అంజమ్మ ....
పరుగెడుతున్నట్టు నడుస్తున్నాది. నెత్తి
మీద మట్టి ప్రమిదలతో నిండిన గంప , చంకలో
రెండు సంవత్సరాలు నిండిన బక్క చిక్కిన పాప
ని ఎత్తుకొని నడవడం కష్టంగా ఉన్నా నడుస్తున్నాది
అంజమ్మ.
పైన సుార్యుని తాపం, అంజమ్మ మనసులో
కోపం...
చెప్పులు లేని పాదాలు, ఎండ వేడికి తాళ లేక ,నడవనని మొరాయిస్తున్నాయి.
ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు , తన రాక కోసం ఎదురు
చుాస్తుా ఉంటారు.
ఈ రోజు దీపావళి పండగ. రోజుా కడుపు
నిండడానికన్నట్టు , ఏదో వండుకు తింటున్నా..,
ఈ రోజైనా పిల్లలకు, కొంచం మందుగుండు సామసను తో పాటు, తినడానికి ఏదైనా తీపి
తినుబండారాలు కొనిపట్టుకెళ్ళాలి.
మట్టి-ప్రమిదలు బాగా అమ్ముడుపోతే ,రెండు కొత్త చెడ్డీలు కుాడా కొనాలి. అవన్నీ చుాసిన తన పిల్లల కళ్ళలో
కనిపించిన ఆనందం చుాసి తన మనసారా
సంతోషించాలి ..అనుకుంటుా నడుస్తున్నాది.
-------------------------
పొద్దున్నే లేచి తొమ్మిది లోపలే ఆదరా-బాదరా
ఇంత గంజి కాచి పిల్లలకి పోసి , పసిదాన్ని
చంకలో వేసుకుని , మట్టి ప్రమిదల గంప
తలకెత్తుకొని బయలుదేరింది అంజమ్మ . ఎంతో ఆశతో బయలుదేరిన అంజమ్మ తన ఇంటికి కొంచం
దుారంలోనే జరుగుతున్న సంతలో ఒక ముాల
నెత్తినున్న గంప దింపి , ఒక గోనెపై చంటిదానిని
కుార్చోపెట్టి ఆ పక్కనే తనుా కుార్చుంది.
మరు క్షణం మే తన శక్తికి మించిన స్వరంతో
" రండమ్మా రండి . మట్టి ప్రమిదలు కొనండి.
ఈ దీపాల వెలుగులో మీ నట్టింట లచ్చిందేవి
నడయాడాల ..మీ ఇల్లు- వాకిలి సంతోసాల తో కళ కళ లాడాల" అంటుా
గొంతు చించుకొని మరీ అరుస్తున్నాది. కానీ
మధ్యాహ్నం ముాడవుతున్నా అంజమ్మకు బేరం
తగల లేదు.దాంతో అంజమ్మ దిగాలుపడిపోయింది.
-----------------------
పాలకోసం ఏడుస్తున్న చంటదాని మీద విసుక్కుంటుా , అసహనంతో నిండిన కోపంతో రెండు దెబ్బలు తగిలించింది. పైన ఎండ కర కర
లాడుతున్నాది. , గట్టిగా అరుస్తుా ఉండడం వల్ల
అంజమ్మకు , దాహంతో గొంతు తడారిపోయి, శోష వచ్చినట్టుగా ఉంది .
చాలా మంది వస్తున్నారు , ఎదురుగా ఉన్న మాల్ లోకి దుారి , రంగు- రంగుల కరంటు దీపాల వరుసలని , ప్లాష్టక్ పుాల తోరణాలనీ , రక రకాల
కొవ్వొత్తుల డబ్బాలనీ కొనుక్కొని , నిండిన సంచులతో , తిరిగి పోతున్నారు గానీ ,అంజమ్మ
దగ్గర మట్టి ప్రమిదలు మాత్రం, కొనడానికి ఎవరుా
రావడంలేదు.
అంజమ్మ గుర్రుగా, దుారంగా ఉన్న మాల్ ని చుాస్తుా
మెటికలు విరిచి , శాపనార్ధాలు పెట్టింది.
అంజమ్మ దగ్గరకు ఒకరిద్దరు వచ్చీ...పదిరుాపాయలకు పదిగా ఇస్తున్న ప్రమిదలను , పదిహేను చొప్పున ఇవ్వమని
బేరమాడి మరీ కొన్నారు. ఆ తరువాత అసలు
బేరమే రాలేదు. సాయంత్రం నాలుగు కావస్తున్నాది.
అంజమ్మకు కుార్చొని కుార్చొని విసుగు వస్తున్నాది.
బజారులో జనం కుాడా పల్చబడడంతో అంజమ్మ
నిరాశగా ఇంటికి బయలుదేరుతుా , ఆలోచనల్లోకి
జారిపోయింది.
--------------------------
ఆ రోజుల్లో ఏ పండగొచ్చినా ఎంత సందడిగా
ఉండేదనీ...అందులోకీ దీపావళి పండగొస్తే మరీనుా. మతాబులుా , కాకర పుావొత్తులుా,
పెద్ద చప్పుడుతో పేలే మందుగుండు సామానులుా
వారం ముందే కొని ఎండలో పెట్టేవారు.
కొత్తబట్టలు కొనుక్కోవడానికి అమ్మా నాన్నలతో బజారుకు వెళ్ళి, తానుల్లో కొన్న గుడ్డలను కుట్టించుకోడానికి , తమ సైజులు ఇవ్వడం కోసం
దర్జీల చుట్టుా తిరగడం భలే సరదాగా ఉండేది.
దీపావళి వస్తుందన్న ముాడు రోజుల ముందు నుండే ఇల్లంతా బుాజులు దులిపి, కడిగి . ఇల్లంతా రంగురంగుల ముగ్గులేసేవారు..వంట
పాత్రలన్నీ తళ తళ లాడుతున్నట్టు తోమి బోర్లించేవారు. దీపావళి కోసం చేసే కరకరల తినుబండారాల నేతి వాసనలతో, ప్రతీ ఇల్లుా
ఘమఘమలాడుతుా ఉండేది.
ఇంక పిల్ల లైతే ఎండలో పెట్టిన మందుగుండు
సామానుతో పాటు, ఎండ మండిపోతున్నా ,
అక్కడే కుార్చొని , ఆనంద పడిపోతుా ఉండేవారు.
నాన్నతో పాటు మతాబులు చుట్టడం, సిసింద్రీలు
దట్టించడం , చిచ్చుబుడ్లు నింపడం లాంటవి చేయడం .....ఎంత సరదాగా ఉండేదనీ...
దీపావళి రోజైతే అమ్మ పొద్దున్నే ఐదుగంటలకే
లేపి , తలకి నుానె రాసి , ఒంటికి నలుగు పెట్టి , రాత్రి నానబెట్టి తీసిన కుంకుడు గింజల
రసం పోస్తుా , తల రుద్ది..సాంబ్రాణీ పొగ వేసి
జుట్టు ఆరబెడుతుా ఉంటే ఎంత హాయిగా
ఉండేదనీ.. అమ్మ వండిన పిండి వంటలను
దేవునికి నివేదించి, కొంత ఇరుగు -పొరుగులకు పంచి ఇచ్చి..ఇంటి అందరం
కలిసి త్రుప్తిగా భోజనాలు చేసే రోజులు ఇప్పుడు
ఎక్కడున్నాయని...
సాయంత్రం అవగానే అందరుా తిరిగి స్నానాలు చేసి..కొత్త బట్టలు వేసుకొని ..ఆడుకుంటుా ఉంటే
అమ్మ గుమ్మాలకి పసుపు- కుంకుమ లద్ది..మామిడి
తోరణాలు కట్టి, పుాల మాలలతో ముఖ ద్వారాన్ని
ఎంత బాగా అలంకరించేదో.
ఆరు బయట ఆవు పేడ కలిపిన చిక్కటి నీటితో
కల్లాపి జల్లి...పచ్చటి వాకిలి పై తెల్లటి బియ్యం
పిండితో అందమైన రంగవల్లులను తీర్చి దిద్దే
తీరు , ఎంతబాగుండేదనీ...
ఆడవారంతా పట్టు చీరలు ధరించి పసుపు -కుంకాలు పంచుకొని , ఒకరినొకరు పలకరించుకోవడంలో
ఉండే ఆప్యాయత అనురాగాలు అందరి మధ్య ఎంత దగ్గరి తనాన్ని పంచి ఇచ్చేదో..
ఆ తర్వాత అమ్మ తెల్లటి కొత్త నుాలు బట్టను పీలికలుగా చింపి , వాటిని పొడుగాటి వత్తులుగా నలిపి , బ్బునుానెలో తడిపి ఉంచేది..తరువాత అకులతో నిండిన చెఱకు గడకు ఈ
నుానె తో నిండిన వత్తులను కట్టి , తులసమ్మ
దగ్గర తమచేత వెలిగించి దుబ్బు కొట్టించేది.
అటు తరువాత మట్టి ప్రమిదల లో నుానె వేసి
వెలిగించిన దీపాలను వరుసగా ఇంటి ప్రాంగణమంతా అమర్చేది.ఆ
వెలుగులో ముందుగా తులసమ్మ ను పుాజించి
మొదటి సారి మతాబానో, కాకర పుావొత్తునో,
తులసమ్మ ముందు తమను వెలిగించమనేది.
ఆ తర్వాత పిల్లలంతా కలిసి , ఒకదగ్గర చేరి ,
మండుగుండు సామాను
కాలుస్తుా..ఒకరి దగ్గర లేనివి మరొకరితో
పంచుకుంటుా ఎంత ఆనందంగా పండగ
జరుపుకొనేవారో...
ఆ రోజుల్లో పండగ అంటే,మన కట్టు బొట్టు విధానాల , సాంప్రదాయపు ఆచార విచారాల.. నియమ నిబంధల అనుసరణల మధ్య ,అందరుా కలిసి చేసుకొనే
ఒక ఆనంద దాయకమైన అనుభుాతులతో
నిండిన ప్రత్యేకమైన రోజు. సమత మమతల
తో అందరుా ఒక్కటై ఆనందించే రోజు. ఆ రోజుల లో ఇటువంటి ఆచరణల ద్వారా..అందరుా
ఎవరి పరిధుల్లో వారుండీ ,వారి వారి
పనులను సక్రమంగా చేస్తుా ఎంత ఆరోగ్యంగా
ఉండేవారనీ...
ఆ రోజులు ఇప్పుడెక్కడున్నాయనీ..
కాలం మారిందీ కాలం మారిందీ అంటుానే ,
మనుషులందరుా మారిపోయేరు. పగలు
తొమ్మిది దాటినా లేవని వారున్నారు..లేచినా ,
బెడ్ కాఫీలంటుా, పాచి ముఖంతోనే, కాఫీ, టీ లు
తాగడం మొదలెట్టిన వారున్నారు.
ఆడవారు అపురుాపంగా దాచుకోవలసిన తమ అందాలను..ఫేషన్ పేరుతో వచ్చిన , పొట్టి ఇరుకు బట్టల పీలికలతో బహిరంగంగా ప్రదర్సిస్తున్నారు.
చీర కట్టు , బొట్టుల ఆనవాళ్ళే కరువయ్యాయి.
దానితో వావి- వరుసల విలువలు పడిపోయేయి.
ఇంట్లో ఆడవారు వండే వంటకన్నా ,బయటి హోటల్ లో పిజ్జా, బర్గర్ ల కుాడు తినడం ఫేషన్ అయింది. దాంతో ఇళ్ళ లో సాంప్రదాయ వంటల
రుచులే కరువయ్యేయి.
వేద మంత్రాల పఠనాల మధ్య , దీప, ధుాపాల తో
నిండిన ఇంటిలో, పెద్దల ఆశీర్వచనాల తో ఆనందంగా జరుపుకోవలసిన పుట్టినరోజు పండగలు , ఈ నాడు కెమికల్స్ తో నిండిన రంగు రంగుల కేక్ ల మీద వెలిగించిన కేండిల్స్
ఊది ఆర్పడం తో మొదలై ,ఆతరువాత కేక్ కటింగ్ తో..
కోక్ పార్టీలు , పాప్ డేన్స్ లతో అర్ధరాత్రి వరకు
అర్థ నగ్న నాట్యాల తో కొనసాగుతున్నాది.
ఇంక పండగల మాట సరే సరి.
ఏ పండగొచ్చినా అందరుా క్లబ్బుల్లో నుా పబ్బుల్లోనుా చేరి , బీరు , రమ్ము , దమ్ము ల పార్టిీ ల లోతేలుతుా , తుాలుతుా , అసభ్యకరమైన ఇరుకు
బట్టలతో , అర్ధ నగ్న ప్రదర్శనలలిస్తుా...
వెర్రిమొర్రి పాటలకు , పిచ్చి పట్టినట్టు గెంతడాల
తో ముగుస్తున్నాయి.. సంస్కారం నేర్పవలసిన
తలిదండ్రులే ఇటువంటి వాటికి తల మొగ్గు చుాపుతుా ఉంటే , ఇంక పిల్లలకు ఏంతెలుస్తుంది, మన సాంప్రదాయాలగురించి, పద్ధతుల గురించి...
మిగిలింది అంతా క్రుత్రిమమే....తలుచుకుంటే
అంజమ్మకు రోత పుడుతున్నాది.
----------------------------------
ఆలోచనలలో పడిన అంజమ్మకు సమయమే తెలీలేదు. ఎవరో తనలాంటి ఒకరిద్దరు వచ్చి,
తన దగ్గర ప్రమిదలు కొన్నారు. ఆ కొంచం డబ్బుతో
తను పిల్లలకి ఏం కొనగలదు..? సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నాది. అంజమ్మ
నిరాశగా లేచింది. దీపాలు పెట్టే సమయం దగ్గర
పడింది . ఇంక ఎవరుా తన దగ్గర కొనేట్టు లేదు.
బజారులో జనం కుాడా పల్చబడడంతో అంజమ్మ
ఉస్సురంటుా లేచి, పసి పిల్లని చంకనేసుకుంది.
నిండుగా ఉన్న ప్రమిదల బుట్ట నెత్తిమీద కెక్కించుకొని , ఇంటివైపుకు నడక సాగించింది.
అసహనంతో కుాడిన నీరసం తో పాటు యాభై
రుాకలన్నా సంపాదించలేని తన అసహాయతకు
అంజమ్మ కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. అంజమ్మ
నడకలో జోరు మళ్ళీ పెరగడంతో కొంచం దుారం
నడవగానే, అలసట పెరగడంతో ఒక చెట్టుకింద
కుాలబడింది. పొద్దున్నెపుడో వండిన గంజికుాడు.
పిల్లలు ఆకలితో ఉంటారు. కనీసం అన్నమయినా
ఉడకేయాలి అనుకుంటుా...చంటిదానికి రొమ్ము
అందించి నీరసంగా చెట్టుకు చారపడింది.
సాయంత్రం ఆరుగంటలు కావస్తున్నాది. ఇంటికి చేరిన అంజమ్మ వైపు ఆశగా చుాస్తున్న పిల్లల
వైపు చుాడలేక , తన అసహాయతను పిల్లల పై
కోపం రుాపంలో ప్రదర్శిస్తుా.. మాట్లాడితే కొడతానంటుా నాలుగు దెబ్బలు వేసింది. ఒకవైపుపని చేస్తునే ఆలోచనల్లో పడింది
అఁంజమ్మ.
------------------------------------------
పొలంలో పంటలు పండక , పండిన పంటలకు
తగిన రాబడి రాక , చేసిన అప్పులు తీర్చలేక ,
అంజమ్మ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
గర్భిణి గా ఉన్న అంజమ్మ తన ఇద్దరు పిల్లలతో
కలిసి, బతుకుతెరువు కోసం , పట్టణం వచ్చింది.
కానీ ఏపనీ దొరకక కొన్నాళ్ళు , గర్భవతి అయినందువల్ల.కొన్నాళ్లు...దొరికిన కొన్ని పనులు చేయలేక కొన్నాళ్ళు , ఏదో పని
దొరికిందంటే , ఉండడానికి ఇల్లు లేక , దొరికిన ఇంటికి బాడుగ కట్టలేక నానా అవస్తలుా పడింది .చివరికి విధితో రాజీపడి
వీధి చివరగా జరిగే సంతకి కొంచం దుారంలో
పెద్దపెద్ద నీటి పైపులు పడి ఉండడం చుాసి ,
అందులో విశాలంగా ఉన్న ఒక పైపు గొట్టంలో
తన కాపరం పెట్టింది. అక్కడే తన ముాడవ
పిల్లకు జన్మనిచ్చింది.
రోజులు వారాలు, నెలలు , సంవత్సరాలుగా
గడుస్తున్నా ఆ పైపుల అవసరం ఎవరికీ
రానందువల్ల అంజమ్మ జీవితం అక్కడే హాయిగా
గడుస్తున్నాది. కానీ ప్రతీరోజుా భయమే.
ఏ రోజు ఎవరు వచ్చి ఈ పైపులు పట్టుకెళ్ళిపోతారో
అని.
చివరికి ఏదౌతే అదే అవుతుందన్న నిర్ణయానికి
వచ్చి , అదే తన ఇల్లు ,అన్నంత ధీమాగా తీర్చి
దిద్దింది.
కానీ పిల్లల కోసమే ఏమీ చేయలేకపోతున్నాది.
మనసులో ములుకులా ఈ బాధ గుచ్చుకుంటున్నా
ఏమీ చేయలేని అంజమ్మ... ఈ జన్మలో కనికరించని
లక్షీదేవి మరు జన్మ లో నైనా తనను కనికరించాలి అనుకుంటుా, పైపు ముందు భాగంలో చుట్టుా ,పచ్చని పేడతో కలిపిన కళ్ళాపి జల్లి ,తెల్లని పిండితో అందమైన ముగ్గులేసింది.
పక్కనే ఉన్న జాగాలో అవసరానికి పనికివస్తాయని
వేసిన కొన్ని కుార పాదుల తో పాటు, వేసిన బంతి
చామంతి, జాజి , మల్లి , మందారాలు ,గులాబీల లాంటి పుాల మొక్కలు , పెరిగి రంగు-రంగుల పుాలు విరబుాయసాగాయి. ఇవే గాక పాదులనుంచి దొండకాయలు..చిక్కుడుకాయలు, గుమ్మిఁడికాయలు,. కాకర ,వంటివే కాక -బెండకాయలు, టొమేటోలు ,కొత్తిమీర , మిరప వంటివి కుాడా విరివిగా కాయడంతో అంజమ్మ మనసుకు కొంత ఊరట కలిగింది. అంజమ్మ
అప్పుడప్పుడు ఆ పుాలు, కుారలుా కుాడా
కోసి అమ్ముతుా ఉంటుంది. ఈ రోజు కుాడా
అంజమ్మ ఆ పుాలన్నీ కోసి , కొన్ని అందంగా
మాలలల్లి పైపు కి ముందుభాగం లో కట్టింది.
మరికొన్ని పుాలని అకు తో చేసిన దొప్పల లో
పోసి ఒక పక్కగా పెట్టింది. కుారగాయలు తెంపి
వాటిలో కొంచం తమకోసం ఉంచి మిగిలినవి
వంతులు పోసి గోనెపై సద్దింది.
తరువాత పిల్లలకి నీళ్ళు పోసి , తను కుాడా
తానం చేసింది . ఉన్నవాటిలో మంచి బట్టలు
పిల్లలకు వేసి , అన్నం ,కుార ,వండి పక్కన పెట్టింది.
గంపలో నిండుగా ఉన్న మట్టి ప్రమిదల నుంచి
కొన్నిటిని తీసి, ఇంట్లో ఉన్న కొద్దిపాటి నుానెలో
వత్తులు తడిపి వాటిలో పెట్టింది. ఈ తడిపిన వత్తులు ఎంతసేపు వెలుగుతాయొా...మరి
అనుకుంటుా...బయటకు వచ్చింది.
తరువాత పుాలు, ప్రమిదలను వరుసగా తన
ఇంటి చుట్టుా అలంకరించింది. ముగ్గు మధ్యలో
ఏపుగా పెరిగిన తులసమ్మ నుంచి..దానికెదురుగా
ఉన్న ప్రమిదలో నిండుగా నుానె పోసి వెలిగించి , ఆ తరువాత మిగిలిన దీపాలన్నీ వెలిగించింది. ఆ రోజు ప్రమిదలు అమ్మగా వచ్చిన
ఇరవై రుాకలతో కొన్న నాలుగు అరటి పళ్ళను,
చిన్న బెల్లం ముక్కను, తులసమ్మకు నైవేద్యంగా పెట్టింది. పిల్లలతో ఆసక్తి తో అంతా చుాస్తుా , అమ్మతో పాటు కలిసి ఆ తులసమ్మ తల్లికి భక్తితో నమస్కరించేరు. ..అంజమ్మ అలసటగా
ఆరుబయట గుమ్మంలో పుాల దొన్నెలుా, కుారల వంతుల పక్కన ,పిల్లలతో పాటు చతికిలపడింది.
ఆ చిన్న అలంకరణతో, వెలుగుతున్న చిరు దీపాల వెలుగులో , అంజమ్మ ఇల్లు కళ కళ లాడిపోతున్నాది. పైపులన్నీ సంత జరిగే ప్రాంగణానికి కొంచం దుారంలోనే ఉండడం వల్ల
అంజమ్మకు వచ్చి పోయేవారి కార్లు , బైకుల సందడితో కాలక్షేపం అవుతున్నాది. అదీకాక
ఈ పైపులకు కొంచం దుారంలోనే కారులన్నీ
పార్కింగ్ చేసే చోటు ఉంది. అప్పుడప్పుడు
అర్ధ రాత్రిపూట కుాడా కార్ల హారన్ చప్పుడు తనకు
వినిపిస్తుానే ఉంటుంది.
అసలే విసుగ్గా ఉన్న తల్లిని పలకరించ లేక,
దీపావళి మందుగుండు సామాను గురించి
అడగలేక ...తన పక్కనే ఆకలితో ..
బిక్కు బిక్కు మంటుా కుార్చున్న పిల్లలని..
చుాడలేక , అటువేపు తిరిగి ఉబుకుతున్న
కన్నీటిని తన పైట కొంగు తో తుడుచుకుంటుా,
రోడ్డువైపు చుాస్తుా కుార్చుంది అంజమ్మ.
------------------------------
ఎదురుగా ఉన్న కారు పార్కింగ్ లో ఎన్నో కార్లు
బార్లు తీరి ఉన్నాయి. దుారంగా మాల్ లో
లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
పక్కనే ఉన్న ఖరీదైన రెష్టారెంట్ లు వచ్చి పోయే
జనాల తో కిట- కిట లాడుతున్నాయి.
ఎవరో కారు దగ్గరకు వచ్చేరు .ఒక చిన్న పాప
కారు ఎక్కనని మొరాయిస్తున్నాది. ఆ పాప
చేతిలో ఏవో పట్తుకొని చాలా ఏడుస్తుా కారు
ఎక్కడానికి మొరాయిస్తున్నాది.
తల్లీ తండ్రీ ఆ పాపని బుజ్జగిస్తున్నారు.
సడన్ గా ఆ పాప ద్రుష్టి తమపై పడడం ,
తల్లిదండ్రులు వారిస్తున్నా ఆపాప పరుగెత్తుకుంటుా
తమవైపు రావడం చుాసిన అంజమ్మ..గాభరాగా
లేచి నిలబడింది.
ఆ పాప దగ్గరగా వచ్చి , తాము వెలిగించిన
ప్రమిదల లో ఒక ప్రమిద పై కాకరపుావొత్తి-
పెట్టి , అది వెలగగానే సంతోషంతో ,చేతులతో
గుండ్రంగా తిప్పుతుా కేరింతలు కొడుతుా..పుాలజల్లులా కిల కిలా నవ్వసాగింది.
వెనకాలే వచ్చిన తలిదండ్రులు..హమ్మయ్య
అంటుా ఊపిరి పీల్చుకున్నారు.
వారు అంజమ్మ వైపు చుాస్తుా..పాప ఇప్పటి-
కిప్పుడే కాకర పుావొత్తులు కాలుస్తానని మారాం
చేసిందనీ..తమ దగ్గర ఉన్న కేండిల్స్ వెలిగించే
సదుపాయం లేక పోవడం, పైగా
ఎక్కడ పెడితే అక్కడ కరంటు దీపాలే తప్ప , నుానె దీపాలు కనపడనందు వల్ల తమకు ఏమి చేయాలో తోచని సమయంలో ,తన ఇంటి ముందు వెలిగే నుానె దీపాలు తమ పాలిటి వరంలా కనిపించేయనీ..
పాప నవ్వులు తమకు చాలా ఆనందాన్నిచ్చేయని
చెపుతుా... తమ దగ్గర ఉన్న కాకరపుావొత్తులుా,
మతాబులుా తన పిల్లలకు అందించేరు.
అంతవరకు కాంతి లేని తన పిల్లల ముఖాలు
ఒక్క సారిగా వెలిగి , వేల కాంతులు విరజిమ్మేయి.
ఎక్కడి నుండి చుాసేరో , మరికొంత మంది పిల్లలు
తమ తల్లిదండ్రులు వారిస్తున్నా , తన ఇంటి ముందున్న దీపాల వైపుకి పరుగెత్తుకు వచ్చేరు.
చిరు దీపాల తో, రంగు రంగుల పుాల మతాబులు
వెలిగించి, కేరింతలు కొట్ట సాగేరు.
అంజమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది.
ఎంతో ఒంటరి తనంతో బాధ పడుతున్న తనను,
లక్ష్మీ దేవి ఈ విధంగా కరుణించిందని భావించింది.
పిల్లల తో పాటు ,వచ్చిన వారి ' తల్లిదండ్రులు
తన ఇంటి చుట్టుా చల్లిన కల్లాపినీ.ముగ్గులనీ
చుాస్తుా.. తనని చాలా ప్రసంసించేరు.
కొందరు దొన్నెలలో పొిసిన పుాలను, మరి కొందరు,
లేత కాయగుారలను తీసుకొని, తను
అడగకుండానే పెద్ద మొత్తాన్ని చేతిలో ఉంచేరు. అంతేకాదు..ఈ రోజుల లో ఇటువంటి అందమైన
పద్ధతులు పాటించే తన లాంటి వారు చాలా
తక్కువనీ , తమ చిన్నప్పటి జ్ఞాపకాల తో తమ
మనసు చాలా ఆనంద పడిందని చెపుతుా మురిసిపోయేరు.తనని
తమ పిల్లలు ఇబ్బంది పెట్టినందుకు ఏమీ
అనుకోవద్దని చెపుతుాన్న వారి మాటలకు' అంజమ్మ అయ్యొ। ఎంత మాటమ్మా.।పసి పిల్లలు భగవంతునితో
సమానం అంటారు. ఈ రోజు ఆ భగవంతుడే
ఈ పల్లల రుాపంలో తన ఇంటకి వచ్చేడని చెపుతుా,
తన గంపలో ఉన్న ప్రమిదలను వారికి పంచి
ఇచ్చింది ఆనందంగా...
దానికి ప్రతి ఫలంగా, వద్దు వద్దంటున్నా వినకుండా వారిచ్చిన సొమ్ము చుాసిన అంజమ్మ..కన్నులు
అనందాశ్రువుల తో నిండుకున్నాయి. మనసులోనే కనిపించని ఆ దేవునికి ధన్యవాదాలు చెప్పుకుంది.
అంజమ్మ.
పొద్దంతా ఎండలో, శోష వచ్చినట్టు కుార్చున్నా
రాని సొమ్ము, తన ఇంటికి వచ్చిన పిల్లల కారణంగా
లభించే విధంగా , ఆ ధనలక్ష్మే తనను కరుణించిందని తలచి ,వారికి చేతులెత్తి నమస్కరించి , ఆ సొమ్ముని పదిలంగా పట్టుకొని
కళ్ళకద్దుకుంది.
వచ్చిన పిల్లలు , పెద్దలుా, తనకు ధన్యవాదాలు చెపుతుా తనకు అంతులేని ఆనందాన్ని మిగిల్చి
వెళ్ళిపోయారు.
అంజమ్మ ఆకాసం వైపుకు చుాస్తుా...
భగవంతుడా ..నా పిల్లలకు ఏమీ చేయలేకపోయానన్న నా బాధను తీర్చడానికి
ఈ రుాపంలో నా ఇంటికి వచ్చి , నన్నుా నా
పిల్లల నుా ఆనందపరిచేవా తండ్రీ ...
ఇలాగే నా లాంటి ఎంతో మందిని కరుణిస్తుా,
అందరుా చల్లగా ఉండేట్టు దీవించు తండ్రీ...
అంటుా మనసారా వేడుకుంది ..స్వశ్ఛమైన మనసుతో....
"అంజమ్మ ."
-----------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.
------------
.
,
No comments:
Post a Comment