Tuesday, May 5, 2020

దాశరధిగారి పాట

_🎤🎸🎺🎷🥁🎹🎼🎧"_


_*🎤ఆ చల్లని సముద్ర గర్భం..🎤*_

_-------------------------------------------------------_

   _*దాశరథి రాసిన పాట*"_
_అధ్భుతమైన రచన_

🎼🎹🎼🎻🎤🎼🎹🎼

_ఆ చల్లని సముద్ర గర్భం_
_దాచిన బడ బాణలమెంతో (2)_
_ఆ నల్లని ఆకాశంలో_
_కానరాని భాస్కరు లెందరో_
                                         _' ఆ చల్లని '_
_భూగోళం పుట్టుక కోసం_
_కూలిన సుర గోళాలెన్నో_
_ఈ మానవ రూపం కోసం_
_జరిగిన పరిణామాలెన్నో.. (2)_
_ఒక రాజును గెలిపించుటలో_
_ఒరిగిన నర కంఠాలెన్నో (2)_
_శ్రమ జీవుల పచ్చి నెత్తురులు_
_తాగని ధనవంతు లెందరో.._ (2)
                                           _' ఆ చల్లని '_
_అన్నార్థులు అనాథలుండని_
_ఆ నవయుగ మదెంత దూరమో.._
_కరువంటూ కాటకమంటూ_
_కనిపించని_ _కాలాలేపుడో.. (2)_
_అణగారిన అగ్ని పర్వతం_
_కనిపించిన లావా_ _ఎంతో (2)_
_ఆకలితో చచ్చే పేదల_
_శోకంలో కోపం ఎంతో (2)_
                                       _' ఆ చల్లని'_
_పసిపాపల నిదుర కనులలో_
_ముసిరిన భవితవ్యం ఎంతో_
_గాయపడిన కవి గుండెల్లో_
_రాయబడని కావ్యాలెన్నో (2)_
_కుల మతాల సుడి గుండాలకు_
_బలి అయిన పవిత్రులెందరో (2)_
_భరతావని బల పరాక్రమం_
_చెర వీడేదింకెన్నాళ్ళు._ (2)
                                      _'ఆ చల్లని'_

_🎧🎼🎷🥁🎺🎸🎻🎤
_సేకరణ:-ముంగా గంగన్న ఏకలవ్య_
_🎧🎼🎹🎷🥁🎺🎸🎤_

        _👇👇👇👇👇👇_
ఒరిజనల్ రచన.
-----+++++-------
ఆచల్లని సముద్ర గర్భం
-దాశరథి
ఆ చల్లని, సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
|| ఆ చల్లని॥
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాలసుడిగుండాలకు బలిఅయిన పవిత్రులెందరో
| ఆ చల్లని
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
ధనవంతుల ఆకృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో
||ఆ చల్లని||
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసి పాపలనిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో | ఆ చల్లని..

(ఇదీ ఒరిజినల్ ) మీరు పెట్టిన దాంట్లో మార్పులు చేశారు.

No comments:

Post a Comment