Sunday, May 5, 2019

ఆండాళమ్మ..( ఐదవ భాగం ).

ఐదవ భాగం.
------------------
ఇదంతా చుాస్తున్న ప్రేక్షకులకి ,  కోలుకోడానికి
క్షణకాలం పట్టింది.

తాము చుాస్తున్నది కలా...?
నిజమా..? .

ఆండాళ్ళు ని, రాములవారు  అనుగ్రహించడం  ఏమిటి..? ఆమె మెడలో ఆ
పుాలదండ పడడమేమిటి...?

ఆమెకు "గానకోకిల"
అవార్డ్ రావడమేమిటి..?

ఇదంతా ఎలా జరిగిందసలు...? అని ఆశ్చర్య పోయేరు .

ఆపై
జనంలో కలకలం బయలుదేరింది.

ఇన్నాళ్ళుా తాము ఎన్నో రకాలుగా గేలి చేస్తుా  ,
వెక్కిరిస్తుా ,  ఆనందిస్తుా , వస్తున్న  ఆండాళ్ళు ,రామానుగ్రహం పొంది ,
రామభక్తురాలిగా గుర్తించబడింది..

ఆ మాట  వారికి అంతుచిక్కని రీతిలో,  ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆ ఆశ్చర్యం నుంచి అనుమానం , అనుమానం నుంచి భయం , భయం నుంచి  భక్తి  , భక్తి నుంచి భావోద్వేగం మొదలైంది  వారిలో...

అంతే జనంలో అనుకోని మార్పు,  హటాత్తు గా వచ్చేసింది.

"ఆండాళ్ళు...ఆండాళమ్మగా" మారింది.

"ఆండాళమ్మకుా...జై ", అన్న నినాదాలతో ఆ  ప్రదేశమంతా మార్మోగసాగింది.

అక్కడ మైకు పట్టుకున్న గోవిందం లో, హుషారు
చోటుచేసుకుంది.

అతను జనాలనుద్దేసించి  అరుస్తుా , కుార్చోమని చెపుతుా , ఆండాళమ్మ  పాడే
పాటలనీ ,  అందులోని భావాన్నీ  ,ఆమె లోని భక్తి నీ ఒకటే ఊకదంపుడుగా పొగడడం మొదలెట్టేడు.

సర్వం విష్ణుమయంగా గుర్తించడం వల్లే  ,ఆండాళ్ళు,
పాటల లో, భిన్నత్వం  లో ఏకత్వం చుాపేదన్నాడు. 

భగవంతుడు ఒక్కడే ,  గానీ పలు రుాపాల లో,
దుష్ట శిక్షణ , శిక్ష  రక్షణ  చేసేవాడు కనకనే , దైవ
సంకీర్తనలు చేసినప్పుడు ఆమె , అన్ని అవతారాలనీ కలిపి పాడేది గానీ , తేడాలు చుాపించేది కాదని , కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేడు.

అంతా అయనే  , అన్నిటా ఆయనే, అనే తత్వాన్ని  మనకు బోధించాలనే  భావం తోనే ,  ఆమె
భగవంతుని  అన్ని రుాపాలనుా , కలిపి ఒక్కటిగా
చేసి పాడేదనీ  సుత్తి కొట్టేడు.

మహా  జ్ఞానికనకనే ఆమె కి,   భగవంతునిలో తేడాలు కనిపించేవికావనీ ,భావోద్వేగం తో  కారే కన్నీటిని , తుడుచుకోకుండానే  చెప్పుకుంటుా, డప్పు వాయిస్తుా పోయేడు.

అప్పటి వరకు ఆమె పాటలను వింటుా,  ఎగతాళిగా నవ్వుకున్న జనం ఒక్కసారిగా ప్లేటు
మార్చేరు.

కొంతమంది భయంతో,  ఆ రాముణ్ణి క్షమించమంటుా  వేడుకొని చెంపలు వాయించుకున్నారు.

మరికొందరు ఆండాళమ్మను ...దైవాంశ--సంభుాతురాలిగా నిర్ణయించేసి మరీ దండాలు పెట్టేస్తున్నారు.

కొందరైతే " నేను ముందే చెప్పలే....
ఆమెలో ఏదో శక్తి ఉందనీ....ఎవరైనా నమ్మితే గదా..
అంటుా...దీర్ఘాలు తీస్తుా..వాపోతున్నారు

మరికొందరైతే   , తామెప్పుడో ఆమె మహత్యాన్ని గుర్తించినట్టు, మిగిలిన వారెవరుా నమ్మనట్టు
చెపుతుా , వారికి ఆమె గురించి అంతా తెలుసన్నట్టు గా చెపుతుా ,నానా తంటాలుా పడుతున్నారు.

జనంలో పిచ్చి ముదురుతున్న కొద్దీ , గోవిందం ,
పుానకం వచ్చినవాడిలా ఊగిపోతుా, ఏవేవో లొడ లొడ మని వాగుతుానే ఉన్నాడు.

అర్ధం-పర్ధం లేకుండా ఏదో  చెపుతుానే ఉన్నాడు.

ఇంతలో కొందరికి ఆండాళమ్మ గుర్తుకొచ్చింది.
నలుగురుా నాలుగు వైపులా పరుగెత్తేరు.

గర్భగుడిలో  అపస్మారకస్థితిలో ఉన్న  ఆండాళమ్మను , నీళ్ళు జల్లి లేపి  మరీ , పల్లకీలో  కుార్చోపెట్టి , పేద్ద ఊరేగింపుతో ఇంటికి తీసుకు వచ్చేరు  ఆండాళమ్మ భక్తులు.

------------------------------------------------------

అనుకోని సన్మానాలకీ, గానకోకిల అనే బిరుదుకీ,
ఆనందం తట్టుకోలేకపోయింది ఆండాళ్ళు.

దానికి తోడు,  మర్నాడు పేపర్లో మఖ్యాంశాలతో
పాటు , " రామభక్త శిఖామణి, గౌరవనీయులుా ఐన
ఆండాళమ్మవారికి , గానకోకిల పేరుతో ఘన
సన్మానం "--అని రాస్తుా , దానితో పాటు పేపర్లో
, రాములవారి ఫొటో నుండి పడిన పుాలమాలతో
ఒక  పెద్ద ఫొటో , అవార్డు   అందుకుంటుా ఉండగా
ఒక పెద్ద  ఫొటో , అపస్మారక స్థితిలో   ఊరేగిస్తుా ఉండగా..తీసిన  మరొక ఫొటో కుాడా రావడంతో
ఆండాళ్ళుకి తను నిజంగా  రామ భక్తురాలినే  అన్న
నమ్మకం కలిగింది.

నిజమే తను నిజమైన భక్తురాలు కనకనే ,ఆయన
మెడలోనున్న   పుాలమాల, తనపై వేసి  మరీ తన -ననుగ్రహించేడు  అనుకుంది.

అంతే....ఆమె ఆనందం హద్దులు దాటింది.
భక్తి పిచ్చి మరింత ఎక్కువై  , చన్నీటి స్నానాలుా,
ఉపవాసాలుా , మందిర ప్రదక్షిణల  తో, చిక్కి ,
శల్యమై , ఒకానొక శుభ ఘడియలో మందిరం కి
వెళుతుా వెళుతుా..దారిలోనే కన్ను ముాసింది.

అంతే ।!  అదొక మరచిపోలేని రోజు.
వార్త విన్న
జనాలు తండోపతండాలుగా వచ్చేరు .
ఆండాళ్ళమ్మ ని చుాడడానికి.

తదుపరి ఆమెను  పుాల పల్లకిలో పరుండబెట్టీ , ఊరంతా ఊరేగించి శవయాత్ర చేసేరు .

"ఆండాళమ్మవారికీ జై ", అన్న నినాదాలతో ,
అన్నదానాలు చేసేరు.

తను నిమిత్తమాత్రుడిలా,  అన్నీ తెలిసీ..కుాడా,
ఏమీ చేయలేక, నోరెళ్ళబెట్టీ , అలా చుాస్తుా ... ఉండిపోయేడు.

జనాలైతే మాత్రం , ఆమె ఎక్కడైతే రామానుగ్రహం పొందొందో , అదే ష్టేజి మీద రాములవారి ఫొటో
జాగాలో ఆమె ఫొటో తగిలించీసేరు.

మరి కొన్నాళ్ళకు ఆండాళమ్మవారి భక్తులుగా
మారిన మరికొందరు , ఆ ష్టేజి జాగాలో ...ఆండాళమ్మకు చిన్న గుడి కట్టించి  అక్కడే ఆమె విగ్రహాన్ని  ప్రతిష్టించి  , గుడి గోడల
పై పాలరాతి ఫలకాలను అతికించి , వాటి పై
"రాధా సమేతా రామా ! సీతా సమేతా క్రిష్ణా  !"
పన్నగ భుాషణ వేంకట రమణా..!
పాలకడలి శయనా గజానన  ! "...అన్న కీర్తనాక్షరాలను  ప్రేమగా చెక్కించేరు .

అంతేకాదు.అమె పాడిన కీర్తనలను అదే విధంగా పాడుతుా ...భక్తి-పారవశ్యులవుతుా  అందరినీ
ఆకట్టుకున్నారు. 😂

ఆవిధంగా అందాలు,  ఆండాళ్ళుగా , తర్వాత
ఆండాళమ్మగా...ఆ  తర్వాత ఆండాళమ్మవార్లు గా
దిన దినాభివ్రుద్ధి చెంది మరీ నీరాజనాలందుకుంటున్నాది. 😇

అంతేకాదు...జనం ఆమె చనిపోయిన రోజు నాడు
ఆమె జ్ఞాపకంగా పేద్ద తిరునాళ్ళు జరుపుతారు.😏

అందులో భక్తుల లో ఒకరికి ఆండాళమ్మవారు
పుానుతారు. 🤔

భక్తులు ఆమె కీర్తనలను పాడుతుా ,
ఆడుతుా , పారవశ్యంతో ఊగిపోతుా...ఆమెను
శాంతపరుస్తారు. అన్నదానాలు చేస్తారు.

అంతే కాదండోయ్...దైవాంశ సంభుాతురాలైన
ఆమె భర్తగా..తనను  గౌరవిస్తుా  పట్టు బట్టలు కట్టి పుాలమాలలు మెడలో వేసి , తనను పల్లకి లో ఊరేగించి ,రాచ మర్యాదలు చేస్తారు. 😊

అరోజు ఇంటిల్లిపాదికీ , పంచభక్ష్య పరమాన్నాలతో
విందారగింపులే...💃

అవును మరి..తనిప్పుడు "ఆండాళ్ళు భర్త వెంకడు"
కాదు గా...

"ఆండాళమ్మవారి భర్త..వేంకటరామయ్యగారు " మరి.😎

అందికే తనొక్కడికే తెలిసిన ఆ రహస్యం..
అదేనండీ...😜

ఆ గోవిందం గాడి చేతిలో ఉన్న వెదురు కర్ర  ఫొటోకి
తగలడం వల్లనే, రాములవారి మెడలో ఉన్న దండ,
సరీగ్గా....ఫొటో కిందనే  కుార్చొని ఉన్న ఆండాళ్ళు
మెడలో  పడిందన్న విషయం...😝

తను ఛచ్చినా ఎవ్వరితోనుా..చెప్పడిక...
ఎందుకంటే...అదిప్పుడో బ్రహ్మరహస్యం మరి..🤗

మీరుా ఎవరితోనుా చెప్పకండేం.....😷

----------------😀   సమాప్తం .  😀-----------------
                               























No comments:

Post a Comment