Saturday, April 6, 2019

ట్రాఫిక్ పోలీస్

శీర్షిక... ట్రాఫిక్ పోలీస్.
-----------------------------
పెరుగుతున్న జనాభా తో,
ఆకాశ హార్మ్యాల తో పాటు-
ఊరి చివర బీడు భుాముల లో,
కుాడా వాసాలు ఏర్పడ్డాయి.॥

ప్రతీ పనికి దుారాభారం పెరిగింది.
ఉద్యోగస్తులకు , వ్యాపారస్తులకు
చివరకు కుాలీ నాలీ
చేసుకునే వారికి కుాడా  ॥

నిత్యావసర వస్తువుల
కొనూగోళ్ళకు , పిల్లలు
చదివే స్కుాళ్ళకు.,
రోగాల కోసం చికిత్సలకు
ఇలా ప్రతీదానికి నడిచే
నడక భారమైంది.॥

దాంతో ప్రతి ఒక్కరి
అవసరం తీరేందుకు-
వాహనాల కొనుగోలు
అత్యవసరం  అయింది. ॥

దాంతో కారుల బారులు,
బైకుల హోరులు,
సైకళ్ళ జోరులుా,
రోడ్లపై రొదపెట్టసాగేయి ॥

ఎవరి పని వారికి -
తొందర కావడంతో,
వాహనాలు నడిపే తీరులో,
అస్తవ్యస్తపు జోరు -
తీరు ఎక్కువైంది ॥

వాహనాల టక్కర్లు,
తిరగబడ్డ వాహనాల లో-
కుంటు పడ్డ అవయవాల-
రక్త స్రావాలజోరు ఎక్కువైంది ॥

అనుకోని చావులు,
జనాల హోరు ,
ఏక్సిడెంట్ల  ఏడ్పులతో-
రోడ్ల రంగు , హంగు
మారిపోయింది ॥

అటువంటి సమయంలో

ట్రాఫిక్ రుాల్స్ పాటించని
ప్రజానీకాన్ని ...
ఒక తీరులోకి తెచ్చే
ప్రయత్నం  కోసం ,
ప్రజా   రక్షకునిగా"
నియమింపబడ్డ వాడే
" ట్రాఫిక్ పోలీస్".

ప్రజా క్షేమమే  తమ
ధ్యేయంగా  నిలిచిన ,అతనికి
తన  సుఖాన్ని  పణంగా పెట్టి ,
జనసందోహాన్ని-
నియంత్రించే  పని-
నిత్య-క్రుత్యమయింది.॥

ఎండైనా, వానైనా,
తమ విధి నిర్వాహణ లో
ఏ విధమైన లోపం లేకుండా
తమ కళ్లతో గమనిస్తుా.,
చేతుల తో వాహన -
గమనాల్ని  నియంత్రిస్తుా-
గతి తప్పిన వారిని -
"విజల్ " , వేసి -
సావధానపరుస్తుా',

పని చేస్తున్నంత సేపు ,
అలసట మరచి నిలబడే-
నీతి నియమానలకి కట్టుబడి ,
నిరంతరం శ్రమిస్తున్న-
నిత్య  పోరాట వీరుడు-
" ట్రఫిక్ పోలీస్ ".

ఏ ఋతువైనా , ఎంత
సమయమైనా, నిలబడి,
తమ  విధిని  సక్రమంగా-
నిర్వర్తించే,  శాంతముార్తి-
"ట్రాఫిక్ పోలీస్".

ఎందరో తల్లులకి ,
నేనున్నానంటుా, వారి
బిడ్డల్ని,  తమ తోటివారిగా
ప్రేమిస్తుా, జీవిత పోరాటంలో
తమ వంతు ధర్మాన్ని
సక్రమంగా నిర్వర్తిస్తున్న
భరతమాత ముద్డుబిడ్డ
  "ట్రాఫిక్ పోలీస్."
 
వారి శ్రమని గుర్తించి
సహకరించండి.
వారు మనకై చేస్తున్న
నిర్విరామ క్రుషికి, తలవంచి
  "సెల్యుాట్  "చేయండి.॥
 
ఎందుకంటే అతడు -మనకు 

వాహనాల జోరులో
సరైన క్రమశిక్షణా మార్గం
చుాపే  సాయుధుడు.
మన జీవితాలకి రక్షనిచ్చే
మార్గదర్సకుడు. అతడే
మన  "ట్రాఫిక్ పోలీస్".
------------------------------
రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

సకస...4200.
----------------------------

No comments:

Post a Comment