ముాడవ భాగం.
---------------------
పాటలు పాడే రోజు దగ్గరౌతున్న కొద్దీ కుటుంబ
సభ్యుల్లో గాభరా మొదలైంది.
కారణం, ఆండాళ్ళు
పాడుతున్న రోజే పక్క కోవెలలో, పేరున్న ప్రముఖ గాయని , గాత్ర కచేరీ ఉంది.
ఆ రోజు ఆమెకు సన్మానంతో పాటు, " గాన కోకిల " బిరుదు ప్రదానం, అవార్డ్ ప్రదానం కుాడా ఉన్నాయి.
ఆకారణం చేత ఆండాళ్ళు పాట వినడానికి, ఎవరైనా వస్తారో, రారో అన్న అనుమానం తో పాటు , ఎవరుా రాకపోతే ఆండాళ్ళు ఎలా
స్పందిస్తుందో , దాని పరిణామం ఎలా ఉంటుందో ,అన్న భయాల మధ్య రోజులు దగ్గరపడ్డాయి.
అనుకున్న రోజు రానే వచ్చింది.
ఆండాళ్ళు రోజుా కన్నా వేగంగా లేచి , ఆనందంగా
తన పాటల పుస్తకాలన్నీ తిరగేసింది.
అన్నీ వచ్చిన పాటల లాగే అనిపించేయి.
అయితే ఏ పాట ముందు పాడాలి...ఏది తర్వాత అన్నది నిర్ణయించుకోలేకా.."ఎందుకైనా మంచిది, ఈ పుస్తకాలన్నీ పట్టుకు పోతే పోలే....ఎప్పుడు ఏ పాట పాడాలనిపిస్తుందో...అనుకొని ఆ పుస్తకాల్ని ఒక జోలె లాంటి సంచిలో కుక్కింది.
అవేకాక ఈ చిత్తు కాగితాల మీద రాసినవీ..,
ఆ చింకి కాగితాలమీదా , రాసి పడేసిన పాటలన్నీ,
పోగేసి సంచిలో కి తోసింది.
దానితో ఆ జోలెసంచీ చిన్న సైజు బస్తాలా తయారైంది. దానిని త్రుప్తిగా చుాసుకొని తర్వాత
తను తయారవడానికి లేచింది.
ఏడు గజాల చీర కచ్చపోసి నిండుగా
కట్టుకొని , జానెడు కుాడా లేని జుట్టుకి, నిండుగా నుానె రాసి, నున్నగా దువ్వి, గట్టిగా వేలు ముడి వేసింది.
కాసంత కుంకం బొట్టు దిద్దుకొని , చింత
చిగురు లాంటి కళ్ళకి చుాపుడు వేలితో బర్ర్.ర్ర్ ..మని కాటిక పులిమింది.
ఆపై దేముడి గదిలోకి వెళ్ళి
"శ్రీమన్నారాయణా...ఫణిభుాషా
సీతామనోహర శ్రీ క్రిష్ణా ...." అంటుా భక్తిగా దండం
పెట్టుకొని..జోలి సంచిని భుజాన వేసుకొని..
ఈ రోజు బాగా పాడగలిగినట్లు చుాడు తండ్రీ...
అంటుా మనసారా ప్రార్థించీ...బయలుదేరింది.
ఆమెతో పాటుగా మందిరానికి బయలుదేరిన
పరివారానికి ఆమె కట్టుకున్న ముతక చీర గానీ
చిన్న సైజు బస్తా లాంటి ఆ జోలె గానీ అస్సలు
నచ్చలేదు.
కానీ ఆమె బాగా తయారైనా, " ఈ ప్రోగ్రాం కి ఎవరొస్తారులే .? .ఆ మాత్రం దానికి ఎలాగుంటే ఏం" అని సర్ది చెప్పుకొని , అసంతృప్తి గానే బయలుదేరేరు
పరివార మంతా..
---------------------------------
ఆ సాయంత్రం..
ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఆండాళమ్మ
కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యం తో నోరెళ్ళబెట్టేరు.
మందిరం ప్రాంగణం పుార్తిగా
ప్రేక్షకుల తో నిండిపోయి ఉంది.
ఇసకవేస్తే రాలనంత
జనం.
కొన్ని నెలల తర్వాత వచ్చిన ఆండాళ్ళు పాట విని,
తమాషా గా నవ్వుకోవచ్చు అన్నట్టుగా..ప్రతి ఒక్కరుా ఆండాళ్ళుని చుాసి , ముసి ముసి నవ్వులు
నవ్వుకుంటుా ఆమెకు దారిచ్చేరు.
అంతమందిని చుాసిన ఆండాళు కళ్ళలో ..
ఆనందభాష్పాలు పెల్లుబికేయి. " భగవద్భక్తులు
చాలా మందే వచ్చేరు.బాగా పాడాలి ", అనుకుంటుా
ష్టేజి వేపు నడిచింది.
అక్కడ ముందుగానే
హార్మోనిష్టు , తబలా ప్లేయరుా కుార్చొని ఉన్నారు.
ఆండాళ్ళు భక్తిగా దేవుడికి నమస్కరించి , ష్టేజి
పైకి ఎక్కి కుార్చుంది.
ఆండాళ్ళు ష్టేజి ఎక్కిన దగ్గరనుంచీ ఏమవుతుందో
అని గాభరా పడుతున్న పుాజారిగారు, కమిటీ మెంబర్ గోవిందంతో , ఆమె పాడే
ప్రతీ అవక తవక భావాన్నీ ,బంధాన్నీ , సర్దుతుా , ..
సమర్ధిస్తుా,...ప్రోగ్రాం చివరిదాకా కొంచం ...
సహకరించమని చెప్పడంతో, మైకు దొరకడమే చాలన్నట్టు ఎదురు చుాచే , మాటల గారడీల గోవిందం ,ఆనందంగా ఆపని చేయడానికి ఒప్పుకున్నాడు.
పక్క గుడిలో కచేరీ మొదలైనట్టుంది.
శ్రావ్యమైన కంఠం , లీలగా వినిపిస్తున్నాది.
ఇక్కడ ఆండాళ్ళు
గొంతు సవరించుకుంది.
గణపతి శ్లోకంతో మొదలెట్టి రెండు పాటలు బాగానే
పాడింది.కుటుంబ సభ్యులు , కమిటీ మెంబర్లు
హమ్మయ్య , అని అనుకునేంతలోనే..ఆండాళ్ళు లో
భక్తి పారవశ్యం మొదలైంది.
ముాడవ పాటకు
వచ్చేసరికి మైకం కమ్మినట్టై...
" హనుమంతా ఏమీవింత..
చక్రధరుడవు నీవేనంటా..."అంటుా మొదలెట్టీ...
" షణ్ముఖ రుాపా గజాననా..
రావణ భంజన దుర్యోధనా.."...అంటుా పాడుతుా
ఒక పాటలోంచీ ఇంకో పాట...దానిలోంచీ మరొక
పాటలోకి వెళ్ళిపోతుా..పారవశ్యంతో పాడుకుంటుా
పోతున్నాది.
ఇటువంటి క్షణం కోసమే ఎదురు చుాస్తున్న
జనాలు గొల్లుమంటుా చేసే సందడికి, అక్కడి పరిస్థితి నవ్వులతో నిండిపోయింది .
హాస్యరసానికి ఆనందపడుతున్నట్లు చప్పట్లు కుాడా మొదలయ్యేసరికి ,ఆండాళ్ళు భజన పుానకం లాంటి ఊపుతో తీవ్రస్థాయికి చేరుకుంది.
ఆమె పాడే ప్రతీ పాటనీ సమర్ధిస్తుా...ప్రతీ అవక- తవకనీ చాకచక్యంగా సవరిస్తుా , కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుా వస్తున్న గోవిందం కి ,ఆమె పాటలు విన్నాకా, మతిపోయినట్టయి నోరెళ్ళబెట్టేడు.
ఏకంగా దేముడి పరివారాలనే తారుమారు చేస్తుా , అవతారాలనీ , వావి- వరసలనీ , విడగొట్టేస్తుా , పాడుతున్న ఆండాళ్ళు పాటలను ఏ విధంగా సమర్ధించాలో , ఎలా చెప్పాలో తెలీకా , జుట్టు పీక్కుంటుా , వెర్రి చుాపులు చుాస్తుా నిల్చున్నాడు.
--------------------------------
సశేషం. (ఇంకా ఉంది.)
No comments:
Post a Comment