Saturday, April 6, 2019

చిట్టి పొట్టి పాపలు

శీర్షిక.
చిట్టి పొట్టి పాపల్లారా.
---------------------------
చిట్టి పొట్టి పాపల్లారా
చిన్నారి మొలకల్లారా
చెప్పేది వినగా రారే
సిరి మల్లె పుావుల్లారా॥

తొలిదైవం  అమ్మా ,నాన్నలు
మలి దైవం ,గురువులు మీకు
ఆ దేవుని రుాపం వారు
మీ ఉన్నతి కోరేవారు..॥

దైవం ప్రతి ఇంటా కొలువు
అమ్మా  నాన్నలుగా పిలువు
చెప్పేది వినరారండీ
తొలి వందనమిడి లెేవండి॥

పొద్దంతా చదువుల పంటా
సాయంత్రం ఆటా పాటా
పాటిస్తే   వరమిదిటండీ
ఆరోగ్యమే భాగ్యము సుండీ ॥

సంధ్యా సమయం లో ఇంటా
సద్గురులకు వందన మంటా
పాఠాల పారాయణతో
దైవానికి వందనమంటా...॥

చెడు చేతలు  చేయకండీ
చెడు మాటలు  రానీకండీ
వినకండీ చెప్పుడు మాటలు
మరువకు రీ మంచి మాటలు ॥

పరిశుభ్రత పాటించండీ
పరిసరములు మనవేనండీ
ఇంటంటా మొక్కల తోట
చెట్టు  విడుచు గాలే శ్వాశ ॥

అమమ్మ , తాతలున్న ఇంట
మంచి మాట , కధలా పంట
బామ్మ మాట బంగరు బాట
గౌరవించు పెద్దల మాట ॥
------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..( మహారాష్ట్ర  ).

No comments:

Post a Comment