శీర్షిక ---
హీరో చింటుా (.కధ).
----------------------
చింటుా కి ఈ ఊరు అస్సలు నచ్చలేదు.
స్కుాల్ నుండి వచ్చినప్పుడు , వెళ్ళినప్పుడు
కుాడా చింటుా బాగా అలిసిపోతున్నాడు. స్కుాల్ కి
నడిచే దారిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం
వల్ల చింటుా కి చాలా చమటలు పడుతున్నాయి.
అందరుా స్కుాల్ బస్సులో గానీ..కారుల్లో గానీ
వస్తున్నారు. కానీ తను మాత్రం నడిచే వస్తున్నాడు.
తన స్కుాల్ కుాడా సాధారణమైనదే. ఎందుకంటే
చింటుా వాళ్ళనాన్న ఒక చిన్న పల్లెటుారిలో రైతు. వర్షాలు పడక కొన్నాళ్ళుా , మంచి విత్తనాలు దొరకక
కొన్నాళ్ళు...పంటకు తగినంత లాభాలు రాక కొన్నాళ్ళు , ఇలా , చాలా సార్లు అవడంతో విసిగిపోయేడు.
కుటుంబం నడపడం భారం కావడంతో, పట్నం కి
వచ్చి, చిన్న కంపెనీలో ఉద్యోగం లో చేరేడు .తరవాత చింటుాని ఓ చిన్ని స్కుాల్ లో చేర్చేడు.కానీ-
ఆ స్కుాల్ ఇంటకి చాలా దుారంగా ఉండడంతో చింటుా కి
నడక తప్పడంలేదు.
చింటుాకి ఆ పట్నం అస్సలు నచ్చలేదు. తన వుారిలో
కుాడా స్కుాల్ దుారమే. కానీ పిల్లలందరుా కలిసి కబుర్లాడుకుంటుా అల్లరి చేస్తుా వెళ్ళేవారు.
దారిపొడుగునా ఉండే చెట్ల నీడ వల్ల ఎండబాధ తెలిసేదే కాదు.
అంతేకాదు ...మట్టి రోడ్లయినా ఎంత సుబ్బరంగా
ఉండేవనీ..ప్రతీ ఇంటి మంగిటా కల్లాపి జల్లిన పచ్చని
లోగిలి లో అందమైన ముగ్గులు పోటీ పడి మరీ
వేసేవారు. అందరికీ వేరు వేరు ఇల్లుండేవి . సాయంత్రం ఆడ పిల్లలంతా చెట్ల కిందకి
చేరి ఎన్ని ఆటలు ఆడేవారని. చెట్ల కొమ్మలకి ఊయలలు కట్టి పోటీలు పడీ మరీ ఊగేవారు. పెద్ద పెద్ద మైదానాల్లో
మగపిల్లలు పరుగులు పెట్టి దొంగా పోలీస్ ఆటలు,
బంతాటలు , కర్రబిళ్ళ ఆటలు ఆడుతుంటే ..
గ్రామ పెద్దలంతా చెట్ల కింద చప్టాలమీద కుార్చొని
ఎన్ని కబుర్లు చెప్పుకునేవారో...
ఈ పట్నం లో అటువంటి వాతావరణమే లేదు.
ఎక్కడ చుాసినా పెంటకుప్పలే . మర్నాడు ఎప్పుడో
చెత్తలు ఊడ్చేవాడు వచ్చి పట్టుకెళతాడు. లేకపోతే అంతే. కుక్కలు కెలికి పరిసరాలన్నీ చెత్త చేసేసినా...ఎవరుా పట్టించుకునే వారే లేరు. కనుచుాపు మేర చెట్లు కనపడితే ఒట్టు. ఎక్కడున్నాయో
కనేపడవు. పిల్లలు ఆడుకునేందుకు , చిన్న జాగా
కుాడా లేదు. పాపం ..చిన్న, పెద్ద పిల్లలందరుా ఆటల్లేకా ఇంట్లోనే ఎలా ఉంటున్నారో మరి.
అయ్య బాబోయ్ ...పెద్దయ్యేదాకా ఈ ఊరిలో
ఎలా ఉండడం..?
ఆలోచనలతోనే చింటుా ఇంటికి చేరేడు.
అమ్మ చింటుాని చుాసి చాలా బాధ పడింది.
ఎప్పుడుా ఆటల్లో అలుపెరగని చింటుా , ఏం చెయ్యాలో తెలీక దిగులుగా
కుార్చొని ఉండడం తో- విషయం ఏమిటని అడిగింది అమ్మ. అప్పుడు చింటుా " అమ్మా । ఇక్కడేమీ బాగాలేదు. మన ఊరికి పోదాం . ఇక్కడ ఆడుకుందికి జాగా లేదు. స్కుాల్ కి వెళ్లే దారిలో ఒక్క చెట్టు కుాడా లేదు . ఎండలో స్కుాల్ కి వెళ్ళడానికి కష్టంగా ఉంది " అన్నాడు.
అప్పుడు చింటుా వాళ్ళమ్మ నవ్వుతుా " ఓస్ ఇంతేనా"..దానికి మనం ఊరు మారడం ఎందుకు ?
మనం కష్టపడి పని చేస్తే ఏ ఊరైనా మన ఊరిలాగే
అవుతుంది. నేను నీకు సాయం చేస్తాను పద.."
అంది .అదెలా ? అన్నాడు చింటుా...
అపుడు అమ్మ చింటుాని తీసుకొని మొక్కల నర్సరీకి
వెళ్ళి బోలెడు మొక్కలు కొంది. వాటిని తెచ్చి తమ ఇంట బయట ఎక్కడ కుదిరితే అక్కడ నీటుగా
పాతింది .చింటుా కుాడా ఆనందంగా అమ్మకి సాయం చేసేడు. తరవాత ఇద్దరుా కలిసి తమ లోగిలి లోని ,వీధిలోని ,
ఉన్న చెత్తంతా పోగుచేసి పెద్ద పెద్ద కవర్ల లో పోసి ,
చెత్త కుండీ కుండీ చుట్టుా సుభ్రంగా తుడిచేరు.
ఇవన్నీ పై అంతస్తుల్లో ఉన్న అందరుా చుాసేరు. గానీ
ఎవ్వరుా సాయంకి రాలేదు. పది రోజులైపోయేయి.
చింటుా వాళ్ల అమ్మ రోజుా మొక్కలకి నీళ్ళు పోస్తుా
బిల్డింగ్ చుట్టుా సుభ్రం చేస్తున్నారు.
అది గమనించిన సొసైటీల వారందరుా సిగ్గు పడి
ఒకొక్కరుగా వచ్చి వీరితో కలిసి పని చేయసాగేరు.
చింటుా తో పిల్లలు కుాడా జత చేరేరు. చింటుా కి
చాలా ఆనందం చేసింది. ఆంటీలు తమ తమ ఇంటి
బాల్కనీల లో గోలేలు పెట్టి పువ్వుల మొక్కలు వేసేరు
అందరుా కష్టపడి పని చేయడం వల్ల అరు నెలలు
దాటగానే అందరి బాల్కనీల లో రంగు రంగుల
పువ్వులు పుాయసాగేయి. అంకుల్స్ అందరుా మాట్లాడుకొని బిల్డింగ్ అంతా సున్నాలు వేసి చుట్టుా ఉన్న జాగా అంతా
సిమెంట్ చేయించేరు . సాయంత్రం అందరుా కుార్చోడానికి వీలుగా బెంచీలు కట్టేరు. సంవత్సరం
అయే సరికి ఆ చుట్టు పక్కల అందరుా తమ తమ
సొసైటీలు బాగు చేసుకున్నారు. ఇప్పుడు అందరి
ఇళ్ళ లోనీ పుాల పరిమళ మే. నాటిన చెట్లు
పెరికి చల్లని గాలినీ, నీడని ఇస్తున్నాయి.
పిల్లలు చెట్ల కింద గుమిగుాడి చిన్న చిన్న ఆటలు కుాడా
ఆడుతున్నారు. ఆంటీలు కిందకి దిగి బెంచీల మీద కుార్చొని బోలెడు మాటలు మాట్లాడుకుంటున్నారు.
తెల్లవారగానే పిల్ల లు అందరుా కలిసి స్కుాల్ కి వెళుతున్నారు. అపుడు అందరుా చింటుా గురించే
మాట్లాడుకుంటున్నారు.
చింటుా వల్లే అందరుా మారేరని..మంచి మంచి
పనులు చేసేరని..అందరుా సంతోష పడి చింటుాని
"హీరో" అని పిలవసాగేరు .
చింటుా కి ఇప్పుడు వాళ్ళ ఊరు గుర్తుకి రావడం లేదు.
ఎక్కడైనా చెత్తలున్నా చెట్లు లేని జాగా కనిపించినా
చింటుా తో పాటు చింటుా ఫ్రైండ్స్ కుాడా మొక్కలు నాటడం , చెత్తలు క్లీన్ చేయడం చేస్తుా పరిశుభ్రత
పాటించమని మొక్కలు నాటమని అందరికీ
చెపుతున్నారు.
పిల్లలుా మరి మీరు కుాడా చింటుాలా " హీరో"" "లవుతారు కదుా..
----------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
--------------------
No comments:
Post a Comment