విలువలు తగ్గిన విశ్వంలో,
పలు రీతులలో , రక్షణలేని వనితల శరీరాలు ,
చిలువలై చెలరేగిన, నర సర్పాల కాట్లకు
విషపుారితమై , వేదనతో అంతమౌతున్నాయి.॥
మ్రుగాల వంటి మగవారి క్రుార కామ వాంఛలకు
పసి పిల్లల నుండి, పండు ముసలి వరకు
బలౌతున్న సంఘటనలు, అతి సాధారణమై
వేల సంఖ్యల్లో వెలికి వస్తున్నాయి., ॥
తీగ కదిపితే డొంకంతా కదిలే దశలో " దిశ"
చట్టాలు, దిక్కులు మారుస్తుా , దశాబ్దాలుగా తీర్పు తేదీలని పొడిగిస్తుా..పైశాచిక ప్రవ్రుత్తులను పాయసాన్నాలు పెట్టి మరీ పోషిస్తున్నాయి॥
రాజెవరో, రంకెవరో కనిపెట్టలేని రంగుల ప్రపంచంలో
మేకతోలు కప్పుకునే పులులు , విశ్రుంఖలంగా
తిరుగుతుా ,విచక్షణారహితంగా,ధన, హీన , దీన, మానాలపై దాడులుచేస్తుా, దేశానికి , దుర్గతి పట్టిస్తున్నాయి.॥
అసహాయపు ఆర్తనాదాలు నిండే - అర్ధాంతర చావుల ఆక్రోశపు ,చితి-మంటల అగ్ని-గుండాలచుట్టుా ,
ఆయాత్తమైన పాపపు మరణమ్రుదంగాలు-
హాహాకారాలతో ,అగ్నిలో ఆరని అర్ఘ్యం పోస్తున్నాయి.॥
మంటల్లో మసైపోతున్న మానాలతోపాటు,
వావి- వరుసలెరుగని ఘాతుక చర్యల , విక్రుత
రుాపాలు, నిర్లజ్జాపుారిత నినాదాలు చేస్తుా, ,
వికటాట్టహాసం తో , వీరవిహారం చేస్తున్నాయి ॥
అకాశాన్నంటుతున్న అన్యాయపు చావుల సెగల- తాకిడికి , తామెక్కడ మైలపడతామొా, అన్న ట్టుగా , మేఘాలు ధుమ-ధుమలాడుతుా, ముఖాలు -చాటుచేసుకుంటున్నాయి॥
వర్షాలు కురవక ,బీడుబారిన భుాములు బద్దలై ,
రైతుల కన్నీటి గాధలను ,తమలో
ఇముడ్చుకొనేందుకు ,స్మశానవాటికలుగా మారి ,
ఆత్మహత్యలను అదేపనిగా ప్రేరేపిస్తున్నాయి.॥
ప్రక్రుతి వికటించి, తన ప్రతాపాన్ని చుాపుతున్నా..
విక్రుతి చేష్టలు వీరవిహారం చేస్తుానే ఉన్నాయి.
చదువు సంస్కారాలు, సాంప్రదాయపు కట్టుబాట్లు,
సంస్కారహీనుల స్వార్ధపు అధికారాలకు తల వంచుతున్నాయి॥
ప్రజా రాజ్యాంగ చట్టాల ,
మార్పురాని తీర్పుల పట్టీని చదవలేని
న్యాయ దేవత, కళ్ళకు గంతలు కట్టుకుని
న్యాయాన్యాయాలను, తుాకం తో కొలుస్తున్నాది.॥
ఎటువైపు బరువుంటే అటువైపు మొగ్గే--
వెసులుబాటు కలగడంతో, అక్రమాలు , ఆగడాలు అఱ్రులు చాచి మరీ అన్యాయం , అధర్మాల బరువుతో తక్కెడలను అక్రమిస్తున్నాయి.॥
రక్కసి చర్యల రాజ్యాంగంలో, దోపిడీ దొరల రాక్షసత్వం
నిర్భయంగా చొరబడుతున్నా, స్పందించి ఎదిరించే "ఒక్క నాధుని కుాడా కనలేకపోయేనే" అన్న బాధతో , భరతమాత గుండె బద్దలైనట్టు విలపిస్తోంది॥
ప్రజల్లో క్రౌర్యం, కరడు కట్టిన హలమై,నీతి-నియమాల పంటను కుాకటివేళ్ళతోపెకిలించివేస్తుా,
అడిగే నాధుల్ని అడ్డంగా నరికేస్తుా, అక్రమాల "విత్తుల" కు ,అరాచకపు గెత్తం వేసి , ఎదిగేలా చేస్తోంది.॥
పుట్ట- గొడుగుల్లా పుట్టుకొస్తున్న విక్రుతి చేష్టల
వింత బిడ్డలను , మళ్ళీ మళ్ళీ ప్రసవించలేని భరతమాత , పురిటి నొప్పులను భరించలేక..పిచ్చెక్కినట్టు విలయతాండవం చేస్తుా , విధ్వంసాన్ని శ్రుష్టిస్తోంది.॥
ఓ నర రుాప రాక్షసులారా ! నాశనమైపోండంటుా...!॥
---------------------------------
పై కవిత నా స్వంత రచనేననీ , ఎక్కడా ముద్రణ
కాలేదని, ఇందుముాలముగా తెలియజేయుచున్నాను.
రచన, శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు (తెలంగాణా )..
---------------------------
--------------------------
No comments:
Post a Comment