Sunday, October 8, 2023

ప్లీజ్ ! తొందరగా వచ్చేయ్ (...కధ)

08/10/2023.

*తపస్వి మనోహరం E-book  కొరకు కథ*


కథ అంశం:

1..మొగుడు ఊరు వెళ్తే.

అంశం ఇచ్చిన వారు :: అఖిల .

శీర్షిక: ప్లీజ్ ! తొందరగా వచ్చేయ్ ..


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


-----------------------


ప్రియం వదకు చెప్పలేని ఆనందంగా ఉంది కారణం 

ఈ రోజు తన భర్త ప్రకాష్ , ఊరు వెళ్ళిపోతున్నాడు .అదీ పది రోజులట.   ప్రెండ్  కుాతురు పెళ్ళిట. ఆలాగే వాళ్ళ

బంధువుల ఇళ్లకు కుాడా  వెలక్ళి వస్తాడుట.

" అబ్బా! ఎంత హాయో . ! "

------------

ఈ కరోనా కాదు గాని, హాయిగా ఆఫీస్ కి వెళ్తున్న మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టి పనిచేయించేస్తోంది .

ఇంట్లోనే ఉంటూ ఎప్పుడూ "వర్క్ ఫ్రం హోం "అంటూ ఒక రూమ్ లో కూర్చుండి పోతాడు . అంతే ! అక్కడి నుంచి "ఆర్డర్లు " వస్తూనే  ఉంటాయి .. అదీ ఫోన్ లో..‌"

 ప్రియా! తలనొప్పిగా ఉంది . కొంచెం కాఫీ  ఇవ్వూ. "

" ప్రియా!  ఆకలేస్తోంది .ఏమైనా చేస్తున్నావా? "

" ప్రియా !మధ్యాహ్నం  "టీ "టైం అయింది ..ఏమన్నా స్నాక్స్ చేస్తావా?"

" ప్రియా! కాఫీ కావాలి ప్రియా, గ్రీన్ టీ  ఇద్ధూ , కాస్త చేంజ్ గా ఉంటుంది "

ఇలా వేపుకు తినడమే పని. ఆయన చేసే పని ఏంటో గాని,

ఆయన అడిగినవన్నీ అందీయలేక, నేను చస్తున్నాను మధ్యలో. నా అవసరానికి పిలుద్దాం అన్నా ,

ఎప్పుడు  ఆయన కూర్చున్న గది తలుపు వేసే ఉంటుంది

 తలుపు తీయరు.

 ఒకరోజు అనుకోకుండా చేరవేసి ఉన్న తలుపును తీసి లోపలికి తొంగి చూసా .

అబ్బో ! కంప్యూటర్ ,  నడుస్తూనే ఉంది .

ఈయన గారు హాయిగా కుర్చీలో పడుకుని గుర్రు పెడుతూనేఉన్నారు .

"హమ్మయ్య" కాస్తంత ఊపిరి తీసుకోవచ్చు అనుకున్నా. .అంతే 20 నిమిషాల లోనే ఫోను "ప్రియా! పని చేసి  చేసి ,తలనొప్పి వస్తోంది  కాస్తా కాఫీ ఇద్ధూ ..అంటూ తనే వచ్చి చెప్పొచ్చుగా.. ఊహూ,

".రాజా గారు ఫోన్ "చేశారు...

-----------------------------


"ప్రకాష్ ఇలాగే ,అప్పుడప్పుడు ఊరికి వెళ్తుంటే ఎంత బాగుంటుందో  .ఈసారి ట్రిప్పు పది రోజులు.

 ఈ పది రోజులు తను ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఎన్నాళ్లైందో తన స్నేహితులందరినీ కలిసి .

ఎప్పుడూ , వాళ్ళందరూ" కిట్టి పార్టీలు "చేసుకుంటూ ఉంటే, తనను పిలిచినా వెళ్లలేని పరిస్థితికి ఎంత కోపం వస్తూ ఉండేదో. మరి వాళ్ళంతా అంత తీరుబాటుగా  ఎలా ఉంటున్నారో?

వాళ్లంతా తనను కూడా ఎన్నిసార్లు పిలిచినా...కానీ ,

 ఒక్కసారి కూడా తను వెళ్ళలేకపోయింది ,ఎందుకనో ?"


"ఎందుకని ఏమిటి ? కొంచెం కూడా సమయం లేని ఈ పనుల వల్లే కదా ! ఒక్కరోజు కూడా తనను బయటకు పట్టుకు వెళ్లలేదు తనూ వెళ్లడనుకోండి. "


కానీ ప్రతిరోజు "నీకేమైనా కూరలు  కావాలా.".?  అంటూ "వాకింగ్"  పేరుతో వెళ్లి కూరలు తెచ్చి పడేస్తాడు .

అటుపై  పిల్లల్ని స్కుాల్ కి దిగపెట్టి వస్తాడు.

అప్పుడప్పడు పిల్లలకేదైనా  ఒంట్లో చికాకు చేస్తే డాక్టర్  దగ్గరకు తీసుకు వెళ్తాడు. 

తన కెప్పుడైనా ఒంట్లో  బాగా  నలతగా ఉంటే కాస్తంత 

పని చేస్తాడా..ఆమాత్రం దానికే . 

తనకేదో ఉపకారం చేస్తున్నట్టు ఫోజొకటి .

 ఇక సాటర్డే "ఆఫ్ డే "అని ,సండే "ఫుల్ డే "సెలవు అని, ఎంచక్కా , తన స్నేహితులతో.ఎంజాయ్ చేస్తాడో...

మరి తనకు మాత్రం స్నేహితులు లేరా? అబ్బే!  ఆ విషయం ఎప్పుడైనా పట్టించుకుంటే కదా..."

పోనీ ఎప్పుడైనా "పిల్లల్ని అయినా స్కూలుకి దింపి వస్తాను" అంటే అదీ వద్దంటాడు.  "స్కూల్ చాలా దూరం ప్రియా! నువ్వు వెళ్లి వస్తే అలిసి పోతావు. ఆ తర్వాత ఏ పని చేయలేవు కూడా" అంటూ పిల్లల్ని కూడా తనే స్కూలుకి  పట్టుకెళ్తుంటాడు రోజూ.


"సరేలే ! ఇన్నాళ్లకు దొరికిన ఈ అవకాశంలో ,  తను,  తన సరదాలు కొన్నైనా తీర్చుకుంటుంది."

" ఈ పది రోజులు తన చాలా ఎంజాయ్ చేస్తుంది. అసలు ఇంట్లో వంట వండనే వండదు . తనకిష్టమైనవన్నీ, బయట నుంచే తెప్పించుకుంటుంది.

పాపం , ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ,తేజు .

ఒకడికి ఏడేళ్ళు . మరొకడికి ఐదేళ్ళుాను.

 కానీ వాళ్ళకి ఎప్పుడూ ఏవి బయట నుంచి తెచ్చి పెట్టలేదు .వాళ్ళకి పానీపూరీలు అన్నా,  పిజ్జాలన్నా ,ఐస్క్రీమ్ అన్నా ఎంత ఇష్టమో..! అవన్నీ వాళ్ళకి తినిపిస్తుంది."

రాత్రంతా ఇదే ఆలోచిస్తున్న. ప్రియంవదకు ,  సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు . తెల్లారిగానే ప్రకాష్ లేచి బట్టల సర్దుకుంటూ ఉంటే గబగబా వెళ్లి" టీ" పట్టుకొచ్చి ఇచ్చింది ".ఐదు నిమిషాల్లో టిఫిన్ చేస్తానండి." కొంచెం నిద్ర పట్టేసింది అంది.

ప్రకాష్ నవ్వుతూ, పర్వాలేదు ప్రియా , బయట ఎన్నో దొరుకుతాయి గా . ఏదో తినేస్తాలే అంటూ , సూట్ కేసు

 పట్టుకుని బయలుదేరాడు.

"వీలున్నంత తొందరగా వచ్చేయండేం. ఆరోగ్యం జాగ్రత్త "అని ప్రేమ వలకబోస్తూ టాటా చెప్పింది.


-ప్రకాష్ 10 రోజులు వరకు రాడన్న సంతోషంతో, ప్రియంవదకు గాలిలో తేలుతున్నట్టుగా అనిపించింది.

"కాఫీ తాగేసేను కదా! "టిఫిన్" హాయిగా బయట నుండి తెప్పించుకుందాం లే .  ఈరోజు సండే కదా .పిల్లలు లేచేసరికి ఎటుటూ 9 అవుతుంది."

 అనుకుంటూ మళ్ళీ బెడ్ రూమ్ లోకి వెళ్లి ,హాయిగా కాళ్ళు జాజుకు పడుతుంది.

---------------------------


మమ్మీ  ! ఈ రోజు  ఇంకా లేవలేదేం . ఆకలేస్తోంది మమ్మీ !

లే...అంటుా,  తనను,  కుదుపుతున్న తీరుకు ,  పిల్లల అరుపులకు   గాభరాగా కళ్ళు విప్పింది ప్రియంవద.

ఒక్క క్షణం , ఆమె  కేమీ అర్ధం కాలేదు. 

మెల్లగా తల తిప్పి గోడ గడియారం వైపు చుాసి 

అదిరిపడింది.

సమయం  ఉదయం పదకొండవుతోంది.

ఒక్క ఉదుటను మంచం దిగి,  కిచన్ వైపు వెళుతుాన్న ప్రియకు , తెల్లవారి ఐదు గంటలకే ప్రకాష్ ఊరెళ్లిన సంగతి  గుర్తుకు వచ్చి , ఆనందంతో గిర్రున వెనక్కి తిరిగింది.

అమ్మ ముఖంలో ఆనందం చుాసిన పిల్లలు  , 

తల్లివైపు ఆశ్ఛర్యంగా చుాడసాగేరు.

ప్రియంవద    గబగబా పిల్లల దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పింది .

అంతే వాళ్ళిద్దరుా కుాడా , అప్పటికప్పుడు 

పది రోజులవరకు తిరగవలసిన జాగాలుా,  తినలసిన     ఐటమ్స్  అన్నీ ప్లాన్లు  చేసేసుకున్నారు.

అందులో, బవాగంగా  మొదటిదిగా , ఆరోజు "ఫేమిలీ  పిజ్జా "ఆర్డర్ చేసేదారు. ప్రియంవద , పిల్లలతో పాటు  చిన్నపిల్ల లాగే గంతులేసింది.

ఆ రొజుాయంత్రం , "కిటీ పార్టీకి"  వెళామని ప్లాన్ చేసుకుంది. 

పిల్లల్ని  పొరుగునున్న  రాధతో , ప్రకాష్  ఊరెళ్ళిన సంగతి చెప్పి , కుారలు తేవాలన్న మిషతో ,  వాళ్ళింట్లో  వదిలి  , బయట పడింది.

ముందుగా" కిటీ పార్టీ "జరుగు తున్నదెక్కడో ఫోన్ చేసి తెలుసుకునేసరికే  ,  గుండె ఝల్లుమంది.

"అబ్బో।  శోభా వాళ్ళింట్లోట.  చాలా దుారం ."

అనుకుంటుానే మళ్ళీ అందరినీ కలిసే అవకాశం రాదని బయలుదేరింది . షేర్ ఆటో దొరకక , రెండుందల పై చిల్లర 

సమర్పించుకుని శోభా వాళ్ళింట్లోకి అడుగు పెట్టింది

ప్రియంవద. 

అక్కడి వాతావరణం చుాసి నివ్వెరపొియింది. 

టేబుల్ నిండా రకరకాల తినుబండారాలు , కాఫీ కప్పులు

చెల్లా చెదురుగా ఉన్నాయి. ఓ పదిమంది కింద కుార్చొని 

గోల గోలగా  పేకాట ఆడుతున్నారు . మధ్యలో వంద రుాపాయల నోట్లు  చాలా  ఉన్నాయి. 

అక్కడే రెండు బీరు బాటిల్స్ కుాడా ఉన్బాయి. 

వాళ్ళు తన ని చుాడగానే గోలగా అరచి , తర్వాత బీర్ పోసిన గ్లాసు అందించి , పేకముక్కలు  తన చేతికిచ్చి 

కుార్చోపెట్టేసారు. ఇవన్నీ తన ప్రమేయం లేకుండానే 

జరిగిపోయాయి.

ప్రేమగా ఒక మాట గాని,  పలకరింత గానీ లేదు.

సరికదా ఓ ఐదువందలు మధ్యలో వేయించుకున్నారు.

తనకు పేకాట అంత బాగా రాదన్నా వినకుండా 

తన ఆట కుాడా వాళ్లే ఆడేసి రెండువేలు దోచుకున్నారు.

దాంతో ప్రియంవదకు కిటీ పార్టీ మత్తు వదిలిపోయింది.

రెండు గంటల తర్వాత , ఏడవలేక నవ్వుతుా , 

వాళ్ళ బలవంతంమీద 

"మళ్ళీ తప్పకుండా వస్తానని మాట ఇచ్చి" మరీ

 బయటపడింది. 

"అయ్యబాబోయ్..ఒక రోజులోనే రెండువేల ఐదువందలు పోయాయే...ఇక ప్రతీ వారం వెళితే ఇంకేమైనా ఉందా...

ఈ మందంతా తన ఇంటికు వస్తే తను ఖర్చులు  భరించగలదా ...? 

హమ్మొా ..; ఏదో సరదాగా ఉంటుందనుకుంది గానీ, 

ఇంత దరిద్రంగా ఉంటే ఎలా...?

, తనకస్సలు నచ్చలేదు.

"మరి చచ్చినా ఇటువంటి పార్టీలకు రాను " 

అనుకుంటుా "దేవుడా" అని ఇల్లు చేరింది.--

ఆ రాత్రి అనవసరంగా అంత డబ్బు పోయినందుకు ప్రియ సమంగా  నిద్రపోలేకపోయింది. 

----------------

రెండు  రోజులు అంతా బాగానే గడిచాయి . .

అదిగో అప్పటి నుండే  ప్రియకి , మరిన్ని  కష్టాలు మొదలయ్యేయి.

పెద్దాడికి ఏ తిండి అరగలేదో , పొట్ట మాత్రం బానలా 

పొంగిపోయింది. చిన్న వాడికి కడుపులో నొప్పి వస్తున్నాది

తనకు రోజుకు ఐదారు సార్లన్నా బాత్రుామ్కి వెళ్ళవలసి

వస్తున్నాది.

అక్కడికీ  పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళీ , అందరుా 

చుాపించుకున్నారు. ఆయన మీ అందరికీ ఫుడ్ పాయిజన్  అయి, అజీర్తి పట్టుకుంది.. బయటి వస్తువులేవీ తినకండి.కొన్నాళ్ల పాటు  ఈ  తిండి వస్తువులు , కుారలు కుాడా తినకండి .

ఈ మందులు వాడి , తగ్గకపోతే మళ్ళీ రండి " అంటుా

తట్టెడు మందులు రాసేడు

 అతడు రాసిన  మందులు తెచ్చి వేసుకుంటున్నా 

 దేని దారి దానిదే అయిపోయింది. మరో రెండు రోజులు గడిచేయి గానీ ,   ఎవరికీ  రోగం తగ్గుముఖం పట్టలేదు .

ఆ రోజు పిల్ల ల పరిస్థితి చుాసి , స్కుాల్ కి , ఒక నాలుగు రోజులకై  "లీవ్ లెటర్" ఇద్దామని బయలుదేరింది.

పగటి పుాట అందరికీ ఆఫీస్ టైమ్ లయ కావడంతో ,

ఆటో రిక్షాలు దొకనేలేదు . దిరికిన ఆటో" ట్రాఫిక్ జామ్ "వల్ల  అగి ఆగి వెళ్ళడంతో , పొద్దున్న ఏడింటికి వెళ్ళిన తను  పది గంటలదాకా ఇంటికి రాలేకపోయింది.

దాంతో పనులన్నీ  ఆలశ్యమైపోయాయి.

గబ గబా చేసేసరికి ప్రియంవదకు నడుము పట్టేసింది.

---------------------------

ఎంత ప్రయత్నించినా పిల్లలకు  ఏమీ సాయించక ఏమీ తినడంలేదు. .

పిల్లలు  ఏమీ తినలేక బాధ పడుతుా ఉంటే ప్రియంవద

చుాడలేకపోతున్నాది.

ఆకారణంగా డాక్టర్  రాసిన కుారలు , వెతికి వెతికి 

తేవలసి వస్తొింది. మార్కెట్  ఇంటికి చాలా దుారంలో ఉంది. రోడ్డుమీద  నిలబడి చుాస్తే '  ఎన్ని ఆటోలో తన కళ్ళముందునుంచే వెళిపోతాయి . గంటలు గడిచి పోతాయి గానీ ఒక్కటి కుాడా ఆపినా  ఆగదు .ఎలాగో దొరికిన ఆటో ఎక్కి వెళితే అదెంత దుారమొా అదెంత రేటో...

.గానీ రావడం కుాడా అంతే లేటవుతోంది. ఆటోకోసం నిల్చొని నిల్చొని, కాళ్ళు విపరీతంగా  పీకుతాయి .దాంతో ఇంటి పని చేయలేకపోతున్నాది

మార్కెటింగ్  చేయడం ఎంత కష్టమొా 

మొదటిసారి తెలుసుకున్న "ప్రియ" కు భర్త లేని లోటు

మొదటిసారి తెలిసి వచ్చింది . 

ఈ నాలుగు రోజులుా పిల్లలు స్కుాలుకు వెళ్ళే లేదు.

పిల్ల లు ఇంట్లోనే ఉండడంతో, ప్రియకి పని పెరిగిపోయింది.

దానికి తోడు ఇద్దరుా ,రోగ బాధ  భరించలేక తనచుట్టుా

తిరుగుతుా ఉండడంతో , ప్రియకు తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీకుండా పోయింది.

ఇంట్లో అయనుంటే,  పిల్లలకి ఎప్పుడైనా ఇలా చికాకు చేసినా, తనకు ఎప్పుడైనా చికాకు చేసినా, ఎంచక్కా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, తీసుకురావడం, టైమ్ కు మందులు కూడా  ఇస్తూ ఉండేవారు ఇప్పుడు అన్నింటినీ  తానే చూసుకోవాల్సి వస్తోంది దీంతో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు  కనిపిస్తున్నాది ప్రియంవదకి .


ఈరోజు ప్రియంవదకి చాలా ఎక్కువ పని ఉంది .

ఎవరికి ఒళ్లలో  బాగులేని కారణంగా నాలుగు రోజులు బట్టి ,

ఎవరి బట్టలు ఉతకడం అవలేదు. అందుకే ఆరోజు పొద్దున లేచి  అందరి బట్టలు , వాషింగ్ మెషిన్ లో ఉతకడానికి వేసింది మరో రెండు ట్రిప్పులు వేస్తే గాని బట్టలన్నీ ఉతకడానికి అవ్వదు .

ఈరోజు ఎలాగైనా ఈ పని పూర్తి చెయ్యాలి అనుకుంటూ ,వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళిపోయింది.


"రేపటి నుంచి పిల్లల్ని ఎలాగైనా సరే స్కూల్ కి పంపించాలి నాలుగు రోజులు అయింది వాళ్ళు స్కూల్ కి వెళ్ళలేదు. 

ఆబ్సెంట్లు ఎక్కువ అయిపోతే మళ్ళీ పిల్లలకి ,నోట్స్ దొరకడం కష్టమై ,పరీక్షలు రాయడంలో ఇబ్బంది అవుతుంది ."

ఆలోచిస్తునే ,  వంటకానిచ్ఛేసింది .

"పిల్లల స్కూల్ డ్రెస్సులు ఉతకాలి "అనుకున్నంతలోనే కిట్టీ పార్టీ ఫ్రెండ్స్ అందరూ వబిలబిలమని లోపలికి వచ్చేసారు.

ప్రియంవద ,  వాళ్ళని చూడగానే" ఓరి దేవుడో " అనుకుంటూనే మనసులో చిరాకుగా ఉన్నా, పైకి నవ్వు పులుముకొని వారిని లోపలికి ఆహ్వానించింది.

ఆ వచ్చిన వాళ్ళు సాయంత్రం ఆరు దాటాకా గానీ 

కదల లేదు. వారికి కావలసినవన్నీ  అందించి వారిని సాగనంపేసరికి ప్రియందకు తల ప్రాణం తోకకి వచ్చేసింది.

మొారీలో  పడున్న బండెడు అంట్లు తోముకొని, 

 ఇల్లు సవరించేసరికి రాత్రి ఎనిమిది దాటింది. 

బాగా అలసిపోయిన ప్రియంవద ,  స్నేహితులకోసం చేయగా  మిగిలిన   వంటకాలతో రాత్రి ఎంగిలిపడి , పిల్ల ల్ని సముదాయించి పడుక్కొనేసరికి రాత్రి పది దాటింది.

--------------------------


తెల్లారి ఆరు గంటలకు కొట్టే  అలారాన్ని విసుగ్గా ఆపి , బద్ధకంగా లేచి , పిల్లలని  స్కుాల్ కు పంపేందుకు వాళ్ళని లేపి  బాత్రుామ్ లోకి తోసింది. 

అప్పుడు  జ్ఞాపకం వచ్చింది రాత్రి , పిల్ల ల స్కుాల్ యుానిఫారాలు ఉతికి ఆరెయ్యలేదని.

అదిగో ,  అప్పుడొచ్చింది ప్రియంవదకు  ఎడుపుతోపాటు ప్రకాష్ జ్ఞాపకం.

నిజంగా ప్రకాష్  లేకపొివడం వల్ల ఎంత పని పెరిగిపోయింది.

శనివారం వచ్చేసరికల్లా పిల్ల ల యుానిఫాం ," వాషింగ్ మిషన్లో" వేసి ఎండవేసి , ఆదివారం చక్కగా ఇస్త్రీ  చేసి హేంగర్లకి తగిలించేవాడు కదుా..

అప్పుడేమనేది తను "  చాల్లెండి మిషన్ లో పడేసే దానికి , అంత ఫొిజ్ ఎందుకో... ఆ పని చిన్న పిల్లలు 

కుాడా చేసేస్తారు " అంటుా..తీసి పారేసేది కదుా..

ఇప్పుడు  తెలిసొస్తున్బాది . ప్రకాష్ తనకు చేస్తున్న  

సాయం వల్ల , తన కెంత " రెష్ట్ " దొరుకుతున్నాదో..."

కళ్ళలో  నీళ్ళు తిరుగుతుా ఉంటే,  మనస్ఫుార్తిగా

అనుకున్నాది ప్రియంవద ..

"నువ్వు ఊరెళితే ఎంతో హాయిగా ఉంటుందో ""అనుకున్నాను ప్రకాష్ .


కానీ నువ్వు లేని లోటేంటో, నాకిప్పుడు తెలిసి వచ్చింది.

బయటి ఫుడ్ తినడం వల్ల వచ్చే ఇబ్బంది తెలిసింది.

"కిట్టీ పార్టీల" వల్ల , "ఒళ్ళు , ఇల్లు కుాడా గుల్లే " అని 

తెలుసుకున్నాను .

" సారీ।  ప్రకాష్ ..మరెప్పుడుా నిన్ను , నీ పనినీ హేళన చెయ్యను .

"ప్లీజ్ । తిందరగా వచ్చేయ్ "


                         "సుఖాంతం ".

---------------------------





Saturday, June 3, 2023

N.T.R.సంకలనం కొరకు ...కవిత.

04/06 /2023 .
ఆర్ట్ ఫౌండేషన్  వారు నిర్వహించు
 "నందమూరి తారక రామారావు" గారి 
 శతజయంతి ఉత్సవాలు. 
 "సంకలనం" కొరకు
 ప్రక్రియ  : కవిత
అంశం : నందముారి తారక రామారావు.

శీర్షిక  : తారక రాముడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


ఒక తార నింగికెగసింది.
ఒక కన్నీటి బొట్టు ఉధృతమై పొంగింది.
 కళాలోకం స్థంభించిపోయింది
మరపు రాని మహా నటుణ్ణి కోల్పోయింది ॥

తారక రామారావు తిరిగి రాడు.
స్మారక చిహ్నాలకు జన్మ లేదు.
మేలైన కాంతి మణులకు "వెల" లేదు.
మణి కాంతులు విరజిమ్మని చోటు లేదు.॥

నవరసాలను పొిషించే నాయకుడు
భావ వ్యక్తీకరణల మేటి పాలకుడు ॥
తారక మంత్రరాజ భుాషణుడు
రామారావను పేర జగత్ప్రసిద్ధుడు ॥

విల్లు పడితే  అందాల రాముడు.
మురళి నుాదితే  అల్లరి  క్రిష్ణుడు.
పది తలల భారం మొాసే రావణాసురుడు.
పలు  రుాపాలకు ప్రాణం పోసే జీవకుడు.॥

నట సార్వ భౌమునిగా మంచి దర్శకుడు.
భాషాభి వృధ్ధికై పాటుపడిన భావుకుడు.
విన్నుాత పథకాల విశ్వ మేధావతడు
తెలుగు బిడ్డలకన్నగా అత్మ బంధువతడు ॥

తెలుగు వారి గుండెలో    
 ముఖ్య మంత్రి పదవితో 
 చిరస్థాయిగా నిలిచిపోయిన  
 జాతి రత్నమతడు..॥
----------------+
హామీ :
"తారక రాముడు" శీర్షిక గల 
ఈ కవిత నా స్వీయ రచన.

Friday, June 2, 2023

నీ "రసం " కవిత

03/06/2023.
శీర్షిక  : నిదురలో నీ " రసం "

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

నిదురలో నీ " రసం "
మెడడుకు మేత వేస్తొింది.  
బురద జల్లుతున్న బుద్ధిని
అంతరాత్మ  ప్రక్షళన చేయ ప్రయత్నిస్తుా
ఆగ్రహంతో అడుగుతోంది..॥
ఎందరెందరో పోరి తెచ్చిన స్వాతంత్ర్యం .
ఆత్మార్పణల  రుధిరం ధారపొిసి 
మనకై తెచ్చిన ఆనందం .
ఈనాడు తిరిగి బాంచన్ బ్రతుకులకు 
శ్రీకారం చుడుతోందని.అర్ధం కాలేదా..?
అక్రమాలకు ఆహుతౌతున్న 
అప్ప చెల్లెళ్ళ  ఆగని కన్నీటి ధర్నాల -
ఆమడ దుారపు అగచాట్లు  కనపడడంలేదా.?
వృద్ధాశ్రమాల వెలసిన గోడలమధ్య
 విలవిలలాడుతున్న జన్మదాతల
 పగుతున్న గుండె జారి నీదాకా ఇంకా చేరలేదా..?
 వావి వరుసలు మరచిన కామాంధుల 
కబంధ హస్తాల్లో నలుగుతున్న పడతుల 
ఆగని ఆక్రోశాలకు నీ గుండె ద్రవించడం లేదా..?
పాపం పుణ్యం ఎరుగని పసిపాపల 
అమాయక చిరునవ్వుకు, ఐనవారమంటుా
పుాసిన మాయని వికృత మచ్చలు 
నిన్ను భయపెట్టడం లేదా...॥
భారతీయులంరిదీ వసుధైక కుటుంబం
అన్నమాట ఏ కలుగులో దాచేవో..మర్చిపొియావా..?
ప్రస్తుత సమాజంలో  మరుగున పడిన 
మానవత్వం  పిశాచ తాండవం చేస్తోంది...
..నీకుా తెలుసుగా.
ఒక్కడుగు  ముందుకేయెచ్చుగా.... ధైర్తం లేదా.?
నేను ,నాదన్న స్వార్ధంలో  ఆనందపడాలా..?
ఏం బావుకుందామనీ..?
నువ్వుంటున్న నీ దేహమే నీదికాదు.
ఆ దేహం విడిచి పోతే, గాలిలో కలిసిపోతావుగా?
ఈలోపలే ఏం వెలగపెడదామనీ....?
ఒకడుగుడు ముందుకేయవయ్యా....
ఒక మంచి ఆలోచన నీకు తోడౌతుంది.॥
మేముా, మనము అన్న భావనకు
 పదునుపెట్టయ్యా....
మీతో నేనున్నానంటుా చేయుాత నందించవయ్యా.
 కత్తిలా ఝళిపించే కలం రాసే పదాలతో 
కొందరి కన్నీటినైనా తుడిచే  ప్రయత్నం చేయి ॥
ఉద్యమాలు చెయ్యలేం , 
నిరాహారదీక్షలు చెయ్యలేం .
ధైర్యంగా నిలబడి .పోరాడేవారికి 
కనీసం మాట సాయమైనా చేయలేం ॥
ఎందుకంటేమనం కవులం (అనుకుంటున్నాం)కదా..
మాటతో ,చేతతో, చేయలేని ఉద్యమాన్ని 
కనీసం రాత బాటనైనా  నడిపించవయ్యా..॥
.వేల ఆర్తనాదుల అధరాలల లో కొన్నిటికైనా
 విరిసిన చిరునవ్వు అవ్వవయ్యా ....
కోట్ల జనుల నిస్సహాయత్వం,
కోరుకుంటున్న చిన్ని చిన్ని ఆనందాలకు
 మీ  వంతు వరంగా చిన్ని  కవితను 
 చిరుకానుకగా ఇచ్చి  చుాడవయ్యా.....
  నీలో నిజమైన మనిషిని తట్టి లేపు
 ఆనాడు నువ్వనుభవించే బ్రహ్మానందానికి
  నిన్ను నువ్వే మర్చిపోతావు.॥
 మారిన నీ ఆలోచనలు , చరిత్ర 
 సాహిత్య పుటల్లో తర తరాల వెలుగులను
  నింపే  ఆశాజ్యోతు లౌతాయి.॥
 వెలుగులో నిజాల్ని  వెలికి తీసే
నిలకడగల నిత్యానంద యొాగి స్వరుాపవై
 చిరంజీవి వౌతావయ్యా.....
 లే ...లేచి .నిజాల బాటలో  
 అడుగు లేయడం  నేర్చుకో..
 లే...లే...లే.....అంటుా..
లేపుతున్న అంతరాత్మ కుదుపులకు
 నిద్రమత్తు వదిలింది..చుట్టుా చుాశా..
ఎదురుగా తోటలో విచ్చుకుంటున్న మందారం..
 విలాసంగా నావైపు చుాస్తుా తలనుాపుతోంది.
 నీకన్నా నేనే నయమంటుా...॥
దీనికెందుకో ఇంత ధీమా...అనుకుంటుా
 తేరపారి  కిటికీలోంచి చుాశాను ..
 ఆకలికి వాలిన తుమ్మెదకు అది ఆనందంగా 
 తనలో దాచుకున్న  మధురసాన్నందిస్తొింది..
 పరమానందం అనుభవిస్తుా..
 ఆశ్ఛర్యం... మంచం  దిగే ప్రయత్నంలో
 .అనుకోకుండా....ముందడుగేశా..॥

ఈ కవిత నా స్వీర రచన.
 


మనుధర్మ శాస్త్రము

25/05/2023.
మనోహరి మహిళా పత్రిక
శీర్షిక  : మను ధర్మ -శాస్త్రములు.
(వ్యాసం) :
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

యుగాల క్రితం చిహ్నం లేని ప్రమాణముకన్నా
హీనమై నిద్రావస్థలోనున్న  జగత్తును 
పునరుద్ధరించడానికై , స్వయంభువుడు , అవ్యక్ర గోచరుడు అయినవాడు , సమస్త ప్రాణి కోటికీ 
ఆత్మయైన పరమాత్ముడు , స్వయముగానుద్భవించి,
మొదట జలమును సృజించి , అందులో శక్తి బీజమును వదిలిపెట్టెను.

సహస్ర సుార్య తేజోరాజమైన ఆ బీజము  అండమువలె  సువర్ణ ఆకారోత్పన్నమై , అందునుండి
సమస్త లోకములను సృష్టించు బ్రహ్మ నుత్పన్నము
చేసెను.

ఈ బ్రహ్మ ఉత్పన్నమైన జలము "నారా " అని పిలువబడుతుా పాత్మకు పథమస్థానమై, 
నారాయణునకు నివాసయొాగ్యమైనది.

తదుపరి అందుండి సకల చరాచర జగత్తునుా సృష్టించే
బ్రహ్మ తపఃశక్తిచే , రెండు ఖంలుగా విభజింపబడిన 
భుామ్యాకాశాలను, సముద్రాలను , సృష్టించెను.
లోక వృద్ధికై ధర్మా- ధర్మ , సుఖ-దుఃఖ , ఇంద్రియ-
కర్మలకు నిలయమైన దేహమును సృష్టించి , వివిధ
కర్మలకు వివిధ ఇంద్రియములను, బ్రాహ్మణ ,   క్షత్రియ ,
వైశ్య , శుాద్రులను సృష్టించెను.

పిదప తన దేహమును సగము పురుషునిగా , సగము స్త్రీ గా విభజింపజేసి , ఆ స్త్రీ లో విరాట్  సజ్ఞక పురుషుని సృష్టించాడు .

ఆ విరాట్పురుషుని తపఃశక్తిచే ఉత్పన్నమైనవాడు , 
సకల సంసారములను , పది మంది ప్రజాపతులను,
సప్త ఋషులను , సకలచరాచర జగత్తును సృష్టించిన 
శ్రేష్ఠుడే మనువు.

ఈ సృష్టికి మనువు నియమించిన కర్మలు ,ఆచారములు, క్రమముగా ఆచరింపబడుతుా వచ్చినవి . జీవులకు గతులు నేర్పిన వారు మనువు.
ఈ మను వంశ మందు ఉత్పన్నమైన " స్వారోచిష్",
ఉత్తమ్ ,తామస్ , రైవత్ చాక్షుస్ , వంటి మన్వంతరములేగాక , మహా తేజశ్వులైన వైవస్వతులను బట్టి, ప్రస్తుతకాలము 
వైవస్వత  మన్వంతరముగా పిలువబడుచున్నది.

స్వయంభుాయైన బ్రహ్మ , హోమము ,శ్రాద్ధ కర్మలను జేయుట , సంపుార్ణ సృష్టి  రక్షణ, చేయుటకై ,
సర్వ ప్రథముడైన బ్రాహ్మణుని  సృష్టించెను.
ఆపై క్షత్రియ , వైశ్య , శుాద్రులను, వారి వారి 
గుణానుసారము కర్మలను సృష్టించెను.

ఈ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడేగాక , ధర్మ రక్షణకు సమర్ధుడును , వేద శాస్త్రపరాయణుడునుాయై, గృహస్థ ధర్మాది నియమములను పాటించుచుా,
శాస్త్రము లు బోధించువాడై యుండవలయును.
యజ్ఞోపవీత సంస్కారమువలన ద్విజుడు ,
గర్భోత్పన్నమైన దోషములనుండి విముక్తుడగును.

బ్రాహ్మణులకు మంగళసుాచక శబ్దములతోనుా ,
క్షత్రియులకు బలసుాచక శబ్దములతోనుా , 
వైశ్యులకు ధనవాచక శబ్దములతోనుా ,
శుాదృలకు నిందిత శబ్దములతోనుా నామకరణములు
చేయవలయునని  మనువు జెప్పెను. 

మనువు జెప్పిన బ్రాహ్మణ నియమములు, విధులు.
----------------------------------------

యజ్ఞోపవీతసంస్కారమును బ్రాహ్మణ బాలునకు
ఐదు సంవత్సరముల లోనుా ,క్షత్రియులకు ఆరవ సంత్సరములోను , వైశ్యులకు ఎనిమిదవ సంవత్సరములోనుా చేయవలయునని
నియమింపబడినది.

భోజనము చేయునపుడు ఆయుర్వృుద్ధికై తుార్పు ముఖము ,  యశస్సునకు దక్షిణముఖము , 
ధన ప్రాప్తికి పడమర ముఖము , సత్య పాలనకు 
ఉత్తర దిశలు శ్రేష్టమైనవి.

బ్రాహ్మణులు భోజనారంభ , అంత్య సమయములందు
ముాడు సార్లు ఆచమానమును చేసి ఛిద్రమును స్ప్రుశించవలెను .

బ్రాహ్మణునకు బొటనవేలి దగ్గర బ్రహ్మతీర్థము , 
చిటికిన వేలి దగ్గర ప్రజాపతీ తీర్థము , 
ఉంగరపు వేలి దగ్గర దేవ తీర్థము ,
బొటకన వేలు, చుాపుడు వేలులకు మధ్య పితృతీర్థములుండును.

ఈ ఆచమనము వలన బ్రాహ్మణుడు హృదయం  వరకును ,   క్షత్రియుడు కంఠం వరకు ,వైశ్యుడు ముఖము వరకును శుద్ధి యగును.

బ్రాహ్మణుడు బ్రహ్మ ప్రాప్తికై  , ఋగ్, యజుర్ , 
సామవేదోత్పన్నమైన ఓంకారమునుండి ఉత్పన్నమైన
భూః , భువః , స్వః , అను మంత్రమును 
ప్రాతః ,సాయంకాలములందు జపించవలెను.

ఈ జపము వలన బ్రాహ్మణుడు సిద్ధి పొందును.
బ్రాహ్మణునకు తల్లి వలన ప్రథమ జన్మము , 
యజ్ఞోపవీత ధారణ వలన రెండవ జన్మము ,
యజ్ఞ దీక్ష వలన ముాడవ జన్మమును పొందుచున్నాడు.

యజ్ఞోపవీతము లేని బ్రాహ్మణులు ,వేద మంత్రములను పఠింపరాదు.
మసతా భక్తి వలన మృత్యులోకమును , 
పితృ భక్తి వలన అంతరిక్ష లోకములను , 
ఆచార్య భక్తి వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.

మనువు చెప్పిన ప్రకారము చేయకుాడని పనులు :
-------------------------------------

మనువు చెప్పిన ప్రకారము, 
నక్షత్ర నామములు గల కన్యలను ,వృక్ష నామ ములుగల కన్యలను , సర్ప నామములు గల కన్యలను , వివాహము చేసుకొనరాదు.

ఏ కుటుంబములో స్త్రీ లు గౌరవింపబడుదురో..
ఆ కుటుంబము దేవతలకు ప్రసన్నమగును.
గృహస్తుడు దేవ కార్యములకు, ఇద్దరు బ్రాహ్మణులను , 
శ్రాద్ధ కార్యములకు ముగ్గురు బ్రాహ్మణులను 
పిలువవలెను.

మనిషి శాస్త్రములను ఎంత మేరకు అభ్యసించునో
అంతవరకే విశేషములను తెలుసుకొనును .
ఇందువలన జ్ఞానము ప్రాప్తించును.

శాస్త్రానుసారము ఉదయాస్తమయములందు , గ్రహణములందు నిటి యందు, సుార్యుని ప్రతి బింబమును చుాడరాదు. అటులనే నీటి యందు తన బింబమును చుాచుకొనరాదు.

వేద స్వరములను , అక్షరములను అస్పష్టముగానుచ్ఛారణ చేయరాదు.
ఋగ్వేదము దేవతలకును , 
యజుర్వేదము మనుష్యులకును ,
సామ వేదము పితృదేవతలకును , చెందినవి.
కనుక సామ  వేద ధ్వని అపవిత్రము.

మధ్యాహ్నము , అర్ధరాత్రి , సంధ్యాసమయములందు
నాలుగు మార్గముల కుాడలికి పోరాదు.

ఈ విధమైన ఎన్నో శాస్త్రములు , ధర్మములు,
మానవ నడవడికావిధానములెన్నియొా మను శాస్త్రము నందు చెప్పబడినవి.

***************************

ఇంకనుా మనము తెలుసుకోవలసినవెన్నియొాఉన్నవి
మను ధర్మ ములను కొంత  మేరకైనా చెప్పే అవవకాశమును కలిగించిన  మనోహరి కార్యవర్గ 
సభ్యులకు నా మనః పుార్వక ధన్యవాదాలతో..🙏🙏



Sunday, May 21, 2023

[12/05, 4:18 am] +91 99634 18686: సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!99
[12/05, 4:18 am] +91 99634 18686: భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!100
[12/05, 4:18 am] +91 99634 18686: మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!!101
[12/05, 4:18 am] +91 99634 18686: నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!! 102
[14/05, 5:08 am] +91 99634 18686: ధ్రువకోకిల(తరళము)
న భ ర స జ జ గ 12 యతి

శుభము గల్గి ప్రపంచమంత యు శోభతోడనురాజిలన్
విభవమొప్పగ మానవాళి వివేక వంతులుగా మహిన్
ప్రభల కీర్తి వహింతురంచును భావమందు దలంచి నే
నభినుతించెద పెద్దలందరి కంజలించి, సుధీమణీ!! 1

ధ్రువకోకిల

కలిమి గల్గిన నాడు బొంగియు కావరంబున బల్కకోయ్
కలిమి శాశ్వతమౌన దెల్పుమి
క్ష్మాతలంబున నెప్పుడున్
కలిమిలేములు నూగుచుండెడి కావడింగల కుండలోయ్
కలిమిలేములు వచ్చిపోవును గాంచవోయి సుధీమణీ!! 2

Thursday, February 2, 2023

పొిరాటాల జీవితం

02/02/2023.
అ ఆ కవుల భువన విజయ వేదిక .

శీర్షిక  : పోరాటాల జీవితం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.

భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం ,
ప్రతీ కష్టాన్నీ.. తాత్కాలికంగా  మరచిపోవడం ॥
నిన్నటి నెత్తుటి గాయం  , ఈ రోజు
ఉపశమనంతో, రంగుమారుతుంది.॥
గడచిన కష్టకాలపు స్మృతులు, మరపురాని
అంతర్లీన జ్ఞాపకాలై మదిలో నిలిచిపోతాయి.॥
లేమి తనపు కన్నీటి మరకలు, సంతృప్తి నిండిన
సంపాదనతో నవ్వుల మాటున ,వెల-వెలబోతాయి.॥
బీదరికపు పాత చెలిమి ఛాయలు, కొత్త దనపు,
మార్పుకు మనసులో నే మరుగుపడిపోతాయి.॥
విరహవేదన నిండిన అంతరంగం,మరో  ప్రేమ --
కాసారంలో మునిగి, పద్మరాగమై పరిమళిస్తుంది.॥
ఎవరుా లేరన్న ఒంటరితనం,
ఆశల ఆలోచనల విహంగమవుతుంది.॥
అన్నీ కోల్పోతుా కుాడా, ఆశలు-ఆశయాల పయనం,
పరిమళాల  సుమ వీచికయై,  మధురమైన స్వాంతన కలిగిస్తుా, మజిలీదాకా నెట్టుకు వెళ్తుానే ఉంటుంది.॥
ఏ రోజు,  ఎలాగుంటుందో తెలీని ,జీవిత యానం
ఆనంద స్వప్న లోకాల్లో విహరిస్తుా- '
ఎడారిలో ఒయాసిస్సును చేరుకోవాలనే
తపన నిండిన, సద్దుబాటుకు నిదర్శనం .
ఎందుకంటే. ఇది.!  పోరాటాల పరుగు పందెంలో.
,కష్ట- సుఖాలు కలబోసిన   "జీవితం.".
-----------------------------------------
రచన, శ్రీమతి  -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  ( మహరాష్ట్ర ).
---------------------------------------

నా పరిచయం...
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.

సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
మా ఆత్తయ్యగారు సాహిత్య ప్రియులవ్వడంతో
ఆమె ద్వారా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి , సహజంగా ఉండే ఆశక్తి తోడై  ,
కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వీయ రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం
నాకు గర్వకారణం.

పలు సంఘాలలో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు  రచించి స్వరపరచి పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు , లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.

కరోనా కారణంగా ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో  "సంపుార్ణ సుందరకాండ"ను  రచించేను

సంక్షిప్త రామాయణ గాధను , భగవద్గీత పదునెమిది అధ్యాయాలను ,ముప్పది పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచేను..
నేను రాసిన కధలు, కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.
పెళ్ళిపాటలు  సంక్రాంతి పాటలు , విరహ గీతాలు, లలిత గీతాలు , భక్తి గీతాలు , ఇలా వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.
వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందిన నేను ,
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఉంటాను.

సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.
వాటి వివరాలు..

( ఇష్టపది ప్రక్రియలో )
"సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.
(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
"విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
" కవి కోకిల , సుధీ తిలక " బిరుదులను.
సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
."సున్నితం" బిరుదు.ను
పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
"అక్షర ఝరీ రత్న "బిరుదును.
శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
"పద ముత్యం" బిరుదు.ను కాక
సాహిత్య కళానిధి" , మధుర కవి భుాషణ"
స్వర మయుారి ,వెలుగు దివ్వె".అద్వైత--
కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...
రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్,
సమాజ సార్థక్ అవార్డ్.,
కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం,
భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
సాహిత్య సేవా రత్న వంటి ఎన్నో బిరుదులను
పురస్కారాలను  పొందాను.

నా ఈ పరిచయాన్ని ప్రచురింపగోరిన ....
"అ ఆ కవుల భువన విజయ వేదిక " బృందానికి , కార్యవర్గ సభ్యులకు నమస్కరిస్తుా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..🙏🙏

               
     -----------------------------          
                 

పోరాటాల జీవితం . కవిత

02/02/2023.
అ ఆ కవుల భువన విజయ వేదిక .

శీర్షిక  : పోరాటాల జీవితం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.

భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం ,
ప్రతీ కష్టాన్నీ.. తాత్కాలికంగా  మరచిపోవడం ॥
నిన్నటి నెత్తుటి గాయం  , ఈ రోజు
ఉపశమనంతో, రంగుమారుతుంది.॥
గడచిన కష్టకాలపు స్మృతులు, మరపురాని
అంతర్లీన జ్ఞాపకాలై మదిలో నిలిచిపోతాయి.॥
లేమి తనపు కన్నీటి మరకలు, సంతృప్తి నిండిన
సంపాదనతో నవ్వుల మాటున ,వెల-వెలబోతాయి.॥
బీదరికపు పాత చెలిమి ఛాయలు, కొత్త దనపు,
మార్పుకు మనసులో నే మరుగుపడిపోతాయి.॥
విరహవేదన నిండిన అంతరంగం,మరో  ప్రేమ --
కాసారంలో మునిగి, పద్మరాగమై పరిమళిస్తుంది.॥
ఎవరుా లేరన్న ఒంటరితనం,
ఆశల ఆలోచనల విహంగమవుతుంది.॥
అన్నీ కోల్పోతుా కుాడా, ఆశలు-ఆశయాల పయనం,
పరిమళాల  సుమ వీచికయై,  మధురమైన స్వాంతన కలిగిస్తుా, మజిలీదాకా నెట్టుకు వెళ్తుానే ఉంటుంది.॥
ఏ రోజు,  ఎలాగుంటుందో తెలీని ,జీవిత యానం
ఆనంద స్వప్న లోకాల్లో విహరిస్తుా- '
ఎడారిలో ఒయాసిస్సును చేరుకోవాలనే
తపన నిండిన, సద్దుబాటుకు నిదర్శనం .
ఎందుకంటే. ఇది.!  పోరాటాల పరుగు పందెంలో.
,కష్ట- సుఖాలు కలబోసిన   "జీవితం.".
-----------------------------------------
రచన, శ్రీమతి  -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  ( మహరాష్ట్ర ).
---------------------------------------

నా పరిచయం...
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.

సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
మా ఆత్తయ్యగారు సాహిత్య ప్రియులవ్వడంతో
ఆమె ద్వారా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి , సహజంగా ఉండే ఆశక్తి తోడై  ,
కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వీయ రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం
నాకు గర్వకారణం.

పలు సంఘాలలో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు  రచించి స్వరపరచి పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు , లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.

కరోనా కారణంగా ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో  "సంపుార్ణ సుందరకాండ"ను  రచించేను

సంక్షిప్త రామాయణ గాధను , భగవద్గీత పదునెమిది అధ్యాయాలను ,ముప్పది పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచేను..
నేను రాసిన కధలు, కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.
పెళ్ళిపాటలు  సంక్రాంతి పాటలు , విరహ గీతాలు, లలిత గీతాలు , భక్తి గీతాలు , ఇలా వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.
వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందిన నేను ,
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఉంటాను.

సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.
వాటి వివరాలు..

( ఇష్టపది ప్రక్రియలో )
"సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.
(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
"విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
" కవి కోకిల , సుధీ తిలక " బిరుదులను.
సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
."సున్నితం" బిరుదు.ను
పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
"అక్షర ఝరీ రత్న "బిరుదును.
శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
"పద ముత్యం" బిరుదు.ను కాక
సాహిత్య కళానిధి" , మధుర కవి భుాషణ"
స్వర మయుారి ,వెలుగు దివ్వె".అద్వైత--
కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...
రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్,
సమాజ సార్థక్ అవార్డ్.,
కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం,
భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
సాహిత్య సేవా రత్న వంటి ఎన్నో బిరుదులను
పురస్కారాలను  పొందాను.

నా ఈ పరిచయాన్ని ప్రచురింపగోరిన ....
"అ ఆ కవుల భువన విజయ వేదిక " బృందానికి , కార్యవర్గ సభ్యులకు నమస్కరిస్తుా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..🙏🙏

               
     -----------------------------