ద
హెల్మెట్ పెట్టుకోని కారణంగా,
అన్యాయపు చావులకి-
ఆహుతవుతున్న ప్రజానీకానికి
కఠోర సత్యాన్ని తెలియబరచే
సందేశాత్మక ద్రుశ్య కథనం'॥
అందరినీ ఆలోచింపజేసిన
ఆచరణాపుారితమైన సత్యం,
హెల్మెట్ వాడుక వల్ల
కలిగే ఉపయొాగాల సాక్ష్యం ॥
గమనించండి అందరుా
ఈ నిత్య సత్యం.
కలిగించకండి , మీ
తలిదండ్రులకు -
కడుపుసోకం.
కుాల్చకండి- మీ
ఇల్లాలి కలల
ప్రేమ సౌధం ॥
ఆచరించండి...
చట్ట నిర్ణయాల సారం.
సాగించండి సత్ఫలితాల
తో సాగే పయనం ॥
వ్యవహరించండి -
సమాజ హితునిగా
నిరంతరం.
నిర్వహించండి
బాధ్యతా యుతమైన
పౌరసత్వం.॥
తెలపండి అందరికి
"హెల్మట్"
ఉపయొాగాల సారం ॥
-----------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
No comments:
Post a Comment