. చాలాసేపు ఆమె అలాగే ఏడుస్తుా కుార్చుంది. తర్వాత మెల్లగా తలెత్తింది. రావుగారు ఆలాగే మౌనంగా నిలుచునే ఉన్నారు. దీనంగా ఆయనవేపు చుాసింది. ..అంతే....
రెండు బాధాతప్త హ్రుదయాలు మోనంగానే మాట్లాడుకున్నాయి. కళ్ళతోనే కష్టాలు పంచుకున్నాయి. మనసుతో మనసు కలిపి ఓదార్చుకున్నాయి.
కొంత సమయం గడిచేకా..రాఘవరావుగారే ఆమెకు చేయి అందించేరో..లేక ఆమే వారి ఆసరా కోరిందో, తెలీదు కానీ , ఇద్దరుా ఒకరి చేయి ఇంకోకరు పట్టుకొని ముందుకు అడుగులేయసాగేరు.
రాఘవరావుగారి మనసు ప్రసాంతంగా ఉందిపుడు. తామిద్దరి మనసులోనుా ఏ విధమైన వికారాలు లేవు. కానీ ఇద్దరుా విధివంచితులే..తాము ఇకనుంచి ఒకరికి ఒకరై , నిశ్చింతంగా బతుకుతారు. ఇంక ఎవరికీ తలవంచేదీ లేదు , భయపడేదీ లేదు.
శాంతియుతమైన జీవితాన్ని గడిపేందుకు సహజీవనం చేస్తారు....అవును...
సహజీవనం...
తను ఈమధ్య తరచుగా వింటున్న మాట...
ఒకరి బాధ మరొకరు పంచుకొని , ఒకరు మరొకరికి జీవితాన్నిచ్చే సంజీవనం....అదే....సహజీవనం...
వయసు మీరిన తనవంటి వారు ...మరొక నిరాశా జీవితానికి , నేనున్నానంటుా జీవితాంతం వరకు ఇచ్చే ఖచ్చితమైన భరోసా...
అటువంటప్పుడు
" సహజీవనం "
మంచిదే కదా....
చాలా సంవత్సరాల తర్వాత , తను సరైన నిర్ణయం తీసుకున్నందుకు నిశ్చింతగా ఊపిరితీసుకొని ముందడుగు వేసేరు రాఘవరావుగారు .
సమాప్తం.
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. కల్యాణ్.
-------------+--------------------------------------------