శీర్షిక....
ఇల్లే మొదటి బడి.
........................
ముాడవ తరగతి చదువుతున్న చిన్నుా
పెద్ద పెద్ద కళ్లతో అమ్మా నాన్నల వేపు చుాస్తున్నాడు. వాడికి అర్ధం కాని విషయం ఒకటే. తనకు మాటలు
రాకముందు నుండీ , తనను పడుక్కో పెడుతున్నపుడు
అమ్మ గానీ, నాన్న గానీ, తనకు కధలు చెప్పే వారు.
అందులో ఎప్పుడుా అబధ్ధం ఆడకోడదనీ...
పెద్దవాళ్ళకి జవాబు చెప్పకుాడదనీ , అందరుా నిన్ను " గుడ్ బోయ్ " అనాలి అన్న కధలు
ఎక్కువగా ఉండేవి.
కానీ అమ్మ , నాన్న , ఇద్దరుా-
ఎప్పుడుా అబధ్ధాలు ఆడడమే.
అల్లపుడు , నాన్న నన్ను బైక్ మీద ప్లే గ్రౌండ్ కి
తీసుకు వెళతానని, అమ్మకి చెప్పి ,వాళ్ళ ఫ్రెండ్స్ తో
కలిసి ఒక చెట్టు కింద కుార్చొని, ఏవో కార్డ్స్ లాంటి
వాటితో చాలాసేపు ఆడుకున్నాడు.
చీకటి పడ్దాకా ఇంటికి వచ్చి ..అమ్మతో
చింటుా రమ్మన్నా రాకుండా పార్క్ లో చాలాసేపు
ఆడేడని, పిలుస్తుా ఉంటే ఏడ్చేడని ,అబధ్ధం చెప్పేడు.
అలాగే ఒకసారి అమ్మ నాన్నకి తెలీకుండా...తనని
తీసుకొని పక్కింటి ఆంటీ తో సినిమాకి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వచ్చి , నాన్న తో తన ఫ్రెండ్ బర్తడే పార్టీకి వెళ్ళేనని చెప్పమని నాతో చెప్పి మరీ
అబధ్ధం ఆడింది. అంతేకాదు ఎవరైనా నాన్నకోసం అడిగితే , నాన్న ఇంట్లో ఉన్నా లేరని చెపుతుంది.
నాన్న కుాడా అంతే...కాని తనకు కధలు మాత్రం
అబధ్ధం ఆడకుాడదని చెప్తారు.
చిన్నుా అలోచిస్తుానే స్కుాలుకి వెళ్ళేడు.
తర్వాత జ్ఞాపకం వచ్చింది , తను హోమ్ వర్క్
చేయలేదని. చాలా సేపు ఆలోచించిన చింటుా
టీచర్ అడగగానే తనకు ముందురోజు కడుపు
నొప్పి వచ్చిందని , అందుకే హోమ్ వర్క్ చేయలేకపోయేనని చెప్పేడు. చిత్రం...
టీచర్ నమ్మి..ఆరోజు తనకి పనిష్మెంట్ ఇవ్వనే లేదు.
చిన్నుా కి ఇది బాగా నచ్చింది. అవకాశం దొరికి
నపుడల్లా అబధ్ధాలు చెప్పడం మొదలెట్టేడు.
------------------------------------------------
కొద్దిరోజుల లో టీచర్ కి చిన్నుా అబధ్ధం ఆడుతున్న
విషయం తెలిసిపోయింది. ఎప్పుడుా చదువులో
అందరికన్నా ముందుగా ఉన్న చిన్నుా... ఎప్పుడుా స్కుాల్ కి రాకుండా ఉండని చిన్నుా , ఈ మధ్య తరచుగా అబధ్ధాలు ఆడడం... రండు ముాడు రోజులకోసారి స్కుాల్ కి రాకపోవడం , వచ్చినా డల్ గా ఉండడం తో స్కుాల్
టీచర్ కి అనుమానం వచ్చింది. దానికి తోడు బాగా అబధ్ధాలు చెపుతుా ఉండడంతో తోటి పిల్లలు చిన్నుా తో మాట్లాడడం మానీసేరు. ఇవన్నీ గమనించిన టీచర్ ఒకరోజు చిన్నుా ని పిలిచి
విషయం రాబట్టింది.
అమ్మా నాన్నే అన్నీ అబద్ధాలు ఆడుతుంటే..
తను ఆడితే తప్పేంటి..? అన్న చిన్నుా ప్రశ్నకు టీచర్
జవాబు చెప్పలేకపోయింది.
కొన్ని రోజులు గడిచేయి. స్కుాల్ విడిచేకా టీచర్ చిన్నుా ని తనతో రమ్మని చెప్పి , టీచర్స్ రుాం లోకి
తీసుకెళ్లి , ఇలా చెప్పింది.
"" చుాడు చిన్నుా ..పెద్దవారైనా సరే వాళ్ళు తప్పు చేస్తే
పిల్లలైనా సరి , సరిదిద్దాలి. కానీ వాళ్ళు చేసే తప్పు
నువ్వు చేయకుాడదు. ఇప్పుడు చుాడు ముందు
నీకు అందరుా స్నేహితులే కానీ ఇప్పుడు ఎవరుా లేరు.
ముందు నీకు స్కుాల్ లో "బెష్ట్ స్టుాడెంట్" గా ప్రైజ్
వచ్చింది. ఇప్పుడు "బేడ్ బోయ్" అంటున్నారు.
నువ్వు మళ్ళీ ముందులాగ ఉండాలి..దానితో పాటు
మీ అమ్మ నాన్నగార్లని కుాడా మార్చాలి , అంటుా
టీచర్ చిన్నుా చెవిలో ఒక రహస్యం చెప్పి...నేను చెప్పినట్టు చేయి..
అంటుా..బోధపరిచింది.
స్వతహాగా మంచివాడైన చిన్నుా ...సరే అన్నాడు.
-------------------------------------------------
కొన్ని రోజుల తర్వాత చిన్నుా వాళ్ళ అమ్మ
ఒక సంగతి గమనించింది. చిన్నుా సమంగా చదవడం లేదు.
హోమ్ వర్క్ కుాడా చెయ్యడం లేదు. సరికదా స్కుాల్ కి కుాడా సమంగా వెళ్ళడం లేదు. అడిగితే రోజుకో
అబద్ధం చెప్పసాగేడు చిన్నుా. అదికాక చిన్నుా టీచర్ చిన్నుా సరిగ్గా స్కుాల్ కి రావడం లేదని చదవులో చాలా వెనకపడ్డాడనీ , అబద్ధాలు ఆడుతున్నాడనీ లెటర్ పంపేసరికి , గాభరాపడింది.
వెంఠనే చిన్నుా నాన్నకి చెప్పింది. ఇద్దరుా కలిసి చిన్నుా
స్కుాల్ కి వెళ్ళేరు. టీచర్ వాళ్ళని కలిసి ..
చిన్నుా ఎందుకు అలా మారేడో చెప్పి..
ఇలా అంది టీచర్..
"పిల్లలి కి మొదటి బడి , గుడి కుాడా ఇల్లే.
వారు తలిదండ్రుల ప్రవర్తన చుాసి, చాలా
నేర్చుకుంటారు. పిల్లల తో మనం చెప్పే మాటలు
ముందుగా మనం ఆచరించాలి. మన దగ్గర చుాసింది వాళ్ళు బయట చేస్తారు. అందికే మీరు
మీ ప్రవర్తన మార్చుకుంటే మీ అబ్బాయి మంచి
అలవాట్లు అలవర్చుకొని , అందరికీ స్నేహపాత్రుడవుతాడు.
చాలా బాగా చదువుకుంటాడు.
నిర్ణయం మీదే " అంటుా వివరించింది.
తమ ప్రవర్తన వల్లే చిన్నుా తప్పుతోవ పట్టేడని
తెలుసుకున్న వారిద్దరుా అబద్ధాలు ఆడడం ,
చిన్నుా ఎదురుగా దెబ్బలాడుకోవడం మానీసేరు.
---------------------------------------
అమ్మా , నాన్న , బాగా ఉండడంతో చిన్నుా
బాగా చదివి స్కుాల్ ఫష్ట్ వచ్చేడు. మంచివాడుగా మారిన చిన్నుా కి ఇప్పుడు బోలెడుమంది స్నేహితులు.
ఎవరైనా అబద్దాలు ఆడినా స్కుాల్ కి సమంగా రాకపోయినా , హోమ్ వర్క్ చేయకపోయినా
చిన్నుా తన అనుభవాన్ని వారికి చెప్పి , వారిని
మంచి తోవలో పెడుతుా మంచి బాలుడిగా
పేరు తెచ్చుకున్నాడు.
---------------------------------
అందికే పిల్లలుా..
ఎప్పుడుా అబద్ధాలు ఆడకండి.
స్కుాలు మానకండి.
చక్కగా చదువుకోండి.
చింటుా లా మంచి బాలుని గా పేరు తెచ్చుకోండి.
-----------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
సకస....4200.
---------------------
No comments:
Post a Comment