కంద పద్యాలు.
UU - UII - IUI - IIU - IIII
గగ I భ I జ I స I నల I గణములు మాత్రమే రావాలి. ఈ గణాలు ఏ క్రమంలో నైనా రావచ్చు.
బేసి గణాల లో "జగణం" ఉండరాదు.
( 1-3-5-7 బేసి గణాలు.)
రెండు , నాలుగు పాదాల లో "నాల్గవ గణం మొదటి అక్షరం " యతి కుదరాలి. ఆరవ గణం తప్పని సరిగా "నలము" గానీ "జగణం" గాని రావాలి. ప్రాస యతి చెల్లదు.
పద్య పాదం మొదలు దీర్ఘంతో మొదలైతే నాలుగు పాదాలుా దీర్ఘంతోనుా , హ్రస్వం తో మొదలైతే హ్రస్వం తోనే ఉండాలి.
(సుసర్ల వేంకట సన్యాసిరావు గారి సష్టి పుార్తి సందర్భం గా రాసిన కందములు.)
Ull llll Ull
రాజస I గుణములు I కల్గిన"
Ull UU IUl UU UU
వేంకట I సన్యా I సిగారు I వేంచే I యంగన్I
UII UII UII
వేడుక I లింటను I జేసిరి
UII IIII IUI UII UU
కోడలు Iకొడుకులు I నువారి I కోరిక I మీరన్ ॥
-------------------
IIII IIII UII
సదమల హ్రుదయము తోడను
UU IIII IUI UU IIU
సన్మా ర్గపుపథ మునెంచి సంసా రమునన్
IIII UII IIU
యిడుముల నొడ్డియు తనదౌ
IIII IIU IUI IIII UU
గ్రుహమున సుఖసా రమెల్ల ఘనముగ నింపెన్ ॥
-------------------
UII UII UII
ఆటల పాటల దేలుచు
UII UII IIII IIII IIU
మాటల ముాటల నుకవిగ మలచుచు కళలన్
UII IIII III
దేలెడి మనసైన ఘనుడు
UII IIII IUI UII UU5ER
మేలుగ నరువది సుయేండ్లు మన్నిక నేలెన్ ॥
--------------
IIII IIU IIU
శశికిర ణపుకాం తులలో
IIU IIU IIII IIU IIU
యశమం దుచుబం ధు,జనులు,యఖులం దరితో,
IIII UII UII
తరలుచు వచ్చిన వారల
IIII UII IUI UII IIU
వరముల దీవెన లదేలె వేంకటు డిలలో॥
------------
IIII UII UII
విజయము లిచ్చెడు లక్ష్మియె
IIU IIU IIII IIII UU
వినయం బునసే వలిడుచు వివరము తోడన్
IIII UII UII
మెలగుచు యింటిని దిద్దుచు
UU IIII IUI IIII IIU
ఇల్లా లిగసర సనుండ యిడుములు ఎటికిన్ ॥
---------
UII IIU UII
మానము అవమానంబుల
UU IIU IIII IIII IIU
వేరెం చకగాం చెనతడు వెరవక నెపుడున్
UII IIU UII
బాధ్యతలకు వేసారక
UU IIU IIII UII IIU
బాంధ వ్యములె న్నొ నిలిపె బంధము లలరన్॥
---------
IIU UII UII
శతమా నంభవ తీ,శుభ
IIU UII IUI UII UU
శతమా నంభవ తినీకు సద్గుణ ధామా
IIII UII UII
హితములు కాగల వెన్నియొ
IIII UII IUI UII UU
సతతము నీపరి జనాలు సౌఖ్యము లొందన్॥
-----------------
UII UII UII
పిల్లలు పౌత్రుల తోడను
IIU UII IIII IIII IIU
ఘనమౌ నీగుణ పయనపు గమనమె గురుతౌ
UII IIII UII
పచ్చగ పెరిగిన వంశపు
UII UII IUI IIII IIU
వ్రుక్షపు నీడను వరాల సుఖములు గనుమా ॥
----------
No comments:
Post a Comment