[6/19, 13:19] p3860749: SV ఫౌండేషన్ వారి తెలుగు వెలుగు
కవితల పోటీ కొరకు...
అంశం : నాన్న. (వచన కవిత)
శీర్షిక : నిత్య కర్షకుడు.
నా పాలబుగ్గల తళుకుల లో
ప్రతిఫలించే ఆనందపు హరివిల్లతడు.
నా ఉత్తమ విద్యల ,ఉజ్వల జీవితపు
భవిష్యత్ప్రణాళికల బాధ్యత అతడు.
అమ్మ అహర్నిశల కష్టానికి ఆలంబనై
జీవిత ఆకాంక్షల మణిపుాసలల్ని
ఒకటొకటిగా పేర్చి కలిపే సుాత్ర మతడు.
తడి -పొడి జీవితపు పోరాటంలో
తన శక్తి అనే అస్త్రాన్ని అడ్డుపెట్టి
మమ్మల్ని గెలుపు బాటలో నడిపించే
ఉత్తమ రక్షక పాలకుడతడు.
విధి నిర్వాహణల పంట భుామిలో
కష్టమనే హలాన్ని చేత బట్టి
సంసారమనే బీడుభుామిని సాగు చేసి
బాధ్యత ,బరువు అనే చెమటధారలతో
కుటుంబ సేద్యాన్ని చేస్తుా ఆకలి దీర్చే
నిస్వార్ధ నిత్య కర్షకుడతడు ॥
ఎంతో ఎత్తుకెదిగి తలలుాచే పచ్చటి
కంకుల సార సౌందర్యాన్ని ఆస్వాదిస్తుా
తను పడిన కష్టాన్ని మరచి ఆనందంతో
శ్రమించే మహా " మనీషి " అతడు .
నా జీవిత వసంలో నిత్య వసంతుడై
నిలిచి ఉన్న మహి వెలసిన మాధవుడు
ఎవరోకాదు మా " నాన్న" అతడు.
హామీ:
ఈనా కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన
రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
క్రమ సంఖ్య : 127.
[6/19, 13:20] p3860749: కవన వాహినీ తెలుగు వెలుగులో
అంశం : అక్షరక్రమ కవిత
శీర్షిక : ప్రేమ సందేశాలు.
కవన వనంలో కవితాక్షర సుమాలు
వలపు గీతికల సాహిత్య పరిమళాలు
నవ్వుల జల్లుల ఆనంద గీతికలు
వాసి నిండిన వరుస శృతి లయలు
హిమ పన్నగ శోభల సుందర దీపికలు
నిత్య నిర్మల వాహినీ ఝరీ తరంగాలు
తెలుగు వెలుగుల తేట సందేశాలు
లుఫ్త మై దాగినన మనో భావనా వీచికలు
గుండెలో పదిలమైన అందమైన జ్ఞాపకాలు
వెన్నెల రాత్రుల విరహ వేదనా ప్రకంపనలు
లుప్తాంశాల సుదీర్ఘ కావ్య ప్రభంజనాలు
గుండె లయల ఘన జీవన తరంగాలు ॥
నా మది నిండిన నవ్య రస ప్రేమ సందేశాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
క్రమ సంఖ్య : 127
హామీ:
ఈనా కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[6/26, 08:54] p3860749: 26/06/2021.
అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : మా తరం చరిత్ర.
(వం)దనాలు కరువైన
పరదేశీ వ్యామొాహం.
(దే)శ ప్రగతి సుాన్యం .
దైన్య స్థితిలో జనం , మనం.
(మా)రని మనస్తత్వాల
మారణ హోమపు కాలుష్యం.
దిగజారిపోతున్న ప్రకృతి అందాలు
(త)రిగిపోతున్న మానవ బంధాలు
( రం)కు రాజకీయాలతో
రగిలిపోతున్న న్యాయ వ్యవస్థ.
బీద, బిక్కి, బడుగు, జీవితాల
భారమౌతున్న బతుకు అవస్థ.
పుటల్లో నిండిన ఉద్యమకారుల పాత్ర
( వందే) ళ్ళైనా మారని భారత చరిత్ర.
ఇదే ఈ నాటి (మాతరం) జీవన వేధ..
భరత మాత ఒడి నిండిన కన్నీటి కథ ॥
------------------------------------------
అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : భయం-భయం, క్షణ -క్షణం ॥
వంకర టింకర రాజకీయం
దేశ ప్రగతి దుఃఖ మయం
మా,మీ, తగాదాల మారణ హోమం
తరిగిపోతున్న మానవర్వ వులువలు
రంగు మారుస్తున్న రాజకీయ వ్యవస్థ-
నిండే మా "తరం". అను క్షణం ,
భయం- భయం , క్షణ -క్షణం ॥
No comments:
Post a Comment