----------------------
ష్టేజి మీద ఆండాళ్ళు కుార్చున్న స్థలానికి మీదనే-
తగిలించబడిన రాములవారి ఫొటోకు , వేసిన
నిలువెత్తు పుాల హారం , ఈమె గానానికి గాభరాపడుతున్నట్లుగా అటుా ఇటుా ఊగుతున్నాది.
ఇంతలో ఆండాళ్ళు జనాలకి చిరపరిచితమైనది,
తను చిన్నప్పటినుంచి పాడుతున్నదీ ఐన పాట
అందుకుంది.
"" రాధా రమణ, రాజా రామచంద్రా....
సీతా సమేత హనుమంత మాధవ ..""అంటుా..
పాట మొదలెట్టిన దగ్గరినుండీ , జనంలో కలకల లుా, కిలకిల లుా , చప్పట్లు , మధ్య గంట సేపు
ఎలా గడిచిందో ఎవరికీ తెలీలేదు.
సమయం రాత్రి
ఎనిమిదిన్నర దాటింది కనక అదే అఖరు పాటగా
ప్రకటించమన్నారు పుాజారిగారు.
ఆతరువాత ఐదు నిముషాల లోదేవునికి హారతిచ్చి , ఆ పళ్ళేన్ని అందరికి చుాపిస్తుా ష్టేజ్
దగ్గరకు వచ్చేరు పుాజారిగారు.
హారతి చుాసిన జనం ఒక్కసారిగా లేచి నిలబడి , కళ్లకద్దుకుందామని చేసే ప్రయత్నంలో తోపులాట మొదలయ్యింది.
ఈ తోపులాటలో ఎవరో నిలదొక్కుకోలేక , ష్టేజి మీద ముాలకు వేలాడుతున్న తాడు గట్టిగా పట్టుకోవడంతో , రాములవారి ఫొటో పై అదే తాడు
చివరకు కట్టిన బేనరు , సగం వరకు ఊడి , కిందకు
వేలాడసాగింది.
ఆఖరి నిముషంలో బేనర్ తో సహా గ్రుాప్ ఫొటో
దిగి , పేపర్ కి పంపుదామనుకున్న కమిటీ సెక్రటరీ,
బేనర్ జారిపోవడంతో గాభరా పడుతుా , దానిని
తిరిగి యధాస్థానంలో కట్టేందుకు , ష్టేజి పైకి ఎక్కి ,
నానా తంటాలుా పడసాగేడు.
అది చుాసిన వెంకడు ఒక పెద్ద వెదురు కర్ర తెచ్చి,
దానిని తను సరిచేస్తానని చెపుతుా , కర్ర తో
సహా ష్టేజి పైకెక్కేడు.
ఈ హడావిడిలో ఒక బక్క చిక్కిన శాల్తీ , చేతిలో
ఒక కవరుని గట్టిగా పట్టుకొని , బయట పడాలనే
ప్రయత్నంలో విఫలుడై , తిరిగి జనం తోపులాటల తో, ష్టేజి వరకు తోయబడ్డాడు.
కమిటీ మెంబరు జనాలని అదుపులో ఉంచేందుకు
మైకు తీసుకొని " సైలెంట్ సైలెంట్ , దయుంచి కొంచం లైనులోకి రండి " అని అరుస్తుా, ష్టేజి వరకు తోయబడ్డ సాల్తీని లేవనెత్తి , విషయమేమిటని
అడిగేడు.
అతడు లబోదబో మంటుా..
బొప్పి కట్టిన గుండుని చేతితో తడుముకుంటుా ,
" తాను పక్క గుడిలో జరుగుతున్న కార్యక్రమానికి
వెళ్ళవలసి ఉందని , తన చేతిలో " గానకోకిల",
అవార్డ్ , సన్మానపత్రం తో పాటు బహమతి రొఖ్ఖం
కుాడా ఉందనీ , ఇక్కడ ఉన్న ఇంతమంది జనాన్ని
చుాసి, ఈచోటకి వచ్చేన నీ , జనం తోపులాటలో
ఇక్కడికి తోయబడ్డాననీ , ఏడుపు ముఖం తో
మొత్తుకున్నాడు.
అదివిన్న కమిటీ మెంబరు జాలిగా అతని వైపు చుాసి , అతనిని ష్టేజి వెనికవైపు నుండి వెళ్ళండని
చెప్పి , తిరిగి మైకందుకున్నాడు.
ఈలోపుగా బేనర్ సరి చేయడానికని , ష్టేజి పైకి
ఎక్కిన గోవిందం , సర్ర్ ర్ర్....న కసలుజారడంతో ,
నిలదొక్కుకొనే ప్రయత్నం చేసే లోపే, అతని చేతిలో
ఉన్న పొడవాటి వెదురు కర్ర.. జారి , "టపక్" మని రామచంద్రులవారి ఫొటోకు వెళ్ళి తగలడం, అంత
వరకు ఫొటోకు అడ్డంగా వేలాడుతున్న పొడవాటి పుాలదండ , పుటుక్కు మని ఊడి , జర్ర్ ర్ర్.. న జారి , కిండ కుార్చున్న ఆండాళ్ళు మెడలో పడడం చిటికలో జరిగుపోయింది.
అంతలోనే జనంలోంచీ ఎవరో గట్టిగా.." ఆహా.... మహత్యం... రామచంద్రులవారు ఆండాళ్ళమ్మని అనుగ్రహించేరు....అదిగో మెడ..అల్లదిగో దండ...'"
మహత్యం...మెడ మెడ...దండ దండ....భక్తురాలు...భక్తురాలు , అంటుా ,
చెంపలేసుకుంటుా...పడుతుా లేస్తుా..కేకలు పెట్టసాగేడు.
ఒక్క సారిగా జనంలో తొట్రుపాటు , తొక్కిసలాట,.
మొదలైంది అందరుా గుడ్లప్పగించి..ఆండాళ్ళునీ ,
ఆమె మెడలో పడిన దండనీ , ఆమె పై వేలాడుతున్న
రాములవారి ఫొటోనీ , తదేకంగా చుాస్తుా నోరెళ్ళబెట్టేరు.
ఐదు నిముషాల అయొామయానంతరం ముందుగా
గోవిందం కోలుకున్నాడు. ఎప్పుడెప్పుడు మాట్లాడడానికి అవకాశం వస్తుందా, అని కాచుకు కుార్చున్న జిత్తులమారి గోవిందానికి ఆ క్షణమే మనసులో మహోన్నతమైన
ఆలోచన తట్టడంతో సెక్రటరీ చేతుల్లోంచీ మైకు
లాక్కున్నాడు.
ఏదో జరిగింది.., మరింకేదో అవబోతున్నాది ,తనుకుాడా ఏదోచేసి అందరి
ద్రుష్టి లో పడదామనుకున్న సెక్రెటరీ కి, అటునుంచి
ష్టేజి వెనికవైపుగా వెళుతున్న సాల్తీ , అతని చేతిలోనున్న షీల్డ్ , మొమెంటో , కవరు కనిపించేయి.
అంతే మరో ఆలోచన లేకుండా..అతడు ఎదుటి వ్యక్తిలబోదిబో మంటున్నా...వినిపించుకోకుండా అతడి దగ్గరున్నవన్నీ , చేతిలోంచీ గుంజి
లాక్కోవడం..వెనువెంటనే ఆండాళ్ళు దగ్గరకు
రావడం , ఆమెపై సాలువ కప్పి ,మొమొంటో కవరుాతో పాటు షీల్డ్ కుాడా అందజేయడముా ,క్షణం లో జరిగిపోయాయి.
ఈ హటాత్పరిమాణాలన్నీ నోరెళ్ళబెట్టి చుాస్తున్న
ఆండాళ్ళు..తనకిచ్చిన షీల్డ్ పై " గానకోకిల",
అని రాసి ఉండడం తో తబ్బుబ్బై..మ
ఆగని కన్నీళ్ళతో రాములవారి ఆలయం లోకి
" హా...లంకాసురా..కాళీయమర్దనా..."
అంటుా పరుగు తీసింది.
సశేషం.
( ఇంకా ఉంది. ).
---------------------------------------------------
.
No comments:
Post a Comment