Tuesday, April 23, 2019

ఆండాళమ్మ .(రెండవ భాగం. ).

రెండవ భాగం.
--------------------
ఆండాళ్ళు రుాపానికి  ఎలాగున్నా , ఇంటి పనులన్నీ
మాత్రం చాలా బాగా చేస్తుంది.

అందరితోనుా చాలా
చక్కగా మాట్లాడుతుంది. తనకు అన్నీ  సమకుార్చి
పెడుతుంది. సహజంగానే అత్త కుాతురవడం వల్ల,
ఒకే చోట కలిసి పెరగడం వల్ల , అంతే కాక ఆమెను
చిన్నప్పటి నుంచే తన భార్యగా అందరుా నిర్ణయించడం వల్లా కాబోలు , వెంకడు ఆమెమీద
అభిమానం పెంచుకొని , ఫ్యుాచర్ లో ఆమె భర్త గా
అడ్జెష్ట్ అవడానికి సిద్ధపడిపోయేడు.

                           రోజులు గడుస్త్తున్నాయి.
ఆండాళ్ళు మందిరాల లో అవుతున్న ప్రతీ భజన
లోనీ పాల్గొని పాడడం మొదలెట్టింది  .కానీ  ఒక
చిక్కు వచ్చి పడింది. చిన్నప్పటినుంచీ పురాణ
గాధలు వినడం గానీ,  చదవడం  గానీ  , ప్రవచనాలు  వినకపోవడం గానీ ,  చేయకపోవడం వల్ల ,ఏదేవుడు  ఏ పని చేసేడో, ఎవరి కుటుంబ సభ్యులు ఎవరో తెలీకా..దేముళ్ళ సంబంధబాంధవ్యాలను తారు-మారు చేస్తుా పారవశ్యంతో, వావి వరసలు లేకుండా
పాడేస్తుా ఉండేది.

మొదట్లో చాలా మందికి అర్ధం కాక కొన్నాళ్ళుా,
పోనీలే ఏదో పాడుతోంది కదా అని కొన్నాళ్ళు ,
అర్ధం అయ్యేకా చిన్నప్పటి నుంచీ తెలిసిన పిల్ల
కావడంతో మొహమాటానికి కొన్నాళ్ళుా...
ఊరుకున్నారు. కానీ రాను రానుా ఆమె పాటలు
పాడిన ప్రతీసారీ జనం నవ్వు ఆపులేకపోవడం ,
చాటు మాటుగా వ్యంగ్యంగా  మాట్లాడుకోవడం,
తన చెవుల్లో కుాడా పడడం తో సంగతేమిటో
చుాద్దామని తను కుాడా భజనలకు వెళ్ళడం
మొదలెట్టేడు.

నాలుగు  రోజుల్లోనే  అసలు సంగతి
పసిగట్టిన వెంకడు తనే స్వయంగా కుాడా నవ్వు
ఆపుకోలేకపోయేడు.

                             ఆండాళ్ళు పాట మొదలెట్టి ,
చరణం దగ్గరికి  వచ్చేసరికి, పుానకం వచ్చినట్లుగా
ఊగుతుా..భక్తి పారవశ్యం తో తన్మయత్వం
పొదుతుా...
"రాధా సమేతా రామా..।సీతా సమేతా శ్రీ  క్రిష్ణా ।!
ఆంజనెేయ హ్రదయ వహార హర హర శంభో.."
అంటుా అనాదిగా వస్తున్న వారి సంబంధ బాంధవ్యాలనుా వారి ఉనికనీ కుాడా మార్చీసేది.
కానీ ఎవరుా ఆపే ప్రయత్నం  చేసేవారు కాదు.
చేసినా ఆగేదీ కాదు.

ఇలా భక్తి సముద్రం లో మునిగి తేలుతున్న ఆండాళ్ళు..ఇలా ఎన్నో రకమైన అవక -తవకల
తో ,  వావి వరుసలు మార్చి  దేముళ్ళ పరువు
తీయడం, అమ్మలక్కల లో చులకనవ్వడం,
వెక్కిరింతలుా , నవ్వుకోవడాలుా మధ్య...
తమ పెళ్ళి ఎప్పుడు జరిగిందో , ఆండాళ్ళు
నలుగురు పిల్లలకి తల్లి  ఎప్పుడయిందో ...తెలియకుండానే కాలం
గడిచిపోయింది.

నలభైయవ వడిలో పడిన ఆండాళ్ళు కి భక్తి పిచ్చి
ముదిరి పాకాన పడింది.
ఆ వుారి పెద్ద మొాతుబారి
రైతు కుాతురు కావడం వల్ల నేమొా ..ఇన్నాళ్లుా ఏమీ అనలేకపోయినా , అమె పాటలు ఇంక
వినలేమనుకున్న పుాజారులుా..కమిటీ మెంబర్లుా ,
ఒక్కుమ్మడిగా ఆమెను భజనల్లోనుంచీ వెలివేసేరు.
దాంతో ఆండాళ్ళు కి మతి పోయినట్టయింది.

పిచ్చెక్కినట్లు గా ఏడుస్తుా...
ఏడుకొండలవాడా...శివయ్యా...
నను కరుణించ వయ్యా కాపాలీ.."
వక్రతుండా వేంకటపతీ వీరభద్ర రారా..."
అంటుా వీరావేశంతో శోకాలు పెడుతుా , తిండీ-
తిప్పలుా మానీ, చిక్కి శల్యమయింది.

                        ఈమె అవస్త చుాసిన పరివారం'
ఆమె భక్తికి సం,తోషంచాలో...తెలివితక్కువతనానికి
విచారించాలో , అర్ధం కాక చివరికి మందిరం కమిటీ
వాళ్ళ దగ్గరకు పోయి విషయం  వివరించి , మందిరం బాగోగులకంటుా పేద్ద మొత్తం చెల్లించి ,
ఒకానొక సందర్భంలో ఒక గంట సేపు ఆమె గాన
కచేరీ ఏర్పాటు చేయమని అర్ధించి , సఫలులయ్యేరు.

                         ఆమె చావుబతుకుల సమస్య
విన్న కమిటీ వాళ్ళు , తాము చిన్నప్పటి నుంచీ
ఎరిగున్నదీ..తమ ముందే పెరిగిన పిల్లా ...కావడం
వల్ల ఎన్నో తర్జన- భర్జనలు చేసుకున్న మీదట
అతి కష్టం  మీద , ఒకానొక శుభ సందర్భం లో
ఆమె చేత పాడిస్తామని ఒప్పుకున్నారు...వారిచ్చిన మొత్తం బొడ్లో దోపుకుంటుా....

                        సంగతి విన్న ఆండాళ్ళు ఆనందం
తో ఎగిరి గంతేసినంత పని చేసింది.
తనలాంటి భక్తురాలి మొర విన్న ఆ దేవుడిని
పదే పదే తలుచుకుంటుా , పలు రకాలుగా తనదైన
శైలి లో కీర్తించింది.

-----------------         సశేషం.-     -------------
                       ( ఇంకా ఉంది ).
-----------------------------------------------------

    

No comments:

Post a Comment