రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
--------------------------
ప్రక్రియ.
సమ్మొాహనాలు.
శీర్షిక .
దాంపత్య జీవితం.
------------------------
అందమైనది ఇల్లు
ఇల్లంత సందళ్ళు
సందళ్ళ పెరిగారు పిల్లలుా ఈశ్వరీ॥
పెరిగి పెద్దయ్యేరు
పెద్దయిన పిల్లలుా
పిల్లలకు పెళ్ళిళ్ళ సందళ్ళు ఈశ్వరీ ॥
కోడళ్ళు అల్లుళ్ళు
అల్లుళ్ళ సందళ్ళు
సందళ్ళ బాధ్యతల బరువులుా ఈశ్వరీ ॥
గడ్డు కాలము వచ్చె
వచ్చి వయసే తెచ్చె
తెచ్చె ముదుసలి తనము నేయిచ్చె ఈశ్వరీ॥
పనిచేయ లేకున్న
లేకున్న చేసినా
చేసినా ఆరళ్ళు తప్పనైన వీశ్వరీ ॥
విసుగు , ఛీత్కారాల
ఛీత్కార బతుకుల
బతుకేల యనుచునుా విల-విలలు ఈశ్వరీ ॥
వృధ్ధాశ్రమాలగతి
గతి తమకు పోగ మతి
మతిపోయి పయనము మారాతి దీశ్వరీ ॥
లేదు చావుకు భయము
భయము సహచరి, గనుము
గనిన మే మొంటరిగ మనలేము ఈశ్వరీ ॥
ఒకరికొకరము తోడు
తోడుగా మని జోడు
జోడుగనె పోవరుగ ఏనాడు ఈశ్వరీ..॥
ఈనాటి పిల్లలే
పిల్లలు పెద్దలు లే
రేపటికి ఔదురుగ ముదుసలులె ఈశ్వరీ ॥
పిల్లలకై జీవము
జీవితము అంకితము
అంకితము అనర్ధమని తెలియము ఈశ్వరీ॥
ఋణము తీర్చెడి గుణము
గుణ హీనకు స్వార్ధము
స్వార్ధమేలె ఇలలో ఇది నిజము ఈశ్వరీ ॥
ఈతీరు మారనిది
మారని సమాజమిది
సమాజము మనము గద, నీతేది ఈశ్వరీ ॥
తామరను అంటదు
అంటదు నీరంటదు
అంటదు విషయములను అంటదుా ఈశ్వరీ॥
నమ్ము సతిని వీడకు
విడచి అతిగా చెడకు
చెడి సతి కంటనీరు రానీకు ఈశ్వరీ. ॥
అమ్మ రుాపు తానై
తానై చెలి తానై
తానే నీ వలపై నీ తోడు ఈశ్వరీ ॥
కష్ట-సుఖములతోడు.
తోడునీ సరి జోడు
జోడు చివరి వరకు వదలకెపుడు ఈశ్వరీ ॥
No comments:
Post a Comment