వెన్నెల లు కురిపించు చల్లని మాటల కీర్తి కాంతల,క-
న్నెలు, వసంత గీతికల సిరి సిరి మువ్వల సడుతో, క-
ల కలారవాలు నిండిన, ఆమని సొగసుల అందమై,
సార,సుమ,సౌరభాల,సుందర వనకన్యల చెలిమితో,
హితవైన సాహిత్య శోభలు రాజిల్లు సందడులతో-ని,
త్య నుాతన శోబాయమాన కావ్య కళా రతులైన,....
.అగ్రేశ్వరులౌ, కవి సార్వబౌముల భావపరంపరల-
కాసార ,కవితా ప్రవాహములో,జలకమాడి ,-వాడ-వా-
డలా, ప్రసరించే ప్రశంశాపుారిత పద జాల సమాగమ.
మిత్ర బ్రుంద, పరివార, పరీజన హితులతో కలిసి,.కిట
కిటలాడే శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,
"ఉద్ధండ చంద్ర శేఖర "కిరణ కవన కాంతి వేదిక పై
గాన,జ్ఞాన రస,గద్య ,పద్య ,సార,సుగంధవీచికలై--,దిన
దిన ప్రవర్ధమాన రీతుల , గౌరవ శిఖరాగ్రాలు చేరే --
శుభ సమయాన , వఝ్ర కిరీటాది నమ్మాన ద్యుతుల-
భాసిల్లు ,కవన కాంతల మేలిమి బంగరు పసిమి
కాంతుల, కీర్తి కిరణాల తో కలసి , మణి భాసిత, సా-
క్షర సుమ గంధమిళితమై , నలు దిక్కులా గుభాళించు, పలు , ఆనంద శోభల, వర్ధిల్లాలని ఆకాంక్షిస్తుా.....
"వెన్నెల అకాడమీ " సభ్యులకు
"శార్వరీ వత్సర " " . "శుభాకాంక్షలు".
---------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర .).
-------------------------------
No comments:
Post a Comment