Monday, February 24, 2020

అన్వేషిత.

ఎప్పటికప్పుడు ఎదిగీ-ఎదగని 
ఒడిదుడుకుల- జీవితాశయాలను , 
ఆసరాగా చేసుకొని  చేసుకొని, 
ఒంటరి  పోరాటం సాగిస్తుా.
కవన కాసారంలో , సంగీత , సాహిత్య  
కథన , కవితా గంగ లో మునిగి తేలుతుా, 
 ఆట- పాటల ఆనందపు మునకలు వేస్తున్నాను.॥
 
 గెలవాలన్న "లక్ష్యాన్ని" ఆశయంగా తీసుకొని , 
  అముాల్యమైన సమయాన్ని నాకై నేనుగా
  కొంత -కేటాయించుకున్నాను.॥
  
  సంసార సమస్యలను, బాధ్యతలుగా  స్వీకరించి,
  కర్తవ్య నిర్వాహణలో, "కర్మబద్ధ"నవుతున్నాను.॥
  
  అద్రుష్ట- దురద్రుష్టాల తుాకంలో..
  కుటుంబ బాధ్యతలతో పాటు.-
  ఆశలు, ఆశయాల,బరువును వేసి,
  తక్కెడలను, సమాన బరువుతో సరిచేస్తున్నాను.॥
   ,
  "సంసార" మనే నడిసంద్రపు నావలో నిలబడి, 
  సాగరానికి , అట్టడుగున దాగి ఉన్న -
  నిధి - నిక్షేపాల కాంతి కళల ,కలలు కంటున్నాను.॥
  
  ఆ కలల సౌఖ్యానంద - శీతల గంధ సారాన్ని ,      ఆస్వాదిస్తుా , ఆనంద లోకాల్లో, తేలిపోతున్నాను.॥
  
  జీవితం, అంతులేని లోతైన సాగర మైతే, 
  ఆ సాగరంలోనే , మునకలు వేస్తుా..
  నాకు కావలసిన ,సాహిత్య నిధులను,
   అన్వేషిస్తుా,  ఆశల తెడ్లతో , కన్నీటి-
   అలలను నెట్టుకొచ్చే , ఆశయాన్వేషితను .॥
   
   ఎప్పటికప్పుడు నడిసంద్రాన్ని  దాటి , గమ్యం-
   చేరగలనన్న ,నిశ్ఛయ సంకల్ప సాధనాతురనైన,       
                స్వప్న సాకారాకాంక్షితను".
            నేనో   " నిత్యానందాన్వేషితను"॥
               -------------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర )
-------------------

   
    
   
   
  
  
  
  
  
  
    
 

No comments:

Post a Comment