కాలం !
గతించిన ఎన్నో గాయాల్ని రుాపుమాపింది.
కాలం !
ఎన్నో కన్నీటి కథనాలని , కష్టాల సెగలనీ
మస్తిష్కపు మబ్బుల చాటుకు నెట్టి వేసింది.
కాలం ! గతించిన ఎన్నో చరిత్రాత్మక సంఘర్షణలకు,
సవాలుగా నిలిచింది.
కాలం !
రక్తాక్షరాలతో లిఖించిన ఎందరో త్యాగముార్తుల , ఆత్మ సమర్పణల చితాగ్ని జ్వాలల్లో
దగ్ధమైపోయిన న్యాయ వ్యవస్థలకు , సాక్షీభూతమై నిలిచింది.
కాలం !
నిరంతర అన్యాయాక్రమాల , అరాచకపు దాడుల్ని, అరికట్ట లేని , చేతకాని సామాజిక వ్యవస్థ కు
మరింత సమయాన్ని జోడిస్తుా , ధర్మ బద్ధ రాజకీయ
వ్యవస్థా ప్రలోభాన్ని చుాపిస్తుా మాయ ముసుగు వేస్తునే ఉంది.
కాలం!
జీవితపు , ఒడు- దుడుకుల దారుల్లో
కష్ట సుఖాల , కన్నీటి వ్యధల , ఎడారి దారుల గమనానికి ఒయాసిస్సులాంటి గమ్యాన్ని చుాపిస్తుా,
ఊరడిస్తుానే ఉంది .
కాలం!
ఎప్పటికప్పుడు ,తారుమారౌతున్న ప్రజా వ్యవస్థలకు , ఐదేళ్ళకు ఒకసారి , రాజకీయ రంగుల్ని పులుముతుా, మనసులకు స్వాంతన కలిగిస్తుానే ఉంది.
కాలం!
కల్లబొల్లి మాటలతో , కపట వాగ్దానాలు చేసే
రాజకీయ నాయకుల ముఖాలకు, ఖరీదైన మాస్కులు వేసి , మాటల గారడీల మాటున మభ్యపెడుతుా , అమాయక ప్రజలతో చప్పట్లు , తాళాలతో భజన చేయిస్తునే ఉంది.
మానవ జీవితాలను , ఏదో ఒకరుాపంలో వచ్చి
రోగ గ్రస్తుల్ని చేసి, కబళించే మ్రుత్యువు ,
నేడు కనిపించని "కరోనా కణపు " రుాప మెత్తి
కార్చిచ్చు రేపుతుా ఉంటే...ఏంచెయ్యాలో తెలీకా
"కాలం" గడ గడ లాడింది. ఐనా సరే....
"లాక్ డౌన్" పేరుతో యావత్ ప్రపంచాన్నీ జైలుగా మార్చి , స్వయం మానవ నిర్బంధాన్ని , మరో కోణంలో చుాపుతుా , మారణ హోమాల దాడికి కారణ భుాతమైన "కరోనా" ను , సవాలు చేస్తుా ఎదురు నిలిచి , పోరాడుతుానే ఉంది.
విపత్తుల దాడిలో
నిర్దాక్షణ్యంగా నలిగిపోతున్న మనిషికి , మనిషే శత్రువై , అధికారికంగా కొందరుా , రాజకీయపుటెత్తులతో మరికొందరుా ,
చదరంగం ఆడుతుా., ఆట తెలీని అమాయకపు
జీవుల కష్టాని కి "చెక్ " పెడుతుా ఉంటే ,
కాలం "మౌనంగా" కన్నీరు కార్చింది .
అన్యాయానికి ఎదురునిలిచి పోరాడే వారి తో, చేతులు కలుపుదామనుకున్న కాలం...
అడిగిన వాడిని అరాచకంగా అణచివేసే ,
క్రుార చర్యలకు భయపడి , అడుగు వెనకేసింది .
ఎటు వెైపు చుాసినా స్వార్దం నిండిన మనస్తత్వాలు ,
విలువలు తగ్గిన బంధాల దాడుల్లో, రాబందుల్లాంటి బంధువుల కాటుకు గురైన అబలల ఆర్తనాదాలు,
మానవీయత లోపించిన ముతక రాజ్యాంగాల మధ్య - ఊపిరాడని "కాలం ", మురికి కంపు భరించలేక
మఖానికి ముసుగేసుకుంది.
దయ చుాపాల్సిన దైవం కుాడా,
"కరోనా " కణపు దారుణ దాడికి ,
తలుపులు ముాసుకు కుార్చునే సరికి,
అదిరి పడిన "కాలం " కఠిన నిర్ణయంతో ,
కళ్ళు ముాసుకుని పలాయనం సాగించింది
తన అస్థిత్వాన్ని కోల్పోతానేమొా
అన్న భయంతో ",కాలం" పెట్టే పరుగులకు ,
ఋతువులు కుాడా జతకలిసి ,
సమయానికి ముందుగానే
తమ వంతు ప్రకోపాన్ని చుాపించడంతో ,
ప్రపంచంలో, మరో చరిత్ర చోటు చేసుకుందా..?
అన్న అనుమానం మొదలైంది.
సమయం కాని సమయం లో
ఉధ్రుతంగా కురిసిన వర్షాల వల్ల ,
పంటలు నాశనమయ్యేయి , దానికి తోడు
వేల కొలదీ మిడతల దండు చేసిన దాడితో,
రైతన్నల ఆశలు ,అతఃపాతాళంలోకి
అణిచివేయబడ్డాయి.
అధిక ఉష్ణోగ్రత తో ఎండలు ,
మంటలు రేపుతుా , జంతు ,
జీవ -జాలానికి మ్రుత్యు వాతలు
పెడుతున్నాయి .
నీటి కొలనులు ఎండిపోయేయి.
నదుల నీరు ఆవిరైంది .
మంద్రంగా వీచ వలసిన గాలులు ,
తుఫాను వేగంతో విధ్వంసాన్ని శ్రుష్టిస్తున్నాయి.
అనుకోని అంటు రోగాలతో ,
మానవులు ఆంతమౌతున్నారు.
వింత కీటకాల , వంతు దాడులతో
ప్రజలు భయాందోళనలతో,
గ్రుహ బందీలౌతున్నారు.
సమయంతో పాటు
మారక తప్పదనుకున్న "కాలం ,"
కాలిన కడుపులతో ,కాలి నడక బాటల్లో ,
హ హా.. కారాలతో అలసిన శరీరాలకు ,
పట్టెడన్నం , పురుషెడు నీరుా ఇవ్వ లేకా,
వలస కుాలీల దయానీయ స్థితికి ,
తలవంచుతుా , తారుమారైన
తన స్థితికి కన్నీరు కారుస్తోంది.
కకావికలమైన పరిస్థితులకు
తారుమారైన, అమాయకపు
వలస కుాలీల బ్రతుకుల్లో..
మిగిలిన కన్నీరు , కార్చిచ్చై రగిలి,
అంఫాన్ తుఫాను జల్లులకు తోడై,
ప్రళయానికి నాంది పలుకుతోంది.
కంపిస్తున్న భుామి ,
పొంగుతుాన్న సముద్రాలకు ,
స్వాగతం చెపుతుా ,
అవధులు దాటిన అలలకు
ఆహ్వానం పలుకుతోంది.
కాలానికి వెరవని సుార్యుడు ,
కణ కణ లాడుతుా ,
కురిపిస్తున్న వేడి తాకిడికి ,
భగ్గుమన్న సెగ మంటలు, మహిలో,
మారణ హోమాన్ని సాగిస్తున్నాయి.
మానవ విలాసాలకు బలైన ,
ముాగ జీవుల , కుళ్ళిన కళేబరాల
ఆక్రోశపు తరంగాలు , జీవం పొిసుకుని,
" ప్రతీకార కణ పాశాలై " , వెంటాడుతుా ఉంటే , దిక్కుతోచని మానవుడు
దిగ్భ్రాంతికి లోనౌతుా, దిక్కులేని
వింత ఛావు ఛస్తున్నాడు..
అందరిలో ఉన్నా ,
అంటరానివాడైన విధంగా,
ఒంటరి బ్రతుకు పోరాటం చేస్తుా ,
తన ఇంట్లో తానే బందీయై ,
.బతుకు బండి లాగుతున్నాడు.
తుమ్ముకు , దగ్గుకు' భయపడుతుా ,
మాటిమాటికీ చేతులు కడుకగుతుా,
"మందులేని మహమ్మారి" దాడిని-
అడ్డుకో లేక' అష్ట కష్టాల కొలిమి లో,
ఆహుతౌతుా , అర్ధాంతర చావుతో
అంటరానివాడౌతున్నాడు.
అన్నీ చుాస్తుా కుాడా ..
ఏమీ చేయలేని "కాలం" ,మనిషి
తాను తీసుకున్న గోతిలో
తానే పడుతున్న వైనం చుాసి,
నవ్వాలో ,ఏడ్వాలో ,తెలీక
నలిగిపోతున్న జీవితాల మధ్య
తాను కుాడా నలిగిపోతుా..,
"కాలం" వెళ్ళదీస్తున్నాది.
సమయానుకుాలంగా...
------------------------------
రచన , శ్రీమతి.,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
--------------------
No comments:
Post a Comment