Saturday, April 6, 2019

సహజీవనం

సహజీవనం
------------------
షీలా....
ఎక్కడున్నావే...త్వరగారా.  అవతల
పెళ్ళివారొచ్చే సమయంఅయింది. ఇంకెంతసేపు నీ తెమలడం....
అన్న పిలుపుతో...
అబ్బబ్బ  ఆగమ్మా  ! బ్యుటీషియన్ ని పిలిచిందే  బాగా తయారు అవడానికి.
ఇలా గోల పెడితేమా ఇద్దరికీ ఇబ్బందే మరి.
ఒచ్చిన వాళ్ళు కొంచం ఆగుతే కొంపలేం అంటుకోవు..అంటుా విసుక్కుంది షీలా.!

        షీలా కి చిన్నప్పటి నుంచీ తయారవడం అంటే మహా సరదా...అలాంటిదీ పెళ్లి  కొడుకు ఫొటో చుాసిన దగ్గరినుండి ఊహా లోకాల్లో
తేలిపోతునే ఉంది. ఎంత బాగున్నాడో చుాడ డానికి. మరి అతను మాటకారో కాదో...
అతని అలవాట్లు ఏమిటో.....
ఆలోచనల్లోనే మళ్లీ  అమ్మ పిలుపు.
           ఆ..ఆ...అయిపోయింది . వచ్చేస్తున్నా అంటుా,..
తన మేకప్ ని మరొకసారి అద్దంలో చుాసుకొని
సంత్రుప్తిగా  తలాడించి ,  తన రుామ్ నుండి బయటకు వచ్చింది.
ఆసరికే అందరుా వచ్చి అమ్మచేతికాఫీతాగుతుా ,_
మాట్లాడుకుంటున్నారు. షీలా చక్రాల్లాంటి
కళ్ళతో పెళ్ళి  కొడుకుని  ఓరగా చుాస్తుాండగానే  , నలుగురైదుగురు  ఇరుగు పొరుగు ఆంటీలు  నవ్వుతుా వచ్చి ..తనని
అందరుా ఉన్న చోటుకి పట్టుకెళ్ళి, తనకోసం కేటాయంచిన కుర్చీలో కుార్చోబెట్టేరు.

                     అన్నీ బాగున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం తనకి అస్సలు నచ్చలేదు . తనేదో తప్పు చేసినట్టు తలొంచుకు--- కుార్చోవడం...వారంతా తనని , నఖశిఖ పర్యంతం  చుాస్తుా,  గుస గుస లాడుకోవడం.....ఇదంతా తనకి ఊపిరి ఆడనట్టే ఉంది. 
                 ముందునుంచీ అమ్మ చెప్పడంతో తల వంచుకొనే ఉంది .కానీ ఆలోచనలు ఆగడం లేదు .
అతను తనని చుాస్తున్నాడా...? మరి ఏమనుకుంటున్నాడో ...?
నన్ను నచ్చుకున్నాడా....?
ఫొటో చుాసేవచ్చేరు కదా... నచ్చే ఉంటాను.
ఏదేనా మాట్లాడొచ్చు కదా....

అసహనంగా చీర కొంగు నలుపుతున్న తను   ,
ఒదిన  కుదుపుతో తుళ్ళిపడి  ఏమిటన్నట్టు చుాసింది.ఒదిన నవ్వుతుా చెవిలో "  పెళ్ళి కొడుకు పేరు  రాజేంద్ర ట .నువ్వు  తనకి నచ్చేవుట...తాంబుాలాలుపుచ్చుకోడానికి
ముహుార్తం చుాడమంటున్నారు " ...
అనడంతో
ఒక్కసారి ఆనందంతో తలదించుకున్నా..
వెనువెంటనే...తను ఆలోచనల్లో ఉండగానే జరిగిన ఈ నిర్ణయానికి కాస్త కలవరపడింది. " 

ఇదేంటి...తనతో ఒక్కసారైనా మాట్లాడలేదే....తన అభిప్రాయమైనా అడగలేదే....అనుకొని చిన్నబుచ్చుకున్నా..
పెళ్ళికొడుకు ముందే నచ్చడం వల్ల  మరేం మాట్లాడకుండా లేచి నమస్కారం పెట్టి తన రుాంకి వెళ్లిపోయింది. 
చెవిలో పదే పదే రాజేంద్ర అన్నపేరే మారు మోగుతోంది.    ఫొటో  వెనకాల ఇంద్ర అని రాసి ఉంటే అదే అతని పేరనుకుంది. పుార్తి పేరు రాజేంద్ర అన్న మాట . పేరు చాలా బాగుంది . అనుకుంటుా ..  పెళ్లి తర్వాత అతనితో గడిపే
క్షణాలని ఊహించుకుంటున్న  షీలా కి   ఆరాత్రి కలత నిదురే  ఎదురయ్యంది-
---------------------------------------------------------

షీలా  సాయంత్రం నుండి , ఎదురుచుాపులు  చుాసి, చుాసి విసిగిపోయింది. పెళ్లయిన దగ్గరినుంచి  ఇదే తంతు. తను పనులన్నీ వేగంగా పుార్తి చేసుకొని , అందంగా అలంకరించుకొని , ఇంద్ర రాక కోసం ఎదురు చుాపులు చుాడడం...అతను లేటుగా రావడం...దానికి తోడు లేటుకి కారణం  అడిగితే ,  చిన్న నవ్వుతో సమాధానం.
పోనీ రాత్రయినా ప్రేమగా మాట్లాడి కబుర్లు
చెపుతాడా అంటే అదీ లేదు.

       కానీ అంతకన్నా ఆశ్ఛర్యమైన విషయం
ఏంటంటే ...తన కోరిక తీర్చుకొనే సమయంలో ఆయన మాట్లాడే విధానం. ఛీ..ఛీ....
ఎంత వెగటుగా ఉంటుందో...తనకీ సెక్స్ పరంగా కొన్ని ఇష్టాలు , అభిప్రాయాలు ఉంటాయన్న విషయానికి ప్రాధాన్యతే ఇవ్వడు. కనీసం  తనకి  ఆరోజు ఇష్టం ఉందా...లేదా అనికుాడా అడగడు.
కానీ తను చాలా సార్లు కోపరేట్ చేయడమే
అలవాటు చేసుకుంది.

కానీ రాను రాను అతని తో సెక్స్ అంటేనే
రోత పుడుతున్నాది .ఎంతసేపుా తనకెలా కావాలో అదే పద్ధతి తప్ప తనకేం కావాలో
ఒక్కరోజు  కుాడా అడగలేదు.
ఇంకా తెలిసిందేంటంటే ...
అతనికో స్నేహ బ్రుందం ఉంది . వారే అతనిలోకం. పెళ్ళి అయిన దగ్గరి నుండి
ఒక్క సినిమాగానీ  , షికారుగానీ  తీసుకెళ్ళ లేదు. సరికదా తన స్నేహితులెవరైనా ఇంటికి
వస్తే  , మధ్య తలుపులు వేసేవాడు .టీ తీసుకెళ్లడానికి కుాడా తనే వచ్చేవాడు.
షీలా మనసు ముాగబోయేది. వచ్చే వారిని
పరిచయం చేస్తే ఏం...?  .తనను వారి కుటుంబ సభ్యుల కి పరిచయం చేస్తే , వీకెండ్స్  అందరుా సరదాగా గడపొచ్చు కదా... అతను ఆఫీస్ కి వెళ్లి   నపుడు  తను వాళ్ల  ఇళ్లకి వెళ్లి వాళ్ల  భార్యా పిల్లలతో  సరదాగా గడిపి వస్తుందికదా.

ఇదే విషయం తను ఒకరోజు అడిగితే ,  అలాగే అన్నాడు గానీ  ఏరోజుా తీసుకెళ్ల లేదు.

                      ఎన్నాళ్ళని ఒంటరిగా ఇంట్లో
గడిపేది. అసలు తను ఎలా ఉండేది ?. వైవాహిక జీవితం గురించి ఎన్ని కలలు కన్నాది. ? పెళ్ళయాకా కొంచం సర్దుకుపోవాలి అన్నది నిజం. కానీ మరీ ఇంతలాగా...
షీలా కళ్ళల్లో  ఆగకుండా కన్నీరు  కారుతున్నాది.  ఆలోచనలతో తల పగిలిపోతున్నాది .

         ఇంతలో కాలింగ్ బెల్ మొాగింది. ఇంద్ర వచ్చి ఉంటాడు. ఈ రోజు తను ఖచ్చితంగా అతని ఉద్దేశ్యం అడిగి తీరుతుంది.  తనని
ఎన్నాళ్ళిలా బంధించి ఉంచుతాడని....
కోపంగా లేచి , కళ్ళు తుడుచుకొని తలుపు తీసింది.
ఎదురుగా ఉన్న అతన్ని చుాసి కొంచం
తడబడి , ఆపై తమాయించుకుంది.  అతను కుాడా
ఆమె వైపు చుాసి  ఆశ్చర్యంగా కళ్లెగరేసి ,
షీలా ని విష్ చేసి మీరుా....అంటుా.... ఆగిపోయాడు.
షీలా సర్దుకొని అతనితో..
నేను ఇంద్ర గారి మిసెస్ నండీ.... ఆయనతో
ఏమైనా పనుందా .? అని అడిగింది.
అవునా....అంటుా అతను కొన్ని పుస్తకాలు
తీసి ... నాకు నోవల్స్ చదివే అలవాటుందండీ..   ఇంద్రా  కొన్ని  పుస్తకాలు
తెచ్చి ఇవ్వు...మా మిసెస్ చదువుతుంది. అన్నాడు. అందికే అంటుా నసిగేడు...
షీలా అతని చేతిలో పుస్తకాలు అందుకొని
ధేంక్సండీ....అంటుా.....ఇంతకీ మీ పేరు..
అనగానే అతను నవ్వుతుా   రమేష్ అండీ....
ఇంద్రా ఉన్నాడనుకున్నాను  ..సారీ అంటుా....వెళుతుా వెళుతుా వెనక్కి తిరిగి అదోలా  చుాసి...చేయి ఊపేడు. అనాలోచితంగానే
తనుా చేయి ఊపింది.
         పుస్తకాలు చుాసి  ఇంద్రా గురించి తను
ఇంతసేపుా ఎంత అపార్ధం చేసుకుంది. పాపం తను మాత్రం తనకి బోర్ కాకుండా నవల్స్
తెప్పించేడు ...అనుకోగానే మనసు కొంచం
తేలిక పడింది...

చుాస్తుాండగానే   రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంద్రా మారలేదు కదా దానికి తోడు చిన్న చిన్న పుల్ల విరుపు మాటలు  ,  విసుగులు ..తగవులు మాత్రం
మొదలయ్యేయి.

ఇలాంటి సమయంలోనే రమేష్ వస్తుా పోతుా
షీలాకి దగ్గరయ్యేడు. షీలాకి కుాడా తన బాధ
పంచుకోడానికి ఒక స్నేహితుడు దొరికేడన్న
సంత్రుప్తి కలిగింది.దానికి తోడు అతను తన
మనసుకు నచ్చినట్టు మాట్లాడడం..చిన్న చిన్న
గిఫ్ట్స్  తీసుకురావడం  ,   ప్రేమగా మాట్లాడడం  చేయడంతో,  తనకో మంచి
మనిషి స్నేహం  దొరకిందన్న  భావంతో అతని వేపు  ఆకర్షితురాలైంది.

     అతని మాటల బట్టి తెలిసిందేమిటంటే
అతని భార్య పరమ గయ్యాళి అని ,డబ్బు మనిషి  అని,
డబ్బు తీసుకొని ఊరంతా తిరగడం తప్ప ,
అతనితో ఒక్కరోజు కుాడా ప్రేమగా మాట్లాడదు...పట్టించుకోదని ,  జీవితంలొ అన్ని సరదాలు కోల్పోయి మరమనిషిగా మిగిలేనని  వాపోయేడు. తను జాలి పడేది.
ఇద్దరివీ ఆనందం లేని  జీవితాలే...అని బాధపడేది.

రోజులు గడుస్తున్నాయి. షీలాకి చాలా అసంత్రుప్తిగా ఉంది. తను ఇంద్రా కి ఎంత దగ్గరవుదామన్నా...అతని ప్రవర్తన తో
విసుగు అసహ్యం పెరుగుతున్నాయే తప్ప
తగ్గడం లేదు. నిజానికి అతనికి ఏ విధమైన
చెడు అలవాట్లుా లేవు. . ఇంటికి కావలసిన వన్నీ  లేవు అనే లోపలే తెచ్చి పెడతాడు.
తనకి చీరలు ..డ్రస్ లు అన్నీ తనే తెస్తాడు
తను కుాడా వచ్చేది  కదా.....అంటే..ఏం...
నేను తెచ్చినవి నీకు నచ్చలేదా ..అంటాడు.
తను ఏ రకంగా చెప్పినా  , ఎన్ని విధాల
ప్రయత్నించినా అతనితో కలిసి బయటకు
వెళదామన్న కోరిక అలానే  ఉండిపోయింది.
కారణం బోధపడలేదు.

అందం ఉండి , చదువుండి..అన్ని పనుల లో
నేర్పరి అయి ఉండి...ఇలా నాలుగు గోడల
మధ్య జీవితం ఊహించడానికే భయంతో
వణికిపోయేది. ఇదేదో జైలులా ఉంది
కానీ ఇల్లులా లేదు. కనీసం  అతను తనతో
ప్రేమగా మాట్లాడినా చాలు . కానీ అతను
చాలా మితంగా మాట్లాడుతాడు. ఎలా...?
ఇంత   డల్  గా ఉంటాడని  తెలుస్తే
ఇతనిని చచ్చినా  పెళ్లి చేసుకునేది కాదు.

    ఈ విషయమై మొదలైన స్ఫర్ధలు చిలికి చిలికి గాలివానలై  .ఇద్దరి మధ్య
మాటలు లేకుండా పోయేయి.

కానీ తన విషయం ఏమిటి..? అతను బాగానే
ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు.తన విషయం
పట్టించుకోవడమే మానీసేడు.

             ప్రేమ కరువైన తన మనసు , ప్రేమని కోరుకుంటున్నాది.  ప్రేమ పుారితమైన మాటలు  ..చేతల కోసం తపిస్తున్నాది.
అటువంటి  బలహీన స్థితిలోనే  తనొక నిర్ణయం తీసుకుంది.

మర్నాడు రమేష్  రాగానే తన నిర్ణయం తెలిపింది.  రమేష్  ముందు ఆశ్చర్యపోయేడు
తర్వాత ఆనందపడ్డాడు...ఆపై ఆలోచించేడు.
తర్వాత  ఇద్దరుా కలిసి అమలు చేసేరు. పర్యవసానం...ఇద్దరుా  కలిసి  వేరుగా ఉండి
సహజీవనం చేయడం. ..అదీ సెక్స్ కి దుారంగా ఉండాలన్న ఒప్పందంతో...

-------------------------------------------------

రోజులు గడుస్తున్నాయి. షీలా రమేష్ ల ప్రేమ ఆనంద తీరాల లో విహరిస్తుా..సినిమాలు , షికార్లుా, షాపింగ్ ల జోరులో ఉంది. 
షీలాకైతే రమేష్  తనమీద చుాపిస్తున్న ప్రేమకి
అతనికి ఏమిచ్చినా ఋణం తీరదన్న స్థితికి
వచ్చీసింది.

ఆరునెలల  వ్యవధిలో రమేష్
ఒక్కనాడు కుాడా షీలాకి ఇష్టంలేని పని ఒక్కటి కుాడా చేయ  లేదు..సరికదా  ఏది చేసినా అడిగే చేసేవాడు.

ఈ ప్రేమే కదా ఇంద్రా నుండి తను ఆశించింది..
కానీ అతను ఏ నాడుా  తననర్ధం చేసుకో లేదు
కానీ రమేష్....
ప్రేమ  పిపాసి  అయిన  షీలా  మనసు ఆర్ద్రత తో నిండిపోయింది. ఒకానొక వెన్నెల రాత్రి
తనంత తానుగా రమేష్  బాహువుల్లో ఒదిగిపోయింది.

--------------------------------------------------------

                          ఇవేవీ పట్టించుకోని కాలం
తన పని తను చేసుకు పోతున్నాది. సమయం
సంవత్సరాలైంది.   అప్పుడే బయట పడింది రమేష్ అసలైన రుాపం . షీలా మీద మోజు తగ్గిన రమేష్  ఇంటికి  రావడం తగ్గించేడు. షీలా తెలుసుకున్న నిజం...

రమేష్ భార్య చాలా మంచిది. కానీ రమేష్ కి అందమైన ఆడవారి పిచ్చి. వారిని  లోబరచుకోవడం  కోసం
ఏమేనా చేస్తాడు ..ఎన్నాళ్ళైనా ఎదురు చుాస్తాడు. మొహం మొత్తగానే జారుకుంటాడు.

    షీలా మ్ర్రాన్పడిపోయింది. నిజా నిజాలు
తెలుసుకోకుండా  రమేష్ తో సహజీవనానికి
తనే ముందడుగు వేసింది.     
మంచివాడన్న భావనతో మనసే కాక శరీరాన్ని కుాడా అర్పించింది. ఇప్పుడు తను తల్లి కాబోతున్నాది. ఇటువంటి పరిస్థితుల లో
తనేం చేయాలి. ? ఎక్కడికి వెళ్లాలి.?  వెళ్ళినా
ఎవరాదరిస్తారు. ?  ఎందుకాదరిస్తారు..?

తను  సంఘ మర్యాదలకి విలువ ఇవ్వలేదు...
సమాజానికి వెరవలేదు. ఇది అసలు మన సంస్క్రుతే కాదు.  ధర్మ విరుధ్ధమైన నిర్ణయాన్ని
ఎవరు హర్షిస్తారు.   తను రమేష్ తో బయలుదేరడానికి ముందు....ఇటువంటి
పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని ఎందుకు ఆలోచించలేదు.

సుప్రీంకోర్టు  తీర్పు ప్రకారం  ఇద్దరు వ్యక్తులు
ఇష్టపడి చేసే సహజీవనం చెల్లుతుంది కానీ
వారికి పుట్టే సంతానానికి చట్టబద్ధమైన
రక్షణ  ఉండదని ...మహిళ లకు కుా్డా
పుార్తి రక్షణ ఉండదని  హెచ్చరించిందే....సహజీవనానికి సంబంధించి
వివాహితులైన   స్త్రీల  విషయంలో   జష్టిస్ రాధాకృష్ణన్
 నేత్రుత్వంలో   గ్రుహ హింస చట్టం కింద    కొన్ని  మార్గదర్శకాలను రుాపొందించినట్టు
వినికిడి . కానీ వివాహితులైన స్త్రీ పురుషులు
సహజీవనం చేస్తే వారిరువురుా కుాడా
భార్యా.భర్తల  సంబంధీకుల కింద పరిగణింప బడరని కుాడా తెలిపిందే. తామిద్దరిలో ఎవరు మరణించినా  రెండవ వారికి తమ  ఆస్థి చెందుతుంది...కానీ వారి మొదటి భార్య గానీ,
భర్త  గానీ   వారి వివాహ బంధానికి  సంబంధించిన  సాక్ష్యాధారాలు  చుాపిస్తే..
అవి వారికే చెల్లే అధికారం ఉందే...
తామిద్దరుా ఒకరికనొకరు   ఇష్టపడి తీసుకున్న నిర్ణయంలో  సంతానం కలిగినా
వారికి గానీ...స్పర్ధలోచ్చి విడిపోయినా తమకు
గానీ  ఏవిధమైన చట్టం  సహకరించే అవకాశమేలేదే..  మరిప్పుడు తన గతి....

ఆలోచిస్తున్న కొద్దీ షీలా కి ఊపిరాడనట్టుగా ఉంది. పోనీ చచ్చిపోదామా..అంటే ....
తన కడుపులో ఊపిరి నింపుకున్న మరో
జీవిని...చంపే అధికారం తనకు లేదే....
పోనీ  పిల్లో పిల్లడో పుట్టేక చనిపోతే....
హమ్మొా.....ఆ పసికందుని ఎవరు చుాస్తారు...?

పోనీ చంద్రా దగ్గరకే వెళ్లి క్షమాపణ అడిగితే..
ఛీ...ఛీ...అతన్ని నలుగురిలో తలెత్తుకోని
విధంగా చేయడమే కాకుండా....అతనికి తెలీకుండా   బయటకు వచ్చీ  సంఘం
కట్టుబాట్లకి ..ఆచార వ్యవహారాలకి అతీతంగా
తను చేసిన పని హర్షింప తగినదా....
అతనెందుకు  క్షమిస్తాడు...

ఇలాంటి తప్పులు ఎవరుా చేయకుాడదనే
మన  పుార్వికులు   సంస్కార   సంప్రదాయాలికి  .'వివాహ వ్యవస్తకి 
కొన్ని నియమాలు పెట్టేరు. అప్పటిలో
ఇటువంటి  సమస్యలుగానీ ఆలోచనలుగానీ
ఎవరికీ వచ్చేవే కావు. కానీ మారే కాలంతో
పాటు...మనిషి మనస్తత్వం,   మారే అభిప్రయాాలు...
నీతి నియమాలను , కట్టుబాట్లను , ఉల్లంఘించడం వల్ల....న్యాయ స్థానాలు
కుాడా తీర్పులలో మార్పులు తేవడం వల్ల
జరిగే అనర్ధాలు....ఇలా అనుభవంలోకి
వస్తేగానీ అర్ధంకావు..

చేతులు కాలేకా...అకులు సామెతలా
ఇప్పుడాలోచించి ఏం లాభం. ఇప్పుడు
తన గతేంటి..?  ఈ విషయం బయటకు
తెలిసిన మరు క్షణం నుండే తన పతనం
మొదలవుతుంది. రమేష్ లాంటి  ఎంతమందున్నారో తనని  వేటాడడానికి..
.అయితే తను బ్రతకడానికి మరో దారే లేదా...?  ఒంటరిగా బతకగలదా..?
ఉద్యోగం వెతుక్కున్నా  అక్కడ నా విషయం తెలిస్తే...నన్ను గౌరవంగా చుాస్తారా..? ఇంకెవరైనా మాయమాటలు చెప్పి లోబర్చు కుంటే.....తను లొంగిపోతే. ...అలా ఒకరి తరువాత మరొకరు.....అంటే.....తను
వ్యభిచారిగా మారిపోతుందా....మరో దారిలేదా....అయ్యొా.. భగవంతుడా..

మరిప్పుడెలా.....మరిప్పుడెలా.....తెగని ఆలోచనలతో  భయంతో కుాడిన ఒంటరితనంతో....
షీలా నిస్సహాయురాలై  
ఏడుస్తున్నాది.....హ్రుదయవిదారకంగా....

-------------------------------------------------------------- రచన..శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------------

No comments:

Post a Comment