మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది
సమతా మమతా లేని జగతిలో
మందును ఎవరిని అడిగేది...॥
రక్త సంబంధపు రాగములే...నడ-
యాడెను స్వార్ధపు చింతనలై...,
అర్ధము లెరుగని అవేశములై ,
అర్ధము కొరకు అనర్ధములై....॥
అమ్మా, అక్కా, చెల్లీ,. తమ్ముల
బంధాలు బరువై , పలచబడే !
అన్నలు ,అయ్యలే , వావీ వరుసల
బంధపు విలువకు శిలువేసే॥
నారీ చింతన నెగడై ఎగసే.
మనిషే మ్రుగమై చెలరేగే....
ఏసిడ్ దాడుల , కాలిన చావుల
కన్నీరె-ప్రళయమై-కోపించే ॥
చీకటి వెలుగుల జీవన గతిలో..చిరు-
నగవుల విలువలు దిగజారే ..
భార్యా బిడ్డల బాధ్యత , విధులే
బరువై , బ్రతుకులే చితులాయే .. ॥..
అమ్రుతమె కరువై , విషపు జ్వాల లే
మింటికెగసె , హ్రుది మైలపడె..
మనిషే మనిషికి , శత్రువు కాగా
"పగ" లే...మనిషికి విధులాయే.॥
నాదీ -నీదను వాదపు సమరాన
రక్తమె ఝరులై ప్రవహించే..
ధనమే జగతిని సాశించినదై...
వైరపు మంటల నెగదోసే ॥
మమతల మాటున మధన పడే
నా మనసుకు ఏమని చెప్పేదీ..?
ఎవరికి ఎవరుా కాని జగతిలో
ఎంత కాలమని బతికేది..॥
రగిలిన గాయపు మంటల నార్పగ
మందును ఎవరిని అడిగేదీ....॥
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది..॥
---------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------
No comments:
Post a Comment