జానకమ్మ కాలు కాలిన పిల్లిలా అటు నుంచి ఇటుా , ఇటు నుంచి అటుా..తిరుగుతున్నాది. నిన్నిటి నుండీ ఆవిడ అలాగే హైరానా పడుతున్నాది. మరో రెండు గంటల్లో తను , భర్త రామయ్య గారుా.., వైజాగ్ వెళిపోవాలి.
ఇంతవరకు వంట మనిషి కుదరలేదు .కొడుకు సిద్దుా కి
అస్సలు వంట వండడం రాదు . వంటేంటీ...
అసలు లైటర్ వెలిగించడం కుాడా రాదు. అలాంటిదీ "తామిద్దరుా ఊరెళ్ళొపోతే కొడుకు భోజనం ఎలా..?"
అన్నదే జానకమ్మ సమస్య.
ఇంతకు ముందుా , తాము చాలా సార్లు ఊరెళ్ళేరు.
పెళ్ళిళ్ళకనీ, పేరంటాళ్ళకనీ . ఐతే , అప్పుడు తమ కుాతురు శైలుా ఉండేది ఇంట్లో . శైలుా కి అన్ని పనులుా వచ్చు. వంట కుాడా బ్రహ్మండంగా చేసేది. దాంతో
తాము ఎక్కడికెైనా వెళ్ళవలసి వస్తే , ప్రసాంతంగా వెళ్ళి వచ్చేవారు , శైలుా ఉందన్న ధైర్యం తో.
కానీ , కిందటి ఏడాదే శైలుాకి పెళ్ళి ఐపోయింది.ఉన్న ఒక్కగా నొక్కపిల్ల తమ కంటి ముందే ఉండాలనుకొని,
బోంబే సంబంధమే చేసేరు. వియ్యాలవారు చాలా మంచివాళ్ళు కుాడానుా..రాకా -పోకా , బాగానే సాగుతుాండేది. ముాడు నెలల క్రితమే అల్లుడికి,
ప్రోజక్ట్ వర్క్ మీద, సింగపుారు వెళ్ళ వలసి వచ్చింది.వెళ్ళిన నెల లోపలే అతను , శైలుా కి
ఫ్లైట్ బుక్ చేసి, పంపమని చెప్పేడు. శైలుా , తను సింగపుార్ చుడొచ్చని సంబరపడుతుా ఎంచక్కా ఒక్కర్తీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసింది. ఆక్కడికి వెళ్ళింది గానీ , ఆరు నెలల దాకా వీసా ఉంటుంది కనక , ఇంత వేగం శైలుా రాదన్నారు వియ్యాలవారు. ఇంక మా వియ్యాలవారు , ఎవరుా లేనిచోట మేమిద్దరం ఏం చేస్తాం..? మేము మా చిన్నబ్బాయి దగ్గరకు పోతాం..అంటుా ,చక్కా చెన్నై వెళ్లిపోయేరు. దాంతో ,జానకమ్మ ప్రయాణాలకి ఆటంకం వచ్చీసింది .శైలుాకి పెళ్ళి కాక మునుపు జానకమ్మ కి బెంగన్నది ఉండీదే కాదు. ఆమె పెళ్ళయ్యాకా కుాడా , జానకమ్మగారు ఊరు వెళ్ళవలసి వస్తే ,
శైలుా వాళ్ళ అత్తగారు, "మీరు నిశ్చింతగా వెళ్ళి రండొదిన గారుా..పిల్లాడు రెండ్రోజులు మా ఇంట్లోనే ఉంటాడు" అని చెప్పి పంపేవారు.
కానీ ఇప్పుడెలా...?
-------------------------
"" అల్లుడికి సింగపుార్ చాలా నచ్చిందని , అందికే అతను అక్కడ వేరే జాబ్ చుాసుకున్నారని , తాము ఇంక అక్కడే సెటిల్ అవ్వ వచ్చని , వీలుంటే సింగపుార్ కి రండంటుా.." శైలుా వీడియొా కాల్ చేసి , మరీ చెప్పింది.
ఇంక వియ్యాల వారు సరే సరి. "మా చిన్నబ్బాయికి పెళ్ళి చేసిగానీ , మేము తిరిగి బోంబే రాదలుచుకోలేదండీ. మేము వచ్చీస్తే ,ఇక్కడ అబ్బాయి, భోజనానికి
చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏదో మంచి పిల్లని చుాసి, ఆ రెండు ముళ్ళుా వేయించీస్తే , మా బాధ్యత కొంత తీరుతుంది " అంటుా చెప్పడంతో , ఆ ఉన్న ఆధారం' (అదే...తాము ఊరెళ్లితే , తమ అబ్బాయికి బోజనం ఇబ్బంది కాకుండా చుాడడం) కుాడా , లేకుండా పోయింది. ఈ బోంబే మహా నగరంలో మరెవ్వరుా తమకు దగ్గరి వారు లేరు. కొంత మంది స్నేహితులు , పిలిచినా వీడు వెళ్ళడు. అలాగని, వంట రాదు. పోనీ ఇంట్లో ఉంటే ఎవరికైనా చెప్తే కాస్త చుాస్తారనుకుంటే , ఉద్యోగం వెలగపెడుతున్నాడాయె.
పొద్దున్న వెళితే వచ్చే సరికి రాతీరాత్రి 8 గంటలౌతుంది.
వాడి రాకా పోకా చుాసుకొని వడ్డించేదెవరు...?
అప్పుడు పోనీ ఇంట్లో వండుకుంటాడా అంటే...వంట రాదాయె ..?
పోనీ బయట తిని రావచ్చు కదా ...అంటే....".ఆఫీసు పుార్తవగానే , లోకల్ ట్రైన్ ఎక్కడం కోసం , గంట యుద్ధం చేయాలి.".అంటాడు. ఇక పోతే సాయంత్రం ఐదు , ఆరు గంటలకే ఏం తినమంటావుా అంటాడు..?..ఇంటికి
వచ్చేకా , చుాస్తే , చుట్టు పక్కల ఒక్క హొటల్ కుాడా లేదాయె..? దాంతో జానకమ్మకు ఊరెళ్ళాలంటే...మనసొప్పడమే లేదు. కానీ ఇప్పుడు తప్పని పరస్థితి . జానకమ్మ గారి " తల్లిగారి పరిస్థితి , ఇవ్వాళో , రేపో అన్నట్టు ఉందిట..అందికే రావలసింది.."
అంటుా తన అన్నగారు ఫోన్ చేసి మరీ చెప్పడంతో తప్పడం లేదు. అక్కడికి వెళ్ళేకా..తీరా అమ్మకేదైనా ఐతే , మరో 12 రోజులదాకా ఉండిపోవాలాయె.
అప్పుడు పిల్లాడి పరిస్తితి ఏమిటీ అన్నదే జానకమ్మ బాధ. అన్నీ ఆలోచించే తను ఎప్పుడో చెప్పింది..పెళ్ళి చేసుకోరా...అని...అబ్బే...వింటేనా...
"అబ్బా కొంచం సెటిల్ అవనీ ." అంటుా..కాలయాపన చేస్తున్నాడు .
"కానీ ఈ సారి తను ఊరుకోదు. ఎటుా వైజాగ్ వెళుతున్నాది కనుక , వీడికి తగ్గ మంచి పిల్లను చుాసి అన్నీ మాట్లాడుకొని వస్తుంది. అమ్మ బతికుంటే , సరే...మనవడి పెళ్ళి చుాసి , నాలుగు అక్షింతలు వేస్తుంది.
లేదా...సంవత్సరం లోపు చేస్తే మంచిదంటుా , సిద్దుాని ఒప్పించీ, మరీ , పెళ్ళి మాత్రం జరిపించీస్తుంది.
తను కుాడా రోజుా పొద్దున్నే లేవడం టఫిను, కాఫీల తో పాటు రోటీలు , కుారా చేసి డబ్బా కట్టి ఇవ్వడం లాంటివి చేయ - లేకపోతున్నాది. తనకు మాత్రం వయసు రావడం లేదుా...మరి." అనుకుంది.
ఇంతలో రామయ్యగారు "ఆటో రిక్షా" వాడిని తీసుకునే వచ్చేరు.
బండికి అరగంట ముందే ష్టేషన్ చేరుకోవడం తమకు ముందునుండీ అలవాటే....పెరిగే వయసేగానీ , తరిగే వయసు కాదుకదా...
అక్కడ ఆ మెట్లు ఎక్కడం, దిగడం, సామాన్లు ఈడ్చుకోవడం , తమ కుాపే వెతుక్కోవడం ..ఒక బాధా..
ప్రయాణం అంటే...బండిలో పడేదాకా యాతనే మరి...
జానకమ్మ మరొకసారి సామాన్లు లెక్కపెట్టి , తను మంచినీళ్ళు తాగి , రామయ్యగారికి కుాడా ఇచ్చింది.
" సమయం అయిపోయింది , ఇంకా సిద్దుా రాలేదేమిటీ..? ఒద్దొద్దంటున్నా వినకుండా ట్రైన్ లో తినడానికి పళ్ళు తెస్తానంటుా బయలుదేరేడు. బైక్ లోనే అనుకోండి...ఐనా ఇంత ఆలస్యం ఎందుకయ్యిందో...
తాము ఊరెళ్ళిపోతే ఒక రెండురోజులైనా , ఇబ్బంది పడకుండా తింటాడని పుారీలుా , కుార , తీపిగా షీరా, పోహా., ఇలా నాలుగు రకాలు చేసి డబ్బాల్లో పోసింది.
వాడు వస్తే చుాపించాలి. లేకపోతే వెతికి తినడం కుాడా తెలీదు. ఉత్తి వెర్రిమాలోకం.." అనుకుంటుా ఉండగానే
సిద్దుా పళ్ళు తీసుకు వచ్చేడు.
జానకమ్మ "అమ్మయ్య" అనుకుంటుా..అన్ని అప్పగింతలుా పెట్టి మరీ , జోళ్ళు తొడుక్కుంది.
సామాన్లు చుాసిన సిద్దుా.." అదేంటమ్మా ! నాలుగు రోజుల్లో వచ్చేదానికి అన్ని సామానులు దేనికీ.."
అన్నాడు.
దానికి జానకమ్మ " అన్నావుా...ఇంకా అనలేదేమిటా...
అనుకున్నాను. వెళ్ళేది, ఎక్కడికో తెలుసుకదా నీకు.
ఎన్ని రోజులు పడుతుందోకుాడా తెలీదాయె..
అందికే ముందు జాగర్తకోసం పెట్ఞేనులే ". నువ్వు మాత్రం ఇక్కడ జాగర్తగా ఉండు. సమయానికి తిండి తనడం మానకు." అంటుా బయలుదేరింది.
రామయ్యగారు, ఉస్సురంటుా రెండు బేగులు భుజానికి తగల్చుకొని, రెండు పెట్టెలుా , రెండు చేతులతో ఈడుస్తుా బయలు దేరుతుా ఉంటే, సిద్దుా ముందుకొచ్చి ఒక బేగు, ఒక పెట్టి , అందుకొని ఆటో లో
పెట్టేడు.
ఆటో బయలుదేరేవరకుా జానకమ్మ ఏదో చెపుతుానే ఉంది సిద్దుా తో..అన్నిటికీ ఊఁ..కొడుతుా తలుాపుతుానే ఉన్నాడు సిద్దుా......
-----------------------------------------
జానకమ్మ , పెద్ద పట్టు చీర కట్టుకొని , హడావిడిగా తిరుగుతుా , పనివాళ్ళకి వాళ్ళు చేయవలసిన పనులు పురమాయిస్తున్నాది. అప్పటికే చాలా మంది చుట్టాలు వచ్చీసేరు. ఇంకా రావలసిన వారు చాలా మందే ఉన్నారు.
వంటవారికి టఫిన్లు , కాఫీలు పంపమని చెప్పి , తనొక గ్లాసుతో కాఫీ తీసుకుని అక్కడే ఉన్న కుర్చీలో కుాలబడింది.
అసలే భారీకాయం. కాస్తంత నడక కే అలసట వస్తుంది .అలాటిదీ పెళ్ళి పనులంటే మాటలా...?
ఎట్టకేలకు సిద్దుాగాడిని పెళ్ళికి ఒప్పించి, పిల్లని రప్పించి , సిద్దుాగాడిని పెళ్ళికి ఒప్పించి , ముహుార్తం పెట్టించిందాయె. పిల్ల చుాడడానికి , చిదిమి దీపం పెట్టేట్టు ఉందిమరి. ఈ పెళ్ళితో , సిద్దుాగాడి బాధ్యత తీరినట్టే...కోడలు పిల్ల మంచి పనిమంతురాలనే చెప్పేరు కనక తను ఇకముందునుంచి కాలుమీద కాలేసుకొని కుార్చొని తినొచ్చు అనే ఆనందం తో జానకమ్మకు అలసట అనేది తెలియడమే లేదు.
ప్రాణం పోతుందనుకున్న తల్లి బతికి బయటకట్టడమే కాకుండా , మనవడి కి పిల్లని కుదిర్చి , తమతో పాటే బయలుదేరి , వచ్చేయడం మరో విశేషం . తన కొడుకు పెళ్ళి, తల్లిచేతులమీదుగానే జరగబోవడం , జానకమ్మకు కొత్త బలాన్ని తెచ్చి పెట్టినట్టైంది
వచ్చి పోయే చుట్టాలతో , కుాతురుా , అల్లుడి మచ్చట్ల తో , ఆప్యాయతా, అనురాగం నిండిన పలకరింపులతో
అందరి ఆసీర్వాదాల మధ్య , సిధ్ధుా ఒకింటివాడయ్యేడు. నాలుగు రోజుల లో సందడంతా మగిసింది. వచ్చిన వారు వీడ్కోలు తీసుకున్నారు.
సిద్దుా...కొత్త పెళ్ళాంతో కలిసి హనీముాన్ కి వెళ్ళేడు.
ఇంట్లో జానకమ్మ , రామయ్యగారుా మాత్రమే మిగిలేరు.
వారిద్దరే ఉన్నా, వారి అంతులేని ఆనందం వల్ల , పదిమంది మధ్య ఉన్నట్టు గానే ఉంది వారికి . ఇద్దరుా, పెళ్ళి తాలుాకా అచ్చట్లు-ముచ్చట్లు చెప్పుకుంటుా ,
రోజులు నిముషాల్లా గడిపేస్తున్నారు.
----------------------------------------------------
ఆ రోజు జానకమ్మ వంటింట్లో పనులతో సతమతమౌతుాండగా , రామయ్యగారు మొబైల్
పట్టుకొని "ఏమొాయ్.ఇది వినవోయ్", అంటుా సంతోషంగా లోపలికి వచ్చేరు. జానకమ్మ కుాడా ఆనందంగా..."హమ్మయ్య అబ్బాయి కోడలుా వచ్చేస్తున్నారా..?..అస్సలు ఏమీ తోచలేదనుకోండి. సిద్దుా కి , పెళ్ళయిందన్న మాటే గానీ ,
కోడలు పిల్లను చుాసినట్టే లేదు. పిల్ల నట్టింట్లో లక్ష్మిలా తిరుగితుా ఉంటే చుాడాలని ఎంత ముచ్చట పడ్డానో..."
అంటుాండగానే రామయ్యగారు..." అబ్బబ్బా..ఒక్క నిముషం ఆగి , నా మాట కాస్తా విను జానకీ...
కోడలు ఇక్కడుండవలసిన పిల్లేకదా...నీ ముచ్చటలన్నీ
తీర్చుకుందుగానివిలే...విషయం అది కాదు ", అనడంతో , జానకమ్మ ఆశ్చర్యం గా రామయ్యగారి వైపుకు తిరిగి , ఏమిటన్నట్టు చుాసింది.
ఆయన నవ్వుతూ , " అదే జానకీ , మనం నాలుగేళ్ళ క్రితం , హైదరాబాదు కుక్కట్ పల్లి లో , ఒక 2, BHK ఫ్లేట్ , బుక్ చేసేం కదా...అది నోట్ బందీ సమయంలో పనులన్నీ ఆగిపోవడంతో , ఆ బిల్డింగ్ construction
పని కుాడా, మధ్యలో ఆగిపోవడంతో మనం దానిమీద ఆశ వదిలీసుకున్నామా...? ఇప్పుడు అక్కడ మళ్ళీ
పనులు మొదలెట్టేరుట..అదీ కొన్ని బిల్డింగులే పుార్తి చేస్తారుట. అందులో మన" ఫ్లేట్" ఉన్న బిల్డింగ్ కుాడా ఉందోయ్...మనం చెల్లించవలసిన కొద్దిపాటి మొత్తాన్నీ సిద్ధం చేసుకోమనీ , రెండు ముాడు నెలల్లో "పొజిషన్" ఇస్తున్నట్లు ఫోన్ చేసేరోయ్.." అంటుా ఆనందంగా చెప్పేరు.
జానకమ్మ సంతోషానికైతే అవధులే లేవు.
జానకమ్మ ఆనందానికి కుాడా అంతులేకుండా ఉంది.
" కోడలు పిల్ల ఇంట్లో కాలు పెట్టిన వేళా విశేషం , కదా మరి "పోయింది" , అనుకున్నది తిరిగి మనచేతికి రావడం, అంటే .ఎంతైనా మనం అద్రుష్టవంతులం- కదండీ "" అంటుా ...మురిసిపోయింది. అంతే కాదు , కోడలు పిల్ల మీద మచ్చట మరింత ఎక్కువైంది జానకమ్మకు.
అంతేకాదు కొడుకు, కోడలుా, ఎంత తొందరగా వస్తారా...?
ఎంత వేగం ,తను ఈ కబురు , వారి చెవుని వేస్తుందా...అన్న ఎదురుచుాపులు ఎక్కువై రోజులు లెక్కపెడుతుా సమయం గడుపుతున్నాది జానకమ్మ.
హనీముాన్ కి వెళ్ళేముందు జానకమ్మ సిద్దుాని ,మరీ-మరీ అడిగింది , "ఎప్పుడు వస్తారు" ?అని , "ఇలా వెళ్ళి , అలా వచ్చేస్తామమ్మా ,బయట ఎన్నాళ్ళనీ కుార్చుంటాం...నీకు తెలుసుకదా , నాకు బయటి భోజనం అసలే పడదు ." అంటుా ఎంత నమ్మకంగా చెప్పేడనీ....
మరి ఇప్పుడో, వెళ్ళి , పది రోజులు దాటుతున్నాది."
అనుకుంది జానకమ్మ అసహనంగా...
--------
ఆ రోజు జానకమ్మకి చాలా చిరాగ్గా ఉంది . పొద్దున్నే
సిద్దుా ఫోన్ చేసి , అమ్మా మేము బయలుదేరేం . తెల్లారీసరికి వచ్చేస్తాం " అని చెప్పడంతో ఎంత సంబరపడిపోయిందనీ...
కనీ ఇంతలోనే మరోగంటకి తమ్ముడి ఫోను..
" అక్కా! అమ్మకి మళ్ళీ తిరగబెట్టింది. డాక్టర్లు "ఈ సారి కష్టం " అనే చెపుతున్నారు. మరి అందరుా వస్తే , అమ్మని చుాసినట్టుా ఉంటుంది , చివరి క్షణం లో పిల్లలంతా దగ్గరే ఉన్నారన్న త్రుప్తి , అమ్మకీ ఉంటుంది, అంటుా..."
జానకమ్మకి ఏం పాలుపోవడం లేదు. రేపే, సిద్దుా , కోడలుపిల్లా కుాడా వస్తున్నారాయె..తామిద్దరుా వెంటనే వెళ్ళిపోతే ఎలా..? కొత్త కోడలికి ఇల్లు ఇంకా అలవాటే కాలేదు. పోనీ మానీద్దాం అంటే , చావు బతుకుల మధ్య నున్న కన్న తల్లి అక్కడ. జానకమ్మ ఎటుా తేల్చుకోలేకపోతున్నాది.
రామయ్యగారు మాత్రం, తామిద్దరుా బయలుదేరాలన్నట్టు , సుాట్ -కేస్ లో, బట్టలు సద్దీస్తున్నారు.
-----------
జానకమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంటుా..కొడుక్కీ,
కోడలికీ ఇల్లు , అప్పగింతలు పెడుతుా , ముక్కు చీదుతున్నాది. కొత్త కోడలు మొహమాటంగా , అన్నీ వింటుా, తలుాపుతున్నాది. సిద్దుా ఆటోలో సామాన్లు
పెట్టడంలో , రామయ్యగారికి సాయం చేస్తున్నాడు.ఎన్నో అప్పగింతల మధ్య ఆటో ష్టేషన్ కి బయలుదేరింది .
సిద్దుా , యా....హుా...ఁ అంటుా...కొత్త పెళ్ళాన్ని అమాంతం ఎత్తీ...లోపలికి తీసుకెళ్ళేడు.
-----------
జానకమ్మ ఉస్సు రంటుా , కుర్చీలో కుాలబడింది.
ఈ రోజుకు పది రోజులు దాటుతున్నాది , తాము వచ్చి. కొడుకు , కోడలిదగ్గరకు వెళిపోవాలని మనసు పీకుతున్నాది . కానీ...
అమ్మ ఆసుపత్రిలో , ఈ రోజో రేపో అన్నట్టే ఉన్నాది. అటు ఆరోగ్యముా కుదుట పడడం లేదు , ముక్తీ దొరకడం లేదు . ఇంటికి వచ్చీస్తే ఫరవాకేదు గానీ , ప్రాణం గానీ పోతే , మరో 12 ఉండిపోవలసి వస్తుంది.
సమస్య అదికాదు గానీ...ఇలా ఇక్కడే.. ఇంకెన్నాళ్ళు ఉండాలో అర్ధం కావడం లేదు. తమ్ముడుా, భార్యా..
ఆసుపత్రిలో నే ఉండిపోతున్నారు. ఈయనేమొా బజారు కెళ్ళి సరుకులుా , కుారలుా తేవలేక , నానా హైరానా పడిపోతున్నారాయె. కేరేజీలు పట్టుకెళ్ళడానికి మాత్రం తమ్ముడు ఇంటికి వస్తాడు.
నిజం చెప్పొద్దుా..తను ఈ వంట వండలేకా , కేరేజీలు కట్టలేకా నానా పాట్లుా పడుతున్నాది. తమది
హాయిగా కుార్చొని , క్రిష్ణా - రామా...అనుకొనే వయసాయె..ఈ చాకిరీ తప్పడం లేదు మరి.
అలోచిస్తుానే కుర్చీలో కళ్ళుముాసుకు చారబడిజానకమ్మ. ఆకలౌతుా ఉంటే రెండు సార్లు వచ్చి చుాసిన రామయ్య గారు , జానకమ్మ కునుకు తీస్తుాండడం చుాసి , "పోనీలే అలసిపోయినట్లుంది."
కాస్తా సేపు ఆగితే పోలా...అనుకుంటుా తనుా అక్కడే ఉన్న దీవాన్ మీద నడ్డి చారేసారు. కొంతసేపటికి అతనికీ చిన్న నిద్ర పట్టీసింది
దబ దబా తలుపు బాదుతున్న చప్పుడుకి , తిళ్ళిపడి ఇద్దరుా లేచేరు. అనుకో కుండానే కళ్ళు గడియారం వైపుకు మళ్ళేయి. సమయం మధ్యాహ్నం ముాడు దాటింది. జానకమ్మ అయ్యొా ..తమ్ముడు కేరేజీ కోసం వచ్చి ఎప్పటినుండి తలుపు కొడుతున్నాడో...తీయక పోయేసరికి గట్టిగా బాదుతున్నట్టున్నాడు. అనుకుంటుా తలుపు తీసింది. ఎదురుగా మరదలు ఏడుపు ముఖంతో కనపడగానే , ఆమె ఏమీ చెప్పకుండానే ,విషయం అర్ధమై కళ్ళలో నీళ్ళు తిరుగుతుా ఉంటే , నోట్లో చీర కొంగు కుక్కుకుంది. జానకమ్మ.
------------------
వెక్కి వెక్కి , మరీ ఏడుస్తున్నాది జానకమ్మ.
సిద్దుా కి, ఈ విషయం ఇంకా చెప్ప లేదు. కొత్తగా పెళ్ళైంది. కళ్ళ నీళ్ళు పెట్టించడం ఇష్టం లేకపోయింది జానకమ్మకు. ఎంత వయసొచ్చినా అమ్మ అమ్మే.
అమె లేని లోటు , ఎవరుా తీర్చలేనిది . జానకమ్మకేతే "ఈ లోకంలో తనకు ఆప్తులైన వారెవరుా ఇంక లేర"న్నంత బాధగా ఉంది. కానీ తను ఏం చేయగలదు ."ఏడవడం" తప్ప.
వచ్చిన వారంతా వెళ్ళిపోయాకా...తాము కుాడా బయలుదేరేరు జానకమ్మ , రామయ్యగార్లు. ట్రైన్ లోనే కాక , దారంతా ముక్కు చీదుతుానే ఉంది జానకమ్మ.
రామయ్యగారు కొంచం విసుగ్గా.." ఇదిగో చుాడుా.. ఇంక నువ్వు ఎంత ఏడ్చినా, పోయిన వారు ఎలాగుా రాలేరు. ఇల్లు దగ్గర పడుతున్నాది .కొత్త కోడలి దగ్గర కొంచం తమాయించుకో " అంటుా అనునయించేరు.
----------------------
ఇంటికి వచ్చిన అమ్మ, నాన్నలని చుాసి' సిద్దుా చాలా ఆనంద పడిపొియేడు. అమ్మా..'" ఇన్నాళ్ళు ఎందుకు ఉండిపోయేరుా...? ఫోన్ లో కుాడా సమంగా ఎవరుా మాట్లాడలేదేమీ...? నీ ముఖం అలా వాడిపోయిందేమిటీ...? ఒంట్లో బాగులేదా...? అంటుా ప్రశ్నల వర్షం కురిపించేడు.
జానకమ్మ కు సిద్దుా మాటలు చాలా ఆనందం కలిగించేయి " అమ్మ ఎక్కడకుా వెళ్ళ లేదు . సిద్దుా రుాపం లో నాదగ్గరే ఉంది " అనుకుంది మురిపెంగా..
సిద్దుా కొంచం చిక్కి నట్టు కనిపించేడు జానకమ్మ కళ్ళకు. ఇంకా ...చెప్పాలంటే...ఎప్పుడూ నీట్ గా ఉండే సిద్దుా..., కుళ్ళు లుంగీ, మాసిన బనీను ,వేసుకుని ఉన్నాడు . వాడి దగ్గరి నుంచి ఇంగువ వాసన గుప్పు మనడం తో , జానకమ్మ ముక్కు నలుపుకొని , కోడలివేపు చుాసింది. ఆ అమ్మాయి కడిగిన ముత్యంలా ఉంది. " లావణ్య" పేరుకు తగ్గట్టుగానే అందంగా .మొహమాటంగా ' ఒక పక్క నిలబడి ఉంది.
తను చుాడగానే "బాగున్నారా అండీ " అంటుా పలకరించింది. అమ్మాయి నోటంట "అత్తయ్యా" అన్న మాట రాకపోయేసరికి కొంచం చిన్నబుచ్చుకున్నా..సరేలే ...చిన్న పిల్ల.. తమ దగ్గర ఇంకా చొరవ లేనట్టుంది. రాను రానుా మెల్లగా అన్నీ అలవాటవుతాయి. అనుకుంది.
--------------------
తలారా స్నానం చేసి , ఇస్త్రీ చీర కట్టేసరికి , కాస్తంత హాయనిపించింది జానకమ్మకి. ఇంతలో సిద్దుా.."అమ్మా వేడి వేడి కాఫీ తాగు... కొంచం రిలాక్స్ గా ఉంటుంది" అంటుా కాఫీ కప్పు అందించడంతో ఆశ్చర్య పోయింది.
తను కాఫీ కప్పు అందుకోగానే సిద్దుా వంటింటి వైపు వెళ్లడం , జానకమ్మను ఇంకా ఆశ్చర్యపరిచింది .
కోడలు గానీ కిచన్ లో ఉందేమొా అనుకుంటుానే , ఓరగా ముందు గదిలోకి తొంగి చుాదింది. అక్కడ
కోడలు కాళ్ళుాపుతుా , కాఫీ తాగుతుా , వాళ్ళ అమ్మగారితో కాబోలు, ఫోన్ లో మాట్లాడుతున్నాది.
జానకమ్మకి ఎందుకో మనసు" చివుక్కు" మనిపించింది.
అగ్గిపుల్ల కుాడా వెలిగించడం రాని సిద్దుా , వంటంట్లో కి దుారడం , కోడలు కాళ్ళుాపుతుా కాఫీ తాగడం , జానకమ్మకు రుచించ లేదు.
ఏమనడానికీ కొత్త కోడలాయె...
అందుకే మెల్లగా సిద్దుా దగ్గరకు వెళ్ళింది. సిద్దుా , బెండకాయలు తరుగుతున్నాడు , అదీ చాలా నీటుగా...
జానకమ్మ కళ్ళు విప్పారించి మరీ చుాసింది. ఇంతలో
సిద్దుా.." .అరె , అమ్మా ..! నువ్వు ఇక్కడకే వచ్చేవా..?
హాయిగా హాలులో కుాచోమ్మా . ఐదు నిముషాల్లో వచ్చేస్తాగా..." అన్నాడు.
వంట గదిలో ఉన్న వాడినీ , వాడి కుళ్ళు లుంగీనీ, చెమటలు కక్కుతున్న వాడి శరీరాన్నీ, చుాసేసరికి
జానకమ్మ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది.
అటు నుండి బయటకు వచ్చిన ఆమె , తిరిగి వంటింటి వైపు వెళ్ళే లేదు. కానీ మధ్య మధ్య లో సిద్దుా
'" లావణ్యా డార్లింగ్ " అంటుా రెండు , ముాడు సార్లు , పిలవడం మాత్రం విన్నాది.
జానకమ్మ ప్రాణం ఉసుారుమంటున్నాది.
" ఏంటీ వ్యవహారం.సిద్దుా బేంక్ కి ఎందుకు వెళ్ళ లేదు...? ఉద్యోగం మానీసేడా..?.అసలు సిద్దుా వంట చేయడమేమిటీ..? ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ పనులన్నీ..? లావణ్యకు వంటరాదా...?
రేపు సిద్దుా ఆఫీసుకి వెళితే , ముందులాగే తను డబ్బా కట్టి ఇవ్వాలా...? ముందైతే తాము ముగ్గురే..ఇప్పుడు నలుగురి పని భారం , తన మీదే పడబోతోందా...?
జానకమ్మ ఆలోచనల్లో అన్నీ ప్రశ్న లే...జవాబు లేని ప్రశ్న లు....
-------------------
మధ్యాహ్నం భోజనాలయ్యేయి. అప్పుడు కుాడా , కోడలు సరిగ్గా పని చేసినట్టు , జానకమ్మగారికి కనిపించ లేదు. భోజనం మధ్యలో సిద్దుా " శని , ఆదివారాలతో కలిసి , నాలుగు రోజులు బేంక్ కి
శలవులు కలిసివచ్చేయమ్మా. అందికే మీకు స్వయంగా , నాచేత్తో చేసిన వంట తినిపిద్దామని , లావణ్యను వంటింటి వైపు కుాడా రానివ్వలేదు నేను.
ఇంతకీ వంట ఎలా ఉందో నువ్వు చెప్పనేలేదు.
మీరు ఊరు వెళ్ళగానే , శని, ఆదివారాలు బేంక్ కి శలవే గనక , ఊరికే కుార్చోవడం ఎందుకనీ , లావణ్య దగ్గరే నేర్చుకున్నాను ." అని చెప్పగానే జానకమ్మకు "హమ్మయ్య" అనిపించింది.
వెంటనే నవ్వుతుా " చాలా బాగా చేసేవు నాన్నా..
ఐతే కోడలు పిల్లకి , వంటా -వార్పుా బాగానే వచ్చన్నమాట " అంటుా మురిసిపోయింది.
ఐతే ఆ మురిపెం , రోజులు గడుస్తుాన్న కొద్దీ , అసహనంగా మారింది జానకమ్మకు.
"సిద్దుా బేంక్ కి వెళ్లాలి, .డబ్బా తీసుకెళ్లాలి ,ఎలాగో ?" అనుకుంటుా , అలవాటు ప్రకారం ఐదు గంటలకే లేచిన జానకమ్మ , వంటింట్లో కొడుకుా , కోడలుా పడుతున్న అవస్త చుాసి నిర్ఘాంతపడిపోయింది.
కోడలు "యుా ట్యుాబ్" లో చుాస్తుా, వంటల గురించి చదువుతుా ఉంటే , ఆ ప్రకారం సిద్దుా కుారలు తరిగి ,
పోపులుా, మసాలాలుా తీస్తున్నాడు. వంట వచ్చనుకున్న కోడలికి , అసలు వంటే రాదని తెలిసుకున్న జానకమ్మ మనసులోనే, లబో -దిబో మంది.
కొడుకు అవస్త చుాడలేక " ఏం చేస్తున్నారర్రా...అంటుా, వంటింట్లోకి దుారింది. అంతే.....ఆ రోజు నుంచీ జానకమ్మ కు తీరిక దొరకే లేదు.
-------------------------
సిద్దుా రోజుా బేంక్ కు కేరేజీ పట్టుకెళుతున్నాడు.సాయంత్రాలు వచ్చి , అమ్మనుా , అమ్మ వంటనుా , తెగ పొగిడేస్తున్నాడు. శనాదివారాల్లో,
లావణ్యతో కలిసి షికార్లకు, బయటకు వెళ్ళిపోతుా కుాడా , భోజనాలు
ఇంట్లోనే చేస్తామని చెప్పి మరీ వెళుతున్నారు.
సిద్దుా ముద్దుతో , కొత్తకోడలు అత్తగారికి , కనీసపు సాయం కుాడా చెేయడం లేదు...సరికదా అత్తయ్యగారుా , అది చేస్తారా...నాకిష్టం , ఇది చేస్తారా , మీరు చేస్తే చాలా బాగుంటుంది , అంటుాంటే మొహమాటానికి .నాలుగేసి రకాలు చేస్తుా, పని ఒత్తిడికి అలిసిపోతున్నాది జానకమ్మ..
"పోనీలే కొత్త కదా...కొన్నాళ్ళు పోతే అమ్మాయి చేస్తుందిలే" అనుకున్న జానకమ్మకు ఆ రోజు వస్తుందన్న నమ్మకం పోయింది.
ఇప్పుడు,
జానకమ్మ మునుపటి కన్నా తొందరగా లేస్తున్నాది.
రాత్రి పదకొండు వరకు , నడుం వాల్చడానికి కుదరడం లేదు.
రోజులు అలసటగా గడుస్తున్న సమయంలో, కోడలు గర్భవతి అయిందన్న విషయం , మండు వేసవిలో , చల్లగాలి వీచినట్టు , వినిపించింది జానకమ్మకు.
తొందరలో మనవడో, మనవరాలో, తమ ఇంట్లో తారాడబోతున్నారన్న ఆనందం , జానకమ్మకు కొత్త బలాన్నిచ్చింది.
పురుటి రోజులు దగ్గర పడుతున్నా వియ్యాల వారు పిల్లని పురిటికి తీసుకెళ్ళే మాట ఎత్తడం లేదు. అదే మాట సిద్దుా తో అంటే , లావణ్యను పురిటికి , పుట్టింటికి పంపడం తనకు ఇష్టం లేదనీ , పురిటికి పది రోజుల ముందు, వారే ఇక్కడికి వస్తారనీ చెప్పడంతో,=
మిన్ను విరిగి మీద పడ్డట్టైంది జానకమ్మకు.
---------------
కోడల్ని వారం ముందే ఆసుపత్రిలో చేర్పించేడు సిద్దుా.
అనుకున్నట్టే లావణ్య అమ్మ , నాన్నా , తమ్మడుా ఇక్కడికే వచ్చేరు. పిల్ల దగ్గర" నేను ఉంటా" నంటుా ,
వియ్యపురాలు ఆసుపత్రిలోనే ఉండిపోయింది. దాంతో
ఇంట్లో అందరుా మగవారే అవ్వడంతో , ఇంటింటెడు చాకిరీ జానకమ్మపైనే పడింది.
రాను -రానుా, జానకమ్మ పరిస్థితి "కుడితిలో పడ్డ ఎలకలా" మారింది.
జానకమ్మ అవస్తను గమనిస్తున్న రామయ్య గారు ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా " అన్న ఆలోచనల్లో
పడిపోయారు. ఈ మధ్యలో తమకు మనవడు పుట్టేడన్న ఆనందంకన్నా , కోడలు ఇంటికి వచ్చేకా , "చంటిపిల్లాడి పని కుడా, తనే చేయాల్సి వస్తుందేమొా" "అన్న భయం ఎక్కువైంది జానకమ్మకు.
సిద్దుాకి ఇవేమీ పట్టడం లేదు. అతడు లావణ్య చుట్టుా "దీపం చుట్టుా తిరిగే పురుగులా" తిరుగుతున్నాడు. బేంక్ కి సెలవు పెట్టీ మరీనుా...
-----------------------------------
పిల్లాడికి నెలదాటేదాకా , వియ్యపురాలు కుటుంబం ,
అంతా ఇక్కడే ఉన్నారు , చంటిపిల్లాడి తో అచ్చట్లు- ముచ్చట్లు అంటుా..
కోడలు చంటాడికి మాలిష్ చేయడానికి , నీళ్ళు పోయడానికి మనిషిని కుాడా పెట్టనివ్వలేదు.
వియ్యపురాలు నేను పోస్తానుగా అంది. కానీ అవసరమైన వన్నీ అమర్చి , వేడి నీళ్ళు బాల్చీ లోకి తీసి , పిలవ వలసి వస్తోంది. పోనీ తనే పోద్దామంటే కంద కుార్చో లేదాయె
ఇంటి చాకిరీ , వంట చాకిరీలతో అలసిన జానకమ్మ , ఒకొక్క సారి , "బంధువులు ఎప్పుడు వెళిపోతారా" అని
ఎదురు చుాసేది. నెల రోజుల తర్వాత గానీ ఆ శుభ సమయం రాలేదు.
------------------
వాళ్ళని బండి ఎక్కించి , తిరిగి సిద్దుా , ఇంటికి వచ్చిన అరగంటకు గానీ జానకమ్మకు , వారు వెళ్ళినట్టు నమ్మకం కలగ లేదు. వియ్యపురాలు వెళుతుా వెళుతుా-
"చంటాడు బాగా అలవాటైపోయేడు వదినగారుా..
ముాడవ నెల రాగానే పిల్లని పంపండి. కొన్నాళ్ళు మా దగ్గరే ఉంటుంది. మీ ముచ్చట తీరా , బారసాల ఎటుా
ఇక్కడే చేస్తారు కదా...ముహుార్తం పెట్టి వారం ముందే చెప్తే , మేము బయలుదేరి వచ్చే ప్రయత్నాలు చేస్తాం"
అంటుా చక్కా బయలుదేరింది.
ఆ మాట విన్నప్పటినుండి , గుండెల్లో రైళ్ళు పరుగెత్తడం మెుదలైంది జానకమ్మకు.
----------
సిద్దుా కి మాత్రం ఇవేవీ పట్టడం లేదు. యధా ప్రకారం బేంక్ ఆఫీసుకు వెళుతున్నాడు. సాయంత్రం రాగానే,
"అమ్మా !తినడానికి ఏం చేసే" వంటాడు.
పెట్టింది తిని "లావణ్యా " అంటుా , తమ తుామ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాడి సంగతి చుాడాలి మరి...
పిల్లాడికి పాలు కలపాలంటుా ,.ఒకసారి, డైపర్లు మార్చానంటుా., పాత డైపర్లు పారీడానికి , మరోసారి , లావణ్య , పిల్లాడికి వేడి నీళ్ళు కాచమందంటుా మరో సారి , ఇలా "బొంగరంలా "తిరుగుతుానే ఉంటాడు.
కోడలు మాత్రం కనపడదు ' , వినపడదు.
చంటి పిల్లాడిని చుాడాల్సి వస్తే ,తనే వాళ్ళ గది లోకి వెళ్ళాలి. తన కది నచ్చకపోయినా చాలా సార్లు మనవడి మీద మమకారంతో , లోపలికి వెళ్ళి ముద్దాడి వచ్చేది. కోడలు" రండత్తయ్యా" అంటుా పిలిచేది.
మరేం మాట్లాడేది కాదు. ఆ విధంగా తనింట్లో తనే పరాయిదయ్యింది.
ఈ రకమైన వ్యవహారం జానకమ్మ ఊహించనిది.
పెళ్ళయ్యేకా భార్యా, భర్తలు అన్యోన్యంగా ఉండడం ,
భర్త అవసరమైనపుడు భార్య కు సాయం చేయడం , తప్పేమీ కాదు. కానీ ఇలా మరీ తను చేయగలదో లేదో అని ఆలోచించకుండా , పని భారమంతా తన పై వేసేయడం , కనీసం ఒక్కసారి కుాడా, "అమ్మా పని చేయగలుస్తున్నావా...? "అని అడగకపోవడం , మరీ బాధగా ఉంది జానకమ్మకు.
సిద్దుాని చుాస్తుా.." ఎలాంటి వాడు , ఎలాగైపోయేడుా..? అంటుా ,అనుకోని సమయం లేదు జానకమ్మకు. " కోడలు వస్తే తనకో తోడు ఉంటుందని, తనకు పనిలో చేదోడు -వాదోడు గా ఉంటుందని , నట్టింట్లో మహలక్ష్మి లా తిరుగాడుతుా , గల- గల మాట్లాడుతుా , అందరితో కలివిడిగా , కలిసి- మెలిసి ఉంటుందని, ఎంతలా అనుకొంది తను. కానీ తన కోడలు తనతో మాట్లాడకపోవడమే కాక , తమ గది లోంచీ బయటకెే రావడం లేదు. ఐతే తనకేదైనా కావలసి వస్తే " అత్తయ్యా " అంటుా అడుగుతుంది.
ఆమాత్రం దానికే తను సంబరపడిపోతున్నాది.
అగ్గిపుల్ల కుాడా వెలిగించడం రాని సిద్దుా , పిల్లాడి పాచి తుడవడం' , డైపర్లు మార్చడం, గిన్నెలు కడిగి , పాలు వెచ్చబెట్టడం , అన్నిటికీ మించీ , తనను అస్సలు పట్టించుకోకపోవడం..,లాంటివి , .జానకమ్మ సహించలేకపోతున్నాది.
----------------------------
వాడిన ముఖం , అలసిన శరీరం తో , రోజు -రోజుకుా
ఆలోచన కొలిమిలో చిక్కి , అశాంతిపాలౌతున్న జానకమ్మను చుాసిన రామయ్య గారు, ఆమె ఆరోగ్యరీత్యా , ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవడమే కాక , దాని గురించిన పనులమీద , తన దృష్టి పెట్టేరు. రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు సాయంత్రం , సిద్దుా రాగానే తన దగ్గరకు పిలిచి, ముందు "కుక్కడపల్లి " ఇంటి గురించి చెప్పేరు .తర్వాత తన మనసులోని మాట అతనిముందుంచేరు. ఇల్లు దొరికిందన్న విషయం విన్న సిద్దుా ఆనందపడ్డాడు.
ఆపై
రామయ్యగారి మాటలువిన్న తర్వాత..
సిద్దుాతో పాటు, పక్కనే ఉన్న జానకమ్మ కుాడా, అతని
నిర్ణయం విని ఆశ్చర్య పోయేరు.
సిద్దుా కి తండ్రి హటాత్తుగా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కాలేదు. అదే విషయం,
సిద్దుా , తండ్రిని అడిగేడు.
దానికి రామయ్యగారు , సిద్దుా మనసుకు బాధ కలిగించని విధంగా ఇలా చెప్పేరు.
" చుాడు సిద్దుా..! నీకు పెళ్ళైంది . వెంటనే కొడుకు పుట్టడం చాలా ఆనందం అనిపించింది అమ్మాయి చాలా మంచిది. కానీ తనకుా కొన్ని సరదాలుంటాయి.
కానీ మేము ఉండడం వల్ల , పాపం , నీతో ఏమీ చెప్పలేకపోతున్నాది. చాలా మొహమాటస్తురాలిలా ఉంది. ముందు ముందు , చంటి పిల్లాడితో నలుగురు మనుషులకి వంటా అదీ చేయడం ,అమ్మాయికి కుాడా కష్టమే.
అందుకే కొన్నాళ్ళు మీరిద్దరుా ఇక్కడ ఉండండి.
అమ్మాయికి కుాడా కాస్తంత " ఫ్రీ" గా ఉంటుంది.
ఇంక మేము హైదరాబాద్ వెళ్ళి , ఆ కొత్తింటి తాళాలు ,తీసుకొని కొన్నాళ్ళు అక్కడే ఉంటాము. , నీకుా బెంగ ఉండదు. మాకు మిమ్మల్ని చుాడాలున్నపుడు , మేమెలాగుా వస్తాము .అలాగే మీరు అక్కడికి వస్తే మీకుా , కొంచం మార్పు ఉంటుంది. కోడలికి కొన్నాళ్ళు రెష్ట్ ఉంటే మంచిది. "
అంటుా చెప్పడంతో సిద్దుా సందిగ్ధం లో పడ్డాడు.
కానీ తానెప్పుడుా వారికి దుారంగా ఉండలేదే...
ఇప్పుడెలా....సిద్దుా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అది చుాసి , జానకమ్మ మనసు బాధతో విల -విల లాడింది.
కొన్ని తర్జన - భర్జనలయ్యేయి . చివరికి రామయ్యగారి మాటే నెగ్గింది.
పర్యవసానం.
శ్రావణ మాసం వచ్చేసరికి , తామిద్దరుా ,హైదరాబాద్ లో " తమకు రాదు " అనుకున్న, కుక్కడపల్లి ఇంటికి వెళ్ళిపోయేరు.
ఇల్లు చుాసీ జానకమ్మ చాలా సంతోషపడ్డారు.
అందులో, గేస్ పొయ్యతో సహా, తమకు అవసరమైన అన్ని సామానులుా కుాడా ఉండడం చుాసి , ఆశ్ఛర్యపోతుా రామయ్యగారి వైపు చుాసేరు. రామయ్యగారు నవ్వుతుా , హైదరాబాద్ లో ఉన్న తన ప్రియ స్నేహితుడి ద్వారా , అన్ని "ఎరేంజ్ మెంట్లుా "ముందుగానే తను చేయుంచినట్టు చెప్పేరు. అంతే కాదు, తాము వచ్చిన గంట తర్వాత "
నమస్కారమమ్మా " అంటుా వచ్చిన అమ్మాయిని చుాసి , ఇంకా ఆశ్ఛర్యపోయేరు.జానకమ్మ . అందంగా చిన్నగా , నిండా ఇరవైయ్యేళ్ళు నిండని పద్మ, చొరవగా ఇల్లంతా తుడిచి, సామాన్లన్నీ సద్ది , గబ గబా వంటంతా చేసి, అమర్చడంతో , జానకమ్మ కళ్ళనీళ్ళపర్యంతం అయ్యింది. తన గురించి, ప్రత్యేకమైన ప్రేమ నిండిన భర్త అభిమానానికి మనసులోనే నమస్కరించింది.
పద్మ కలివిడిగా ఇల్కంతా తిరుగుతుా , సాయంత్రం దాకా ఉండి,
తమకు "టీ" అందించి , రాత్రి చపాతీలు , కుారా కుాడా చేసి వెళిపోయింది ఉన్నంత సేపుా గల -గల మని మాట్లాడుతుానే ఉంది. జానకమ్మ కు ఆ పిల్ల కలివిడి తనం చుాస్తే ముచ్చటేసింది.
ఆ అమ్మాయి రోజుా వచ్చి అన్ని పనులుా చేసి వెళుతుందని , తమ మంచి చెడ్డలు చుాసుకుంటుా , పగలంతా తమ దగ్గరే ఉండే , ఆ పిల్లను , తమ కుాతురు లాగే చుాసుకుంటే , పిల్లలు దుారంగా ఉన్నారన్న తమ బాధకు , కాస్తంత ఉపశమనం కలుగుతుందని చెప్పిన రామయ్యగారి మాటలకు
నిజమే అంటుా , ఆనందంగా తలుాపింది జానకమ్మ .
"నిజమే ! పిల్లలు వారి జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోగలిగే, తెలివితేటలు ఉన్న వయసు వాళ్ళే.
వాళ్ళ గురించిన తను అనవసరంగా బెంగ పడుతున్నాది.
అంతేకాదు .తనకి కోడలు కుాతురిలా , తనతో వ్యవహరించాలని ఉంటుంది. కోడలు అంటీ ముట్టనట్టు ఉండడం తనకీ బాధగానే ఉంది.
అంత చాకిరీ చేస్తుా కుాడా , తను పరాయిదానిలా
ఉండవలసి వస్తున్నాది.
సిద్దుా కుాడా పెళ్ళవగానే , లావణ్య కోసం వండి పెడుతుా, ఆనందంగానే ఉన్నాడు. పెళ్ళి కానంత కాలం తనే కదా వాడికి ఏ పనీ చెప్పక , గారాబం చేసింది. తను పని నేర్పి ఉంటే , అప్పుడు కుాడా అన్ని పనులుా చేసేవాడేమొా..ఐనా..పుార్వ కాలం , తమ తరం లో, ఉమ్మడి కుటుంబాలుా వారి, జీవితాలుా , మనస్తత్వాలుా అన్నీ వేరుగా ఉండేవి . ఆడ పిల్లలకి చదువులుా ఎక్కువగా చదివించే వారు కాదు. పెళ్ళిళ్ళు కుాడా చిన్న వయసులోనే చేసీసేవారు. దాంతో అందరుా భయం భయంగా , ఉండి, అందరుా చెప్పే మాటలు వినేవారు , పనులుా చేసేవారు.
కానీ ఈ తరం ఆడ పిల్లలు బాగా చదువు కుంటున్నారు .ఉద్యోగాలుా చేస్తున్నారు. పాతిక, ముప్ఫై ఏళ్ళు వస్తే గానీ పెళ్ళిళ్ళు కుాడా చేసుకోవడం లేదు. అది కుాడా వాళ్ళకు నచ్చక పోతే ముఖం మీదే చెప్పేస్తున్నారు . వారి ఆలోచనలుా, అలవాట్లుా , పధ్ధతులుా అన్నీ వేరే .
పుార్వం పెద్దలు చెప్పినట్టు , పిల్లలు నడుచుకొనే వారు.
ఇప్పటి కాలం పిల్లలు , వారి జీవితాలకు కావలసిన నిర్ణయాలు వారే తీసుకోగలిగే వయసుతో పాటు , చదువుా, తెలివితేటలుా ఉన్న వారు. అప్పటి కాలం లో, తామున్నట్టు ఉండాలనుకోవడం, లేకపోతే బాధ పడడం అనవసరం కదుా. అవును అంతే మరి.
మారుతున్న కాలంతో పాటు , తాముా, మారాల్సిందే అనుకుంది జానకమ్మ. రామయ్యగారి అనురాగంతో పాటు ,
జీవితంలో మొదటిసారి ఏ పనీ లేని, ప్రసాంతమైన విశ్రాంతి , సుఖం, అనుభవించింది .
ఎప్పుడుా అందరికీ మర్యాదలు చేస్తుా, వండి పెడుతుా.., అలసిన జానకమ్మ.
-----------
రోజులు ఆనందంగా గడుస్తున్నాయి . జానకమ్మకుా, కలివిడిగా ఉండే పద్మ కుా..మధ్య చాలా అనురాగం పెరిగింది.
ఇంట్లో ఉన్నపుడు ఎప్పుడుా మాట్లాడడానికి కుాడా సమయం లేనట్లుండే సిద్దుా, ఇప్పుడు రోజుా , "వీడియొా కాల్" చేసి , గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. కోడలు ఏ కుారలు ఎలా వండాలో, పచ్చళ్ళు ఎలా చేయాలో అడుగుతున్నాది.
మనవడు మొబైల్ లో తమని చుాసి ఊఁ ఊఁ అంటుా,
ఊసులాడుతున్నాడు.
జానకమ్మ కు ప్రపంచంలో ఉన్న అనందం అంతా తన సొంత మైనట్టే ఉంది. పిల్లలు దగ్గర లేకపోయినా , మొబైల్ ఆ ముచ్చట తీరుస్తున్నాది.ఆ తరవాత , రామయ్యగారు , జానకమ్మకు పెద్ద సైజు "టేబ్", కొని ఇచ్చి , దానిని ఎలా ఆపరేట్ చేయాలో,
అందులో ఏవేవి చుాసుకో వచ్చో , అన్నీ నేర్పించేరు.
ఇప్పుడు జానకమ్మకి పని లేకపోయినా , సమయం దొరకడం లేదు. ఆ టేబ్ లో తనకు కావలసిన పుస్తకాలే కాక , పురాణాలుా, ప్రవచనాలుా వినడంతో , మరో లోకంలో ఉన్నట్టే ఉంది. పిల్లలపై బెంగ కుాడా తగ్గింది. ఇంకా తనలో ఉన్న ప్రేమంతా, పద్మ పై కురిపిస్తుా , ఆ పిల్లకి మంచి బట్టలు , బహుమతులుా కొంటుా, తన ముచ్చట తీర్చు కుంటున్నాది జానకమ్మ , రామయ్య గారి అండ దండలతో...
శుభం.
---------------------------------------------
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ) .
-----------------------------
No comments:
Post a Comment