తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్న చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చుట్టుా, ఉన్న నీ వారి ఆనందం ,
నీ వెప్పటికీ మరువలేని అనురాగ బంధమౌతుంది.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
బయటి ప్రపంచంలో నువ్వడుగిడే ప్రతీచోటా,
నీ చెలిమికై చేయిజాచే వారు, నీ బాటలో ఎదురౌతారు.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ కష్టాలను , తన ఇష్టాలుగా . భరించే సహచరి ,
నీ భారాన్ని ,బాధల్ని ,పంచుకునేందుకు నీ వెన్నంటే ఉంటుంది..
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
వ్రుద్ధాప్యంలో, నీ ప్రేమను పొందిన వారు , నీకు తిరిగి పంచి ఇచ్చేందుకు, నీ పిల్లలు, నీకు తోడై నిలుస్తారు.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితంలో అన్నీ సాధించగలిగే అత్మ శక్తి
నీలో నిరంతర సంజీవినై ,నిన్ను ముందుకు నడిపిస్తుంది.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
లోకంలో డబ్బుతో కొనలేని ఆత్మ సంత్రుప్తి..
నీకు ఆలంబనై , ఆనందలోకాల్లో విహరింపజేస్తుంది
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
అందం, ఆస్థి , అంతస్థులనే డాంబికాలనొడ్డే
సత్సంబంధాల సౌరభం ,నీ చుట్టుా పరిమళిస్తుా ఉంటుంది.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
ఎన్నో బంధాలు, అనుబంధాలు , ఆప్యాయత-
అనురాగాల ఆస్థికి వారసుడవౌతావు.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి క్షణాల్లో నీకై కన్నీరు కార్చే ఎంతోమంది
నీ స్నేహపుారితమైన చిరునవ్వు, ఎప్పటికీ తమతో
ఉండాలనే కోరికతో నీకై తపిస్తారు.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి స్వాశలో , మమకారంతో నీకై తపించేవారి కన్నీటి అలలు, వైతణీని దాటించే వారధిగా మారి
నీ ఆత్మను , శాంతి లోకాలకు సాగనంపుతాయి.
తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితాన్ని జయించే రీతిలో ,నీ
పయనాన్ని కొనసాగించి , మనిషిగా పుట్టినా
మనీషిగా ఎదిగి, అందరిమదిలో స్థిరంగా నిలిచిపో....॥
-----------------------------
రచన శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
-----------------------------
No comments:
Post a Comment