*వడిచర్ల సత్యం*
మణిపూసల రూపకర్త
7989511543.
*మణిపూసలు*
*పోతుల చైతన్య భారతి*
*హైదరాబాద్* 701326446
1.
ముసిరిన మబ్బులనూ,
చెదిరిన గుండెలనూ,
చేరదీయవలెనోయి.!
మనసు కుదుట పడునూ.
2.
కడలికేమో ఆరాటం,
మనసుకేమొ ఉబలాటం,
పరుగులు పెట్టాలని.
ఆపలేము ఈ కెరటం.
3.
ఉషోదయపు రవికిరణం.
వేకువకే ఆభరణం.
చైతన్యపు ఇనబింబం.
మనసుకే అలంకరణo.
4.
ప్రకృతిలో కొత్తదనం.
కుసుమాల నిండుదనం.
రమ్యమైన సోయగం.
అందమైన మధువనం.
5.
తీయని మాటల గాలము.
చేసే మాయాజాలము.
మాయకుల మోసాలు.
ఎరుకతోనుంటె క్షేమము.
*******************
22/05/2022.
చైతన్య భారతి వారి మణిపుాసలు సంకలనం కొరకు...
అంశం : స్త్రీల పై అత్యాచారాలు.
శీర్షిక : నాటికీ నేటికీ మారని చరిత
ప్రక్రియ : మణిపుాసలు.
సృష్టి కర్త : వడిచెర్ల సత్యంగారు.
రచన.:.శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
నాడు
1.
ఒకప్పుడు ఆడపిల్లలు
భ్రుాణ హత్యలకు నెలవులు
వంటింటి కుందేళ్ళుగా
బ్రతుకు బంధాల కొలువులు ॥
2.
కన్యాశుల్కపు బాధలు
అడుగడుగునవమానాలు.
సతీ సహగమనం వంటి
కర్కశపు ఆచారాలు ॥
3.
మార్పు కోరె ఉద్యమాలు
మహిళారక్ష కేంద్రాలు
గడప దాటిన మహిళల్లో
ఆత్మవిశ్వాసపు సిరులు ॥
4.
స్త్రీ జాతికి కొత్త మలుపు
అన్ని రంగాల్లో గెలుపు
ఆశయ ఆరోహణలవి
విజయ పథాలకిడె పిలుపు॥
నేడు..
5.
విదేశ వ్యామొాహ ఘనత
నాశనమౌతున్న యువత
డ్రగ్స్ , విస్కీల మత్తులో
చిత్తాయెను భరత భవిత ॥
6.
మార్పది తెచ్చిన సారం
అవనిని నిండిన ఘొారం
కామంతో రగిలె జనం
స్త్రీ బ్రతుకాయెను భారం ॥
7.
పురుషుల అహంకారాలు
స్త్రీ ల పాలిటి శాపాలు
మాన మర్యాదల లోపం
మరచారు వావి వరుసలు ॥
8.
మనిషి పిచ్చి మృగమాయెను.
మంచి చెడులు విడనాడెను
పాప భీతి అసలు లేదు.
పచ్చి స్వార్ధపరుడాయెను .
9.
నేడు అతివ ఆట బొమ్మ.
సరదాల సందడి కొమ్మ
సాముాహిక హింసలతో
చావు రేవుల శవమమ్మ ॥
హామీ : ఈ మణిపుాసలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచనలు.
పసి పిల్లని చుాడ లేదు.
పండు ముసలి నొదల లేదు
అక్క అమ్మ చెల్లి యైన
తప్పు అన్న మాట లేదు.