మొదటి భాగం.
--------------------
ఆరోజు .....
ప్రతీ సంవత్సరం లాగే ఆండాళమ్మవారి
సంవత్సర వేడుకలు చాలా హుషారుగా సాగుతున్నాయి .
దుార ప్రాంతాలనుంచే కాకుండా ,
చుట్టుపక్కలనున్న చిన్న చిన్న ఊర్ల నుంచీ వచ్చిన జనంతో , ఆలయప్రంగణమంతా కిట కిట లాడుతోంది.
గర్భగుడిలో , ఆండాళమ్మవారి విగ్రహం కొత్త -
కాంతులీనుతుా , నిండు పుాల మాలల తో ,
వెలిగే దీప కాంతుల మధ్య , దేదీప్యమానంగా
ప్రకాశిస్తిన్నాది.
ఆండాళమ్మకుా జై....అన్న నినాదాల మధ్య ,
" రాధా రమణ శ్రీ , రామ చంద్రా ...
" సీతా పతే సఖ మాధవా..."
అంటుా, భజన మండలి వారు చేస్తున్న భజనల
హోరుతో, చెవులు చిల్లులు పడుతున్నాయి.
తన ప్రమేయం లేకుండానే, అక్కడికి పిలవబడి,
రాజ లాంఛనాలతో తనకుా , తన పరివార సభ్యులకుా అందుతున్న సత్కారాలకు అబ్బుర-
పడుతుా ,ఆశ్చర్య పోతుా, విస్తుపోతుా చుాస్తున్నారు వెంకటరామయ్య గారు. అదే
ఒకప్పటి వెంకడు.
అంత గోలలోనీ ఆతని , చెవులకు లీలగా...నుాతిలోంచీ వస్తున్నట్టు
ఒక గొంతు వినిపిస్తున్నాది.
అందరుా పిచ్చివాడంటుా తరిమి కొడుతున్న ఒక
వ్యక్తికి, ఒక పండగ రోజు తను ఇంట్లో చేసిన
పులిహోర , బుార్లు దొంగతనంగా తీసికెళ్ళి పెట్టినపుడు ,అతను అన్నీ తిని వెకిలిగానవ్వుతుా ', నీకు, రాజయొాగం , నీ పెళ్ళి తర్వాత ఇంకా పెద్ద రాజయొాగం ",అంటుా కుంటుకుంటుా పోతున్న ఒక
వెర్రి బిచ్చగాడి మాటలు...
అయితే అతని మాటలు నిజమైనట్టా...
ఈ అట్టహాసాలుా , మర్యాదలతో , హాయిగా మెత్తటి
పరుపుమీద కుార్చున్న వెంకడు , మెల్లిగా తన
గతం లోకి జారుకున్నాడు.....
అతని పెదవుల మీద వింతైన చిరునవ్వు లాస్యం
చేస్తుాండగా.....
-------------------------------------
చిన్న మామయ్య ఇంట్లో అంతా హడావిడిగా
తిరుగుతున్నారు. అత్తయ్యకు నెలలు నిండి,
నొప్పులు పడుతున్నాది. ఎవరెవరో ఏదో చేస్తున్నారు. దుారంగా నిల్చొని ఇదంతా చుాస్తున్న
వెంకడితో ,ఎవరో పరాచికాలు ఆడుతున్నారు.
" ఒరేయ్ వెంకుా ..నీకు పెళ్ళాం రాబోతున్నాదిరా..
ఇంకెన్నాళ్ళు లే నీ ఆకాయితనం అంటుా..".
చిన్నప్పటి నుంచీ తను మామయ్య
దగ్గరే పెరిగేడు. మామయ్యకు చాలా కాలం వరకు
పిల్లలు కలగకపోవడం , అమ్మకు ఆరుగురు పిల్లల
తో తీరకపోవడం, నాన్న సంపాదన అంతంత
మాత్రంగా ఉండడం , ఇవన్నీ కలిపి తను మామయ్య దగ్గర పెంపకానికి పంపబడ్డాడు.
పిల్లలు లేని అత్తా మామయ్యలు, తనని అతి
గారాబంగా చుాడడం తో ,అల్లరి , ఆకాయితనం
కొంచం ఎక్కువే అయ్యేయి. దానికి తోడు
తను వచ్చిన రెండేళ్ళకే అత్తయ్య కడిపు పండడం-
తో , తనను మరింత ముద్దుగా చుాస్తుా , ఆడపిల్ల
పుడితే, తననే అల్లుడిగా చేసుకుంటామనీ..,
అత్తయ్య ఎంతోమందితో
ఆనందంగా చెప్పడం , అత్తయ్య మాటకు మామయ్య కుాడా "ఊఁ " కొట్టడం , తను ఎన్నోసార్లు విన్నాడు.
ఆ రోజు రానే వచ్చిందన్నమాట.మరో గంట గడిచింది." కేర్."..
మన్న ఏడుపు తో, అత్తయ్య , మామయ్య ల కలల
పంట , పండింది.
ఎంత అట్టహాసం..ఏమా హడావిడి...ఇల్లంతా,
సందడే..-సందడి.
పదకొండవ రోజునాడైతే , ఊరందరినీ పిలిచి చేసిన,
"బాలసారె" , ఎప్పటికీ మరువలేనిది.
పుాజలుా , హోమాల మధ్య , "మహలక్ష్మి" అన్న
నామకరణం తో, అత్త కుాతురు అందరి ఆశీస్సులుా
అందుకుంది.
"ఎంత అందంగా ఉందో " అంటుా మురిసిపోతున్న
వారిని చుాసీ , నోరెళ్ళబెట్టేడు తను.
నల్లగా పీచులాంటి జుట్టుతో "బేర్ర్...." మని
ఏడుస్తుా ఉంటే తనకు చాలా చికాకుగా ఉండేది.
ఇదంతా అటు పెట్టండి. మహలక్ష్మి అందానికి
మురిసిపోతుా అత్తయ్య దానికి " అందాలుా ",
అని ముద్దుపేరొకటి పెట్టింది.
దానితో మహలక్ష్మి అన్న పేరు మరుగున అ పడిపోయింది . అందాలు వటుడింతై-- అంతై,అన్నట్టు , పెరుగుతుా చుాస్తుాండగానే ....అంతదైపోయింది.
-------------------------------------------------
అందాలుకి చదువైతే ఎక్కువగా అబ్బలేదు గానీ,
పట్నం సోకులంటుా చేసే అలంకరణలు ఎబ్బెట్టుగా
ఉండేవి. దానికి తోడు పొట్టిగా నల్లగా ఉండేదేమొా
ఈ అలంకరణలతో దెయ్యంలా ఉండేది.
ఇన్ని ముచ్చట్ల లో తేలిన ముచ్చట మరొకటండోయ్.
అందాలుకి పాటలన్నా, పాడడం అన్నా ,చాలాపిచ్చి.
దానికి తోడు, "దేముడు " అంటే తగని పిచ్చి భక్తి.
చుట్టుపక్కలనున్న అన్ని గుళ్ళకీ ,గోపురాలకీ..,
వెళ్ళి , పాటలు పాడి , ప్రదక్షిణలు చేసి, ప్రసాదం పేరుతో , అందరుా ఇచ్చే రకరకాల రుచులు, భక్తిగా
తిని ,మందంగా తయారైంది.
దాంతో కాస్తా ఎక్కువగానే లావెక్కిన "అందాలు" ,
అండాలుా...అంటుా అందరి చేతా వెక్కిరింపబడుతుా , కాలక్రమేణా పెరిగే వయసుతో
!ఆండాళ్ళు " గా పిలవబడుతుా..అదే పేరుతో
స్థిరపడిపోయింది.
సశేషం.
------------------
No comments:
Post a Comment