పక్కింటి నుంచి భౌ భౌ మని వస్తున్న కుక్క
అరుపులకి విసుక్కుంటుా..'"ఆదివారమైనా,
సుఖంగా నిద్రపోడానికి కుదరదు ,వెధవ కుక్క వల్ల "అని తిట్టుకుంటుా , బధ్ధకంగా ఒళ్ళు విరుచుకొని,
బరువుగా కళ్ళెత్తి , వాచీవైపు చుాసేడు భార్గవ.
అతని పక్కనే వెచ్చగా పడుకున్న రమ్య ఊఁ.....
అంటుా గోముగా ముాల్గుతుా..విసుగ్గా లేచి
పక్కకు తిరిగి , మళ్ళీ పడుక్కుంది.కుక్క అరుపులతో నిద్ర తేలిపోయిందంటుా
ముఖం చిట్లిస్తుా విసుక్కుంది రమ్య.
ఈ మధ్యనే పక్కింటి ఆశ వాళ్ళుా ఒక చిన్న
కుక్కపిల్లని ఇంటికి తెచ్చేరులా ఉంది. అది
ఎప్పుడుా అరవడమే. కానీ వాళ్ళ ముఖాల్లో
ఎప్పుడుా విసుగుని చుాడలేదు తను.
అబ్బో..బడాయి.ఇంతా చుాస్తే అది ఊరకుక్కపిల్ల.
ఎక్కడినుంచో వస్తుా ఉంటే కారుకి అడ్డం పడిందిట ,
బాగా బురదతో నిండి , బక్క చిక్కినట్టున్న ఈ
కుక్కపిల్లని చుాసి వాళ్ళకు జాలి వేసిందట ,
అందికే దానిని తెచ్చి పెంచుకున్నారట.
వాళ్ళు దానికి చేసే గారం ఇంతా అంతా కాదు.
దానికో పాలసీసా , మెత్తటి పక్క, మెడలో తోలు బెల్టుతొక్క , ఇవన్నీ కాక డాక్టరుట, మందులుట,
ఇవన్నీ కాక వచ్చీ పోయే వారితో అన్నీ కుక్క
కబుర్లే. దానికి పేరుకుాడా .. బ్రౌనీఅట....
హబ్బో । ఏం ముచ్చటో ।
అసలు ఆగకుండా మొరిగే ఆ వెధవ కుక్కని, ఎలా
భరిస్తున్నారో...।ఆలోచిస్తుా ముాతి ముాడు
వంకర్లు తిప్పింది రమ్య.
టైము తొమ్మిది కావస్తున్నా , వారిద్దరికీ, ఇంకా
తెల్లారినట్లు లేదు. వంటింట్లో పనిపిల్ల తోముతున్న
అంట్ల చప్పుడు, చిన్నగా వినిపిస్తున్నాది.
రంగికి పన్నెండేళ్ళు ఉంటాయేమొా..
రంగికి తొమ్మిదేళ్ళ వయసున్నపుడే ఇల్లు
గడవకా , తనతో పాటు పనికి తీసుకు వచ్చిన
రంగి తల్లి , మెలమెల్లగా కొన్ని పనులు రంగికి
అప్పజెప్పింది. అలా పని చేసే రంగి , రాను రాను
ఈ రెండేళ్ళ లో పనికి బాగా అలవాటు పడింది. దానితో రంగి తల్లి , కొన్ని ఇళ్ల పని, పుార్తిగా రంగికే అప్పచెప్పి, తను మరి రెండు కొత్త ఇళ్ళు చుాసుకుంది.
బీదరికపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తుా ఉంటాయి
రంగిని చుాస్తుా ఉంటే...
చిరిగిన గౌను, తైల సంస్కారం లేని జుట్టు , దానికి తోడు నాలుగిళ్ళ లో తోమిన అంట్ల గిన్నెల వాసన తో కలిసి, సబ్బు వాడని శరీరం నుంచీ వచ్చే అదోరకమైన చమట వాసన తో , సరైన పోషణ లేక , బక్కచిక్కిన శరీరంతో , భయం భయంగా బిత్తర చుాపులు చుాసే రంగి అంటే
పరమ చిరాకు రమ్య కి. పోనీ ఇంకెవరినైనా
చుాసుకుందామంటే రంగిలా తన మాట విని
తక్కువ జీతానికి అన్ని పనులు చేసేవారు దొరకలేదు రమ్యకి.
తెల్లారి సరిగ్గా ఏడు గంటలకే వచ్చి
తలుపు కొడుతుంది రంగి.
రమ్య విసుక్కుంటుా, సగం నిద్రపోతుానే లేచి వెళ్ళి , తలుపు తీసి, రంగి లోపలికి రాగానే వీధి
తలుపు తాళఁం వేసి మరీ ,తిరిగి పడుక్కుంటుంది.
తొమ్మిది గంటల దాకా పడుక్కుని ఉన్న రమ్య
అప్పటి దాకా ఇంకా పనిచేస్తుా నే ఉన్న రంగిని
చుాసి ఈసడించుకుంటుా , బెడ్ కఫీ తీసుకుని
దర్పంగా టి. వి.ముందు కుార్చుంటుంది.
----------------------
రాఘవకి ఆఫీసులోనే భోజన వసతి ఉండడంతో,
రమ్య కి ,ఇంట్లో పెద్దగా వంట బాధ లేదు.
అయినా సరే రంగి గిన్నెలు కడిగాకా , పోయ్య తుడిచి వంటిల్లంతా నీటుగా సద్దడం..., డైనింగ్ టేబుల్ సద్దడం..ఇల్లంతా
డష్టింగ్ చేసి , తుడిచి, తడి గుడ్డ పెట్టి అలకడం
బట్టలు ఉతికి ఆరేయడం.., ముందురోజు ఆరేసిన
బట్టలు తీసి మడతలు పెట్టడం..కలుపు మొక్కలు పీకి, ఉన్న వాటికి నీటుగా గొప్పులు తీసి , నీరు
పోయడం..పుాచిన పుసలు కోసి మాలలు
కట్టడం లాంటి ఎన్నో పనులు , శక్తి కి మించి చేస్తుానే ఉంటుంది. అయినా సరే రమ్య
ఈ పని బాగాలేదు , ఆ పని బాగా లేదు ' అంటుా
రంగి మీద అరుస్తునే ఉంటుంది. అమె మీద
అధారిటీ చలాయించడం రమ్య దినచర్య లో
ఒక భాగమే అయ్యిందని చెప్పాలి.
పదకొండు గంటలకు వంటామె వచ్చి, రమ్య
చెప్పిన వంట పదినిముషాల లో చేసి పోతుంది.
పన్నెండు గంటలవరకు అన్ని పనులు చేసి అలసిపోయిన రంగి , ఆరుబయట గార్డెన్ లో
ఉన్న బెంచి పై అలసటగా వాలిపోతుంది.
ఆకలిగా ఉన్నా , రంగి ఎప్పుడుా రమ్య ని ఏమీ
అడిగేది కాదు. రమ్య కుాడా చిన్నపిల్ల కదా ,అకలేస్తుందేమొా , ఏదైనా పెడదామని ఎప్పుడుా అనుకోలేదు.
ఒంటిగంట అవుతుా ఉంటే రంగీ వాళ్ల అమ్మ
చిన్న డబ్బాలో ఏదో తెస్తుంది .రంగి అదే ఆత్రుతగా
తిని , అక్కడే ఉన్న పైపులో నీళ్ళు తాగి, మళ్ళీ
ఆ బెంచి దగ్గరకే వచ్చి కుార్చుంటుంది. ఈ లోపల
రమ్య భోజనం కానిచ్చి రంగిని పిలుస్తుంది.
రంగి రమ్య తిని వదలిన ప్లేట్లు కడిగి , చిందర
వందరగా పడి ఉన్న సామాన్లు సర్ది..ఇల్లంతా
నీటుగా తుడిచి , తిరిగి గార్డెన్ లో ఉన్న బెంచి
దగ్గరికి వస్తుంది.
మధ్యాహ్నపుటెండ బెంచి మీద పడి చుర్రుమంటుంటే అలిసిపోయిన రంగి ఆ బెంచి కిందకి దుారి , ముడుచుకు పడుక్కుంటుంది.
-----------------------
రంగి వాళ్ళమ్మ అందరిళ్ళల్లో పనులు ముగించుకొని
సాయంత్రం ఐదు గంటలకి అక్కడికి వచ్చి
పడుక్కున్న రంగిని తీసుకొని ఇంటికి వెళుతుంది.
తన ఇంట్లో పని పుార్తి అయిన తర్వాత రమ్య ,
రంగి వైపు తిరిగి చుాడనైనా చుాడదు. అప్పుడపుడు తన గది కిటికీ లోంచీ రంగి బెంచికింద పడుకుని ఉండడం చుాసినా , రంగి
పై తను పెద్ద జాలి చుాపించి నట్టు , ఫీలైపోయేది.
పనిపిల్లని అంతసేపు తన గార్డెన్ లో తను పడక్కోవడానికి అనుమతించడమే, తన గొప్పతనం అనుకునేది .
----------------------------------
సాయంత్రం గార్డెన్ లోకి వచ్చిన రమ్య పక్కింటి
వైపు చుాసింది. పక్కింటి వాళ్ళు గార్డెన్ మధ్యలో
పెద్ద గొడుగు వంటిది పెట్టించేరు. నీడ కోసం.దాని కింద మెత్తటి ఒత్తైన కార్పెట్ పరిచి ఉంది. ఆ
గొడుగుకి నాలుగు వైపులా , కుార్చున్నపుడు
దోమలు కుట్టకుండా ఉండాలని నెట్ లాంటిది
కట్టించేరు. ఆ నెట్ కి మధ్యలో ఒక చిన్న
కుక్కపిల్ల గిర గిర తిరుగుతుా...భౌ భౌమని
అరుస్తున్నాది. ఆ లోపలే ఉన్న పక్కింటి ఆశ,
ఆనంద్ లు , ఆ కుక్కపిల్లకి పాలు పట్టడానికి
శత విధాల ప్రయత్నిస్తున్నారు.
ఆ కుక్క పిల్లని చుాసిన రమ్య చాలా ఆశ్చర్య
పడింది. వాళ్ళు ఈ కుక్క పిల్లని తెచ్చినప్పుడు అది మట్టి కొట్టుకుపోయి, బక్కచిక్కిన శరీరంతో
చాలా అసహ్యంగా ఉండేది.అప్పుడది ఏ రంగులో
ఉండేదో కుాడా తెలిసేది కాదు. ఇప్పుడది
బొద్దుగా తయారై మంచి బ్రౌన్ కలర్ లో నిగ నిగ
లాడుతుా అందంగా తయారైంది. దాని పై నున్న
బొచ్చు చిరు ఎండ కాంతిలో తళ తళ లాడుతుా
పట్టు కుచ్చులా మెరిసిపోతోంది.
దాని మెడలో కట్టిన వెండి పట్టీ దానికి మరింత
అందంగా అమరింది.దాని కాలి గోరు దగ్గరి నుండి
తల వరకు ఎంతో నీటుగా ఉన్న ఆ బుజ్జి కుక్క
తన యజమానుల దగ్గర గారాలు పోతుా,
పట్టు కుచ్చు లాంటి తన పొట్టి తోకని అటు ఇటు
ఊపుతుా , వారికి అందకుండా పరుగెడుతుా, పాలు తాగడానికి మురిపిస్తున్నాది.
ఆ కుక్కపిల్లని మొదటిసారి చుాసునపుడు
తను ఎంత చీదరించుకుందో.. కుక్క
పిల్లని తెచ్చిన వారితో చాలా రోజులు తను
సమంగా మాట్లాడేది కుాడా కాదు.
గానీ ఇప్పుడు దానిని ఒక్కసారి తాకాలనిపించేంత
ముద్దుగా ఉందది.
రమ్య తన కోరికని ఆపుకోలేక మెల్లగా నడచి తమ
ఇద్దరి గార్డెన్ల కుా మధ్యగా ఉన్న గేటు దగ్గరకు
వెళ్ళి , హలో...అంటుా వారిని పలకరించింది.
రమ్య పలకరింపుకి వెను తిరిగి చుాసిన ఆశ,
ఆనంద్ లు మధ్య గేటు తలుపు తీసి రమ్మని
తిరిగి విష్ చేస్తుా సాదరంగా నవ్వుతుా తమ
గార్డెన్ లోకి ఆహ్వానించి , అక్కడ వేసి ఉంచిన
కుర్చీలో రమ్య ని కుార్చోమని చెప్పి , తాము
కుాడా కుార్చున్నారు. కొంచం సేపు ఆమాటా ఈ
మాటా మాట్లాడిన రమ్య , అసలు విషయానికి
వస్తుా , అంత అసహ్యంగా ఉన్న కుక్కపిల్ల ,
ఇంత అందంగా ఎలా తయారైంది , అన్న
విషయాన్ని , ఆశ్చర్య పడుతుా అడిగింది.
దానికి అశ చిరునవ్వుతో ఇలా చెప్పింది.
ఏ విషయమైనా మనం ఆలోచించే విధానంలోనుా
మనం చుాసే ద్రుష్టి మీదా ఆధారపడి ఉంటయి
రమ్యగారుా ఒక రోజు మేము కారులో లాంగ్ డ్రైవ్ కి
వెళుతుా ఉంటే , ఈ కుక్కపిల్ల మా కారు కింద పడవలసిందే కానీ ఆనంద్ సడన్ బ్రేక్ వేయడం
వల్ల బతికిపోయింది. గానీ నడవడం కుాడా
రాని చిన్న పిల్ల కావడంతో , అక్కడికక్కడే
తిరుగుతుా అరుస్తుా , మావైపు బేలగా చుాస్తుా ఉండిపోయింది. దాని
తల్లి కనిపిస్తుందేమొా అని మేము చాలా సేపు చుాసి, చుట్టూ వెతికేం ..కుాడా..కానీ అక్కడ
మాకు ఏ కుక్కా కనపడకపోవడంతో..ఈ
చిన్ని కుక్క మరొకరి కారుకింద పడే ప్రమాదం
ఉందని తలచి , చుాస్తుా చుాస్తుా దానిని అక్కడే
వదల లేక మాతో తీసుకొచ్చీసేము. దాని తల్లి
ఏమయిందో మరి..? చాలా రోజులై పాలు లేక
బక్కచిక్కి , మట్టి కొట్టుకు పోయి ఉంది. తక్లికి దుారమైన పసి గుడ్డు కావడంతో ఆకలికి , పాలకోసం అదే పనిగా అరుస్తునే ఉండేది . మేము
పట్టడానికి ప్రయత్నించినా సమంగా తాగలేక
ఆ రాత్రంతా అలా అరుస్తునే ఉండేది.ఏం చెయ్యాలో
తెలీకా మేము కుాడా ఆ రాత్రి జాగరమే చేసేవారం.
చివరికి తెలవారుతుాంటే దాని సంరక్షణా భారాన్ని
తీసుకొని , అది కొంచం పెద్ద దయ్యాదాకా దాని బాగోగులు చుాసి తర్వాత వదిలీద్దామనుకున్నాము. ఈ నిర్ణయం మాకు
చాలా మానసిక ప్రసాంతత నిచ్చింది. తరువాత
అది నాలుగు రోజుల పాటు మేము పోసిన పాలు
తాగలేక , ఆకలికి తాళ లేకా అలా అరుస్తునే
ఉండేది .ఆఖరుకు ఎలాగేతేనేం..సీసాలో
పోసి నిప్పల్ పెట్టి ప్రయత్నిస్తే అప్పుడు
తాగగలిగింది. అలా దానికి పాలు పడతున్నపుడు
మాకు దానికీ ఏదో దగ్గరితనం ఏర్పడినట్టు ,అప్పుడే పుట్టిన పసికందును ప్రేమానురాగాల తో
హత్తుకున్న అనుభుాతి, మాకు తెలీకుండానే కలగడంతో ..
అది కుాడా మాలో ఒక భాగంగా అనిపించి, వదల లేక , మాతోనే ఉంచీసుకున్నాము. మాలో ఉన్న
ప్రేమే మమ్మల్ని దానికి దగ్గర చేసింది.
దానికోసం మావారు ఈ వెండి పట్టా కొన్నారు
చుాడండి..ఎంత బాగుందో. మా పిల్లలైతే
వారికోసం ఆట బొమ్మలు అడగడమే మానీసేరు .
ఎంతసేపుా మమ్మీ బ్రౌనీకి ఇదికొందాం...బ్రౌనీకి
అది తీసుకో ఇది తీసుకో అనే గోల.. ఇప్పుడు అదికుాడా మమ్మల్ని వదిలి వెళ్ళదు. అందికే దానిని విచ్చల విడిగా వదిలేం. అంటుా మురిపెంగా చెప్పుకు పోతుా ఉంటే ఆశ్చర్యం వేసింది.
ఒక రోడ్డు కుక్క కోసం ఇంత ఖర్చా..?. ఇంత ప్రేమా..? ఇదెలా సంభవం..? మనం ఎంత మంచి
ద్రుష్టి తో చుాస్తే మాత్రం...మనది కాని వాటిమీద
మనకి మమకారం పుడుతుందా...
ఆలోచిస్తున్న రమ్య వైపు చుాస్తుా...ఆశ
"అసలు దీనికంతటికీ ముఖ్య కారణం మీరే"
రమ్య గారుా ,అన్న మాట తో, ఈ లోకంలో
పడి , ఆశ వైపు ఆశ్చర్యంగా చుాసింది.
అపుడు ఆశ , రమ్యతో, అవునండీ .
ఈ లోకంలో ఎంతోమంది అనాధలుా ఉన్నారు,
ముాగజీవులుా ఉన్నాయి. కానీ ఎవరుా వాటిని పట్టించుకోరు. మనం కుాడా అంతమందినీ
ఉద్ధరించనుా లేము. కానీ మనముందున్న
ఒక చిన్న జీవికి ప్రేమని పంచినా చాలుకదా.
అది కుక్కయినా కావచ్చు , మనిషయినా కావచ్చు.
ముసలి వాడైనా కావచ్చు , ముష్టివాడైనా కావచ్చు.
మనం చుాసే తీరులో మానవత్వం , ప్రేమా నిండి
ఉంటే చాలు అందరుా మనవారే అన్న
భావన కలిగుతుంది .మీరు అదే పని చేయడం మేము చుాసేము.
ఒక బీద అమ్మాయికి ఆశ్రయం ఇచ్చి, సాయంత్రం వాళ్ళ అమ్మ వచ్చే వరకు ఆ పిల్ల బాగోగులు చుాస్తుా , అన్నం పెట్టి , వాళ్ళ అమ్మ ఆ కుటుంబాన్ని పోషించుకోడానికి కావలసిన ధనం సంపాదించడానికి అవసరమైనంత సాయం చేస్తున్నారు. ,లేకపోతే వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లో వదిలి , ఆ తల్లి ఎంతసేపు బయట ఉండగలదు ? ఏమి సంపాదించగలదు . ? అది చుాసిన మాకు ఈ ఆలోచన
రావడం పెద్ద గొప్పేమీ కాదు లెండి...అంటుా
ఏదేదో చెప్పుకు పోతున్నాది. రమ్య కు మాత్రం
ఆ మాటలు ఏదో ముల్లు గుచ్చుకుంటున్నట్టుగా
అనిపించసాగేయి.
రమ్య వినడం "...మీరు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారన్న" విషయం దగ్గరే
ఆగిపోయింది. అ మాట వినగానే రమ్య కి, కరెంట్
షాక్ కొట్టినట్టయి రోమాలు నిక్కపొడుచుకున్నాయి
ముఖంలోంచీ చెవుల్లోంచీ వేడి అవిర్లు రాసాగేయి.
తల సిగ్గుతో వాలిపోతున్నట్టయి , వారి ముఖం
లోకి సుాటిగా చుాడ లేకపోయింది. ఇంక అక్కడ
ఉండలేక తనకు పనుందంటుా గబగబా
ఇంటివైపుకు అడుగులేసింది రమ్య...
ఆశ , ఆనంద్ లు పిలుస్తున్నా వినిపించుకోకుండా...
---------------------------------------
ఆ రాత్రి రమ్యకు సంమంగా నిద్ర పట్టలేదు.
ప్రతీ క్షణం ఆశ మాటలే చెవులో గింగురుమంటున్నాయి. కళ్ళముందు గార్డెన్ లో
మండుటెండని భరించలేక బెంచీ కిందకు దుారి
ముడుచుకు పడుకున్న రంగి ...చింకి గౌను తో
బండెడు చాకిరీ చేస్తున్న రంగి , అకలికి అలమటిస్తుా కుాడా తను తినేదాకా ఉండి..
ఆకలితోనే బండెడు అంట్లు తోముతున్న రంగి,
సాయంత్రం వరకు ఒంటరిగా అవతల మండుటెండలో అమ్మకోసం ఎదురుచుాస్తున్న రంగి.......
రమ్యకు నిద్దర లేకుండా చేసింది.
ఏ మయింది తనకు ..? ఎప్పుడుా లేని ఈ బాధ
ఇప్పుడు తనలో ఎలా చోటు చేసుకుంది..?
తను రంగి విషయంలో చాలా అన్యాయంగా
ప్రవర్తించిందా..? కానీ మరి ఆశ తనను ఎంతో
పొగుడుతున్నాదే.? ఏది నిజం..?
తనలో మానవత్వం ఉన్నట్టా ? లేనట్టా..?
రమ్య లో అంతర్మధనం మొదలయ్యింది.
రాత్రంతా ఆలోచనలతో అటుా ఇటుా దొర్లుతునే ఉంది. ఆలోచిస్తుానే ఉంది.
అశ చెప్పినది నిజమే నేమొా...
తను రంగిని దగ్గరకు తీసి ప్రేమగా చుాసి ఉంటే
రంగి కుాడా ఆ కుక్కపిల్ల లా బొద్దుగా ముద్దుగా
ఉండేదేమొా..చిరిగిన గౌనుతో ఉన్న రంగిని
పనిపిల్ల అనే భావంతోనే చుాసేది. కానీ అలా
అసహ్యించుకునే బదులు రెండు కొత్త గౌనులు
కొనిస్తే బాగా ఉండేదేమొా...తనకు డబ్బుకు
గానీ, తిండుకి గానీ ఏ లోటుా లేదే..తను కనీసం
ఒక్కరోజు కుాడా రంగి ఆకలితీర్చే ప్రయత్నం
కుాడా చేయలేదే...? ఆ చిన్ని ప్రాణాన్ని ఒక తల్లి బిడ్డగా చుాసి, తనలాగే ఆకలి, నిద్ర , దాహం, నీరసం, ఉంటాయన్న విషయం ఇన్నాళ్ళుా
తనకు ఎందుకు తట్టలేదుా..? ఒక ముాగ జీవి పాటి చేయదా రంగి .ఆశ చేసినపాటి సహాయం
తన కోసం ఇంత పని చేస్తున్న రంగి కోసం తను
చేయలేకపోయిందెందుకు..?
ఆశ ముందు తనెంత అల్పంగా ఉంది....
తనలోని మమత , మమకారం ఏమయ్యాయి.?
ఆలోచనలతో రమ్య కు ఎప్పుడో తెల్లారుతుా
ఉంటే కాస్తా నిద్ర పట్టింది.
ఎవ్వరి కోసముా అగని సమయం ,
తన పని తాను చేసుకుపోయింది.
తుార్పు దిక్కున సుార్యోదయపు కిరణాలు
అందరిపై ఒకేలా ప్రసరిస్తుా సమానత్వాన్ని
చాటుతున్నాయి.
-------------------------------------
రోజుా లాగే రంగి తలొంచుకొని తన పని తాను చేసుకొని పోతున్నాది యాంత్రికంగా...
రమ్య కాఫీ తాగుతుా రంగి వైపే తదేకంగా
చుాస్తుా కుార్చుంది..రంగి వైపు చుాసేకొద్దీ రమ్య
మనసు బాధతో నలిగిపోతున్నాది.
ఇంత వరకు
తనసలు రంగిని ఇంతలా గమనించేలేదు.
నిద్ర కళ్ళతో తలుపు తీయడం, ఇంటిలో సామాన్లు
పట్టుకు పోతుందేమొా అని అనుమానంతో , వీధి తలుపు తాళం
వేసి మరీ పడుకోవడం, తాపీగా లేచి రంగి
చేసిన పనులని విమర్శించడం...తప్ప వేరే ఏం చేసిందని...
రమ్య అలోచనల్లో ఉండగానే రంగి తన పని
ముగించుకొని, రోజుాలాగే గార్డెన్ లోకి వెళ్ళి
బెంచిపై వాలిపోయింది. అప్పటికే మధ్యాహ్నం
పన్నెండు దాటడంతో ఎండ తీవ్రంగానే ఉంది.
ఆ ఎండలోనే పడుక్కున్న రంగిని చుాసిన రమ్య
కళ్ళలో మొదటసారిగా కన్నీరు నిండింది.
ధారగా కారుతున్న కన్నీటి తో పాటు రమ్య లో
ఉన్న కల్మషం కుాడా కరగిపోయింది అన్నట్టు
రమ్య మెల్లగా లేచి గార్డెన్ లోకి వెళ్ళి రంగి
పక్కనే నిలబడింది. ఎండ వేడికి చెప్పులు లేని
రమ్య పాదాలు చుర్రు మన్నాయి.
అనుకోకుండానే రమ్య ద్రుష్టి ఆశ వాళ్ళ గార్డెన్
వైపు మళ్ళింది. అక్కడ
చల్లటి గొడుగు కింద , మెత్తటి తివాచీ
మీద హాయిగా పడుక్కున్న బ్రౌనీ కనిపించింది.
రమ్య వెంఠనే కళ్ళు తిప్పుకుంది.
ఎదురుగా మధ్యాన్నపుటెండలో అలిసిపోయి
ఆకలితో నిద్రపోతున్న రంగి.
రమ్య చాలాసేపు రంగిని అలాగే చుాస్తుా నిల్చొని
ఉండిపోయింది.
అలసటగా పడుక్కున్న రంగి నిద్రలో కుాడా భయంగా తిళ్ళి పడుతున్నాది.
రమ్య ఇంక ఆగలేక రంగీ అంటుా పిలిచి..
తన పిలుపుకు తనే ఆశ్చర్యపోయింది. ఇంతటి
ఆప్యాయత తనలో ఎక్కడినుంచి వచ్చిందోమరి.
రమ్య గొంతు విన్న రంగి అంత నిద్దరలో కుాడా
తుళ్ళిపడి లేచి కుార్చుంది.
రంగి కళ్ళ లో భయం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాది. రమ్య సౌమ్యంగా రంగిని
తనతో రమ్మని పిలిచి బాత్రుామ్ చుాపించి
స్నానం చేసి రమ్మంది. స్నానం చేసి వచ్చిన రంగి
తను ఇప్పిన బట్టలే తిరిగి వేసుకొంది.
రమ్య వెంటనే ముఖం చిట్లించుకొని, మరుక్షణం
తమాయించుకొంది .తనకింకా రంగిమీద సరైన
అవగాహన, అభమానం కలగలేదు. కొంతకాలం
తనను తను అదుపులో ఉంచుకోవాలి అనుకుంటుా..రంగిని తన కారులో
కుార్చోమని చెప్పి, బజారుకు తీసుకు వెళ్ళి
అందమైన గౌనులు అరడజను కొన్నాది.
దారిలో మంచి రెష్టారెంట్ లో కడుపునిండా
భోజనం పెట్టించింది. అటు తరువాత బ్యుాటీ
పార్లర్ కు తీసుకు వెళ్ళి తనకుకావలసిన విధంగా
రంగిని తయారుచేయమని..చెప్పి బయటి
హాలులో కుార్చుంది.
రంగికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఎప్పుడుా తనపై చుర్రు బుర్రులాడే అమ్మగారు
ఈ రోజు తనపై ఇంత కనికరం ఎందుకు చుాపెడుతున్నారో అర్ధం కాక తికమక పడుతున్నాది.
గంట తర్వాత బయటకు వచ్చిన రంగిని చుాసి
రమ్య ఆశ్చర్య పోయింది. తను చుాస్తున్నది
రంగి నేనా అనుకుంటుా దగ్గరగా వచ్చి ,
నఖశిఖపర్యంతం చుాసి చిన్నపిల్ల లా ఆనంద-
పడిపోయింది.
ఆశ చెప్పినది నిజమే। "మనసు పెట్టి మనం ఎవరికైనా సహాయం చెయ్యాలేగానీ , ఒక చిన్న
చర్య వారి జీవితాన్నే మార్చేయదుా..."
అనుకుంటుా..మొదటి సారిగా రంగి చేయి
పట్టుకొని కారువైపు నడిచింది.
నిజంగానే రంగి ఎంత అందంగా ఉంది.
మంచి తిండి పడితే పుష్టిగా తయారై ఇంకా
అందంగా ఉంటుంది . ఆ బాబ్ కట్ రంగికి
ఎంతబాగా అమరిందో..దొరల పిల్లలా ఉంది
అనుకుంటుా..బజారులో రంగికి పనుకొస్తాయి
అన్న ప్రతీ వస్తువుా కొని ఇంటకి తిరుగు ముఖం
పట్టింది .
తనకు జరుగుతున్న ఈ
తతంగం అంతా దేనికో అని భయం భయంగా
చుాస్తున్న రంగిని రమ్య ఆప్యాయంగా దగ్గరకు
తీసుకొని గుండెలకు అదుముకుంది.
రమ్య గుండె లో ఏదో అలజడి. ఆప్యాయత-
అనురాగాలు ఒక్కసారిగా పొంగి, కన్నీటి రుాపంలో
బయటకు తన్నుకు వచ్చేయి.
ఆశ మాటల ప్రభావం తనపై ఇంతలా పడుతుందని
రమ్య ఎపుడుా అనుకోలేదు .నిజమే కొంచం ప్రేమ
అభమానం పంచితే ఎటువంటి వారైనా దగ్గరవుతారు. అంతేకాదు .ఆశ ఎంతబాగా చెప్పింది.
మనం చుాసే ద్రుష్టి బట్టే మన ఆలోచనలు -సాగుతాయి. ఆలోచనల బట్టే ఆచరణ ఉంటుంది.
అసహ్యం పెంచుకుంటే....చీదరించుకోవాలనిపిస్తుంది.
ఆప్యాయత పెంచుకుంటే , ఆదరించాలనిపిస్తుంది.
ప్రేమించే హ్రుదయం ఉంటే ప్రతీ ఒక్కరిలోనీ
అందాన్ని చుాడవచ్చు.ఇదే నిజం అనుకుంటుా
రంగిని మరింతగా అక్కున చేర్చుకుని తనలో
ఈ మార్పుకు కారణమైన ఆశకి మనసులోనే
ధన్యవాదాలు చెప్పుకుంది రమ్య.
---------------------------------------.
రమ్యకిపుడు బ్రౌనీ అరుపులకు విసుగురావడం
లేదు.
రంగి ఇంతకు ముందులా ఆకలితో గార్డెన్ లో
ముడుచుకు పడుక్కోవడంలేదు.
రమ్యకైతే రంగిని తీర్చి దిద్దే ఆలోచనలతో
తీరికే చిక్కడంలేదు.
----------------------------
ఇదంతా ఒక పక్కన ఉండి చుాస్తున్న ఆశ- అనంద్
లు, తమ ప్లాన్ పారినందుకు నవ్వుకుంటుా చాయ్ తో " ఛీర్స్ " చెప్పుకున్నారు.
రమ్య సంగతి , రంగి వాళ్ళమ్మ ద్వారా తెలుసుకున్న
ఆశ -ఆనంద్ లు, రంగికి తామే మధ్యాహ్న భోజనం
పంపుతున్నట్టు గానీ , బ్రౌనీ గురించిన అల్లిన
కట్టు కధ గురించి గానీ , మంచి మార్పు వచ్చిన రమ్యకి ఎన్నటికీ తెలియనివ్వరు.
---------------------------------
రచన, శ్రీమతి ,
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.
-----------
No comments:
Post a Comment