యుగయుగాలుగా జగాన ఆమని
వెన్నెల కాంతులు తెచ్చెనురా
యుగాది పర్వము ఆంధ్రుల మదిలో
పునాది వేసిన పండగరా ॥
ఆమని పాటల గీతికరా...
ఆ.....ఆ.....ఆ........॥
అందముగా ఆనందముగా, అర-
విరిసిన కన్నుల పుాబాలలుా,
డెందములే మురిపించెనుగా, సుక-
పిక, రవముల , చిరు గానములుా--।
చిగురులు తొడిగిన కొమ్మల నడుమా,
కోయిల పాడిన గీతికలుా-
గలగల పారే నదీ -నదములా
పారే సొగసుల మాలికలుా......
గిరుల-ఝరుల సడి, సందడులుా..॥
ఆరు ఋతువు లా అల్లరి బాలలు,
చేరి చెలిమి నిడె , కానుకలుా..
వత్సరాల వరి , వనరులాది సిరి-
పంచిరి, పలురీతి వేడుకలుా..
కోటి వెలుగులా దీపికలుా..ము-
క్కోటి దేవతల దీవెనలుా...
భువిని వెలుగులా పండగలుా.....
ఆ.......ఆ......ఆ.........॥
కలిమి -బలిమి లా , చెలుల చేరి-
మన మంతా చేద్దాం, వేడుకలుా।
సమత -మమత లా, ఐకమత్య మిడి
స్నేహ భావముతొ , మసలికలుా..।
జాతి జగడములు.., వద్దు -వద్దికా
కుల మత భేదపు , జాడ్యములుా।
రానీయకు మీ, దరికి వాదములు
చాలిక ఈ తార-తమ్యములుా..
మన ప్రగతికి బాటిది , శాంతికలుా--
ఆ.....ఆ...ఆ..................॥
----------------------------------------------
రచన..శ్రీమతి..,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------+
No comments:
Post a Comment