కరోనాకి చెక్... ఇక వాళ్లందరికీ అదే మందు... కేంద్రం తాజా నిర్ణయం...
రెండు నెలల కిందట ఓ పరిశోధన చేసినప్పుడు... ఆ రిపోర్ట్ చూసి అమెరికా ఆశ్చర్యపోయింది. కరోనాకీ మలేరియాకీ ఏంటి సంబంధం అని అమెరికాలో పరిశోధకులంతా లోతుగా ఆలోచించారు. వాళ్లు చెప్పిందేంటంటే... ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తి పెద్దగా లేదు. కారణం ఏంటంటే... ఆ ఖండాల్లో ప్రజలు దోమల నుంచి వచ్చే మలేరియా మందుల్ని ఎక్కువగా వాడుతున్నారనీ... అదే మందు కరోనా వైరస్‌కి కూడా చెక్ పెడుతోందనీ, అందుకే ఆఫ్రికా, ఆసియా ప్రజలకు కరోనా ఎక్కువగా సోకట్లేదని తేల్చారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మలేరియా నివారణకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి... 60కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. వాటిలో అమెరికా కూడా ఉంది. (credit - twitter)
మన దేశంలో కరోనా వైరస్ సోకిన పేషెంంట్లకు, వారికి ట్రీట్‌మెంట్ చేస్తూ... వైరస్‌తో పోరాడుతున్న డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు, వైద్య సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇస్తున్నారు. వాళ్లంతా డైలీ ఆ మందు వాడుతున్నారు. ఐతే... ఇప్పటివరకూ నాన్-కొవిడ్ (కొవిడ్ లేని ప్రాంతాల్లో) హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా లక్షణాలు లేకపోతే... ఈ మందు ఇవ్వట్లేదు. ఇప్పుడు కేంద్రం దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో... లక్షణాలు లేకపోయినా... హెల్త్ కేర్ వర్కర్లు అందరికీ, అన్ని ప్రాంతాల్లో వారికీ ఈ మందును ఇవ్వాలని ప్రతిపాదించింది. కాబట్టి... హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును కేంద్ర ప్రభుత్వం... కరోనాకి సరైన మందుగా భావిస్తోందని అనుకోవచ్చు. (credit - twitter)
అసలీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎలా పనిచేస్తుంది అనే అంశంపై ఈమధ్య తెలంగాణ ప్రభుత్వం సర్వే చేయించగా... ఇది మంచి ఫలితాలే ఇస్తున్నట్లు తెలింది. కరోనా కచ్చితంగా తగ్గిపోతుందని చెప్పలేం గానీ... కరోనా వైరస్ పెరగకుండా... హైడ్రాక్సీ క్లోరోక్విన్ అడ్డుకోగలుగుతోందని తేలింది. అమెరికాలో కూడా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటూ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లూ ఈ మందును వాడుతున్నారు. (credit - twitter)



