(సహస్ర పుస్తక యజ్ఞం కొరకు).
శీర్షిక .
ఓటు వేయండి.
---------------------
ఓటు...వేయడం అంటే
మన సమస్యలని -
పరిష్కరించడం కోసం ,
మనకోసం , మనం ఎన్నుకొనే
ప్రజారక్షకుని గుర్తుగా,
మనకు ఈయబడే
ఒక ముఖ్యమైన చిహ్నం ॥
మన పభుత్వం
పదునెనిమిది సంవత్సరాలు
వచ్చిన ప్రతి ఒక్కరికీ ,
ఓటు వేసి తమ నాయకుని
ఎన్నుకొనే అవకాశం,
హక్కు మనకు కల్పించింది.॥
అయితే కొంతమంది
నాయకులుగా తమని
ఎన్నుకోమని , ధనాన్ని
ఎరగా చుాపించి,
సభ్యత్వాన్ని సంపాదించుకొని ,
ఆపై , గెలుపొందేకా
ప్రజా సంపత్తిని తమ
స్వార్ధానికై, అంచెలంచెలుగా
ఉపయొాగించుకుంటున్నారు.
ఎలక్షన్లకి ముందు ,వారు
ఎన్నో బాసలు చేసి,
ప్రజల లో నమ్మకాన్ని
కల్పించి., ఆపై తమ -
స్వార్ధపుారితమైన-
ఆలోచనలకు పదును- పెట్టి,
ప్రజా ధనాన్ని దుర్వినియొాగం
చేస్తున్నారు.దానివల్ల జరిగే
కష్ట నష్టాలను , ప్రజలు
భరించవలసి వస్తోంది.॥
చదువులేనందువల్ల
కొంతమంది , బీదరికానికి
తలవంచి కొంతమంది ,
కల్లబొల్లి మాటలునమ్మి
కొంతమంది , ఓటు
విలువను గుర్తించలేని
కారణంగా...చాలా
రకాలుగా మొసపోవడం
జరుగుతుంది.
మధ్యలో నాయకుని
తొలగించలేకా -
ఐదు సంవత్సరాలు
వారి దురాగతాల్ని
భరించలేకా , ప్రజలు
తల్లడిల్లిపోతున్నారు.॥
ఒకసారి ఎన్నుకోబడిన
నాయకుడు ఐదు -
సంవత్సరాలు దేశాన్ని -
తన శాశనాలతో,
పరిపాలించే హక్కును
కలిగిఉంటాడు.
ఈ విషయాన్ని తెలుసుకొని
ప్రతీ పౌరుడుా, తమ
ఓటు హక్కును,
సద్వనియొాగపరచుకొని,
తమకు కావలసిన నాయకుని'
ఎన్నుకొనడంవల్ల-
ఎంతో లబ్దిని
పొందుతారనేది గ్రహించి..,
చదువుకున్న వారిని ,
మానవత్వం కలిగినవారిని,
కార్యసమర్ధత ఉన్న
అనుభవజ్ఞుని -
ఎన్నుకొని, తమ
ఓటు హక్కును ,
సద్వినియొాగం చేసుకోండి. ॥
లేదా , చేతులారా,
మనకు మనమే ,
మన దేశ స్థితిగతులను
అస్తవ్యస్తం చేయడానికి
అవకాశం ఇచ్చినవారం-
అవడమేకాక ,
శాంతియుతమైన జీవితాన్ని
కోల్పోయిన వారమవుతాం. ॥
నోటుకి ఓటును
అమ్ముకోకండి.
ఓటు విలువను
గుర్తించండి.
ఓటు హక్కును
సద్వినియొాగపరుచుకోండి.
సరైన నాయకుని కి
మీ ఓటువేసి గెలిపించండి.
మీ భవిష్యత్తుని
ఉజ్జలంగా తీర్చి దిద్దుకోండి.
-------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
సకస...4200.
-----------------------
Saturday, April 6, 2019
ఓటు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment