Wednesday, May 6, 2020

వాగ్గేయకారుడు త్యాగరాజు

*వాగ్గేయకారుడు*
  7  దేవనపల్లి ఓగన్న   7
.......................................
ప్రతి సంవత్సరం దేవుల్లకు ఉత్సవాలు జరిగే మాధిరిగానే 
త్యాగరాజు జయంతోత్సవాలు 
వీనుల విందుగా, కన్నుల పండుగగా జరగడం విశేషం 

తేది.04/05/2020 న త్యాగయ్య గారి 249 జన్మ దినోత్సవం
 సందర్భంగా ఈ చిన్న ప్రయత్నం

కర్నాటక సంగీత ప్రపంచoలో ఆగ్ర 
స్థానo త్యాగయ్య . తెలుగు వాడైన 
రాముని భక్తాశ్రేష్టి త్యాగయ్య 

తమిళనాడు, తంజావూరు జిల్లా 
తిరువారులో 1767 మే 4 న 
బ్రాహ్మణ కుటుంబలో జన్మించాడు 

చిన్న వయసులోనే సoస్కృతాధ్రo 
కఠస్తo చేసిన త్యాగయ్య 
"సంగీతం వినా సంస్కారo కలదే మనసా....అని మానవాళికి భోద 
చేసాడు. 
" ఓ రాఘవా మరుగేలరా....."
అని రామ భక్తికి నిశితం
తంజావూరు రాజు ఆస్తానకవి 
పదవి తృణప్రాయంగా భావించి 
" రాముని సన్నిధి పెన్నిధిగా...
కీర్తిoచిన భాగవతోత్తముడు 

తన జీవితకాలoలో 24 వేలకు పైగా కీర్తనలు రచించి స్వరపరిచాడు . ప్రస్తుతం 700
కీర్తనలే అందుబాటులో వున్నాయి 
అoదులో కొన్ని తన మాతృ భాషా 
తెలుగు,   కొన్ని సoస్కృతానికి 
పరిమితం 

18 యేoడ్ల వయస్సులో త్యాగయ్య కు పార్వతితో వివాహమైoది 
త్యాగయ్య 23 సoవత్సరంలోన 
భార్య పార్వతమ్మ మరణించినది 

చరమ కాలంలో సన్యసిoచి శేష 
జీవితాన్ని తిరువయ్యూరులో 
తన చిన్న కుటీరoలో గడిపాడు 
రామున్ని భక్తి గీతాలులతో కొలిచాడు.పండిత-పామరుల 
గురువుగా నిలిచాడు 

నాదోపస ద్వారా భగవంతుని 
చేరుకోవచ్చునని నిరూపించిన 
వాగ్గేయకారుడు.ఆయన శ్రీరామ 
భక్తినే గాక వేదాలపై, ఉపనిషత్తులపై పట్టు సాధించాడు 

ఉపనయనం తర్వాత తండ్రి భోదలు, తల్లి అలవలచిన భక్తి 
సoగీతాలు బాల్యంలోనే బీజాక్షరాలై మూర్తీభవించాయి 
ఆనతి కాలంలోనే 36 కోట్ల రామ 
నామాలు జపిoచి రామ సాక్షాత్కారo,  ఆశీర్వాదం పొందిన 
ధన్య జీవి 

గురువు శొoటి వెంకటరమణయ్య 
ఇoటిలో చేసిన కచేరులో....
"ఎoదరో మహానుభావులు..."
అనే కీర్తనను స్వరపరచి పాడారు 
సoస్కృతoలో రాసిన "జగదానంద 
కారక ..."  అనే కీర్తన శ్రీరామ భక్తు 
కున్న 108 పేర్లను ప్రస్తావించడం 
పరమపావనం 

' ప్రహ్లాద భక్తి విజయం, నౌకాచరితo ' అనే నాట్య రూపకాలు కూడ త్యాగయ్య 
ఇతర కృతులు. గనతి కెక్కిన 
రచనలు 

తన వంతుకు వచ్చిన రామ పట్టాభిషేకం విగ్రహాలే సర్వశ్వoగా 
పూజించి తరిoచేవాడు 
తంజావూరు రాజు కోరిక తిరస్కరణ త్యాగయ్య అన్నయ్య 
జపేశుడికి కోపం తెప్పించి రామ 
విగ్రహాలను కావేరి నదిలోకి విసిరాడు 

రాముడు లేని ఇల్లు తన కెందుకని 
దక్షణ దేశ యాత్రలు దర్శిసిoచాడు 
రామ కీర్తనలు పాడాడు 
వైకుంఠం నుంచి నారాయణుడే 
రాముని రూపంలో వచ్చి ఆ విగ్రహాలు తీసి ఇచ్చాడు అని 
ప్రతీతి 

దేవ ముని నారదుడు స్వయాన 
సoగీతoలోని రహశ్యాలను చెప్పి 
"స్వరార్ణవము " అనే అద్భుతమైన 
గ్రంథo కానుకగా ఇచ్చాడట 

అసoక్యoగా కీర్తనలు రచించి
కర్నాటక సంగీతంను అజరామరo 
గావించి, అశేష ప్రజల  మన్నన 
లందుకున్న భక్తాగ్రేసరుడు 

తన ఇంటి వద్దనే 1847 జనవరి 6
శ్రీరాముని సన్నిధికి చేరుకున్నాడు 
శిష్యులు కావేరి నది తీరాన సమాధి నిర్మించారు  

కర్నాటక సంగీతం మూల స్తoభo 
ఆయన జన్మ దినo భారతీయ 
సoగీత దినోత్సవంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వo 
ప్రకటిoచిoది 

ఈనాడు ఆరాధనోత్సవం పoచ 
రత్న కీర్తనలతో అలరారు తుoది 
త్యాగయ్య పేరుతో వున్న వారు 
మన గ్రూపులో ఉన్నారు 
చక్కని,చిక్కని కవిత్వంతో 
సుప్రసిద్ధం వారు 

గమనిక:- త్యాగయ్య  విడియో 
ఆధారంగా ఈ వ్యాసం రాశాను.
ఎమైనా తప్పులున్నచో మన్ననకు 
పాత్రున్ని...

No comments:

Post a Comment