Saturday, February 29, 2020

జీవన్ముక్తి.

జీవితం పరిసమాప్తమైన వెంటనే  జీవుడు-
మరొక జన్మకై ,మాత్రుగర్భం లోకి చేరేందుకు నెట్టబడ్డాడుొ
చిన్న కణ రుాపంలో, మల -ముాత్రాదుల మధ్య
కొట్టుమిట్టాడుతుా..బయటకు దారి  కానరాని ,
చీకటి నిండిన మురికి నీటిలో  తేలుతుా "పున్నామ- 
నరక" బాధను అనుభ విస్తున్న భావన తో ,తలవంచి
నా మునుపటి జన్మ , పాప క్రుత్యాలు
తలచుకొంటుా, కర్మ ఫలాన్ని అనుభవించడానికి,
ఊపిరాడని, ఇరుకు జీవితానికి అలవాటు 
పడడానికి రాజీ పడ్డాను .

ఇంతలో ఎవరో నన్ను  అక్కున చేర్చుకొని ..
అప్యాయత తో అలరించిన భావన. దుర్గంధపు 
ఊబి నుంచి నన్ను లాగి , నా చుట్టుా ఒక రక్షణ కవచం  చుట్టి , ఆ పొరలో నన్ను చేర్చి ఊరడించిన భావన.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

నా పాప కర్మ కొంచ తగ్గినట్టుండే  ఆనందం, 
అనుభవించేంతలోనే "క్షుద్బాధా పీడితుడి నయ్యేను.
కళ్ళు విప్పలేని నా బలహీనత తో చుట్టుా తిరుగితుా
కదల లేని ఇరుకు పొరలో ఈదుతుా, తేలుతుా..
దుర్వాసనా భరితమైన ఉమ్మి నీటిని గుటకలు వేస్తున్న
నన్ను ,ఎవరో ఆప్యాయంగా తడుముతున్న భావన.॥

నా శరీరం పెరుగుదల కోసం, తాను తిన్న అహారపు
సారాన్ని ,నా నాభినుండి ,పంపేందుకు , బలమైన
తన ఆహారపు నాళాన్ని, నా నాభిలోనికి చొప్పించి, ఆకలి తీర్చే జీవామ్రుతాన్ని ,అడగకుండానే-
 నాకు అందిస్తున్న భావన..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

ఎదుగుతున్న నా భారానికి సాగుతున్న కవచపు..పొర.
పెరుగుతున్న బరువుకు,నాఉనికి నాకే భారమైన చెర .
పెరిగే మెదడును తాకుతున్న బాహ్య తరంగాల సవ్వడి
చిరునవ్వుల గలగలల , ప్రేమ పుారిత స్పర్శాభావం.
నాలో ఏదో పులకరింత.నా నాడుల ప్రేరేపించే 
నిత్య  నిస్వార్ధ నియంత.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

శబ్ధగ్రహణ శక్తి పుంజుకుంటోంది. సప్త స్వర పేటికా-
తరంగాల ఓంకార ధ్వని ,నాలో నాదానికి ప్రేరణౌతోంది.
ఆశ్చర్యానందాల తో ద్వనిని ఆస్వాదిస్తున్నాను.
శబ్దాన్ని గ్రహిస్తున్న నా వీనులకు, వినిపిస్తున్న
కమ్మని పిలుపు."కన్నా, నా బుజ్జీ, నా తండ్రీ.".అంటుా నాకై ,వినిపించే నవ చైతన్యపు అనురాగ సంబోధన.
నాతో బంధాన్ని పెనవేసుకుంటున్న..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

 రోజుకో పలకరింత , నాలో రేగే పుకరింత .
 ఆమెను ఎలాగన్నా చుాడాలన్న కోరికల కలవరింత
 నేను శతవిధాలుగా బయటకు రావాలన్న ప్రయత్నంతో
 నేను చేసే భీభత్సవానికి బాధనిండిన బేలతనపు -
 ఆక్రదన .చిన్ని కాళ్ళతో చిందులు వేసే సమయంలో...
 చిరు నిట్టుార్పుల బాధాతరంగపు ప్రకంపనలు..
 నేను చేసే అల్లరిని అత్యంత సహనంతో భరిస్తుాన్న..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥

ఆ ప్రేమామ్రృత ముార్తిని చుాడాలన్న తపన..
ఆమె తన కోసం పడే వేదనను మించినదై..
గాడాంధకారపు చీకటి నిండిన ఇరుకు బస నుంచి ,
వెలుగుల వెలికి రావాలన్న పట్టుదల ,పంతానికి-
పగిలిన  పొర,  చీకటి నుండి  కలిగించిన విముక్తి.॥

ఒక్కసారిగా చెర విడిన చైతన్యంలో నిండిన ఆనందం.
పేగులు పెళ్ళగించుకొని , కాళ్ళతో తన్నుతుా, 
ఉదరాన్ని చీల్చుకొని,  బయటకు రావాకన్న నా ప్రయత్నానికి,  బాధను ఉగ్గపట్టి, తన విడుదలకై  సహకరంచిన..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
భుామి మీద పడకుండానే, సుతి మెత్తని చేతులతో
సున్నితంగా తనను అక్కున చేర్చుకొని, ఆనందాశ్రువులతో తన రాకను ఆహ్వానించి,
ఆర్తితో తన ఒడిని చేర్చుకొని, ఒద్దికగా ఒడిసి పట్టిన
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చి పడ్డానో తెలియని-
అయొామయ స్థితిలో,అసహాయం నిండినభయంతో
ఏకధాటిగా  ఉవాఁ..ఉవఁ...అంటుా ఏడుస్తున్న నన్ను
చుాసి, "ఎందుకు కన్నాఏడుపు".ఆకలేస్తోందా.అంటుా
అడగకనే తన రక్తస్రవాలను క్షీర రసామ్రుతంగా మార్చి, తనకు స్తన్యమిచ్చి,  ఆకలి తీర్చిన ,ఆ అమ్రుతమయ.
  దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
  
తనపై కురిసే ముసి ముసి నవ్వుల ముద్దుల ముాటలు.
గోల-గోలగా, మమతల జల్లుల మనసైన  చేతలు.
లీలగా వినిపించే తన వీనులకు ,అర్ధమయ్యే  మాటలు.
ఎవరో అంటున్నారు."అమ్మ దగ్గరబజ్జున్నావా."అంటుా.

ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను.దేవత పేరు విన్నాను.
నవమాసాలుా నన్ను మొాసి, నాతో పాటుగా నరక-
యాతనలు అనుభవిస్తుా, పున్నామ నరక గుహ్యంలో
తనకు రక్షణ నిచ్చి, ఆకలి తీర్చన ఆ పుణ్యముార్తి...
పేరు...అ,ఊ, మ, అవుమ...అ...ఉమ్ ..మ....
..అమ్మ ..అమ్మా...అమ్మా...అంటుా వల్లించేను.

ఒక్కసారిగా నా కళ్ళు క్రుతజ్ఞత తో వర్షించేయి.
ఆర్ద్రత నిండిన గొంతు తో ఆర్తిగా పిలిచేను...
(అమ్మా)...  ఉవాఁ ఉవాఁ.... అంటుా..
నా బాధ అర్ధం కాని "అమ్మ" నన్ను  ఆర్తిగా 
అక్కున చేర్చుకుంది. ఏడుస్తున్నాననుకొని ....॥
తన వెచ్చటి పరిష్వంగంలో  ఇముడ్చుకొని, 
నా చుట్టూ  పెనవేసిన చేతులతో, నన్ను  పరి-
రక్షిస్తున్న ఆ ప్రేమైక శక్తి స్వరుాపిణి "అమ్మ" కు,
ఆ జన్నాంతర ఋణగ్రస్తనై , ఉంటానన్న సంకల్ప నిర్ణయం తో , ఆమె ఒడిలో , వెచ్చగా ఒదిగి ,
నిశ్చీతగా నిద్రపోయేను.
---------------------------------------------------

అమ్రుతానందమయులైన "అమ్మ "లకు ప్రేమతో...

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.. (మహరాష్ట్ర .)
--------------------------------



 

 







  .
 






 

ఆట బొమ్మ.

కాలుష్య మెరుగని, కల్లక పటము లేని
చిన్ని పాపను నేను , చింత లేవెరుగను॥
చిందులేయుచు ,అమ్మ ఒడి చేరి నిదురించు
చిన్న పిల్లను, చిన్ని  పసి పాపను నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥

అన్న ,నాన్నా, తాత,మామ నాదీ యనుచు
వలపు పంచెడి పసిడి పాల పలుకు ను నేను॥
అంత రంగము నల్ల-కల్లోల మైనట్టి-
అలోచనలు రాని ,చిన్ని ప్రాణి ని నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥

ఆడ -మగలను వేరు, భావమ్ము తెలియని-
పసి మనసు పట్టి నవు వట్టి అబలను నేను.॥
ఏ చేయి రక్షించు ,నే చేయి బక్షించు నను-
మర్మ మెరుగని , లెేత మొగ్గను నేను॥

 ముద్దు మురిపెపు వలపు..సద్దు మణగిన పిలుపు_
 సరి కీడు లెరుగని , వట్టి వెర్రిని నేను.
 పసి దేహమును కామ, చింతనతో చుాచేటి,
 కాముకుల  నెరిగేటి, మేటి జ్ఞాని ని కాను.
 ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
 
 ఆదరించిన హాయి ,అన్న మెట్టిన చేయి, 
 అమ్మ ఒడి సాటనీ...నమ్మి మురిసితి నేను.
 నటన నేర్చిన నరుల, వికట రీతుల, వలల
 చిక్కి చితికిన చిన్ని, ముద్దు గుమ్మను నేను.
 ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
 
  నాది , నా వారనుచు నమ్మ, నను గద్దించి,
  నిలిపి నలిపిన , భీతి నేడ్చు బేలను నేను.
  విధి వంచనకు వాడి , తోలు బొమ్మగ మారి
  పలు కాముకుల కొదుగు' బెదురు బొమ్మను నేను
  ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
--------------------------------------------------------
 రచన, శ్రీమతి, 
 పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. ( మహరాష్ట్ర ).
 ------------------------------

ఆ దేవత ఎవరో....

జీవితం పరిసమాప్తమైన వెంటనే  జీవుడు-
మరొక జన్మకై ,మాత్రుగర్భంలోకి నెట్టబడ్డాడు.
చిన్న కణ రుాపంలో, మల -ముాత్రాదుల మధ్య
కొట్టుమిట్టాడుతుా..బయటకు దారి  కానరాని
చీకటి నిండిన మురికి నీటిలో పున్నామ నరక బాధను
అనుభ విస్తుా, నా మునుపటి జన్మ , పాప క్రుత్యాలు
తలచుకొంటుా, కర్మ ఫలాన్ని అనుభవించడానికి,
ఊపిరాడని, ఇరుకు జీవితానికి అలవాటు పడ్డాను.

ఇంతలో ఎవరో నన్ను  అక్కున చేర్చుకొని ..
అప్యాయత తో అలరించిన భావన. దుర్గంధపు 
ఊబి నుంచి నన్ను లాగి , నా చుట్టుా ఒక రక్షణ కవచం  చుట్టి , ఆ పొరలో నన్ను చేర్చి ఊరడించిన భావన.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

నా పాప కర్మ కొంచ తగ్గినట్టుండే  ఆనందం, 
అనుభవించేంతలోనే "క్షుద్బాధా పీడితుడి నయ్యేను.
కళ్ళు విప్పలేని నా బలహీనత తో చుట్టుా తిరుగితుా
కదల లేని ఇరుకు పొరలో ఈదుతుా, తేలుతుా..
దుర్వాసనా భరితమైన ఉమ్మి నీటిని గుటకలు వేస్తున్న
నన్ను ,ఎవరో ఆప్యాయంగా తడుముతున్న భావన.॥

నా శరీరం పెరుగుదల కోసం,నాకై నా నాభినుండి , 
జీవామ్రుతాన్ని ,అడగకుండానే అందిస్తున్న భావన..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

ఎదుగుతున్న నా భారానికి సాగుతున్న కవచపు..పొర.
పెరుగుతున్న బరువుకు,నాఉనికి నాకే భారమైన చెర .
పెరిగే మెదడును తాకుతున్న బాహ్య తరంగాల సవ్వడి
చిరునవ్వుల గలగలల , ప్రేమ పుారిత స్పర్శాభావం.
నాలో ఏదో పులకరింత.నాడుల ప్రేరేపించే నియంత.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

శబ్ధగ్రహణ శక్తి పుంజుకుంటోంది. సప్త స్వర పేటికా-
తరంగాల ఓంకార ధ్వని ,నాలో నాదానికి ప్రేరణౌతోంది.
ఆశ్చర్యానందాల తో ద్వనిని ఆస్వాదిస్తున్నాను.
శబ్దాన్ని గ్రహిస్తున్న నా వీనులకు, వినిపిస్తున్న
కమ్మని పిలుపు."కన్నా, నా బుజ్జీ, నా తండ్రీ.".అంటుా నాకై ,వినిపించే నవ చైతన్యపు అనురాగ సంబోధన.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

 రోజుకో పలకరింత , నాలో రేగే పుకరింత .
 ఆమెను ఎలాగన్నా చుాడాలన్న కోరికల కలవరింత
 నేను శతవిధాలుగా బయటకు రావాలన్న ప్రయత్నంతో
 నేను చేసే భీభత్సవానికి బాధనిండిన బేలతనపు -
 ఆక్రదన .చిన్ని కాళ్ళతో చిందులు వేసే సమయంలో...
 చిరు నిట్టుార్పుల బాధాతరంగపు ప్రకంపనలు..
 నేను చేసే అల్లరిని అత్యంత సహనంతో భరిస్తుాన్న..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥

ఆ ప్రేమామ్రృత ముార్తిని చుాడాలన్న తపన..
ఆమె తన కోసం పడే వేదనను మించినదై..
గాడాంధకారపు చీకటి నిండిన ఇరుకు బస నుంచి ,
వెలుగుల వెలికి రావాలన్న పట్టుదల ,పంతానికి-
పగిలిన  పొర,  చీకటి నుండి  కలిగించిన విముక్తి.॥

ఒక్కసారిగా చెర విడిన చైతన్యంలో నిండిన ఆనందం.
ఉదరబాధను ఉగ్గపట్టి, తన విడుదలకై  సహకరంచిన..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
భుామి మీద పడకుండానే, సుతి మెత్తని చేతులతో
సున్నితంగా తనను అక్కున చేర్చుకొని, ఆనందాశ్రువులతో తన రాకను ఆహ్వానించి,
ఆర్తితో తన ఒడిని చేర్చుకొని, ఒద్దికగా ఒడిసి పట్టిన
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చి పడ్డానో తెలియని-
అయొామయ స్థితిలో,అసహాయం నిండినభయంతో
ఏకధాటిగా  ఉవాఁ..ఉవఁ...అంటుా ఏడుస్తున్న నన్ను
చుాసి, "ఎందుకు కన్నాఏడుపు".ఆకలేస్తోందా.అంటుా
అడగకనే తన రక్తస్రవాలను క్షీర రసామ్రుతంగా మార్చి, తనకు స్తన్యమిచ్చి,  ఆకలి తీర్చిన ,ఆ అమ్రుతమయ.
  దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
  
తనపై కురిసే ముసి ముసి నవ్వుల ముద్దుల ముాటలు.
గోల-గోలగా, మమతల జల్లుల మనసైన  చేతలు.
లీలగా వినిపించే తన వీనులకు ,అర్ధమయ్యే  మాటలు.
ఎవరో అంటున్నారు."అమ్మ దగ్గరబజ్జున్నావా."అంటుా.

ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను.దేవత పేరు విన్నాను.
నవమాసాలుా నన్ను మొాసి, నాతో పాటుగా నరక-
యాతనలు అనుభవిస్తుా, పున్నామ నరక గుహ్యంలో
తనకు రక్షణ నిచ్చి, ఆకలి తీర్చన ఆ పుణ్యముార్తి...
పేరు...అమ్మ ..అమ్మా...అమ్మా...అంటుా వల్లించేను.

ఒక్కసారిగా నా కళ్ళు క్రుతజ్ఞత తో వర్షించేయి.
ఆర్ద్రత నిండిన గొంతు తో ఆర్తిగా పిలిచేను...
(అమ్మా)...  ఉవాఁ ఉవాఁ.... అంటుా..
నా బాధ అర్ధం కాని "అమ్మ" నన్ను  ఆర్తిగా 
అక్కున చేర్చుకుంది. ఏడుస్తున్నాననుకొని ....॥

అమ్రుతానందమయులైన "అమ్మ "లకు ప్రేమతో...

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.. (మహరాష్ట్ర .)
--------------------------------



 

 







  .
 






 

Friday, February 28, 2020

వెన్నెల అకాడమీకి ఉగాది కవిత

వెన్నెల లు కురిపించు ,చల్లని మాటల కీర్తి కవన,క-
న్నెలు,వసంత గీతికల,సిరి-సిరి మువ్వలసడులతో,క-
ల- కలారవాలు నిండిన, ఆమని సొగసుల అందమై,

సార,సుమ,సౌరభాల,సుందర వనకన్యల చెలిమితో,
హితవైన సాహిత్య శోభలు రాజిల్లు సందడులతో-ని,
త్య నుాతన ,సాహిత్య , కథన, కళారతులైన,.....

అగ్రేశ్వరులౌ, కవి సార్వభౌముల, భావపరంపరల-
కాసార ,కవితా ప్రవాహములో,జలకమాడి ,-వాడ-వా-
డలా, ప్రసరించే ప్రశంశాపుారిత పద జాల సమాగమ.
మిత్ర బ్రుంద, పరివార,పరీజన హితులతో కలిసి,కిట 
కిటలాడే ,శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,

ఉల్లాసోజ్వల పుార్ణచంద్ర శీతల కిరణ  కవన కీర్తి ,    గాన,జ్ఞాన రస,గద్య ,పద్యసార,సుగంధవీచికయై-,దిన
దిన ప్రవర్ధమానమౌ రీతుల గౌరశిఖరాగ్రాలుచేరాలని,

శుభ్ర వస్త్ర,వఝ్ర, కిరీటాది ,దివ్యాభరణ ద్యుతుల-
భాసిల్లు ,కవన కాంతల' మేలిమి బంగరు పసిమి- 
కాంతుల, కీర్తి కిరణాల తో కలసి ,వాణీ విలసిత,సా-
క్షర,సుమగంధమిళితమై,నలుదిక్కులాగుభాళించు,పలు ఆనంద శోభలతో,మంగళ ప్రదరవములతో,నిండు

   "ఉద్ధండ చంద్ర శేఖర వెన్నెల కవన కాంతి వేదిక  "
   నిత్య నుాతన గతుల, దిన దిన ప్రవర్ధమానమై -                                                       --                        వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుా.
                         "శార్వరీ వత్సర  "                       "            .          " శుభాకాంక్షలు".  
                తెలుప, వేంచేయుచున్న కీర్తి-
                      కాంతలకు "స్వాగతం ",  
                        "  సు స్వాగతం."
                     ----------------------------

రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర .).
-------------------------------     
కవిత లోని మొదటి అక్షరాలు చదివితే వచ్చే వాక్యం.
"వెన్నెల సాహిత్య అకాడమికి, ఉగాది శుభాకాంక్షలు ".

             






అక్షరయాన్ కవిత.


అబలల ఆత్మబలానికి ఆలంబన నిచ్చేఆప్త తేజమై,
క్షణం కుాడా, విశ్రాంతి నెరుగని అవిరామ క్రుషీ తో-
రక్షణ,శిక్షణల నీడనిచ్చే,మమతల మహా వ్రుక్షమై-
యావత్ మహిళాసమస్యల సమాధాన-సమాహారమై,
నమ్మకమైన నియమాల, నిశ్ఛయ సంకల్ప సారమై,

మమతా,మానవతాధ్రుక్పథ ,సేవాభావ, సహయొాగ-
హిత, కార్య -కలాపాది,  సమ్మిళిత.కవన క-
ళా,సాహిత్య, సమావేశాది కార్య కలాపోత్సుకతాతుర-

సార ,సమన్వయ,సాహస,శ్రామికమహిళాబ్రుంద-
హిత ,సన్నిహిత,-పరిజనాది  స్వాతంత్ర్య  ,ని
త్య,జీవన పోరాటాది, కార్య-కలాపాది ,సహిత-

సేవా సంకల్ప, ప్రయత్నాపుారిత,కార్యాక్షర యాన-
వాక్ సుధారసాధ్భుత,ప్రేరణాపుారిత కవనకాంతలకు-.

నిత్య కల్యాణ,సామాలోచనా పుారిత సాహిత్య -
రసమయ వాజ్మధుర గీత, సంగీత,రస పానామ్రుతులై.
తిరోధాన, సంఘటిత, తీక్ష్ణ ,పోరాట పటిమొాద్యమాది
కిరణ కవన వేదికానంద, మహిళా,స్రవంతి చెలిమికై  ..
                             
ఉద్యమోత్సాహిత,సాహస మహిళా తతీ యుత  ,    
గాన, కవితా సమారంభ రసోల్లాస సమాగమ-
దిగ్విజయ ప్రాప్త,అభయ హస్త, కీర్తి కిరీట ద్యుతులతో-

                             విచ్చేసిన
                                   
శుభ "శార్వరీ" తేజ , శక్తిమయ పుారిత ,నవ వర్ష-సు
భాసిత పరంపరాది, భారతీ సాంప్రదాయ, శోభిత
కాంతామణి మండల, కవన  కోమల, సుందర సారా--
క్షర కవితా ఝరీ ప్రవాహిత కీర్తి కమల కాంతలకు, ప
లు ప్రశంసల ,తెలుగు నవ వర్ష , "శార్వరీ" నామానంద-  

                         శుభాకాంక్షలతో
                     స్వాగతం, సు స్వాగతం.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------------+
(మొదటి అక్షరాలు నిలువుగా చదవితే
వచ్చే భావాక్షర సంపద.).
అక్షరయాన్ మహిళా సాహిత్య -,
సేవానిరతికి  ఉగాది శుభాకాంక్షలు .

గుర్రం జాషువా గారి పాపాయి పద్యాలు

*పాపాయి 4 పద్యాలు... గుర్రం జాషువా గారు*
🥀
1
(నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!)

నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
(మా చిట్టి పాప నా ఒళ్ళో ముత్యాలు పోశాడు. నెలబాలుడై ఆనందాన్ని కుప్పవోశాడు. చిట్టిబాబూ!)

నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
3
(కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు! ఉయ్యేల్లో, ఉల్లంలో ముద్దులు మురిపిస్తాడు!)

గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,
తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి

ఏమి పనిమీద భూమికి నేగినాడొ,
నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని,
ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!
4
(పిచ్చి తండ్రి! ఏమా ముచ్చట్లు! ఎవరితో ఈ కేకిసలు! లేదు! లేదు! ఏడవకు తండ్రి! ఏడవకు! పిచ్చితండ్రి!)

ఊయేల తొట్టి ఏముపదేశ మిచ్చునో,
కొసరి నొంటరిగ నూ కొట్టుకొనును
అమ్మతో తనకెంత సంబంధమున్నదో,
ఏడ్చి యూడిగము చేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో,
బిట్టుగా కేకిసల్ కొట్టుకొనును
మూనాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో,
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును
ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి,
చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు
నాదు పసిడికొండ, నా రత్నమని, తల్లి
పలుకు పలుకులితడు నిలుపుగాక!
🥀🙏🏼

Thursday, February 27, 2020

తురగా జయశ్యామల.

Name.Turaga Jaya Syamala.
Address flat no.706
Aradhana bldg,BWing
G.D.Ambekar marg,
Dadar,Mumbai.
Pin.400014.
Rachanalu .
కాలమిచ్చినతీర్పు ,ముళ్లతోటలోపూలబాటలు ,చీకటిచెట్టున వెన్నెలపూలు ,మనసుపిలిచింది ,మొదలయిన నవలలు 40,దేవుడునావ్వాడు ,శంఖారావం ,అనుకోలేదని మొదలయిన కథాసంపుటాలు తో సహా దాదాపు 350కధలు రాయడం వివిధ వారమాసపత్రికలలో ,నే రుగాను ప్రచురితమయ్యాయి .

అక్షరయాన్ కోసం ఉగాది కవిత.


అబలల ఆత్మబలానికి ఆలంబన నిచ్చేఆప్త తేజమై,
క్షణం కుాడా, విశ్రాంతి నెరుగని అవిరామ క్రుషీ తో-
రక్షణ,శిక్షణల నీడనిచ్చే,మమతల మహా వ్రుక్షమై-
యావత్ మహిళా సమస్యలసమాధానసమాహారమై,
నమ్మకమైన నియమాల, నిశ్ఛయ సంకల్ప సారమై,

మమతా,మానవతాధ్రుక్పథ ,సహకార సెేవాభావ
హిత, కార్య -కలాపాది, రస సమ్మిళిత.కవన క-
ళా,సాహిత్య,సమావేశాది కార్యకలాపోత్సుకతాతుర-

సాహిత్య ,సమన్వయ,సాహస, మహిళాబ్రుంద-
హిత ,సన్నిహిత,-పరిజనాది సహిత అవిరామ,ని
త్య,జీవన పోరాటాది, కార్య-కలాపాతుర నిరతి తో.

సేవా సంకల్ప, ప్రయత్నాపుారిత,కార్యాక్షరయాన్-
వాక్సుధారసాధ్భుత,ప్రేరణాపుారిత,కవనకాంతలకు-.

నిత్య కల్యాణ,సామాలోచనా పుారిత సాహిత్య -
రసమయ వాజ్మధుర గీత,సంగీత,రసపానామ్రుతులై.
తిరోధాన, సంఘటిత, తీక్ష్ణ ,పోరాట పటిమొాద్యమాది
కిరణ కాంతి వేదికాంద , మహిళా, తతి చెలిమికై  ..
                             
ఉద్యమ ప్రోత్సాహ సాహసమహిళామండలీసమేత    గాన, కవితా సమారంభ రసోల్లాస సమాగమ-
దిగ్విజయ ప్రాప్తాభయ, హస్త కీర్తి కిరీట ద్యుతులతో-

                             విచ్చేసిన
                                   
శుభ శార్వరీ తేజ , శక్తిమయ పుారిత , నవ వర్ష-
భావ , భారతీయ సంస్కృతి, సంప్రదాయ, సార హిత-
కాంతామణి మండల, కవన కోమల,సుందర సా--
క్షర కవితా కాసార వికసిత, కీర్తి కమల కాంతలకు, ప
లు ప్రశంసల ,తెలుగు నవ"శార్వరీ" వత్సర, శుభ
నామానంద-  

                         శుభాకాంక్షలతో
                     స్వాగతం, సు స్వాగతం.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------------+

Wednesday, February 26, 2020

వెన్నెల వేదిక good.(వెన్నెల అకాడమీ కోసం.).

వెన్నెలలు కురిపించు ,చల్లని మాటల కీర్తి కాంతల,క-
న్నెలు, వసంత గీతికల,సిరి సిరి మువ్వలసడులతో,క-
ల- కలారవాలు నిండిన, ఆమని సొగసుల అందమై,

సార,సుమ,సౌరభాల,సుందర వనకన్యల చెలిమితో,
హితవైన సాహిత్య శోభలు రాజిల్లు సందడులతో-ని,
త్య నుాతన ,శోభాయమాన, కావ్య కళారతులైన,.....

అగ్రేశ్వరులౌ, కవి సార్వభౌముల, భావపరంపరల-
కాసార ,కవితా ప్రవాహములో,జలకమాడి ,-వాడ-వా-
డలా, ప్రసరించే ప్రశంశాపుారిత పద జాల సమాగమ.
మిత్ర బ్రుంద, పరివార,పరీజన హితులతోకలిసి,.కిట 
కిటలాడే ,శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,

"ఉద్ధండ చంద్ర శేఖర "కిరణ కవన కాంతి వేదిక-నిత్య

గాన,జ్ఞాన రస,గద్య పద్య,సార,సుగంధవీచికయై-,
దినదినప్రవర్ధమానమౌ,రీతులగౌరవశిఖరాగ్రాలుచేరాలని, --
శుభ్ర వస్త్ర ,వఝ్ర కిరీటాది, దివ్యాభరణ- ద్యుతుల-
భాసిల్లు ,కవన కాంతల' మేలిమి బంగరు పసిమి- 
కాంతుల, కీర్తి కిరణాల తో కలసి ,మణి భాసిత,సా-
క్షర, సుమ గంధమిళితమై,నలు దిక్కులాగుభాళించు, పలు ,ఆనంద శోభలతో, మంగళ రవములతో,

                    వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుా.....
                         "శార్వరీ వత్సర  "                       "            .          " శుభాకాంక్షలు".  
                తెలుప, వేంచేయుచున్న కీర్తి-
                      కాంతలకు "స్వాగతం ",  
                        "  సు స్వాగతం."
                     ----------------------------

రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర .).
-------------------------------                   






మమతల మంటలు.Good

మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది?
 సమతా మమతా  లేని జగతిలో
 మందును ఎవరిని అడిగేది...?॥

రక్త బంధపు, అనురాగములే
నిలిచెను స్వార్ధపు చింతనలై...,
అర్ధము లెరుగని అవేశములై ,
అర్ధము కొరకు అనర్ధములై....॥

అమ్మా, అక్కా, చెల్లీ,. తమ్ముల  
బంధాలు బరువై  , పలచబడే !
అన్నలు ,అయ్యలే , వావీ వరుసల
బంధపు విలువకు శిలువేసే॥

కామపు కాటుల ,మంటలు రగిలే.
 దారుణ హత్యలె , ఆటగ చెలగే.
 ఏసిడ్, దాడుల ఏడ్పుల గోడులె,
 నిత్య కర్మ , క్రుత్యములై మిగిలె ॥

న్యాయం ,ధర్మం, కనులు ముాసుకొనె,
జాతి జగడములె  జగతిని నిండె.
నీతి -న్యాయముల, బాటలు బురదై,
బ్రతుకు శ్వాశలే  బరువాయె ॥

నారీ చింతన నెగడై ఎగసే.
మనిషే మ్రుగమై చెలరేగే....,  
చావుల చితి గని, భరతావని- 
కన్నీరె-ప్రళయమై- కోపించే ॥

చీకటి- వెలుగుల జీవన గతిలో..
నగవుల విలువలు దిగజారే ..
భార్యా బిడ్డల బాధ్యత , విధులే
బరువై  , బ్రతుకులే చితులాయే .. ॥..

అమ్రుతమె కరువై , విషపు జ్వాలలే
మింటికెగసె , హ్రుది మైలపడె..
మనిషే   మనిషికి , శత్రువు కాగా
"పగ" లే...మనిషికి  విధులాయే.॥

నాదీ -నీదను వాదపు సమరాన
రక్తమె ఝరులై  ప్రవహించే..
ధనమే జగతిని సాశించినదై...
వైరపు మంటల నెగదోసే ॥

మమతల మాటున మధన పడే
నా మనసుకు ఏమని చెప్పేదీ..?
ఎవరికి ఎవరుా కాని జగతిలో
ఎంత కాలమని బతికేది..॥

రగిలిన గాయపు మంటల నార్పగ
మందును ఎవరిని అడిగేదీ....?॥
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది..?॥
---------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------









Monday, February 24, 2020

వెన్నెల వీచిక.

వెన్నెల లు కురిపించు చల్లని మాటల కీర్తి కాంతల,క-
న్నెలు, వసంత గీతికల సిరి సిరి మువ్వల సడుతో, క-
ల కలారవాలు నిండిన, ఆమని సొగసుల  అందమై,

సార,సుమ,సౌరభాల,సుందర వనకన్యల చెలిమితో,
హితవైన సాహిత్య శోభలు రాజిల్లు సందడులతో-ని,
త్య నుాతన శోబాయమాన  కావ్య కళా రతులైన,....
.అగ్రేశ్వరులౌ, కవి సార్వబౌముల భావపరంపరల-
కాసార ,కవితా ప్రవాహములో,జలకమాడి ,-వాడ-వా-
డలా, ప్రసరించే ప్రశంశాపుారిత పద జాల సమాగమ.
మిత్ర బ్రుంద, పరివార, పరీజన హితులతో కలిసి,.కిట 

కిటలాడే శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,
"ఉద్ధండ చంద్ర శేఖర "కిరణ కవన కాంతి వేదిక పై
గాన,జ్ఞాన రస,గద్య ,పద్య ,సార,సుగంధవీచికలై--,దిన
దిన ప్రవర్ధమాన రీతుల , గౌరవ శిఖరాగ్రాలు చేరే --

శుభ  సమయాన , వఝ్ర  కిరీటాది నమ్మాన ద్యుతుల-
భాసిల్లు ,కవన కాంతల మేలిమి బంగరు పసిమి 
కాంతుల, కీర్తి కిరణాల తో కలసి , మణి భాసిత,  సా-
క్షర సుమ గంధమిళితమై , నలు దిక్కులా గుభాళించు, పలు , ఆనంద శోభల,  వర్ధిల్లాలని ఆకాంక్షిస్తుా.....
           "వెన్నెల అకాడమీ " సభ్యులకు 
                     "శార్వరీ వత్సర  "                       "            .       "శుభాకాంక్షలు".    
                     ---------------------

రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర .).
-------------------------------                   






అన్వేషిత.

ఎప్పటికప్పుడు ఎదిగీ-ఎదగని 
ఒడిదుడుకుల- జీవితాశయాలను , 
ఆసరాగా చేసుకొని  చేసుకొని, 
ఒంటరి  పోరాటం సాగిస్తుా.
కవన కాసారంలో , సంగీత , సాహిత్య  
కథన , కవితా గంగ లో మునిగి తేలుతుా, 
 ఆట- పాటల ఆనందపు మునకలు వేస్తున్నాను.॥
 
 గెలవాలన్న "లక్ష్యాన్ని" ఆశయంగా తీసుకొని , 
  అముాల్యమైన సమయాన్ని నాకై నేనుగా
  కొంత -కేటాయించుకున్నాను.॥
  
  సంసార సమస్యలను, బాధ్యతలుగా  స్వీకరించి,
  కర్తవ్య నిర్వాహణలో, "కర్మబద్ధ"నవుతున్నాను.॥
  
  అద్రుష్ట- దురద్రుష్టాల తుాకంలో..
  కుటుంబ బాధ్యతలతో పాటు.-
  ఆశలు, ఆశయాల,బరువును వేసి,
  తక్కెడలను, సమాన బరువుతో సరిచేస్తున్నాను.॥
   ,
  "సంసార" మనే నడిసంద్రపు నావలో నిలబడి, 
  సాగరానికి , అట్టడుగున దాగి ఉన్న -
  నిధి - నిక్షేపాల కాంతి కళల ,కలలు కంటున్నాను.॥
  
  ఆ కలల సౌఖ్యానంద - శీతల గంధ సారాన్ని ,      ఆస్వాదిస్తుా , ఆనంద లోకాల్లో, తేలిపోతున్నాను.॥
  
  జీవితం, అంతులేని లోతైన సాగర మైతే, 
  ఆ సాగరంలోనే , మునకలు వేస్తుా..
  నాకు కావలసిన ,సాహిత్య నిధులను,
   అన్వేషిస్తుా,  ఆశల తెడ్లతో , కన్నీటి-
   అలలను నెట్టుకొచ్చే , ఆశయాన్వేషితను .॥
   
   ఎప్పటికప్పుడు నడిసంద్రాన్ని  దాటి , గమ్యం-
   చేరగలనన్న ,నిశ్ఛయ సంకల్ప సాధనాతురనైన,       
                స్వప్న సాకారాకాంక్షితను".
            నేనో   " నిత్యానందాన్వేషితను"॥
               -------------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర )
-------------------

   
    
   
   
  
  
  
  
  
  
    
 

Friday, February 21, 2020

సమయం గడిచిపోయింది.

గడచిపోతున్న కాలంతో పాటు
సమయం ఎలా గడచిపోతున్నాదో
తెలీకుండానే  రోజులు గడిచిపోతున్నాయి.
నిద్రపోతున్న నన్ను లేపి , తయారుచేసి ,
ఎత్తుకొని స్కుాలుకు చేర్చి, టాటా చెపుతున్న
అమ్మా, నాన్నల ప్రేమానురాగాల ప్రపంచంలో 
నేనెప్పుడు ఎదిగిపోయేనో నాకు తెలియనే లేదు. ,
నన్ను  ప్రేమించిన అమ్మా నాన్నలు , నా బాధ్యతను    మరికరి చేతుల లో పెట్టి , నన్ను  వంటరిని చేసి,
కాల ప్రవాహంలో ఎప్పుడు  కలిసిపోయేరో , 
సమయం ఎలాగడిచిపోయిందో  తెలియనే లేదు.  అంత లోపలే......
నేను అమ్మ నై బాధ్యతల అలలలో
మునిగి -తేలుతుా, గిరికీలు కొడుతుాండగానే...
నా ఒడిలో,  పాకుతున్న పిల్లలు ,
నా భుజాలదాకా ఎప్పుడు  ఎదిగిపోయేరో, నా మాటలు వినే పిల్లలు , నన్ను ప్రశ్నించేంత  పెద్ధగా
 ఎలా ఎదిగిపోయేరో , తెలియనే లేదు .
ఎదిగిన పిల్లల బాధ్యత  ,పెళ్ళిళ్ళు చేసి తీర్చుకొని , 
కొత్త బంధాలను తనవిగా , అనుకొనే  ఆనందం అనుభవించకుండానే....
అత్తగారి పదవికి  ఎదిగిన నేను , కోడలు- కొడుకుల
కంటి నలుసుగా ఎప్పుడు మారేనో....
అమమ్మ , నానమ్మ ల పిలుపుకు, ఎప్పుడు చేరువయ్యేనో...నా కో పెద్దరికాన్ని తెచ్చిపెట్టిన
సమయం, నాకు  తెలియకుండానే , నన్ను  
అవమానాల కొలిమిలోకి ఎప్పుడు నెట్టిందో ,  నాకు తెలియకుండానే . కాలం గడిచిపోయింది.
అద్దంలో నన్ను నేను చుాసుకొనే సమయం
దొరికే సరికి , నెరసిన నా జుట్టు , నా వయసును
గుర్తుచేస్తుా ఉంటే.., ఒప్పుకోని అంతరంగం ,
ఒడిసి పట్టిన రంగులతో ,వయసును దాచే
ప్రయత్నంలో సమయం ఎలా గడిచిపోయిందో
తెలీకుండానే గడిచిపోయింది.
 ముఖంలో ముడతల వికారం 
వెక్కిరిస్తుా వెటకారం చేస్తుా ఉంటే ..ఆప్యాయంగా
"అమ్మా " అంటుా పిలిచే  పిల్లలు , అసహ్యించుకుంటుా
విసుక్కుంటుా  ఉంటే , ఆ అవమానాల , నిస్సహాయతల మధ్య..నా జీవితం ఎలాగడిచిందో....      నాకు తెలియకుండానే  సమయం గడిచిపోయింది.
మారుతున్న కాలంతో పాటు , మమతలు మరచిన
నా రక్త మాంసాల రుాపాలు, మరో బంధంతో ముడివడి .....జీవన సంద్రానికి  ఎదురీదలేక ,  
వ్రుద్దాశ్రమాల చుారుల్లో'  నా ఉనికి గుర్తులను
వేలాడదీసిన వైనం , ఆగని కన్నీటి గా మారి
ఆవిరైపోతున్నా...జవసత్వాలుడిగిన శరీరం
ఇంకా  చావని ఆశల ఎదురుచుాపులు  చుాస్తుా ఉంటే..
సమయం ఎలా గడిచిపోతోందో తెలియనే లేదు.
తన అనుకున్న వారు , పరాయి వారై 
తమను మరచి పోయినా....
నిశ్శబ్దంగా గడచిపోతున్న కాలం , .నిరీక్షణ కు  నిస్సహాయతను కలిపి...నిదురకు దుారం చేసినా...
మంచం మించి లేవలేని నిస్సహాయత , గడచిన-
మమతల , జ్ఞాపకాలను నెమరువేసుకుంటుా ఉంటే-
సమయం ఎప్పుడు ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు.
బహుశా..
అంతరంగ వేదనలతో,  అలసి ,వడలిన శరీరాలను ,చివరి క్షణాలకు తొందరగా...
 దగ్గర చేర్చి ,   స్వాంతన పరచడం కోసమేమొా--
 సమయం తెలీకుండానే గడిచిపోతోంది.
 మంచిదేకదుా...
 
 --------------------------------------------------
రచన , శ్రీమతి .
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర ).



కుదిరితే చిన్న చిరునవ్వు.


తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్న చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చుట్టుా,  ఉన్న నీ వారి ఆనందం ,
నీ వెప్పటికీ మరువలేని అనురాగ బంధమౌతుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
బయటి ప్రపంచంలో నువ్వడుగిడే ప్రతీచోటా,
నీ చెలిమికై చేయిజాచే వారు, నీ బాటలో ఎదురౌతారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ కష్టాలను , తన ఇష్టాలుగా . భరించే సహచరి , 
నీ భారాన్ని ,బాధల్ని ,పంచుకునేందుకు నీ వెన్నంటే ఉంటుంది..

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
వ్రుద్ధాప్యంలో, నీ ప్రేమను పొందిన వారు , నీకు తిరిగి పంచి ఇచ్చేందుకు, నీ పిల్లలు, నీకు తోడై నిలుస్తారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితంలో అన్నీ సాధించగలిగే అత్మ శక్తి 
నీలో నిరంతర సంజీవినై ,నిన్ను ముందుకు నడిపిస్తుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
లోకంలో డబ్బుతో కొనలేని ఆత్మ సంత్రుప్తి..
నీకు ఆలంబనై , ఆనందలోకాల్లో విహరింపజేస్తుంది

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
అందం, ఆస్థి , అంతస్థులనే  డాంబికాలనొడ్డే
సత్సంబంధాల సౌరభం ,నీ చుట్టుా పరిమళిస్తుా ఉంటుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
ఎన్నో బంధాలు, అనుబంధాలు , ఆప్యాయత-
అనురాగాల ఆస్థికి వారసుడవౌతావు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి క్షణాల్లో నీకై కన్నీరు కార్చే ఎంతోమంది
నీ స్నేహపుారితమైన చిరునవ్వు, ఎప్పటికీ తమతో
ఉండాలనే కోరికతో నీకై తపిస్తారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి స్వాశలో , మమకారంతో నీకై తపించేవారి కన్నీటి అలలు,  వైతణీని దాటించే  వారధిగా మారి
నీ ఆత్మను , శాంతి లోకాలకు సాగనంపుతాయి.

తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితాన్ని జయించే రీతిలో ,నీ
పయనాన్ని కొనసాగించి , మనిషిగా పుట్టినా
మనీషిగా ఎదిగి, అందరిమదిలో స్థిరంగా నిలిచిపో....॥
-----------------------------

రచన శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
-----------------------------








శార్వరీ తేజం.(నవ తెలుగు తేజం .మాస పత్రిక కోసం.).

నవ వర్ష శుభాకాంక్షలేలే  శుభ సమయంలో..
వర్ధమాన కవి సముాహపు విందు , వినోదాలతో..,
తెలుగు  వేదిక, శోభాయమానమైన...ప-
లు సాహిత్య సంపదల , సమావేశపు సందడులతో,
గుభాళించే పరిమళాల సుమ  సమాహారమై,
తెేట- తెలుగు,వెలుగులతో,అజరామర.కీర్తి రా-
జంబై, వేల సత్కారాల, సమాగమ నవ్య తేజమై.
సార కవితా రసాల, మ్రుదు మధుర సుధలతో,
హితవైన పద సముాహపు, చమత్కారకేరింతలతో,ని-
త్య నుాతన సమతా-పుారిత సమన్వయ కళావేదికగా ,
వేవేల ప్రశంసాపుారిత,  వచన, కవనాల సారమై,
దిన -దిన ప్రవర్ధమానమై,  మేటి, రచనా దురంధరాది కవి సముాహ,  సాహిత్య సుమ సుగంధ వీచికయై ,
కుల, మత , తారతమ్యాధిగమనార్జిత, కీర్తి కిరీటమై ,
ఉన్నతోన్నత పద- కుార్పుల , మణిమాలాభుాషితయై
గారపట్టిన సమాజపు కుళ్ళుని, కుాకటి వేళ్ళతో సహా
దిగ్విజయంగా దిగలాగగల , దిట్టమైన కలం హలంతో.
శుద్ధ తర, కవితాస్త్ర సమ్మేళనాది  విజయాలతో -
భాసిల్లుతుా, కళలు నిండే రమణీయ కావ్య కళా...
కాంతయై, గద్య -పద్య సంగీతాది సకల కళా., సా
క్షరానంద, హిత  కార్య- కలాపాది రస పానముతో- ప
లు వేల జే -జేల కవితా రస శోభలతో ,భాసిల్లు -
           "నవ తెలుగు తేజం " మాస పత్రికా
                      సభ్యులకు నుాతన-
                             " శార్వరీ"
              నామ సంవత్సర శుభాకాంక్షలు..
              -------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
-----------------------------------

పద్మగారుా..!
మొదటి అక్షరాలను ,  నిలువుగా చదివితే వచ్చే వాక్యం...👇
"నవ తెలుగు తేజం " సాహిత్య వేదికకు-
             "ఉగాది" శుభాకంక్షలు.    
             ( అనేది గమనించగలరు.).
















Monday, February 17, 2020

మమతల మంటలు.(సంక్రాంతి పోటీల లో ప్రధమ బహుమతి పొందిన కవిత.).

మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది
 సమతా మమతా  లేని జగతిలో
 మందును ఎవరిని అడిగేది...॥

రక్త సంబంధపు రాగములే...నడ-
యాడెను స్వార్ధపు చింతనలై...,
అర్ధము లెరుగని అవేశములై ,
అర్ధము కొరకు అనర్ధములై....॥

అమ్మా, అక్కా, చెల్లీ,. తమ్ముల  
బంధాలు బరువై  , పలచబడే !
అన్నలు ,అయ్యలే , వావీ వరుసల
బంధపు విలువకు శిలువేసే॥

నారీ చింతన నెగడై ఎగసే.
మనిషే మ్రుగమై చెలరేగే....
ఏసిడ్ దాడుల , కాలిన చావుల
కన్నీరె-ప్రళయమై-కోపించే ॥

చీకటి వెలుగుల జీవన గతిలో..చిరు-
నగవుల విలువలు దిగజారే ..
భార్యా బిడ్డల బాధ్యత , విధులే
బరువై  , బ్రతుకులే చితులాయే .. ॥..

అమ్రుతమె కరువై , విషపు జ్వాల లే
మింటికెగసె , హ్రుది మైలపడె..
మనిషే   మనిషికి , శత్రువు కాగా
"పగ" లే...మనిషికి  విధులాయే.॥

నాదీ -నీదను వాదపు సమరాన
రక్తమె ఝరులై  ప్రవహించే..
ధనమే జగతిని సాశించినదై...
వైరపు మంటల నెగదోసే ॥

మమతల మాటున మధన పడే
నా మనసుకు ఏమని చెప్పేదీ..?
ఎవరికి ఎవరుా కాని జగతిలో
ఎంత కాలమని బతికేది..॥

రగిలిన గాయపు మంటల నార్పగ
మందును ఎవరిని అడిగేదీ....॥
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది..॥
---------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------













Sunday, February 16, 2020

కుదిరితే చిన్న చిరునవ్వు. (కవిత.)


తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్న చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చుట్టుా,  ఉన్న నీ వారి ఆనందం ,
నీ వెప్పటికీ మరువలేని అనురాగ బంధమౌతుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
బయటి ప్రపంచంలో నువ్వడుగిడే ప్రతీచోటా,
నీ చెలిమికై చేయిజాచే వారు, నీ బాటలో ఎదురౌతారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ కష్టాలను , తన ఇష్టాలుగా . భరించే సహచరి , 
నీ భారాన్ని ,బాధల్ని ,పంచుకునేందుకు నీ వెన్నంటే ఉంటుంది..

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
వ్రుద్ధాప్యంలో, నీ ప్రేమను పొందిన వారు , నీకు తిరిగి పంచి ఇచ్చేందుకు, నీ పిల్లలు, నీకు తోడై నిలుస్తారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితంలో అన్నీ సాధించగలిగే అత్మ శక్తి 
నీలో నిరంతర సంజీవినై ,నిన్ను ముందుకు నడిపిస్తుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
లోకంలో డబ్బుతో కొనలేని ఆత్మ సంత్రుప్తి..
నీకు ఆలంబనై , ఆనందలోకాల్లో విహరింపజేస్తుంది

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
అందం, ఆస్థి , అంతస్థులనే  డాంబికాలనొడ్డే
సత్సంబంధాల సౌరభం ,నీ చుట్టుా పరిమళిస్తుా ఉంటుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
ఎన్నో బంధాలు, అనుబంధాలు , ఆప్యాయత-
అనురాగాల ఆస్థికి వారసుడవౌతావు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి క్షణాల్లో నీకై కన్నీరు కార్చే ఎంతోమంది
నీ స్నేహపుారితమైన చిరునవ్వు, ఎప్పటికీ తమతో
ఉండాలనే కోరికతో నీకై తపిస్తారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి స్వాశలో , మమకారంతో నీకై తపించేవారి కన్నీటి అలలు,  వైతణీని దాటించే  వారధిగా మారి
నీ ఆత్మను , శాంతి లోకాలకు సాగనంపుతాయి.

తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితాన్ని జయించే రీతిలో ,నీ
పయనాన్ని కొనసాగించి , మనిషిగా పుట్టినా
మనీషిగా ఎదిగి, అందరిమదిలో స్థిరంగా నిలిచిపో....॥
-----------------------------

రచన శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
-----------------------------








అంతరాపత్య. ( గర్భిణి స్త్రీ .కవిత)

విలువలు తగ్గిన విశ్వంలో, 
పలు రీతులలో , రక్షణలేని వనితల శరీరాలు ,
చిలువలై చెలరేగిన, నర సర్పాల కాట్లకు
విషపుారితమై , వేదనతో  అంతమౌతున్నాయి.॥

మ్రుగాల వంటి మగవారి క్రుార కామ వాంఛలకు
పసి పిల్లల నుండి, పండు ముసలి వరకు 
బలౌతున్న సంఘటనలు, అతి సాధారణమై
వేల సంఖ్యల్లో వెలికి వస్తున్నాయి., ॥

తీగ కదిపితే డొంకంతా కదిలే దశలో " దిశ"
చట్టాలు, దిక్కులు మారుస్తుా , దశాబ్దాలుగా తీర్పు తేదీలని  పొడిగిస్తుా..పైశాచిక ప్రవ్రుత్తులను పాయసాన్నాలు పెట్టి మరీ పోషిస్తున్నాయి॥

రాజెవరో, రంకెవరో కనిపెట్టలేని రంగుల ప్రపంచంలో
మేకతోలు కప్పుకునే పులులు , విశ్రుంఖలంగా
తిరుగుతుా ,విచక్షణారహితంగా,ధన, హీన , దీన,  మానాలపై దాడులుచేస్తుా, దేశానికి , దుర్గతి పట్టిస్తున్నాయి.॥

అసహాయపు ఆర్తనాదాలు నిండే - అర్ధాంతర చావుల ఆక్రోశపు ,చితి-మంటల అగ్ని-గుండాలచుట్టుా ,
ఆయాత్తమైన పాపపు మరణమ్రుదంగాలు-
హాహాకారాలతో ,అగ్నిలో ఆరని  అర్ఘ్యం పోస్తున్నాయి.॥

మంటల్లో మసైపోతున్న మానాలతోపాటు,
వావి- వరుసలెరుగని ఘాతుక చర్యల , విక్రుత
రుాపాలు,  నిర్లజ్జాపుారిత నినాదాలు చేస్తుా, ,
వికటాట్టహాసం తో ,  వీరవిహారం చేస్తున్నాయి ॥

అకాశాన్నంటుతున్న అన్యాయపు చావుల సెగల- తాకిడికి , తామెక్కడ మైలపడతామొా, అన్న ట్టుగా , మేఘాలు ధుమ-ధుమలాడుతుా, ముఖాలు -చాటుచేసుకుంటున్నాయి॥ 

వర్షాలు కురవక ,బీడుబారిన భుాములు బద్దలై ,
రైతుల కన్నీటి గాధలను ,తమలో
ఇముడ్చుకొనేందుకు ,స్మశానవాటికలుగా మారి ,
ఆత్మహత్యలను అదేపనిగా ప్రేరేపిస్తున్నాయి.॥

ప్రక్రుతి  వికటించి,  తన ప్రతాపాన్ని చుాపుతున్నా..
విక్రుతి చేష్టలు వీరవిహారం చేస్తుానే ఉన్నాయి.
చదువు సంస్కారాలు, సాంప్రదాయపు కట్టుబాట్లు,
సంస్కారహీనుల స్వార్ధపు అధికారాలకు తల వంచుతున్నాయి॥

ప్రజా రాజ్యాంగ చట్టాల , 
మార్పురాని తీర్పుల పట్టీని చదవలేని  
న్యాయ దేవత,  కళ్ళకు గంతలు కట్టుకుని
న్యాయాన్యాయాలను, తుాకం తో కొలుస్తున్నాది.॥

ఎటువైపు బరువుంటే అటువైపు మొగ్గే--
వెసులుబాటు కలగడంతో, అక్రమాలు , ఆగడాలు అఱ్రులు చాచి మరీ  అన్యాయం ,  అధర్మాల  బరువుతో తక్కెడలను అక్రమిస్తున్నాయి.॥

రక్కసి చర్యల రాజ్యాంగంలో, దోపిడీ దొరల రాక్షసత్వం
నిర్భయంగా చొరబడుతున్నా, స్పందించి ఎదిరించే "ఒక్క నాధుని కుాడా కనలేకపోయేనే"  అన్న బాధతో , భరతమాత గుండె బద్దలైనట్టు విలపిస్తోంది॥

ప్రజల్లో క్రౌర్యం, కరడు కట్టిన హలమై,నీతి-నియమాల పంటను కుాకటివేళ్ళతోపెకిలించివేస్తుా,
అడిగే నాధుల్ని అడ్డంగా నరికేస్తుా, అక్రమాల "విత్తుల" కు ,అరాచకపు గెత్తం వేసి , ఎదిగేలా చేస్తోంది.॥
 
పుట్ట- గొడుగుల్లా పుట్టుకొస్తున్న విక్రుతి చేష్టల
వింత బిడ్డలను , మళ్ళీ మళ్ళీ  ప్రసవించలేని భరతమాత , పురిటి నొప్పులను భరించలేక..పిచ్చెక్కినట్టు విలయతాండవం చేస్తుా , విధ్వంసాన్ని శ్రుష్టిస్తోంది.॥

ఓ నర రుాప రాక్షసులారా ! నాశనమైపోండంటుా...!॥
---------------------------------


పై కవిత నా స్వంత రచనేననీ , ఎక్కడా ముద్రణ 
కాలేదని, ఇందుముాలముగా తెలియజేయుచున్నాను.


రచన, శ్రీమతి, 
జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు (తెలంగాణా )..
---------------------------
--------------------------