ఆ లోగిలిలో నాలుగు కుటుంబాలు పక్క పక్కగా
ఉంటున్నారు.
1.ఆంటీ...అందరిలోకీ పెద్దావిడ. చిన్న చిన్న గిల్లికజ్జాలు పడుతున్న వీరందరినీ అప్పుడప్పుడు మందలిస్తుా -బుజ్జగిస్తుా , తన పిల్లలలాగే చుాస్తుా
ఉంటుంది.
2.ప్రభ= ఈమెకు అలంకరణ మీద కొంచం మక్కువ
ఎక్కువ. ప్రతీ చిన్న కార్యక్రమానికీ అందంగా అలంకరించుకోవడమే కాక , లేని- పోని గొప్పలు చెప్పుకుంటుా..మిగిలిన వారిని
ప్రతీవిషయం ,సాగదీసి మరీ అడుగుతుా...బడాయిలు
పోతుా ఉంటుంది.
3.రమ= ఈ విడ మరో టైపు.
ఎవరేం మాట్లాడినా ముాతి ముాడు వంకర్లు
తిప్పుతుా..ఐనా నాకెందుకమ్మా...అంటుానే
మునపటికెవడో చెప్పినట్టు...అని మొదలెట్టి
తలా..తోకా లేని సామెతలు చెపుతుా..
అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుా ఉంటుంది.
4. మంజుా= కొంచం పెద్దరికంగా ఉంటుా...అందరుా
కలిసి మెలిసి ఉండేందుకు తన ప్రయత్నం తాను చేస్తుా...అప్పుడప్పుడు చిన్న చిన్న సలహాలిస్తుా
అందరినీ కలుపుతుా ఉంటుంది.
No comments:
Post a Comment