శీర్షిక...
మహిళా శక్తి.
---------------------------
తర తరాలుగా మహిళలు
తమ శక్తికి మించి
శ్రమిస్తునే ఉన్నారు.॥
ఎన్నో రంగాల లో పోరాడి ,
గెలుపొందిన మహిళలు
తాము అబలలం కాదు
సబలల మని నిరుాపించేరు.
పలు రంగాల లో
తొలి మహిళలు గా
విజయ పతాకాన్ని ఎగరేసి
కీర్తి కిరీటాన్ని ధరించి
పేరొందిన మహిళలు
ఎందరో ఉన్నారు.॥
ఇస్రోలో శిక్షణ పొందిన
శాస్త్రవేత్తలుగా...
దక్షిణ ధ్రువాన్ని చేరిన
తొలి మహిళా శక్తిగా---
నోబెల్ ప్రైజ్ గ్రహితలుగా,
జ్ఞాన పీఠం అవార్ద్ గ్రహితలుగా,
గవర్నర్లుగా , గానకోకిలలుగా
కార్మిక సంఘ అద్యక్షరాండ్రుగా
నాట్య, కళాకారిణులుగా
విద్యా , క్రీడా రంగాల
విజయపథంలో -విజేతలుగా,
ఇలా ఎన్నో రంగాలలో
ముందడుగు వేసి...ఘన
విజయం సాధిఁచిన మహిళలు ,
మరెందరికో స్ఫుార్తి నిచ్చిన
మణి మాణిక్యాలు॥
ఇంటా బయటా కుాడా
తమని తాము
నిరుాపించుకొన్న మహిళ
శక్తి స్వరుాపిణియై
రాజిల్లుతోంది॥
అమ్మగా మరో బ్రహ్మై
ప్రతి సృష్టి చేస్తుంది.
ఆలిగా అవసరాలని
తీర్చి ఇంటిని
నందనవనంగా తీర్చి
దిద్దుతుంది.॥
అంబగా అరాచకాలని
అణగదిక్కుతుంది.
శ్రీలక్ష్మిగా సిరులు
పంచుతుంది.
విద్యా లక్ష్మిగా.పిల్లలను
విద్యావంతులుగా తీర్చి దిద్ది
వారి ఉన్నతి కి తోడ్పడుతుంది.
గ్రుహ లక్షిగా
ఇంటంటా సుఖ, సంతోషాల
కళలు నింపుతుంది .॥
ఆలనలో, పాలనలో
అన్నీ తానై నిలచిన
మహిళా శక్తిని గుర్తిస్తుా..
వారికి సహకరిస్తుా...
మహిళ లపై జరిగే
అరాచకాలను అంతం
చేయండి. మహిళా శక్తిని
గుర్తించండి.
గుర్తించనివారికి
గుణపాఠం నేర్పండి.॥
-----------------------------
రచన..శ్రీమతి ,
పుల్లాభట్ల జగదిీశ్వరీముార్తి.
కల్యాణ్.
మార్చి ఎనిమిదవ తేదీని
అంతర్జాతిీయ -
మహిళా దినోత్సవంగా
ప్రకటించి , మహిళల
కీర్తి కిరీట పతాకాన్ని
ఎగరవేసి గౌరవించిన (గౌరవించడం మహిళలకు ,గర్వకారణం ).
No comments:
Post a Comment