Saturday, June 26, 2021

తెలుగు వెలుగు లో కవితలు

[6/19, 13:19] p3860749: SV ఫౌండేషన్ వారి తెలుగు వెలుగు 
కవితల పోటీ కొరకు...

అంశం : నాన్న. (వచన కవిత)
శీర్షిక  :  నిత్య కర్షకుడు.

నా పాలబుగ్గల తళుకుల లో
ప్రతిఫలించే ఆనందపు హరివిల్లతడు.
నా ఉత్తమ విద్యల ,ఉజ్వల జీవితపు 
భవిష్యత్ప్రణాళికల బాధ్యత అతడు.
అమ్మ  అహర్నిశల కష్టానికి ఆలంబనై
జీవిత ఆకాంక్షల మణిపుాసలల్ని
ఒకటొకటిగా పేర్చి కలిపే సుాత్ర మతడు.
తడి -పొడి జీవితపు పోరాటంలో
తన శక్తి అనే అస్త్రాన్ని అడ్డుపెట్టి 
మమ్మల్ని గెలుపు బాటలో నడిపించే
 ఉత్తమ  రక్షక పాలకుడతడు.
విధి నిర్వాహణల పంట భుామిలో
కష్టమనే హలాన్ని చేత బట్టి 
సంసారమనే బీడుభుామిని సాగు చేసి
బాధ్యత ,బరువు అనే చెమటధారలతో 
కుటుంబ సేద్యాన్ని  చేస్తుా ఆకలి దీర్చే
నిస్వార్ధ నిత్య  కర్షకుడతడు ॥
ఎంతో ఎత్తుకెదిగి తలలుాచే పచ్చటి
కంకుల సార సౌందర్యాన్ని ఆస్వాదిస్తుా
తను పడిన కష్టాన్ని మరచి ఆనందంతో
శ్రమించే మహా " మనీషి " అతడు  .
 నా జీవిత వసంలో  నిత్య వసంతుడై
 నిలిచి ఉన్న  మహి వెలసిన మాధవుడు
 ఎవరోకాదు  మా " నాన్న" అతడు.


హామీ:
ఈనా కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన

రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
క్రమ సంఖ్య : 127.
[6/19, 13:20] p3860749: కవన వాహినీ తెలుగు వెలుగులో
అంశం : అక్షరక్రమ కవిత 
శీర్షిక :  ప్రేమ సందేశాలు.

కవన వనంలో కవితాక్షర సుమాలు
వలపు గీతికల సాహిత్య పరిమళాలు
నవ్వుల జల్లుల  ఆనంద గీతికలు
వాసి నిండిన వరుస శృతి లయలు
హిమ పన్నగ శోభల సుందర దీపికలు
నిత్య నిర్మల వాహినీ ఝరీ తరంగాలు
తెలుగు వెలుగుల తేట సందేశాలు
లుఫ్త మై దాగినన మనో భావనా వీచికలు 
గుండెలో పదిలమైన అందమైన జ్ఞాపకాలు 
వెన్నెల రాత్రుల విరహ వేదనా ప్రకంపనలు
లుప్తాంశాల సుదీర్ఘ కావ్య ప్రభంజనాలు
గుండె లయల ఘన జీవన తరంగాలు ॥
నా మది నిండిన నవ్య రస ప్రేమ సందేశాలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
క్రమ సంఖ్య : 127

హామీ:
ఈనా కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[6/26, 08:54] p3860749: 26/06/2021.
అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : మా  తరం  చరిత్ర.

(వం)దనాలు కరువైన  
 పరదేశీ వ్యామొాహం.
(దే)శ ప్రగతి సుాన్యం .
 దైన్య స్థితిలో జనం , మనం.
(మా)రని మనస్తత్వాల 
మారణ హోమపు కాలుష్యం.
దిగజారిపోతున్న ప్రకృతి అందాలు
(త)రిగిపోతున్న మానవ బంధాలు
( రం)కు రాజకీయాలతో 
 రగిలిపోతున్న న్యాయ వ్యవస్థ.
  బీద, బిక్కి, బడుగు, జీవితాల
 భారమౌతున్న బతుకు అవస్థ.
పుటల్లో నిండిన ఉద్యమకారుల పాత్ర
( వందే) ళ్ళైనా మారని భారత చరిత్ర.
 ఇదే ఈ నాటి (మాతరం) జీవన వేధ..
 భరత మాత ఒడి నిండిన కన్నీటి కథ ॥

------------------------------------------

అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక :  భయం-భయం, క్షణ -క్షణం ॥

 వంకర టింకర రాజకీయం
 దేశ ప్రగతి దుఃఖ మయం
 మా,మీ, తగాదాల మారణ హోమం
 తరిగిపోతున్న మానవర్వ వులువలు 
 రంగు మారుస్తున్న రాజకీయ వ్యవస్థ-
  నిండే మా "తరం". అను క్షణం ,
  భయం- భయం ,  క్షణ -క్షణం ॥

Friday, June 25, 2021

నవరత్నాలు

నవ రత్నాలు
1. దీనిలో 4 వరుసలు ఉండాలి
2. ప్రతి వరుసలో 10 నుండి 16 అక్షరాలు రావాలి
3.న గుణింతాము తో 1,2,3 వరుసలు మొదలవ్వాలి
4. చివరి వరుసలో
నవ రత్నాలు మానవ హిత కారకాలు అనే మకుటం రావాలి

Wednesday, June 23, 2021

చిత్ర కవిత.

తెలుగు వెలుగు లో
చిత్ర కవిత.

ప్రక్రియ : ఆట వెలది 

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

విడెను లాకు డౌను  విచ్చలవి డిపెరిగె
చేయి చేయి పట్టి  చెలగి రంత
నియమ పాల నమును  నిశ్చయ మ్ముగవీడి
మాస్కు మాట మరచి  మనిషి మెలగె   ॥

లాకు డౌను వీడ  లాగివీ ధినిబడి
సాకు లెన్నొ జెప్పి   సడలి నిష్ట
బడికి పోవు బాల విడిచెమా స్కునుచుాడు
చేరి కరము బట్టె చెలిమి కొరకు ॥

మాస్కు నొకరు వేసె  మాస్కుతీ సిరొకరు
కదలి పోవు చుండ్రి కరము బట్టి
 కరుణ లేని దైన  కణముమ హమ్మారి  .
 కాటు వేయ వచ్చు  గనుమ బాల ॥

 
చిన్ని మాస్కు మరచె   చిరునవ్వు చిలుకుచుా
అన్ని నియమ ములను  అదెగ విడచి
మన్ని  కైన చదువు మంచిగా నేర్వంగ
 కదలె  బాబు,పాప  కరము బట్టి    ॥

పెక్కు దుారపు చదువు పెక్కుభా రపుమొాత
 మాస్కు మాట మరచె మాదు బాల
 కేలు కేలు బట్టి  ఏగుచు న్నారదిగొ
 చదువు కొరకు బడికి చక్కగాను ॥
  
చిత్ర మైన ప్రీతి చిన్నపి  ల్లలరీతి
మిత్ర భావ మలరు మించు చెలిమి
ఛత్ర మెండ నిడక  చదువు బరువిడక
ఛాత్ర లిరువు రేగె చదువు బడికి ॥




Tuesday, June 22, 2021

గజల్.

గజల్.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥

వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥

మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥

పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥

నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై  పలకాలని ఉన్నది.॥

ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥

Tuesday, June 15, 2021

వందనం

ఈ రోజు అనగా జూన్ 19 జాతీయ చదువు రోజు అనగా National Reading Day, ఇది కేరళ కు చెందిన ఫణిక్కర్ అను వారు చనిపోయిన రోజుకు గుర్తుగా గత 25 సంవత్సరాల నుండి జరుపుతున్నారు. కారణం ఆయన భారతదేశంలో లైబ్రరీ వ్యవస్థ ను తీసుకొచ్చిన ప్రదముడు, ముందుగా తన కేరళ రాష్ట్రం మొత్తము లైబ్రెరీలు పెట్టించారు, తద్వారా ఆ రాష్టం 100% విద్యావంతులు గా మారడానికి దోహద పడింది. ఆ తరువాత దేశం మొత్తం లయిబ్రరీలు రావడానికి కారణభూతం అయ్యింది. చదువు తో పాటు లోకజ్ఞానం విలువ తెలిసిన ప్రతివారూ ఫణిక్కర్ గారికి అభివాదాలు తెలియచెయ్యడం ఒక గౌరవం తో కూడిన బాధ్యత. ధన్యవాదాలు