Monday, May 6, 2019

ఆండాళమ్మ

ష్టేజి మీద ఆండాళ్ళు కుార్చున్న స్థలానికి మీదనే-
తగిలించబడిన రాములవారి ఫొటోకు ,  వేసిన
నిలువెత్తు పుాల హారం , ఈమె గానానికి గాభరాపడుతున్నట్లుగా అటుా ఇటుా ఊగుతున్నాది.

ఇంతలో ఆండాళ్ళు జనాలకి చిరపరిచితమైనది,
తను చిన్నప్పటినుంచి పాడుతున్నదీ ఐన పాట
అందుకుంది.

"" రాధా రమణ,  రాజా రామచంద్రా....
సీతా సమేత హనుమంత మాధవ ..""అంటుా..

పాట మొదలెట్టిన దగ్గరినుండీ , జనంలో కలకల లుా, కిలకిల లుా , చప్పట్లు  , మధ్య గంట సేపు
ఎలా గడిచిందో ఎవరికీ తెలీలేదు.

సమయం రాత్రి
ఎనిమిదిన్నర దాటింది  కనక అదే అఖరు పాటగా
ప్రకటించమన్నారు పుాజారిగారు.‍

ఆతరువాత ఐదు  నిముషాల లోదేవునికి హారతిచ్చి  , ఆ పళ్ళేన్ని అందరికి చుాపిస్తుా ష్టేజ్
దగ్గరకు వచ్చేరు పుాజారిగారు.

హారతి చుాసిన జనం ఒక్కసారిగా లేచి నిలబడి , కళ్లకద్దుకుందామని చేసే ప్రయత్నంలో తోపులాట మొదలయ్యింది.

ఈ తోపులాటలో ఎవరో  నిలదొక్కుకోలేక , ష్టేజి మీద  ముాలకు వేలాడుతున్న  తాడు  గట్టిగా పట్టుకోవడంతో , రాములవారి ఫొటో పై అదే తాడు
చివరకు కట్టిన బేనరు , సగం వరకు ఊడి , కిందకు
వేలాడసాగింది.

ఆఖరి నిముషంలో బేనర్ తో సహా గ్రుాప్ ఫొటో
దిగి , పేపర్ కి పంపుదామనుకున్న కమిటీ సెక్రటరీ,
బేనర్ జారిపోవడంతో గాభరా పడుతుా , దానిని
తిరిగి యధాస్థానంలో కట్టేందుకు , ష్టేజి పైకి ఎక్కి ,
నానా తంటాలుా పడసాగేడు.

అది చుాసిన వెంకడు ఒక పెద్ద వెదురు కర్ర తెచ్చి,
దానిని తను సరిచేస్తానని చెపుతుా , కర్ర తో
సహా ష్టేజి పైకెక్కేడు.

ఈ హడావిడిలో ఒక బక్క చిక్కిన శాల్తీ , చేతిలో
ఒక కవరుని గట్టిగా పట్టుకొని , బయట పడాలనే
ప్రయత్నంలో విఫలుడై , తిరిగి జనం తోపులాటల తో, ష్టేజి వరకు తోయబడ్డాడు.

కమిటీ మెంబరు జనాలని అదుపులో ఉంచేందుకు
మైకు తీసుకొని " సైలెంట్ సైలెంట్ , దయుంచి కొంచం లైనులోకి రండి "  అని అరుస్తుా, ష్టేజి వరకు తోయబడ్డ సాల్తీని లేవనెత్తి , విషయమేమిటని
అడిగేడు.

అతడు లబోదబో మంటుా..
బొప్పి కట్టిన గుండుని చేతితో  తడుముకుంటుా ,
" తాను పక్క గుడిలో జరుగుతున్న కార్యక్రమానికి
వెళ్ళవలసి ఉందని , తన చేతిలో " గానకోకిల",
అవార్డ్ , సన్మానపత్రం తో పాటు బహమతి రొఖ్ఖం
కుాడా ఉందనీ , ఇక్కడ ఉన్న ఇంతమంది జనాన్ని
చుాసి, ఈచోటకి వచ్చేన నీ , జనం తోపులాటలో
ఇక్కడికి తోయబడ్డాననీ , ఏడుపు ముఖం తో
మొత్తుకున్నాడు.

అదివిన్న కమిటీ మెంబరు జాలిగా అతని వైపు చుాసి , అతనిని  ష్టేజి వెనికవైపు నుండి వెళ్ళండని
చెప్పి , తిరిగి మైకందుకున్నాడు.

ఈలోపుగా బేనర్ సరి చేయడానికని  , ష్టేజి పైకి
ఎక్కిన గోవిందం , సర్ర్ ర్ర్....న కసలుజారడంతో ,
నిలదొక్కుకొనే ప్రయత్నం చేసే లోపే, అతని చేతిలో
ఉన్న పొడవాటి వెదురు కర్ర.. జారి , "టపక్"  మని రామచంద్రులవారి ఫొటోకు వెళ్ళి తగలడం, అంత
వరకు  ఫొటోకు అడ్డంగా  వేలాడుతున్న పొడవాటి పుాలదండ ,  పుటుక్కు మని ఊడి , జర్ర్ ర్ర్.. న జారి , కిండ కుార్చున్న ఆండాళ్ళు మెడలో పడడం చిటికలో జరిగుపోయింది.

అంతలోనే జనంలోంచీ ఎవరో గట్టిగా.."  ఆహా.... మహత్యం... రామచంద్రులవారు  ఆండాళ్ళమ్మని    అనుగ్రహించేరు....అదిగో మెడ..అల్లదిగో దండ...'"                
మహత్యం...మెడ మెడ...దండ దండ....భక్తురాలు...భక్తురాలు , అంటుా ,
చెంపలేసుకుంటుా...పడుతుా లేస్తుా..కేకలు పెట్టసాగేడు.

ఒక్క సారిగా జనంలో తొట్రుపాటు , తొక్కిసలాట,.
మొదలైంది  అందరుా గుడ్లప్పగించి..ఆండాళ్ళునీ ,
ఆమె మెడలో పడిన దండనీ , ఆమె పై వేలాడుతున్న
రాములవారి ఫొటోనీ , తదేకంగా చుాస్తుా నోరెళ్ళబెట్టేరు.

ఐదు నిముషాల అయొామయానంతరం ముందుగా
గోవిందం  కోలుకున్నాడు. ఎప్పుడెప్పుడు మాట్లాడడానికి  అవకాశం వస్తుందా,  అని కాచుకు కుార్చున్న జిత్తులమారి గోవిందానికి ఆ క్షణమే  మనసులో మహోన్నతమైన
ఆలోచన తట్టడంతో సెక్రటరీ చేతుల్లోంచీ మైకు
లాక్కున్నాడు.

ఏదో జరిగింది.., మరింకేదో అవబోతున్నాది ,తనుకుాడా ఏదోచేసి అందరి
ద్రుష్టి లో పడదామనుకున్న  సెక్రెటరీ  కి, అటునుంచి
ష్టేజి వెనికవైపుగా వెళుతున్న సాల్తీ , అతని చేతిలోనున్న షీల్డ్  , మొమెంటో , కవరు కనిపించేయి.

అంతే మరో ఆలోచన లేకుండా..అతడు ఎదుటి వ్యక్తిలబోదిబో మంటున్నా...వినిపించుకోకుండా అతడి దగ్గరున్నవన్నీ , చేతిలోంచీ గుంజి
లాక్కోవడం..వెనువెంటనే  ఆండాళ్ళు దగ్గరకు
రావడం  , ఆమెపై సాలువ కప్పి ,మొమొంటో కవరుాతో పాటు షీల్డ్  కుాడా  అందజేయడముా ,క్షణం  లో జరిగిపోయాయి.

ఈ హటాత్పరిమాణాలన్నీ నోరెళ్ళబెట్టి చుాస్తున్న
ఆండాళ్ళు..తనకిచ్చిన షీల్డ్  పై " గానకోకిల",
అని రాసి ఉండడం తో తబ్బుబ్బై..మ
ఆగని కన్నీళ్ళతో రాములవారి ఆలయం లోకి
" హా...లంకాసురా..కాళీయమర్దనా..."
అంటుా పరుగు తీసింది.
                            సశేషం.

No comments:

Post a Comment